సాక్షి,ఢిల్లీ: ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
‘త్వరలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు.
కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు వస్తాయి’అని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment