
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment