ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం | Priyanka's house near President's retreat poses security risk | Sakshi
Sakshi News home page

ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం

Published Sat, Jun 18 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం

ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం

సిమ్లా: సోనియా గాంధీ కూతరు ప్రియాంకా గాంధీ సిమ్లాలో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం నెలకొంది. స్థానిక బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ ఈ ఇంటి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హోం మంత్రి రాజనాథ్ సింగ్కు ఓ లేఖ రాశారు. ప్రియాంకా గాంధీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నది.. రాష్ట్రపతి వేసవి విడిది భవనానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఈ నిర్మాణం అపాయకరమని, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు.

గతంలో ఆ ప్రాంతంలో సామాన్యులు ఇళ్లు నిర్మించుకోదలచినప్పుడు భద్రత పరమైన కారణాలను చూపిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. అయితే ప్రియాంకా గాంధీ మాత్రం తన 'ఫ్యామిలీ స్టేటస్' సహాయంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారని ఆయన ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement