ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు హంబన్‌టోట నగరంలోని మెదములానాలో ప్రధాని మహింద రాజపక్సే, అతని తమ్ముడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాక కొందరు మహీంద తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన డీఏ రాజపక్స విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
దీంతో పాటు అధికార కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యుల పలు ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో శ్రీలంక అధ్యక్షుడి నివాసాన్ని ఆర్మీ ఆధీనంలో తెచ్చుకుంది. రాజపక్స నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment