కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు .కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం దిస్సనాయకే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ‘నేనేం మాంత్రికుడిని కాదు, నాకు తెలిసినవి, తెలియని విషయాలు ఉన్నాయి. ఉత్తమ సలహాలు తీసుకొని మంచి నేతగా పనిచేసేందుకు కృష్టి చేస్తాను, అందుకు నాకు అందరి సహాకారం అవసరం’ అని పేర్కొన్నారు.
కాగా అదివారం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయ తన సమీప ప్రత్యర్థి, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్‌లోనే వైదొలిగారు.
చదవండి: ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతి
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment