టూరిస్ట్‌ బస్సు ప్రమాదం.. పలువురు మృతి | US Tour Bus from Niagara Falls Crashes Near New York, 5 Dead, Dozens Injured | Sakshi
Sakshi News home page

టూరిస్ట్‌ బస్సు ప్రమాదం.. పలువురు మృతి

Aug 23 2025 7:16 AM | Updated on Aug 23 2025 11:36 AM

Tourist bus crashes in New York and Indians among those on board

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక, టూరిస్టుల్లో ఎక్కువ మంది భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని పెంబ్రోక్‌ సమీపంలో టూరిస్ట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్‌కు వస్తున్న ఓ టూరిస్టు బస్ బోల్తా పడింది. కాగా, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది.

ఈ క్రమంలో చాలా మంది సీటు బెల్టులను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటికి తీసుకొచ్చినట్లు ఓ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు. కాగా, బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 54 మంది ప్రయాణిస్తున్నారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. నాలుగు హెలికాప్టర్‌లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్‌ గవర్నన్‌ క్యాథీ హోచుల్‌ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement