
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనని తాను రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. ట్రంప్ తాజాగా, న్యూయార్క్ నగరంలోని పాత బస్సు, మెట్రో రవాణా వ్యవస్థకు నిధులు సమకూర్చే కాంక్షన్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ (Congestion Pricing Program)ను రద్దు చేశారు. రద్దు అనంతరం, ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తనను తాను ‘రాజు’ అని ప్రకటించుకున్నారు. దీంతో ఆయన అధ్యక్షాధికారాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరింత వివాదం
వైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ట్రంప్ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ, టైమ్ మ్యాగజైన్ మేకప్ కవర్‌ను షేర్ చేసింది. అందులో లాంగ్ లైవ్ ద కింగ్ అనే క్యాప్షన్ జోడించడం గమనార్హం. అంతేకాదు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ ఏఐ-తయారుచేసిన ట్రంప్ రాజరిక చిత్రం పోస్ట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
"CONGESTION PRICING IS DEAD. Manhattan, and all of New York, is SAVED. LONG LIVE THE KING!"
–President Donald J. Trump pic.twitter.com/IMr4tq0sMB— The White House (@WhiteHouse) February 19, 2025
న్యూయార్క్ గవర్నర్ వార్నింగ్
ట్రంప్ రాజు ప్రకటనపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తీవ్రంగా స్పందించారు. మేం రాజుల పాలనలో లేం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కోర్టులో కలుసుకుందాం’ అంటూ ఘాటుగా స్పందించారు.
అధ్యక్ష అధికార దుర్వినియోగమా?
ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీ, ఇతర ఫెడరల్ అధికారులపై కేసు నమోదు చేసింది. ట్రంప్ ప్రభుత్వం న్యూయార్క్ ట్రాన్స్‌పోర్ట్ టోల్ ప్రోగ్రామ్ రద్దు చేయాలని ప్రయత్నించడం అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment