sworn
-
రేపు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఇవాళ్టి(ఆదివారం)తో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక.. ఆయన వచ్చే ఏడాది మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇవాళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణ స్వీకారం
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు .కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.ప్రమాణ స్వీకారం అనంతరం దిస్సనాయకే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ‘నేనేం మాంత్రికుడిని కాదు, నాకు తెలిసినవి, తెలియని విషయాలు ఉన్నాయి. ఉత్తమ సలహాలు తీసుకొని మంచి నేతగా పనిచేసేందుకు కృష్టి చేస్తాను, అందుకు నాకు అందరి సహాకారం అవసరం’ అని పేర్కొన్నారు.కాగా అదివారం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయ తన సమీప ప్రత్యర్థి, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలిగారు. చదవండి: ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతిశ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
TS CM Revanth Reddy: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, సోదరుడి కుమారుడు అవినాష్‌రెడ్డి షాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు. చదవండి: గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు: హైకోర్టు కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక్కటి చేసింది. పైలెట్ రోహిత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ ఇచ్చారు. టికెట్టు కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు గురువారం.. మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్
నేపాల్ అధ్యక్షుడిగా సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర పాడెల్ సోమవారం ప్రమాణం చేశారు. ఈ మేరకు శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హరి కృష్ణ కర్కీ 78 ఏళ్ల పౌడెల్ చేత ప్రమాణం చేయించారు. పౌడెల్ నేపాల్ కొత్త అధ్యక్షుడిగా గురవారం ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో 33,802 ఓట్లు సాధించగా, పౌడెల్ ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15,518 ఓట్లు సాధించారు. ఈ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఫెడరల్ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు, అలాగే ప్రాంతీయ అసెంబ్లీల నుంచి 518 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఓటింగ్ ఖాట్మాండ్‌లోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్ పార్లమెంట్లో జరిగింది. నేపాల్ ఎన్నికల సంఘం ఫెడరల్ పార్లమెంటేరియన్లు, ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యుల కోసం రెండు వేర్వేరు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ప్రావిన్సులకు చెందిన శాసనసభ్యులు ఖాట్మాండుకు చేరుకున్నారు. ఇందులో 884 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందులో 274 మంది సభ ప్రతినిధుల సభ్యులు, 59 మంది నేషనల్ అసెంబ్లీ సభ్యులు కాగా, ఏడు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు చెందిన 550 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు పౌడెల్ మాట్లాడుతూ.."పాలనలో తనకు అనుభవం ఉందని, రాష్ట్ర యంత్రాంగాల పని తీరుకు ఈ కొత్త పదవి సరిపోతుంది. నేపాల్ రాచరికం సమయంలో మాజీ హౌస్ స్పీకర్‌గా పనిచేసిన పౌడెల్ తనకు వాటిల్లో అపార అనుభవం ఉంది. ఇంతకుముందు వివిధ ప్రభుత్వ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాను . రాచరికం సమయాల్లో రాజభవనాలకు వెళ్లాను. సభాపతిని అయ్యాను. వారానికి ఒకసారి ప్యాలెస్‌ని సందర్శించాను. మాజీ అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ చేపట్టాల్సిన విధులు గురించి తనకు తెలుసునని, ఇవేమి తనకు కొత్త కాదు అని" తేల్చి చెప్పారు. కాగా, పౌడెల్ మాజీ హౌస్ స్పీకర్‌గానే కాకుండా దశాబ్దం పాటు జైల్లో ఉన్నారు కూడా. ఇప్పటి వరకు ఆరుసార్లు శాసన సభ్యుడిగా, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడూ నేపాల్ దేశానికి మూడవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పౌడెల్‌కు మొత్తం పది పార్టీల మద్దతు లభించింది. -
ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ (ఫొటోలు)
-
ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. కాగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983 లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. -
AP: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు గురువారం ప్రమాణం చేశారు. ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. -
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్
-
పంజాబ్ కేబినెట్ 4.30 కు ప్రమాణస్వీకారం
-
రేపు పంజాబ్ కేబినెట్ ప్రమాణస్వీకారం
-
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ ఒకటిన నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ అభ్యర్థిగాగా పోటీ చేసి గెలిచారు. -
టీటీడీ చైర్మన్ గా రెండో సారి వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు
-
MK Stalin: 7న స్టాలిన్ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) శాసన సభాపక్ష సమావేశం మంగళవారం జరుగనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశమై, తమ శాసనసభాపక్ష నేతగా ఎం.కె.స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభా పక్ష భేటీ అనంతరం స్టాలిన్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆ తీర్మానం ప్రతిని అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. గవర్నర్ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్టాలిన్‌తోపాటు మరో 29 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. స్టాలిన్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తానని చెప్పారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీఎంకే దళపతి స్టాలిన్‌కు తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే సీనియర్ నేత పళనిస్వామి అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 7న జరుగనుంది. పళనిస్వామి రాజీనామా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు సోమవారం తెలిపాయి. మధ్యాహ్నం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా పదవిలో కొనసాగాలని సీఎం పళనిస్వామిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కోరారు. తమిళనాడు 15వ శాసనసభను గవర్నర్ రద్దు చేశారు. పుదుచ్చేరిలో 7న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు పుదుచ్చేరీ ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి విజేతలు ఎన్ఆర్ రంగస్వామిని శాసనసభాపక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి గురు వారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్య క్రమంలో ఆమె చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమా ణం చేయించారు. అనంతరం జస్టిస్ హిమా కోహ్లికి గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కోహ్లి కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ట్రూ లవ్.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు
బెర్లిన్ : ప్రేమ అనేది మనుషులకు మాత్రమే కాదు జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తాజాగా దీన్ని నిజం చేసే సంఘటన ఒకటి జర్మనీలో చోటు చేసుకుది. ఆ వివరాలు.. రెండు హంసలు హై స్పీడ్ రైల్వే లైన్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఒక హంస ఒవర్‌హెడ్ పవర్ కేబుల్‌లో చిక్కుకుని మరణించింది. దాంతో మిగిలిన హంస రైల్వే ట్రాక్ మీదనే ఉండి చనిపోయిన భాగస్వామి శరీరాన్ని చూస్తూ.. బాధపడసాగింది. అధికారులు హంసను అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసినప్పటికి అది కదలలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలా చనిపోయిన హంసను చూస్తూ.. బాధపడుతూ.. సంతాప సూచకంగా అక్కడే ఉండిపోయింది. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు హంసను అలాగే ఉండనిచ్చారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి చనిపోయని హంస మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించడంతో జంట హంస కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ 50 నిమిషాల పాటు ట్రాక్‌పై రాకపోకలు సాగకపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ సంఘటనతో జంతువులు, పక్షులు కూడా ప్రేమ వంటి భావోద్వేగాలను కలిగి ఉండటమే కాక సున్నితంగా ఉంటాయని మరోసారి రుజువయ్యింది. అవి మనకంటే అధికంగా నొప్పిని అనుభూతి చెందుతాయిని నిరూపితమయ్యింది. అంతేకాక మనుషులు జంతువుల, పక్షులు వంటి మూగజీవుల పట్ల మరింత కరుణతో వ్యవహరించాలిన ఈ సంఘటన గుర్తు చేసింది. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం) బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. ‘‘జన్‌ధన్ ఖాతా ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని’’ ఆయన తెలిపారు. సంస్థాగత మార్పులలో భాగంగా.. సంస్థాగత మార్పులలో భాగంగా సోము వీర్రాజు ఏపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారని దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొంత మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు. సోము వీర్రాజుకు సహకరిస్తా.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2018 మే 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనను నియమించారని, పది మాసాలే గడువు ఉన్నా కమిటీలు వేసుకుని ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. మళ్లీ సంస్థాగత ఎన్నికలు రావడంతో.. బూత్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యత తీసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానని తెలిపారు. తన చర్యల వల్ల కొంతమంది కి కష్టం, నష్టం కలిగించినా... అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వివరించారు. పార్టీ కోసం పని చేసే క్రమంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కొత్త అధ్యక్షులు సోము వీర్రాజుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. -
రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
-
15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఈనెల 15న ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది.రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. -
అభివృద్ధే ధ్యేయం
సాక్షి, ఖమ్మం : జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించింది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయిన కోరం కనకయ్య(టేకులపల్లి)తో పాటు వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు(చుంచుపల్లి), మిగిలిన జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులతో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఎన్నికల అధికారి హోదాలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలన వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేయడంతో పాటు గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని అన్నా రు. ప్రస్తుతం కొత్త జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పా టు కావడంతో గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలిగిందన్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర రంగాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే గత ఐదేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ తనకు ఈ విధంగా నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. అందరి తోడ్పాటుతో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత పంచాయతీలు, ప్రస్తుతం పరిషత్‌లు కూడా విభజించడంతో పాలన దగ్గరైందన్నారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలిసారిగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ వారిచే ప్రమాణం చేయించారు. వారిలో వాంకుడోతు ఉమాదేవి (ఇల్లెందు), భూక్య కళావతి (జూలూరుపాడు), కొమరం కాంతారావు (కరకగూడెం), పోశం నరసింహారావు (మణుగూరు), సున్నం నాగమణి (ములకలపల్లి), బిందు చౌహాన్ (సుజాతనగర్), వాగబోయిన రామక్క (గుండాల), లాలమ్మ (అన్నపురెడ్డిపల్లి), చిన్నంశెట్టి వరలక్ష్మి (అశ్వారావుపేట), మేరెడ్డి వసంత (లక్ష్మీదేవిపల్లి), బరపటి వాసుదేవరావు (పాల్వంచ), కొడకండ్ల వెంకటరెడ్డి (చండ్రుగొండ), పైడి వెంకటేశ్వరరావు (దమ్మపేట), ఇర్పా శాంత (చర్ల), కామిరెడ్డి శ్రీలత (బూర్గంపాడు), బెల్లం సీతమ్మ (దుమ్ముగూడెం), దాట్ల సుభద్రాదేవి (పినపాక), సూదిరెడ్డి సులక్షణ (అశ్వాపురం), కొమరం హనుమంతరావు (ఆళ్లపల్లి), కో–ఆప్షన్ సభ్యులు షర్ఫుద్దీన్ అహ్మద్, సయ్యద్ రసూల్ ఉన్నారు. -
నవశకానికి నాంది
సాక్షి, వరంగల్ : జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసిన రెండు నెలలు నిరీక్షణ తర్వాత పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. నేడు జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లా ఏర్పాటయ్యాక తొలి పరిషత్ కొలువుదీరి నవశకానికి నాంది పలకనుంది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నాళ్లు ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి గడువు ముగియడంతో నూతన జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానంలో ఆరు కొత్త జెడ్పీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం కొనసాగిన భవనంలోనే ఐదు గదులను కేటాయించారు. పాత కార్యాలయంలోనే రూరల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం కొనసాగనుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రూరల్ జిల్లా ప్రజా పరిషత్ మొదటి సమావేశం జరుగనుంది. మొదటి సమావేశంతో పాలక మండలి బాధ్యతలు స్వీకరించినున్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వైస్ చైర్మెన్ శ్రీనివాస్‌లతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులచే కలెక్టర్ ముండ్రాతి హరిత ప్రమాణ స్వీకారం చేయించనున్నార. అనంతరం సమావేశం జరుగుతుంది. సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సీఈఓగా రాజారావు.. నూతన జెడ్పీలకు ప్రభుత్వం ముఖ్య కార్యనిర్వహణాధికారులను నియమించింది. రూరల్ జెడ్పీకి రాజారావు సీఈఓగా నియమించింది. శుక్రవారం రాజారావు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా జెడ్పీకి సిబ్బందిని నియమించారు. ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ఉద్యోగులను కేటాయించారు. ఈ మేరకు అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ జిల్లాకు 16 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇందులో ఇద్దరు సూపరింటెండెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డ్రైవర్, నలుగురు నాలుగో తరగతి సిబ్బందిని కేటాయిం చారు. వీరు ఈ నెల 5న నూతన వరంగల్ రూరల్ జెడ్పీలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్రమాణం..ప్రణామం!
టీటీడీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. తిరుమలలో శనివారం ఉదయం 11.47 నిమిషాలకు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారిని దర్శించుకుని తులాభారం సమర్పించారు. సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ తిష్టవేసిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ప్రతినబూనారు. సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ.సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. తమ పార్టీ ముఖ్యనాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. నిర్ణయించిన ముహూర్తానికి బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డి చేత టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈఓ స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత తన బరువుకు సమానంగా పెద్దకలకండ, చిన్నకలకండ, బెల్లం, బియ్యం, నెయ్యి, నవధాన్యాలతో వైవీ.సుబ్బారెడ్డి శ్రీవారికి తులాభారం సమర్పించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని, అందుకనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. తిరుమలలో తాగునీరు, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. అన్నప్రసాదం స్వీకరణ.. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి వెళ్లారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణమ్మ భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తరువాత అన్నప్రసాద క్యూకాంప్లెక్స్, వంటశాలను పరిశీలించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ విజయ్‌సాయిరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి, శాసన మండలి చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్, రెడ్డి రవీంద్రారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి, టీటీడీ జేఈఓలు శ్రీనివాసరాజు, లక్ష్మీకాంతం, సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టి, పలువురు అర్చకులు పాల్గొన్నారు. -
దైవసాక్షిగా.. ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎంపీలు
సాక్షి, తిరుపతి: జిల్లా నుంచి గెలుపొందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం తెలిసిందే. ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా అక్షర క్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులకు అవకాశం వచ్చింది. అందులో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, దుర్గాప్రసాద్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.వీరిలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలుపొందారు. రెడ్డెప్ప, దుర్గాప్రసాద్ మొదటిసారిగా పార్లమెంట్‌కు పోటీచేసి విజయం సాధించారు. వీరిద్దరు సోమవారం మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభా పక్షనేతగా ఎంపికైన విషయం విదితమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలతో పాటు 13 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. కుప్పం మెజారిటీతో చిత్తూరు పార్లమెంట్‌ను దక్కించుకుంటూ వస్తున్న టీడీపీకి ఈ సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో కుప్పంలోనూ వైఎస్సార్సీపీకి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు పార్లమెంటు స్థానం కూడా వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల తర్వాత 17వ లోక్‌సభ మొదటిసారిగా సమావేశం కానుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి మూడు రోజుల పాటు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ నేతలు వేర్వేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అనూహ్యంగా విజయం.. గత ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలబడ్డాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌పై 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందగా ఒక్క ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇక్కడ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందడం చారిత్రాత్మకమైంది. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత సోయం బాపురావు ఘన విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి... పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ మూడో స్థానంలో నిలిచారు. వెంకటేశ్ నేత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెంకటేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇద్దరు తొలిసారే.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేత ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. సోయం బాపురావు గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక బొర్లకుంట నేత ఉద్యోగిగా పదవి విరమణ తీసుకొని డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకుని విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోయం బాపురావు తెలుగులో ప్రమాణస్వీకారం చేయనుండగా, వెంకటేశ్ నేతది తెలియరాలేదు. -
ఎమ్మెల్సీగా ‘శేరి’ ప్రమాణస్వీకారం
సాక్షి మెదక్ : మెతుకుసీమ ముద్దు బిడ్డ.. సీఎం కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో శాసనమండలి ఉప చైర్మన్ నేతి విద్యాసాగర్ సోమవారం ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చురుకైన పాత్ర పోషించి.. ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపించిన శేరికి శాసన సభ్యుల కోటా కింద టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని అసెంబ్లీ హా లులో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధిం చారు. ఆయనతోపాటు మరో నలుగురు సైతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వీరితోపాటు కరీంనగర్–మెదక్–నిజామబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తం రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హైదరాబాద్‌కు తరలి వెళ్లాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ.. మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన శేరి విఠల్‌రెడ్డి–సుశీల దంపతుల కుమారుడు సుభాష్‌రెడ్డి. ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న సుభాష్‌రెడ్డికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుభాష్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి 1964–1971 వరకు మెదక్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శేరి 1989లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1989లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో యూత్ కాంగ్రెస్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, 1993లో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 1997లో మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్‌రెడ్డి 2001 ఏప్రిల్ 21న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2001 నుంచి మండల పార్టీ అధ్యక్షుడి స్థాయి నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలను చేపట్టారు. 2011 నుంచి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2016 జూలైలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. -
పల్లెల్లో కొత్త పాలన
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ‘స్థానిక’ సమరం ముగిసింది. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వం కూడా అపాయింటెడ్ డేను ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు శనివారం కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గతేడాది ఆగస్టులో పంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషలాఫీసర్లు లేని జీపీల్లో కార్యదర్శులు బాధ్యతలు అప్పగిస్తారని సంబంధిత అధికారులు పేర్కొం టున్నారు. అయితే కొత్త పాలకవర్గం కొలువుదీరన రోజే పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 223 పంచాయతీల్లో తొలి సారిగా పాలన ఆరంభం కానుంది. కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు.. జిల్లాలోని 465 గ్రామ పంచాయతీలకు గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఉత్సాహంతో ఉన్నారు. వీరికి పంచాయతీ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఫిబ్రవరి 2గా నిర్ణయించడంతో శనివారం రోజున పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజు సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. కాగా, కాల పరిమితి ముగియని, ఎన్నికలు జరగని పంచాయతీలకు విడిగా ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటిస్తుందని పంచాయతీరాజ్ శాఖ నుంచి వెలువడిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఆరు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరనున్నందున ఇక నుంచి అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది. రేపటి నుంచి కొత్త పంచాయతీల్లో పాలన జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 224 జీపీల్లో కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే బేల మండలంలోని కొబ్బాయి జీపీకి కాలపరిమితి ముగియనుందున ఎన్నికలు జరగలేదు. ఈ జీపీ నుంచి కొత్తగా మాంగ్రూడ్ పంచాయతీ ఏర్పాటైంది. అంటే ఒక్క మాంగ్రూడ్ జీపీ మినహా మిగతా 223 గ్రామ పంచాయతీలు కొత్తగా పాలనను ప్రారంభించనున్నాయి. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత 2018 ఆగస్టు 2న పంచాయతీ బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. స్పెషలాఫీసర్లతో ప్రారంభమైన కొత్త పంచాయతీలు ఇప్పుడు పాలక వర్గాలతో కళకళలాడనున్నాయి. అయితే పాత జీపీల పరిధిలోని తండాలు, గూడేలను గుర్తించి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. కొన్ని జీపీలకు భవనాలు, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు లేక ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలకు పరిపాలన సవాలుగా మారనుందని చెప్పవచ్చు. కొత్త చట్టంపై సర్పంచులకు శిక్షణ గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఫిబ్రవరిలోనే పరిపాలన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతోపాటు గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ శిక్షణ ఉంటుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు శిక్షణ పొందునున్నారు. అనంతరం జిల్లాలో ఈ నెల 11 నుంచి మూడు విడతలుగా సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్తొతగా ఎన్నికైన 465 మంది సర్పంచులకు ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలి.. అనే దానిపై సమగ్ర ప్రణాళిక తయారీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఫ్యాషనే వారి నినాదం
రంగు రంగుల దుస్తులు, హొయలు చిందే ఫ్యాషన్లు.. ఇదంతా ఎవరినో ఆకర్షించాలని కాదు, పదిమందిలో గుర్తింపు పొందాలని అంతకంటే కాదు.. తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి, ఆడదంటే సబల అని చాటి చెప్పడానికే అంటున్నారు ఈ మహిళా నేతలు. అమ్మాయి అంటే పింక్ కలర్. కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా అచ్చం అమ్మాయిల్లాగే సున్నితంగా ఆ రంగు చెరగని ముద్ర వేస్తుంది. కానీ, ఇప్పుడు పింక్ అంటే ఆహ్లాదం కాదు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చే భావావేశం, ధిక్కారానికి గుర్తు, చేరుకోవాల్సిన లక్ష్యాలకు ప్రతీక, మహిళల పట్ల ఇప్పటివరకు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సంకేతం. అవును అమెరికా కాంగ్రెస్‌కి కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. అమెరికా 116వ కాంగ్రెస్‌లో ప్రమాణస్వీకారమహోత్సవానికి హాజరైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో, వారి సంప్రదాయాలు ఉట్టిపడేలా, సంస్కృతికి ప్రతీకలుగా తయారై వచ్చారు. అదే తమ పోరాట ఆయుధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలంకరణ అనేది బాహ్య అందాన్ని పెంపొందించడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని, సాంస్కృతిక గొప్పదనాన్ని చాటి చెబుతుందని వారంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఫ్యాషన్‌కు పర్యాయపదంలా ఉన్న మహిళలంతా దానినే ఇప్పుడు తమ పోరాటాలకు పంథాగా మార్చుకోవడం విశేషం. రికార్డు స్థాయిలో 102 మంది ఎన్నిక.. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో 102 మంది మహిళలు ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెల్లువలా వీరి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సభలో ఇంకా పురుషాధిక్యమే కొనసాగుతోంది. అయినా తాము ఎందులోనూ తీసిపోమని చాటిచెప్పడానికి ప్రమాణస్వీకార ఉత్సవాన్నే వేదికగా చేసుకున్నారు మహిళా ప్రతినిధులు. నాన్సీ పెలోసి ముదురు గులాబీ రంగు గౌనులో మెరిసిపోతూ సభకు వచ్చారు. ‘‘పింక్ అంటే శాంతి, సహనం కాదు. దానికి అర్థం మారింది. ఈ రంగు మాలోని భావావేశాన్ని తట్టిలేపుతుంది. అమ్మాయిల పట్ల చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని గట్టిగా నిలదీసి అడుగుతుంది‘అని వ్యాఖ్యానించారు. మహిళా ఓటుకు వందేళ్లు.. ఈ ఏడాది అమెరికా ప్రజా స్వామ్య చరిత్రలోనే అత్యంత కీలకమైనది. మహిళలకు ఓటు హక్కు కల్పించి అమెరికాలో వందేళ్లు అవుతోంది. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ 1919, జూన్ 4న కాంగ్రెస్‌లో బిల్లును ఆమోదించారు. అందుకే మహిళా ప్రతినిధులందరూ తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పొడవైన గౌను ధరిం చి వచ్చిన పాలస్తీనా అమెరికన్ రషీదా తాలిబ్ తన తల్లి లాంతర్ వెలుగులో అలాంటి ఎంబ్రాయిడరీ గౌనులు కుడుతూ ఎంత కష్టపడిందో ఉద్విగ్నభరితంగా చెప్పారు. దెబ్రా హాలండ్ రంగురంగుల పూసల గొలుసులు ధరించి వచ్చి తమ ప్రాంతంలో గల్లంతవుతున్న మహిళలు, వారి హత్యల గురించి ప్రస్తావించారు. ఆఫ్రికన్ అమెరికన్ మహిళ బార్బారా లీ మెడ చుట్టూ స్టోల్‌ని వేసుకొని వచ్చి మహిళలు విభిన్న పంథాలో నడుస్తూ నిరంతరం జలపాతంలా క్రియాశీలకంగా ఉండాలన్నా రు. ఇక సోమాలియా నుంచి శరణార్థిగా వచ్చిన ఇల్హాన్ ఒమర్ తెల్లరంగు గౌనులో వచ్చి తమ ప్రాంతంలో శాంతి స్థాపన ధ్యేయ మన్నారు. -
పాక్ అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 13వ అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ (69) ప్రమాణం చేశారు. ఆదివారం ఐవాన్–ఇ–సద్ర్ (అధ్యక్ష భవనం)లో జరిగిన కార్యక్రమంలో అల్వీతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షకీబ్ నిసార్ ప్రమాణం చేయించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ క్వమర్ జావెద్ బజ్వాతో పాటు పౌర, సైనిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అల్వీ.. వృత్తిరీత్యా డెంటిస్ట్. ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితుడు కూడా. 2006 నుంచి 2013 వరకు పీటీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. -
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్‌లోని నన్‌కనా సాహిబ్‌లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
14 లోపు ఇమ్రాన్ ప్రమాణం
ఇస్లామాబాద్ / కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14 లోపే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాయి. జూలై 25న జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్) 64 సీట్లు, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. 272 సీట్లున్న జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 172 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీటీఐ నేత నయీనుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు 14 లోపే ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. మారనున్న బలాబలాలు.. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీని ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన పీటీఐ ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలాగే పీటీఐ నేత గులామ్ సర్వార్ ఖాన్ కూడా ఓ స్థానంలో రాజీనామా చేయాలి. ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీ బలం 109 సీట్లకు పడిపోతుంది. తాజాగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న పీటీఐ నేతలు ఎంక్యూఎం(పీ), జీడీఏ, పీఎంఎల్(క్యూ), బలూచిస్తాన్ నేషనల్ పార్టీ(మెంగల్), అవామీ నేషనల్ పార్టీతో పాటు 13 మంది ఇండిపెండెంట్లతో జోరుగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కరాచీ, సియాల్ కోట్ నగరాల్లో రెండు బ్యాలెట్ బాక్సు లు, పలు బ్యాలెట్ పేపర్లు రోడ్ల పక్కన లభ్య మయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఓడిపోయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చేతులు కలపనున్న పీఎంఎల్–పీపీపీ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు పీఎంఎల్(ఎన్), పాకిస్తాన్ పీపు ల్స్ పార్టీ(పీపీపీ) చేతులు కలిపే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. ఇందులోభాగంగా రెండు పార్టీలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాయనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించింది. దిగజారిన షరీఫ్ ఆరోగ్యం ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం దిగజారింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటనే జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్)కు తరలించాలని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే నవాజ్ షరీఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. షరీఫ్ శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు అక్కడక్కడా రక్తం గడ్డకట్టిందని వైద్యులు ప్రభుత్వానికి తెలిపారు. ఆయన గుండె స్పందన కూడా సరిగా లేదని వెల్లడించారు. దీంతో ఉన్నతస్థాయి ఖైదీల కోసం పీఐఎంఎస్లో ప్రత్యేకంగా రూపొందించిన విభాగంలో షరీఫ్‌కు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
23న కుమారస్వామి ప్రమాణం
-
ఘనంగా ప్రథముడి ప్రమాణం
-
ఘనంగా ప్రథముడి ప్రమాణం
14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్ ► హాజరైన అధికార, విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు ► భిన్నత్వమే భారతదేశ విజయంలో కీలకం: కోవింద్ న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ (71) ప్రమాణ స్వీకారోత్సవం సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కోవింద్‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయించారు . న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి, రాజకీయ నాయకుడిగా ఎదిగిన కోవింద్.. రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టిన మొదటి బీజేపీ నేతగా, రెండో దళిత వ్యక్తిగా నిలిచారు. ప్రమాణస్వీకారం అనంతరం కొత్త రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తూ.. భారతదేశ విజయ ప్రస్థానంలో భిన్నత్వమే అత్యంత కీలకమన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలు, జీవన విధానాలున్నా అందరం ఐక్యంగా ఉన్నామని తొలి ప్రసంగం చేశారు. అనంతరం సెంట్రల్ హాల్లోని అధికార, విపక్ష నేతలు కోవింద్‌కు అభినందనలు తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటలకు... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోవింద్‌ను అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వాహన శ్రేణితో పాటు అశ్వదళం వెంట రాగా దారి పొడవునా త్రివిధ దళాలకు చెందిన జవాన్లు సైనిక వందనం సమర్పించారు. పార్లమెంట్ భవనం ఐదో గేటు వద్ద ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌కు స్వాగతం పలికి సెంట్రల్ హాలుకు తోడ్కొని వెళ్లారు. జాతీయ గీతాలాపన తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ గెలుపొందినట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనను కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌తో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేయించారు. వెంటనే 21 తుపాకులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతి కోవింద్‌ను.. ప్రణబ్ తన ఆసనంలో కూర్చోబెట్టారు. అనంతరం కోవింద్ ప్రసంగిస్తూ.. కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్‌కు ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేశానని గుర్తుచేసుకున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించాలి: కోవింద్ ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ ఎంతో అవసరమన్నారు. ‘ఒక చిన్న గ్రామంలో మట్టి ఇంట్లో పుట్టి పెరిగాను. రాష్ట్రపతి భవన్ వరకూ నా ప్రయాణం ఎంతో సుదీర్ఘం. ఈ ప్రయాణం దేశానికి, సమాజానికి ఒక విషయాన్ని గట్టిగా నొక్కిచెపుతుంది. అవరోధాల సమయంలో రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ప్రాథమిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల్నే అనుసరించాను. భవిష్యత్తులో ఈ పంథాలోనే కొనసాగుతాను. నా ముందు రాష్ట్రపతులుగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్, ఎస్.రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్‌కలాం, ప్రణబ్ ముఖర్జీతో పాటు మహాత్మా గాంధీ నేతృత్వంలోని వేలాది మంది దేశభక్తుల పోరాట ఫలితమే దేశ స్వాతంత్య్ర ఫలం. ఈ నేతలు కేవలం రాజకీయ స్వేచ్ఛ ఉంటే చాలని భావించలేదు. కోట్లాదిమంది దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని నమ్మారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రతీ చివరి వ్యక్తి, మహిళకు అవకాశాలు చేరాల్సిన అవసరముంది. ఈ దేశం అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు, మతాలు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు కలిగి ఉన్నా భిన్నత్వమే మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. జాతిగా మనం ఎంతో సాధించినా.. మరింత వేగంగా, గొప్పగా, అవిశ్రాంతంగా శ్రమించా ల్సి ఉంది’ అని కోవింద్ ఉద్ఘాటించారు. సంప్రదాయబద్ధంగా... అట్టహాసంగా ♦ దేశ రాజ్యాంగ కొత్త అధినేత మార్పు ప్రక్రియ మంగళవారం ఉదయం సంప్రదాయబద్ధంగా మొదలైంది. రాష్ట్రపతి సైనిక కార్యదర్శి మేజర్ జనరల్ అనిల్ ఖోస్లా కాన్వాయ్‌తో అక్బర్ రోడ్డులోని కోవింద్ నివాసానికి వెళ్లారు. కోవింద్‌ను, ఆయన సతీమణి సవితను రాష్ట్రపతి భవన్‌కు ఆయన ఆహ్వానించారు. ♦ రాష్ట్రపతి భవన్లో కోవింద్ దంపతులకు ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానం పలికారు. ఇద్దరూ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సైనిక వందనం స్వీకరించారు. ప్రెసిడెంట్ బాడీగార్డుల(పీబీజీ) నుంచి ప్రణబ్ ముఖర్జీ చివరి సారిగా సైనిక వందనం అందుకున్నారు. ♦ అక్కడి నుంచి ఇద్దరూ రైసినా హిల్స్ దిగువ భాగంలో ఉన్న పార్లమెంట్ సెంట్రల్ హాలుకు బయలుదేరారు. అధికారిక వాహనంలో కుడివైపున ప్రణబ్, ఎడమవైపున కోవింద్ కూర్చోగా కాన్వాయ్ ముందుకు కదిలింది. రాష్ట్రపతి అశ్వదళం లాంఛన దుస్తుల్లో కాన్వాయ్‌ను అనుసరించింది. దారి మధ్యలో త్రివిధ దళాలకు చెందిన 1000 మంది జవాన్లు ‘హజార్ సలాం’ చేశారు. ♦ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం ముగిశాక ప్రణబ్, కోవింద్‌లు రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరారు. ఈసారి వారిద్దరు ఒకే కారులో ప్రయాణించినా సీట్లు మారాయి. ప్రణబ్ ముఖర్జీ ఎడమవైపున కూర్చుంటే.. దేశ నూతన రాష్ట్రపతి కోవింద్ కుడివైపున ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నాక సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. గుర్రపు బగ్గీలో కోవింద్ కొద్దిసేపు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో తిరిగారు. కొత్త రాష్ట్రపతికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. రాష్ట్రపతి భవనం గురించి కోవింద్‌కు ప్రణబ్ ముఖర్జీ వివరించారు. అనంతరం ప్రణబ్‌ను తీసుకుని కోవింద్ రాష్ట్రపతి భవన్ బయటకు వచ్చారు. అధికారిక వాహనంలో ప్రణబ్ కొత్త నివాసం 10, రాజాజీ మార్గ్ వద్ద ఆయనను దిగబెట్టారు. అక్కడి నుంచి కోవింద్ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కోవింద్‌కు కొత్త ట్వీటర్ అకౌంట్, వెబ్సైట్ నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేటాయించిన కొత్త ట్వీటర్ అకౌంట్ @ RashtrapatiBhvn పనిచేయడం ప్రారంభించింది. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత ఆయన చేసిన ప్రసంగం విషయాలను ఆ ట్వీటర్ హ్యాండిల్లో చూడొచ్చు. పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ వినియోగించిన అధికార ట్వీటర్ చరిత్రను @ POI13 అనే హ్యాండిల్ పేరిట రికార్డుల్లో భద్రపరిచారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పునర్వ్యవస్థీకరించి అందుబాటులోకి తెచ్చారు. మోదీ–మమత పలకరింపులు ♦ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు బల్లలు చరిచి స్వాగతం పలికారు. ♦ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడలతో కలసి ప్రధాని మోదీ ముందు వరసలో కూర్చున్నారు. కోవింద్ ప్రమాణం చేసిన తరువాత పాటిల్ హాల్లోకి రావడం ఆశ్చర్యం కలిగించింది. ♦ కార్యక్రమం ముగిసిన తరువాత బయల్దేరబోతూ మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని చూసి చేయి ఊపారు. బదులుగా మమత కూడా నమస్తే చెప్పా రు. ఇటీవల తారస్థాయికి చేరిన తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ♦ ఎంతో మంది ప్రముఖులు హాజరైనా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసిన తరువాత పలువురు బీజేపీ ఎంపీలు ఆయన చుట్టూచేరి కరచాలనం చేశారు. మరికొందరు ఆయన పాదాలకు నమస్కరించారు. ♦ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నా మాట్లాడుకున్నట్లయితే కనిపించలేదు. ♦ లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన నలుగు రు ఎంపీలతో కలసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చివరి వరసలో కూర్చున్నారు. ♦ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తన పక్కనే కూర్చున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చాలాసేపు ముచ్చటించారు. ♦ సీఎంలలో...కె.చంద్రశేఖర్ రావు(తెలంగాణ), చంద్రబాబు (ఆంధ్రప్రదేశ్), ఫడ్నవీస్(మహారాష్ట్ర), పళనిస్వామి (తమి ళనాడు), వసుంధర రాజె(రాజస్తాన్), శర్బానంద సోనోవాల్(అస్సాం), విజయ్ రూపానీ(గుజరాత్), శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), రమణ్‌సింగ్(ఛత్తీస్‌గఢ్), మనోహర్‌లాల్ ఖట్టర్(హరియాణా), పీకే చామ్లింగ్(సిక్కిం), పెమా ఖండూ (అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్)లు కార్యక్రమానికి హాజరయ్యారు. -
ట్విట్టర్లో నిమిషాల్లో దూసుకుపోయిన కోవింద్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ అప్పుడే ట్విట్టర్లో దూసుకుపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసి నిమిషాలు కూడా గడవకముందే ఆయన ట్విట్టర్ ఖాతాకు ఏకంగా 3.5మిలియన్ల ఫాలోవర్స్ చేరుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'(@rashtrapatibhvn) పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. అయితే, నిమిషాల్లోనే ఆయనకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోవడం గమనార్హం. ఆయన 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు కూడా. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, కోవింద్ ఖాతాకు మాత్రం గతంలో ఏ రాష్ట్రపతికి రానంత వేగంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ మంగళవారం రామ్‌నాథ్‌తో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. -
'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'
-
'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'
న్యూఢిల్లీ: తానొక కుగ్రామంలో, పూరిగుడిసెలో మట్టి ఇంట్లో పుట్టానని భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఇలాంటి తనకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించిందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో తొలిసారి కోవింద్ ప్రసంగించారు. 'పూర్తి వినమ్రంగా నేను ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. ఈ బాధ్యతను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రపతిగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. ఒక కుగ్రామంలో పూరిగుడిసెలో నేను పుట్టి పెరిగాను. అలాంటి నాకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించింది. ఎంతోమంది స్ఫూర్తితో బాధ్యతలు స్వీకరిస్తున్న నేను వాటిని వినమ్రంగా నిర్వహిస్తాను. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి బాటలోనే నడుస్తాను. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ అడుగుజాడల్లో ముందుకెళతాను. 125కోట్ల మంది ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. మన దగ్గర భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నాయి.. అయినా మనం భారతీయులమే. సైనికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, రైతులూ, మహిళలు, యువతే ఈ దేశ నిర్మాతలు. భారత్ ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది. ఇంకా ఎన్నో చేరుకోవాలి. వేలాదిమంది పోరాటం ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీజీ కలలుగన్న నవసమాజాన్ని మనం నిర్మించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలే. ఈ సందర్భంగా భారత్ నాలుగో పారిశ్రామిక విప్లవానికి స్వాగతం పలుకుతోంది..' అంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో ఆయన తొలి ట్వీట్ కూడా చేశారు. 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. Honoured to be sworn in as the 14th President of India; would be carrying out my responsibilities with all humility #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 25, 2017 -
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం
-
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా బిహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్ ముఖర్జీ... కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేత కోవింద్. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా రాజ్‌ఘాట్ చేరుకుని, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. దేశప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత అద్వానీ, రెండు తెలుగురాష్ట్రల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు హాజరు అయ్యారు. కోవింద్ ప్రమాణం చేశాక సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమం ముగిశాక కోవింద్ రాష్ట్రపతి భవనానికి చేరుకున్నాక, అక్కడికి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. -
నేడు కోవింద్ ప్రమాణం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ అభ్యర్థి, బిహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం దేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదలయ్యే కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు కోవింద్.. రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్ ముఖర్జీతో కలసి అక్కడికి చేరుకుంటారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కోవింద్ ప్రమా ణం చేశాక సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తాయి. కార్యక్రమం ముగిశాక కోవింద్ రాష్ట్రపతి భవనానికి చేరుకుంటారు. అక్కడికి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పిస్తారు. -
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
తిరుమల ఆలయంలో ప్రమాణ స్వీకారం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆమెతో టీటీడీ ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె శ్రీవారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సుధా నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. శ్రీవారి ధర్మకర్తల మండలిలో చోటు లభించటం అదృష్టంగా భావిస్తున్నానని సుధానారాయణమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. -
అమెరికా ఫస్ట్
డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ • అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం •నేటి నుంచి ప్రజలే పాలకులని వెల్లడి •‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటన •దేశానికి పునర్వైభవం తెస్తానని హామీ నా చివరి శ్వాస వరకు అమెరికాకు నష్టం కలగకుండా చూసుకుంటా.. మీ ఉద్యోగాలు తీసుకొస్తా.. మీ కలను వెనక్కు తెస్తా.. మీ సంపదను వెనక్కు తెప్పిస్తా.. అమెరికా వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పిస్తా.. మీకోసం ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ నినాదాలు తీసుకొస్తున్నా. – అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలో ట్రంప్ వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ (70) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ఈరోజు (జనవరి 20, 2017) ప్రత్యేకంగా నిలిచిపోతుందని.. నేటినుంచి ప్రజలే పాలకులని ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని.. దేశానికి పునర్వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇన్నాళ్లూ వాషింగ్టన్ డీసీ (రాజధాని)కి పరిమితమైన అధికారం ఇప్పుడు ప్రజలవద్దకు వెళ్తుందన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ నాయకులే బాగుపడ్డారని.. ఫ్యాక్టరీలు మూతపడి ఉద్యోగాలు పోయినా పట్టించుకోలేదని విమర్శించారు. ఓవైపు మంచు కురుస్తున్నా.. ప్రతికూల వాతావరణంలో దాదాపు 8 లక్షల మంది నేషనల్ మాల్ సమీపంలో జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా బైబిల్‌పై ప్రమాణంచేస్తున్న డొనాల్డ్ ట్రంప్. చిత్రంలో ట్రంప్ సతీమణి మెలానియా, కూతురు ఇవాంకా, కొడుకులు ట్రంప్ జూనియర్, బరాన్, చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఉన్నారు లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేసి.. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ వినియోగించిన బైబిల్‌తోపాటు మరో బైబిల్‌పై ప్రమాణం చేస్తూ రాజ్యాంగ రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తానని ట్రంప్ ప్రమాణం చేశారు. అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్.. అధ్యక్షుడితో ప్రమాణం చేయించారు. అధికార మార్పిడిలో సహకరించిన ఒబామా దంపతులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ముందు అమెరికా.. తర్వాతే అన్నీ ఇన్నాళ్లుగా రాజకీయ కారణాల వల్ల అమెరికాలో స్థానికులు దారుణంగా నష్టపోయారని.. ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతబడి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని ట్రంప్ తెలిపారు. ఇకపై ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతోనే పాలన కొనసాగుతుందన్నారు. ‘మీ అందరి (ప్రజల) సహకారంతో తిరిగి అమెరికాకు పూర్వవైభవం తెస్తాం. మీ కలలు, ఆశయాలను నెరవేరుస్తాం. మీ బాధను మా బాధగా, మీ సంతోషాన్ని మా సంతోషంగా స్వీకరిస్తాం. ఇది మీ దేశం. మీరు సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. నేటినుంచి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఈ రోజు అమెరికా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అని ట్రంప్ ప్రసంగించారు. ఇన్నాళ్లూ దేశంలో మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యారని.. ఇకపై ‘విస్మరణకు గురైనవారు’ అనే మాటే వినిపించకూడదన్నారు. వాణిజ్యం, పన్నులు, ఇమిగ్రేషన్, విదేశాంగ విధానం ఇలా ప్రతి నిర్ణయంలో అమెరికా ఫస్ట్ అనే నినాదమే ప్రతిబింబిస్తుందన్నారు. ఉద్యోగకల్పనలో స్థానికత ‘మనమంతా కలిసి అమెరికా, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిద్దాం. మన ముందున్న సవాళ్లను, ఒడిదుడుకులను స్వీకరించి.. సమైక్యంగా ముందుకెళదాం. అన్ని సమస్యలను అధిగమించి గొప్ప అమెరికాను నిర్మించుకుందాం’ అని ట్రంప్ కోరారు. స్థానికులకు ఉద్యోగాలివ్వాలనే ఎన్నికల హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్న ట్రంప్.. అమెరికన్లకు భద్రత కల్పించటం కూడా తమ బాధ్యతని తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ‘ఇన్నాళ్లూ జరిగిన దోపిడీ ఆగిపోతుంది. మార్పు నేటితోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇదీ మీ సంబరం. మాటలు చెప్పటానికి నేటితో చెల్లిపోయింది. ఇకపై చేతల్లో చూపించాల్సిందే’ అని ట్రంప్ తెలిపారు. అమెరికన్లకు ఉద్యోగాలు వెనక్కు తెస్తామని, సరిహద్దులను కాపాడతామని, అమెరికా సంపదను, అమెరికన్ల కలలను తిరిగి తీసుకొస్తామన్నారు. మన విశ్వాసాన్ని దెబ్బతీశారు ‘ఇన్నాళ్లూ ప్రభుత్వ విధానాల కారణంగా సైనికశక్తి కుదేలైంది. ఇది చాలా బాధాకరం. మన దేశ సరిహద్దులను మనం కాపాడుకోవాలి. కానీ లక్షల కోట్ల డాలర్లను, అమెరికా మెషినరీని విదేశాల్లో పెట్టి వచ్చాం. విదేశాలను ధనికులను చేశాం. దీని వల్ల మన సంపద, విశ్వాసం అన్నీ అదృశ్యమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మన గౌరవాన్ని వదులుకున్నాం. ఒక్కొక్కటిగా ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి. లక్షల మంది అమెరికన్లను నిరుద్యోగులుగా మారారు’ అని ట్రంప్ అన్నారు. తుది శ్వాస వరకు అమెరికాను గొప్పగా నిలిపేందుకే ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా దూసుకుపోయేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తానన్నారు. ట్రంప్‌కు మోదీ అభినందన న్యూఢిల్లీ: ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనను అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల, సహకారాల బలోపేతం కోసం ఆయనతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని, రాబోయే రోజుల్లో అమెరికా గొప్ప విజయాలు అందుకోవాలని అభిలషిస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మ భాగస్వామ్య బలం ఉమ్మడి విలువలు, ప్రయోజనాల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఇకనుంచి అంతా మనవాళ్లే..! అమెరికాలో మౌలికవసతుల రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు. అన్ని పనుల్లో లేబర్ల దగ్గర్నుంచి, ఇంజనీర్ల వరకు అందరినీ అమెరికన్లనే వినియోగించుకుంటామన్నారు. ఇందుకోసం ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ (అమెరికన్ వస్తువులు కొనాలి, అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలి) నినాదాన్ని తీసుకొచ్చారు. ‘గతంలో కన్నా అమెరికన్లు గొప్పగా ఆలోచించాలి. మనం విఫలమవ్వం. మనమంతా కలిసి బలమైన, సంపన్న దేశాన్ని నిర్మిద్దాం. ప్రతి అమెరికన్ గర్వపడేలా పరిస్థితిని తీసుకొద్దాం’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అమెరికన్లకు భద్రత కల్పించటం తమ బాధ్యతన్న ట్రంప్.. దేశానికి సమర్థవంతమైన మిలటరీ, దేవుడు రక్షణగా ఉంటారన్నారు. వివిధ జాతులున్నా మనమంతా ఒక్కటే అనే భావన, దేశభక్తి ముందుకు నడిపిస్తుందన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అంతకుముందు. మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. 1.ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు వైట్‌హౌస్‌లో మీడియా ముందుకొచ్చిన ఒబామా, ట్రంప్ దంపతులు 2.యూఎస్ కాపిటల్ ముందు ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన అశేషజనవాహిని ట్రంప్ జీవితంలో కీలక ఘట్టాలు ► క్వీన్స్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ టైకూన్ ఫ్రెడ్ ట్రంప్‌కు జూన్ 14, 1946లో నాలుగో సంతానంగా జననం ► వార్టన్ స్కూల్లో, ఫోర్దమ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో విద్యాభ్యాసం ► తండ్రి నుంచి అప్పు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం ► తండ్రి కంపెనీపై ఆధిపత్యం సాధించి ఆ కంపెనీకి ట్రంప్ ఆర్గనైజేషన్‌గా 1971లో నామకరణం ► ఎంటర్టైన్ మెంట్ బిజినెస్‌లో టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా ప్రఖ్యాతి.. ► మూడు సార్లు వివాహం. ప్రస్తుత భార్య మెలానియా. సంతానం.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫానీ, బారన్ ► అధ్యక్ష పదవికి పోటీపడాలని 1987 నుంచి ప్రయత్నాలు ► రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్నట్లు 2015లో ప్రకటన ► 2016 జూలై 19న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన ► కుమారులు డొనాల్డ్, ఎరిక్‌లకు వ్యాపార సామ్రాజ్యం అప్పగింత -
ఇక అమెరికాకు రెండే విధానాలు: ట్రంప్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మైక్ పెన్స్‌తో అమెరికా సుప్రీంకోర్టు జడ్జి క్లారెన్ థామస్ ప్రమాణం చేయించగా, అనంతరం డొనాల్డ్ ట్రంప్‌తో అమెరికా అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. గత నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే స్లోగన్‌తో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు విషయాలను ప్రసంగించారు. ఉగ్రవాదం, వలసలు, అమెరికా సవాళ్లు ఇలా చాలా అంశాలపై ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించిన పలు కీలక అంశాలు: ఒబామా దంపతులు, మాజీ అధ్యక్షులు, అమెరికా ప్రజలకు ధన్యవాదాలు అమెరికాను పునర్ నిర్మించే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం ఎన్నో సవాళ్లను అధిగమించాం, కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకున్నాం వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని ప్రజలకే అందిస్తాను ఇది మీరోజు.. ఈ విజయం మీది.. అమెరికా మీ దేశం పక్క దేశాల చొరబాట్ల నుంచి మన సరిహద్దులను రక్షించుకుందాం ఇక ముందు వేసే ప్రతి అడుగులోనూ మనదే గెలుపు అమెరికా కోసం మనం రెండే విధానాలు పాటిద్దాం. అమెరికన్లకే ఉద్యోగాలిద్దాం.. అమెరికన్ వస్తువులనే కొందాం మాటలు చెప్పే కాలం ముగిసింది. ఇక చేతలు ప్రారంభం నల్లవాడైనా, తెల్లవాడైనా.. అందరి రక్తం ఎరుపే నేతలు గొప్పవాళ్లు అయ్యారేమో కానీ.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక నుంచి ప్రజలే పాలకులు. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వను అమెరికాను అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుదామన్నారు ఈ భూమి మీద నుంచి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాం (చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం) -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మైక్ పెన్స్ బాధ్యతలు స్వీకరించారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం(వాషింగ్టన్ డీసీ) మెట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన భార్య మిలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, కొడుకు జూనియర్ ట్రంప్ హాజరయ్యారు. రెండు బైబిళ్లపై(ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షులు, సెలబ్రిటీలతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ప్రజలు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు తీవ్ర విమర్శలు, మరోవైపు సర్వేలన్నీ హిల్లరీకే అధ్యక్షపీఠమని తేల్చేసినా... 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే స్లోగన్‌తో అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో విజయం సాధించిన ట్రంప్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ 232 ఓట్లకే పరిమితమయ్యారు. (చదవండి: ఇక అమెరికాకు రెండే విధానాలు: ట్రంప్) -
ట్రంప్ దంపతులకు ఒబామా స్వాగతం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మిలానియా ట్రంప్‌తో కలిసి వైట్ హౌస్‌కు వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ లోని లింకన్ స్మారకంలో జరగనున్న ఈ వేడుకలకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మాజీ అధ్యక్షులు, సెనెటర్లు, సెలబ్రిటీలతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ప్రజలు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేడు అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. -
నేడే ట్రంప్ ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్ : అమెరికా 45వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ లోని లింకన్ స్మారకంలో జరగనున్న ఈ వేడుకలకోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలతోపాటు దాదాపు 9 లక్షల మంది ప్రజలు కూడా ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. సంగీత కళాకారుల ప్రదర్శనతోపాటు పాఠశాల విద్యార్థుల పరేడ్, బాలీవుడ్ తారల నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయిట. 50 మందికి పైగా చట్టసభ సభ్యులు, పలువురు అమెరికా కళాకారులు, సంగీత విద్వాంసులు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరుకావటం లేదని స్పష్టం చేశారు. సెంట్రల్ వాషింగ్టన్ కు 8 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పలు సంఘాలు ట్రంప్ బాధ్యతలు తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి తీసుకున్నాయి. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ ప్రమాణం రేపే
వైట్‌హౌస్ నుంచి ఒబామా బయటకు, ట్రంప్ లోపలికి అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు(జనవరి 20న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం(వాషింగ్టన్ డీసీ) మెట్లపై ప్రమాణం చేసిన రోజే ఆయన అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం అధ్యక్ష భవనంలోని తన పడకగదిలో నిద్రలేచే అధ్యక్షుడు బరాక్ ఒబామా సాయంత్రానికి భార్యాపిల్లలతో కలసి నగరంలోని మరో భవనంలోకి వెళ్లిపోతారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్ పెన్స్ ప్రమాణం ఉంటుంది. ప్రమాణాల తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. ఒబామాకు వీడ్కోలు : ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్ తొలిసారి అమెరికా కాంగ్రెస్ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. వెంటనే ప్రమాణం చేసిన ప్రదేశం క్యాపిటల్ నుంచి ట్రంప్ తన కాన్వాయ్‌తో పెన్సిల్వేనియా అవెన్యూ(క్యాపిటల్, వైట్‌హౌస్‌ను కలిపి మెయిన్‌రోడ్) గుండా శ్వేతసౌధానికి చేరుకుంటారు. 20నే ప్రమాణం ఎందుకు? లీప్ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగాఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి 4న(అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు) కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది. సాధారణంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొత్త అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. ఒబామాతో రెండుసార్లూ(2009, 2013) అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. ట్రంప్‌తో ఆయనే ప్రమాణం చేయిస్తారు. ప్రమాణానికి బాలీవుడ్ డ్యాన్సర్లు ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్ సురేశ్ ముఖుద్ వద్ద శిక్షణ పొందిన దాదాపు 30 మంది భారత డ్యాన్సర్లు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరిలో చాలా మంది బాలీవుడ్‌కు చెందిన వారే. కొద్దిరోజుల క్రితమే వాషింగ్టన్లో మకాం వేసిన ముఖుద్ డ్యాన్స్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. తాను కలలు కన్న అవకాశం ఇప్పుడు తనకు వచ్చిందని పేర్కొన్నారు. కాపిటల్ భవనం 70 ఏళ్ల వయసులో..: అధ్యక్షునిగా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు ఎక్కువ వయసు ఉన్న నేతగా ఇప్పటి వరకూ రోనాల్డ్ రీగన్(69 ఏళ్ల 345 రోజులు) రికార్డుల్లో ఉన్నారు. రీగన్ రికార్డును జనవరి 20న ట్రంప్ బద్దలు గొట్టబోతున్నారు. ఆ రోజున ట్రంప్ వయసు 70 సంవత్సరాల, ఏడు నెలల, ఏడు రోజులు. నాకు ట్వీటింగ్ ఇష్టముండదు: ట్రంప్ తనకు ట్వీటింగ్ ఇష్టముండదని, అయితే నిజాయితీ లేని మీడియాపై సోషల్ మీడియాలో పోరాడతానని ట్రంప్ చెప్పారు. ‘నిజాయితీ లేని మీడియా.. ప్రెస్ నా ముందు ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ట్విటరే నాకున్న ఏకైక మార్గం’ అని ఓ ఇంటర్వూ్యలో అన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ జె. ఉమా దేవి, జస్టిస్ ఎన్.బాలయోగి, జస్టిస్ టి.రజని, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మంగళవారం ప్రమాణం చేయించారు. అనంతరం వీరు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కలసి జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కలసి జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ నాగార్జునరెడ్డితో కలసి జస్టిస్ రజని, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో కలసి జస్టిస్ బాలయోగి కేసులను విచారించారు. కొత్తగా బాధ్య తలు స్వీకరించిన నలుగురు న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. -
ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు అండగా ఉండాలి ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలకు దూరంగా ఉండాలి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు. -
ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
పులివెందుల : బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి సాధించాలని రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడు నారాయణస్వామి రాయల్ తెలిపారు. పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల బలిజ సంఘ కమిటీ సభ్యులతోపాటు పట్టణంలోని బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఇటీవల శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘ అధ్యక్షునిగా గంగల వీరాంజనేయులును ఎన్నుకున్నారు. ఆయన తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో నారాయణస్వామి మాట్లాడుతూ పులివెందులలో బలిజ సంఘీయుల కోసం నూతన కల్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారని.. దానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. రాష్ట్రంలోని బలిజ సంఘీయులమందరం శాంతి, సహనంతో తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేద్దామన్నారు. ముఖ్యంగా యువత ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. రాయలసీమ బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు రాము మాట్లాడుతూ బలిజలంతా ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఏకమైతే మన హక్కులను సులభంగా సాధించుకొని తీరుతామన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బలిజ కులస్తుల సాధక బాధలు తీర్చుటకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాపు సమాఖ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కుమార్, ఆంజనేయకుమార్, వేంపల్లె బలిజ సంఘ అధ్యక్షుడు రెడ్డయ్య, రాష్ట్ర బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, రిటైర్డు డీఎస్పీ శివశంకర్, రాష్ట్ర బలిజ సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి పత్తి నాగేశ్వరరావు, పులివెందుల మాజీ అధ్యక్షుడు బాలు, రాధాకృష్ణ, నూతన ఉపాధ్యక్షుడు శ్రీరామసుబ్బయ్య, పూల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఖాళీగా ఉన్న స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఫరీదుద్దీన్ చేత ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఫరీదుద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తానూ భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) పదవికి రాజీనామా చేయగా ఆ టికెట్‌ను టీఆర్ఎస్ ఫరీదుద్దీన్‌కు కేటాయించింది. విపక్షాల నుంచి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ప్రమాణ స్వీకారం
కొత్త వాళ్లకు బాధ్యతలు హైకోర్టులో 54కు చేరిన జడ్జీల సంఖ్య కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 54కు చేరింది. కొత్తగా నియమితులైన పదిహేను మంది న్యాయమూర్తులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వీరి చేత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త వాళ్లకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి. సాక్షి,చెన్నై: రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు పరిధిలో మదురై ధర్మాసనం కూడా ఉంది. ఈ రెండు చోట్ల సుమారు డెబ్బై మంది న్యాయమూర్తులు తప్పనిసరి. అయితే, ఆ సంఖ్యకు భిన్నంగా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం 39 మంది మాత్రమే న్యాయమూర్తులు పనుల భారంతో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత నెల 24 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి తగ్గ నివేదిక రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, ఇందులో తొమ్మిది మందిని పక్కన పెట్టి, పదిహేను మందికి అవకాశం కల్పించేందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఆమోదముద్ర వేశారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మద్రాసు హైకోర్టుకు చేరడంతో కొత్త వాళ్ల ప్రమాణ స్వీకారానికి తగ్గ ఏర్పాట్లను అధికార వర్గాలు చేశారు. ప్రమాణ స్వీకారం: రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్రతో కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో బార్ కౌన్సిల్ తరఫున ఎంపిక చేసిన తొమ్మిది మంది న్యాయవాదులు ఉన్నారు. వీరిలో సీనియర్ న్యాయవాదులు పార్తిబన్, ఆర్.సుబ్రమణియన్, స్వాతంత్య్ర సమరయోధుడు రాజగోపాలనాయుడు కుటుంబానికి చెందిన న్యాయవాది ఎం.గోవిందరాజ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విభాగాలకు న్యాయవాదిగా పనిచేసిన ఎం. సుందర్, కేంద్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రన్, హైకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షురాలు నిషా భాను, చెన్నైకు చెందిన న్యాయవాది ఎంఎస్.రమేష్, ఎస్ఎం. సుబ్రమణియన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అనితా సుమంత్ ఉన్నారు. ఇక, మరో ఐదుగురు జిల్లాల జడ్జీలుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారు. వీరిలో న్యాయశాఖ కార్యదర్శిగా, చెన్నై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన జయచంద్రన్, మదురై మెజిస్ట్రేట్‌గా పనిచేసిన ఎంఏ బషీర్ అహ్మద్, హైకోర్టు రిజిస్ట్రార్ రవీంద్రన్, పుదుచ్చేరి మెజిస్ట్రేట్ కార్తికేయన్, హైకోర్టు పర్యవేక్షణాధికారి వేల్ మురుగన్, న్యాయవాద సంఘం మాజీ నేత భాస్కరన్ ఉన్నారు. హైకోర్టు ఆవరణలోని ఆడిటోరియంలో ఉదయం వీరి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ కొత్త వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధ్యతలకు తగ్గ ఉత్తర్వుల్ని అందుకున్న కొత్త న్యాయమూర్తులకు న్యాయవాదులు, హైకోర్టు వర్గాలు శుభాకాంక్షలు తెలియజేశాయి. ఇది వరకు హైకోర్టులో 39 మంది మంది న్యాయమూర్తులు ఉండగా, ప్రస్తుతం పదిహేను మందితో కలుపుకుంటే, ఆ సంఖ్య 54కు చేరింది. దీంతో హైకోర్టు, మదురై ధర్మాసనంలలో ఇక, ఏఏ బెంచ్‌లకు ఎవరెవరు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారో అన్న వివరాలను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ప్రకటించిన తదుపరి, ఆయా న్యాయమూర్తులు ఇక, తమ విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. -
బాధ్యతలు చేపట్టిన ఆర్టీఓ
అనంతపురం సెంట్రల్ : జిల్లా రోడ్డు ర వాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా కె. శ్రీధర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఉత్తమ సేవలందించడమే తన ప్రథమ లక్ష్యమన్నారు. -
గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఓపీ కోహ్లి మధ్యాహ్నం ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డిప్యూటీ సీఎం పదవి ఏర్పాటు చేశారు. నితిన్‌తో సహా 8 మంది కేబినెట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులు వెరసి 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. పాత మంత్రివర్గంలో నుంచి ఆనందీబెన్ పటేల్ వర్గానికి చెందిన ఇద్దరు, మరో ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. ఆనందీబెన్ వర్గీయులైన హోం సహాయ మంత్రి రజనీభాయ్ పటేల్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వసుబెన్ త్రివేదిలను కొత్త కేబినెట్లోకి తీసుకోలేదు. ఆర్థిక మంత్రి సౌరభ్, సాంఘిక న్యాయ మంత్రి వోరా, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి గోవింద్ పటేల్‌లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంత్రివర్గంలో అన్ని కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారు. పటేల్ వర్గానికి చెందిన 8 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కేబినెట్లోకి ఒకే ఒక మహిళ (నరోడ ఎమ్మెల్యే నిర్మల వాధ్వానీ)ను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత అద్వానీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, హర్షవర్ధన్, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రఘుబర్ దాస్, మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ అభినందనలు గుజరాత్ కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన రూపానీకి ప్రధానిమోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యటన వల్ల రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేక పోయిన మోదీ.. రూపానీ, నితిన్ బృందం రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన ఆనందీబెన్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమని మరో ట్వీట్లో కొనియాడారు. -
నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం
♦ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక ♦ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో.. ♦ ఢిల్లీకి తరలివెళ్లిన అనుచరులు, అభిమానులు ♦ వచ్చే నెల 7న జిల్లాకు రాక సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ధర్మపురి శ్రీనివాస్ మం గళవారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం విధితమే. గత నెల 24 రాజ్యసభకు నోటిఫికేషన్ వెలువడగా.. 26న డీఎస్‌ను టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఈ వ్యవహరంలో నిజామాబాద్ ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారు. అనంతరం డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. రైళ్లల్లో ఒక రోజు ముందుగానే వెళ్లారు. సీనియర్ నేతగా అనుభవం రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మపురి శ్రీనివాస్‌కు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సుధీర్ఘ అనుభవజ్ఞుడిగా అనేక పదవులు చేపట్టిన నాయకుడిగా డీఎస్ పేర్కొందారు. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారిగా కాలుమోపనున్నారు. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్న ఎంపీ కవిత సూచన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ అంశాలు కూడా డీఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ డీఎస్ చేరిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించిన కేసీఆర్ అనంతకం ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో సీనియర్ రాజకీయ వేత్త, బీసీ వర్గాల నేతగా డీఎస్‌కు తగిన ప్రాధాన్యం కల్పించారన్న చర్చ సాగుతోంది. వచ్చే నెల 7న డీఎస్ రాక రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చే నెల 7న మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు సన్నాహాలు ప్రారంభించా రు. ఇందుకు సంబంధించి అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి నగరంలోని డీఎస్ ఇంటి వరకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మమత రెండోసారి...
పశ్చిమబెంగాల్ సీఎంగా మమత ప్రమాణం - హాజరైన కేంద్రమంత్రి జైట్లీ, బిహార్, యూపీ, ఢిల్లీ సీఎంలు - కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(61) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పశ్చిమబెంగాల్‌ను పాలించిన వామపక్షాలను మట్టికరిపించి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమత.. వరుసగా రెండోసారీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వేలాదిగా అభిమానులు హాజరైన కార్యక్రమంలో గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ.. మమతచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించగా.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అశోక్ గజపతి రాజు, బాబుల్ సుప్రియోలు మమత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, డీఎంకే తరఫున కణిమొళి, మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ, భూటాన్ పీఎం షెరింగ్ తాబ్గే, మమత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మమతతో పాటు 41 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో 28 మంది కేబినెట్ మంత్రులుగా, 13 మంది సహాయమంత్రులుగా నియమితులయ్యారు. మమత తన తాజా టీంలో 18 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం విశేషం. ప్రమాణం అనంతరం పలువురు మంత్రులు మమతకు పాదాభివందనం చేశారు. ప్రమాణ కార్యక్రమానికి కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి కార్లో బయల్దేరే ముందు.. కొద్దిదూరం నడిచి, అభిమానులకు అభివాదం చేశారు. కార్యక్రమం ముగియగానే నేరుగా సచివాలయానికి వెళ్లారు. కొత్త ఫ్రంట్‌కు పునాది!? మమత నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి! బెంగాల్ సీఎంగా మమత రెండోసారి ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కొత్త వేదిక నిర్మాణానికి అడుగులు పడుతున్నాయనే సంకేతాలిచ్చింది. బిహార్ ఎన్నికలకు ముందు జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, ఇతరపార్టీలు మహాకూటమికి తెరలేపినా పలుకారణాలతో దీనికి బ్రేక్ పడింది. బిహార్‌లో నితీశ్, లాలూ కూటమి గెలిచినా.. మూడో కూటమి ఏర్పాటుపై పెద్దగా అంచనాలు పెరగలేదు. కానీ, బెంగాల్లో భారీ మెజార్టీతోప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మమత నాయకత్వంలోనే ఈ వేదిక రూపుదిద్దుకోవచ్చనే వాదన బలంగా వినబడుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీని, మోదీని ఎదుర్కోగల సత్తా ఉన్న కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు ఈ కార్యక్రమం పునాది కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మమత ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ వ్యతిరేకశక్తులైన వివిధ పార్టీలనుంచి కీలక నేతలు (నితీశ్, లాలూ, కేజ్రీవాల్, ఫరూఖ్ అబ్దుల్లా, కణిమొళి) హాజరు కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కార్యక్రమం తర్వాత లాలూ మాట్లాడుతూ.. ‘బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక శక్తులు ఏకమవనున్నాయి’ అని చెప్పటం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ ఈ కొత్త వేదిక ఏర్పడితే.. దీనికి నేతృత్వం వహించే నేత ఎవరనే అంశమూ ఆసక్తికరంగా మారింది. ఈ ఫ్రంట్‌లోని నేతలంతా నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నవారే. ప్రమాణం అనంతరం ‘భారత దేశపు తొలి బెంగాల్ ప్రధాని కానున్నారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నను మమత తోసిపుచ్చకపోవటం. ఎవరైనా ప్రధాని కావొచ్చని చెప్పడం కొత్త వేదిక ఆలోచనలకు బలం చేకూరుస్తోంది. -
తండ్రి బాటలోనే సుప్రీం న్యాయమూర్తిగా..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 29కి చేరింది. ఇంకా మరో రెండు ఖాళీలు ఉన్నాయి. జస్టిస్ ఏఎం ఖనివాకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎల్ నాగేశ్వరరావు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. జస్టిస్ ఖనివాకర్ అంతకుముందు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయగా.. జస్టిస్ చంద్రచూడ అలహాబాద్ హైకోర్టుకు, జస్టిస్ భూషణ్ కేరళ హైకోర్టుకు ఉన్నత న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడు. ఆయన అప్పట్లో 1978 ఫిబ్రవరి 22 నుంచి.. 1985 జూలై 11 వరకు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఎల్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. -
కొలువుదీరిన పాలకమండలి
♦ సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా రాజనర్సు ప్రమాణం ♦ వైస్ చైర్మన్‌గా ఖాజా అక్తర్ పటేల్.. ♦ ఎన్నుకున్న సభ్యులు.. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం ♦ అభినందించిన మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాల్టీలో సంపూర్ణ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ అధిష్టానం విధేయతకే పట్టం కట్టింది. సిద్దిపేట మున్సిపాల్టీ 10వ చైర్మన్‌గా కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్‌గా ఖాజా అక్తర్ పటేల్‌ను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా శనివారం జెడ్పీ సీఈఓ వర్షిణి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పార్టీ నుంచి, కౌన్సిల్ సభ్యుల నుంచి ఎలాంటి పోటీలేక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నిర్ణీత సమయం 11 గంటలకు కౌన్సిల్ సభ్యుల హాజరు తీసుకున్న ఎన్నికల అధికారులు చైర్మన్ ప్రక్రియను 45 నిమిషాల్లో పూర్తి చేశారు. అదే విధంగా 11.45కు వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారిక ప్రకటన చేసి 30 నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ కడవేర్గు రాజనర్సును మున్సిపల్ చైర్మన్‌గా, 13వ వార్డు కౌన్సిలర్ వెంకట్‌గౌడ్ ప్రతిపాదించడం మరో సభ్యుడు, 10వ వార్డు మచ్చవేణుగోపాల్‌రెడ్డి బలపర్చడంతో రాజనర్సు చైర్మన్‌గా ఏకగ్రీవమైంది. అదే విధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం 12వ వార్డు కౌన్సిలర్ ఖాజా అక్తర్ పటేల్‌ను పదవ వార్డు కౌన్సిలర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి ప్రతిపాదించగా, 32వ వార్డు కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ బలపర్చారు. రెండు పదవులకు నిర్ణీత సమయంలో కౌన్సిల్ సభ్యుల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, అభ్యంతరాలు రాకపోవడంతో ప్రిసైండింగ్ అధికారి వర్షిణి ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్, వైస్చైర్మన్లను ఎక్స్ అఫీషియో సభ్యులు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అభినందించారు. ప్రజల మన్ననలు పొందండి నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన పాలక వర్గం ప్రజల మధ్య ఉన్నదని, ప్రజల సమస్యలను పరిష్కరించి వారి మన్ననలను పొందాలన్నారు. సిద్దిపేట మున్సిపాల్టీని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపలన్నారు. ప్రజల్లో ఉండే మనిషికి ప్రజాభిమానం లభిస్తుందన్నారు. అదే విధంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌లు అభినందనలు అందజేశారు. కడవేర్గు రాజనర్సు సిద్దిపేట పట్టణానికి చెందిన రాజనర్సు వార్డు కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మంత్రి హరీశ్‌రావుకు రాజనర్సు అత్యంత సన్నిహితుడు. గత 20 సంవత్సరాలుగా రాజనర్సు కేసీఆర్ అనుచరుడిగా కొనసాగారు. గత పాలక వర్గం చైర్మన్‌గా పట్టణాభివృద్ధికి కృషి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం ఆయనకు రెండవసారి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా ఆవకాశం కల్పించింది. అక్తర్ పటేల్.. సిద్దిపేట పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఖాజా అక్తర్ పటేల్ రెండవ సారి కౌన్సిల్లోకి అడుగుపెట్టారు. గత కౌన్సిల్లో సభ్యునిగా పనిచేసిన అక్తర్ ఈ సారి ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలంగాణ టీడీపీ సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన అధికార టీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి దర్బారు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం), కొండా మురళీధర్‌రావు (వరంగల్), భాను ప్రసాద్‌రావు (కరీంనగర్), నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్-2), పురాణం సతీశ్ (ఆదిలాబాద్), డాక్టర్ భూపతిరెడ్డి (నిజామాబాద్), భూపాల్‌రెడ్డి (మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి), శంభీపూర్ రాజు (రంగారెడ్డి -2), కసిరెడ్డి నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్)లు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. తాము స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యామని, ఈ దృష్ట్యా ఆ సంస్థల సమస్యలపై పోరాడుతామని నూతన ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. కాగా, ఏపీ పునర్విభజన చట్టం మేరకు నలభై మంది సభ్యులతో ఏర్పాటైన తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం ఒక్క స్థానం కూడా ఖాళీగా లేదు. స్థానిక సంస్థల కోటాలో మండలి ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి 21 మంది సభ్యులు ఉండగా టీటీడీపీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. -
కెనడా కేబినెట్లో సిక్కులకు చోటు
కెనడా: కెనడాలో రాజకీయాలలో భారత సంతతి సిక్కులు దూసుకుపోతున్నారు. కెనడా నూతన మంత్రివర్గంలో ముగ్గురు సిక్కులకు చోటు దక్కింది. కెనడా నూతన ప్రధానిగా ట్రుడేవ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన సిక్కులు హర్జిత్ సజ్జన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులు కాగా, నవ్‌దీప్ బెయిన్స్ శాస్ త్రవిఙ్ఞాన, సృజనాత్మక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో సిక్కు అమర్ జీత్ సోహి ప్రాధమిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అమర్ జిత్ సోహి గతంలో బస్సు డ్రైవర్‌గా పని చేశాడు. 1980 లలో భారత్‌లో రెండేళ్లపాటు జైలులో కూడా గడిపాడు. కెనడా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో నవ్‌దీప్ సిద్దు ప్రముఖ పాత్ర పోషించడంతో ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కింది. కాగా సజ్జన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్, బోస్నియాలలో ప్రత్యేక సలహాదారుడిగా సేవలందించారు. -
జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
-
సీవీసీగా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేవీ చౌదరితో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కేవీ చౌదరి (కొసరాజు వీరయ్య చౌదరి) కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. -
ముహూర్తం ఎప్పుడో?
అన్నాడీఎంకేలో ఎదురుతెన్నులు సీఎం చాంబర్‌కు సింగారం వేలాది మంది తలనీలాల సమర్పణ అమ్మ నిర్దోషిగా బయటపడాలన్న ఆశ నెరవేరింది, సీఎంగా చూడాలన్న కోర్కె తీరేనా, ఏడు నెలల ఎదురుచూపుల కలలు నెరవేరేనా అనే బెంగ అన్నాడీఎంకేలో అలుముకుంది. అన్నాడీఎంకే నుంచి గురువారం సైతం ఆశాజనకమైన సమాచారం వెలువడకపోవడంతో విచారంలో మునిగిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వెలువడిన తాజా తీర్పు అన్నాడీఎంకేలో ఆనందాన్ని కలుగజేసినా, అమ్మ అధికార పగ్గాలు చేపట్టేందుకు అడ్డంకులు ఎదురుకావడం హతాశులను చేసింది. తీర్పు వెలువడి నాలుగురోజులైనా పార్టీ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు. ముఖ్యమంత్రిగా జయ ప్రమాణస్వీకార ముహూర్తం ఎప్పుడో చూచాయగా కూడా తెలియరాలేదు. శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా నగరంలోనే ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించిన పార్టీ వారందరినీ నియోజకవర్గాలకు వెళ్లిపొమ్మని చెప్పింది. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, 20 మంది మంత్రులు బుధవారం రాత్రి జయను కలుసుకునే ప్రయత్నం ఫలించలేదు. ఈనెల 22 లేదా 23 వ తేదీన అమ్మ ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఈ విషయంపై 17వ తేదీన నిర్ణయం తీసుకుంటారని అనధికార వార్త. ఇదిలా ఉండగా, టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, పీఎంకే అగ్రనేత రాందాస్ తదితరులు అప్పీలుపై గళం పెంచగా, జయ సీఎం కావడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ప్రకటించారు. ఒక వైపు అప్పీలు...మరోవైపు సింగారాలు ః తాజా తీర్పుపై అప్పీలు చిక్కుముడులు వీడిన తరువాతనే ముఖ్యమంత్రి పీఠం గురించి ఆలోచించాలని భావిస్తున్నట్లు అమ్మ నుండి పరోక్షంగా సంకేతాలు అందాయి. తీర్పు, అప్పీలు అంశాలపై అమ్మ తనకు సన్నిహితులైన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అప్పీలు అంశంలో కర్నాటక వైఖరి సుప్రీం కోర్టు దిశగా అడుగులు వేస్తున్నట్లు అంచనావేస్తున్నారు. జయ సీఎం కావడంలో ఇంతటి చిక్కుముడులు పడిఉన్న తరుణంలో ప్రభుత్వం మాత్రం జయ కోసం సీఎం చాంబర్‌ను సిద్ధం చేస్తోంది. గత ఏడు నెలలుగా మూతవేసి ఉన్న సీఎం చాంబర్‌కు రంగులు వేసి మెరుగులు దిద్దుతున్నారు. చాంబర్‌లోని ఆమె టేబుల్‌పై అమర్చిన ఖరీదైన గ్రానైట్ రాయికి దోషం ఉందని, కలిసిరాలేదని కొందరు సూచించడంతో రాయిని మారుస్తున్నారు. సచివాలయంలో అమ్మ కోసం ప్రత్యేకంగా అమర్చిన లిఫ్ట్‌కు మరమ్మత్తులు, ప్రవేశం ద్వారం వద్ద సున్నాలు కొట్టిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
టీటీడీ సభ్యుడిగా వీరయ్య ప్రమాణస్వీకారం
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆయన చేత తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ర ంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు ఆశీర్వదించారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ టీటీడీ సభ్యుడు కావడం పూర్వజన్మ సుకృతమన్నారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాలతో కూడిన కొత్త ధర్మకర్తల మండలిలో తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రమాణస్వీకారం చేసిన రాజేంద్రప్రసాద్ ప్యానల్
-
‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా!
ప్రతినెలా 50 మంది పేద కళాకారులకు పింఛన్లు అందిస్తామని ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం ఫిలిం చాంబర్లో జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, తదితర సభ్యులతో ‘మా’ పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాను. ‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా. ఇప్పటినుంచి ‘మా’ అధ్యక్షుడిగా కొత్త పాత్రలో లీనమవుతా. ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తా’’ అని చెప్పారు. తన గెలుపు వెనుక మెగా ఫ్యామిలీ ఉందని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం నేడు
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ నెల 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి చాంబర్లో పదవీ ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి -
జనసంద్రంలా మారిన ‘రాంలీలా’
వేదిక వద్దకు పోటెత్తిన స్థానికులు, ఆప్ మద్దతుదారులు సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్‌లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి టోపీధరించిన కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా కనిపించారు. కార్యకర్తలు తమదైన శైలిలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఓ కార్యకర్త ‘సింగం రిటర్స్న్’ కేప్షన్గల పోస్టరుతో కనిపించగా, మరొకరు మఫ్లర్ మాన్ పోస్టర్‌తో వచ్చారు, కొందరు పిల్లలు, పెద్దలు కేజ్రీవాల్ వేషాలంకరణతో కనిపించారు. ఓ కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో అలంకరించిన ఒంటెనెక్కి రామ్‌లీలా మైదాన్కి రాగా, మరో కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో చీపురును నెమలి పింఛంలా తీర్చిదిద్ది వేదికవద్దకు వచ్చాడు. మరో కార్యకర్త కేజ్రీవాల్ భావి ప్రధాని కావాలనే నినాదంతో కూడిన ప్లకార్డు పట్టుకుని దర్శనమిచ్చాడు. మరొకరు గాంధీ వేషధారణలో కనిపించారు. ఆప్ సర్కారు ప్రాధాన్యతలు రాసిఉన్న చొక్కా తొడిగి మరో మద్దతుదారుడు దర్శనమిచ్చారు. ఉదయం 11 గంటల వరకు రామ్‌లీలా మైదాన్ ఆప్ మద్దతుదారులతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు, ఆప్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ వారు ఆప్ నేతల రాక కోసం నిరీక్షించారు. అర్వింద్ కేజ్రీవాల్ జ్వరంతో ఉన్నారని తెలియడంతో నిరుత్సాహానికి గురైనప్పటికీ ఆయన రాకకోసం వేచిచూశారు. వంద డిగ్రీల జ్వరంతో ఉన్న కేజ్రీవాల్ కౌశాంబీలోని తన నివాసం నుంచి బయలుదేరారన్న వార్త తెలిసిన వెంటనే వారి ఉత్సాహం మిన్నంటింది. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం తాము గంగాజలం తీసుకొచ్చి ప్రార్థనలు చేసినట్లు హరిద్వార్ నుంచి వచ్చిన మద్దతుదారులు తెలిపారు. ప్రమాణోత్సవ సంబరాలు రామ్‌లీలా మైదానంలోనే కాకుండా వెలుపల కూడా కనిపించాయి. మైదాన్ బయట ఆప్ పేరిట శీతల పానీయాల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. ఆప్ కోలా, ఆప్ లెమన్ పేరుతో విక్రయించిన శీతల పానీయాలను పలువురు ఉత్సాహంగా తాగారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ఆప్ మద్దతుదారుల సందడి కనిపించింది. ఫరీదాబాద్‌లో ఆటో డ్రైవర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరని వారిని ఉచితంగా బదర్పూర్ సరిహద్దువరకు విడిచిపెట్టి ఆప్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపే హోర్డింగులు రాత్రికి రాత్రి నగరంలతో పలుచోట్ల వెలిశాయి. నీలం చొక్కా, నెహ్రూజాకెట్ ధరించిన కేజ్రీవాల్ చిత్రంతో కూడిన కృతజ్ఞతలు తెలిపే ఆప్ బ్యానర్లు కూడా పలుచోట్ల కనిపించాయి. కౌశాంబీలోని కేజ్రీవాల్ నివాసం ఆప్ నేతలు, కేజ్రీవాల్ బంధుమిత్రులతో నిండిపోయింది. తల్లి చేతితో నుదుట బొట్టు పెట్టించుకుని, ఆమె అందించిన మిఠాయి తిని కేజ్రీవాల్ రామ్‌లీలా మైదాన్‌కు బయలుదే రారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ , కుమార్ విశ్వాస్‌లతో ఇన్నోవాలో వేదిక వద్దకు చేరుకున్నారు. -
పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వండి
కేజ్రీవాల్ డిమాండ్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, వెంకయ్యలతో వరుస భేటీలు ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానం సాక్షి, న్యూఢిల్లీ: సునామీ విజయాన్ని మూటగట్టుకున్న 24 గంటల్లోనే ‘ఆమ్ ఆద్మీ’ పనిలోకి దిగిపోయారు. ప్రమాణం చేయటానికి ఇంకా మూడు రోజుల సమయం ఉన్నా.. అరవింద్ కేజ్రీవాల్ తన పని మొదలుపెట్టారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఇద్దరినీ కోరారు. రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2013 మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామని పేర్కొందని, ఇప్పుడు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో, ఢిల్లీలో తమ పార్టీ పగ్గాలు చేపట్టనున్నందున ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం కష్టం కాదని సమావేశం అనంతరం మనీష్ సిసోడియా అన్నారు. కేంద్రం జోక్యం తప్పనిసరి అయిన అంశాల్లో సమస్యల సత్వర పరిష్కారం గురించి కూడా రాజ్‌నాథ్‌తో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్లు సిసోడియా అన్నారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాఖల మంత్రులు వెంకయ్యనాయుడుజీ, రాజ్నాథ్జీలను కలిశా.. 14న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించా’’ అని సమావేశానంతరం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం తనకు కేటాయించిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కేజ్రీవాల్ తిరస్కరించారు. స్కూళ్లకు, ఆసుపత్రులకు భూమి ఇవ్వండి రాజ్‌నాథ్‌ను కలవటానికి ముందు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియాలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడితో నిర్మాణ్ భవన్లో సమావేశమయ్యారు. ఢిల్లీలోని అనధికార కాలనీలను వేగంగా క్రమబద్ధీకరించడానికి, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించవలసిందిగా మంత్రిని కోరినట్లు మనిష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, పార్కులు పార్కింగ్లాట్లకు స్థలం కావలసి ఉందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీల దగ్గర ఉన్న స్థలాలను సేకరించే విషయంలో కేంద్రం సహ కారాన్ని కోరామని సిసోడియా తెలిపారు. ఢిల్లీ అభివద్ధి కోసం అప్ సర్కారుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని వెంకయ్యనాయుడు వారికి చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన కేజ్రీవాల్.. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా కలి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి కేజ్రీవాల్‌కు రెండు పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఒకటి భారత రాజ్యాంగ ప్రతి కాగా, రెండవది తాను రాసిన ‘థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ అని మనిష్ సిసోడియా తెలిపారు. కాగా,అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆయన ఆహ్వానిస్తారు. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఓ పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు మినహాయింపునిచ్చింది. కేంద్రమంత్రులతో అపాయింట్మెంట్ ఉన్నందున హాజరు నుంచి మినహాయించాలంటూ కేజ్రీవాల్ కోరటంతో కోర్టు మన్నించింది. కేజ్రీవాల్ ప్రమాణానికి భారీ ఏర్పాట్లు ఏడాది క్రితం సరిగ్గా రాజీనామా చేసిన రోజునే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేయబోతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జాతీయ పార్టీలను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ప్రజాపనుల శాఖ వేదిక ఏర్పాట్లలో తలమునకలైపోయాయి. దాదాపు 60 వేల మంది కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షిసారని అంచనా. కాగా, కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరుకావటం లేదంటూ అవినీతి వ్యతిరేక ప్రచార కర్త అన్నాహజారే బుధవారం పూణెలో తెలిపారు. -
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా జేఎస్వీ ప్రసాద్
సాక్షి, తిరుమల: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ (రెవె న్యూ) శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 7.15 బంగారు వాకిలిలో స్వామివారి ముందు టీటీడీ ఈవో సాంబశివరావు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
నేడు రఘువర్ దాస్ ప్రమాణం
హాజరుకానున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరగనుందని రాష్ట్ర హోం కార్యదర్శి ఎన్.ఎన్. పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్, ఇతర నేతలు హాజరవుతారని చెప్పారు. మరోవైపు దాస్ శనివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమై ప్రభుత్వ కూర్పుపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షాతో సమావేశం సానుకూలంగా సాగిందని, పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జార్ఖండ్‌లో గిరిజనేతరుడైన దాస్‌కు బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో మంత్రివర్గంలో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. -
భారత్‌కు అమెరికా రాయబారిగా రిచర్డ్ ప్రమాణం
వాషింగ్టన్: భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా మేధావి వర్గంలో ప్రముఖుడుగా చెప్పదగిన రాహుల్ వర్మ నాన్సీ పోవెల్ స్థానంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ గతవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి ఇండియన్ అమెరికన్‌గా అయ్యారు. భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం కావాలని ఆశించే రిచర్డ్ రాహుల్ వర్మ, ఉభయదేశాల మధ్య పౌర అణు ఒప్పందానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం సాధించడంలో కీలకపాత్ర వహించారు. వచ్చే నెలలో కెర్రీ భారత్‌లో పర్యటించేముందుగా రిచర్డ్ రాహుల్ వర్మ కూడా భారత పర్యటనకు రానున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నెల 26న రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్నారు. -
బాబు వైఫల్యాలపై నేడు కాంగ్రెస్ నివేదిక
హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు పూర్తయినందున ఆయన పాలనా వైఫల్యాలపై ఏపీ కాంగ్రెస్ కమిటీ సోమవారం ప్రత్యేక నివేదికను విడుదల చేయనుంది. గుంటూరు-విజయవాడ మధ్యలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన స్థలంలోనే సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నివేదికను విడుదల చేయనున్నారు. ఈ 6 నెలల్లో తానిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేకపోవడమే కాకుండా ప్రజలను మభ్యపెడుతున్న తీరును ఈ నివేదిక ద్వారా ప్రజలకు వివరించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
ఆ ఐదు సంతకాల అమలేదీ!
పింఛన్లకు తప్ప ఏ ఒక్క పథకానికీ రూపాయి విదల్చని సర్కార్ హైదరాబాద్: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన తొలి ఐదు సంతకాల అమలు ఆరు నెలలు గడిచినా పూర్తికాకుండా మధ్యలోనే నిలిచిపోయింది. ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. రుణాల మాఫీపై రోజుకో మెలిక చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేసేనాటికి రైతుల పేరిట దాదాపు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో రూ.14 వేల కోట్లు, చేనేతకు సంబంధించి ఇంకొక రూ.700 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీపై ఎన్నో మాటలు మార్చారు. అనేక వడపోతలు, ఆంక్షల అనంతరం ఆరు నెలల్లో కాలంలో ఇప్పటివరకు కేవలం సుమారు రూ.15 వేల కోట్ల రుణాలే మాఫీకి అర్హమైనవిగా తేల్చారు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల చొప్పున సాయం మాత్రమే చేస్తామని మాట మార్చారు. పింఛన్లకు భారీ కోత.. బాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ఐదు సంతకాల్లో ఒకటైన పింఛన్ల పథకానికి మాత్రమే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత ఖర్చు చేసింది. అయితే అర్థిక భారం తగ్గించుకోవడానికి బాబు లక్షలాది పింఛనుదారుల నోట మట్టి కొట్టారు. సెప్టెంబర్‌కు ముందు రాష్ట్రంలో 43 లక్షల మంది పింఛనుదారులుంటే, డిసెంబర్లో 37 లక్షల మంది పింఛనుదారులకు మాత్రమే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. దాతలు ముందుకొస్తేనే.. మంచినీటి ప్లాంట్లు ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పంపిణీ చేస్తామంటూ.. ఆ పథకానికి దివంగత ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ సుజల అని పేరు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకం పూర్తిగా అపహాస్యం పాలయ్యేలా వ్యవహరిస్తోంది. బాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు తొలి సంతకాల జాబితాలో దీనిని చేర్చిన చంద్రబాబు ఇందుకోసం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. సగం ఉద్యోగులకు వర్తించని ‘60 ఏళ్లు’ ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు రూపాయి భారం పడని ఉద్యోగుల 60 ఏళ్ల పదవీ విరమణ వయసు పెంపు హామీ అమలు అందరికీ వర్తించకుండా ఆగిపోయింది. కానరాని బెల్టుషాపుల నిర్మూలన కమిటీలు మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేయడంతో గ్రామ, మండల స్థాయిల్లో ఏర్పాటైన బెల్టు షాపుల నిర్మూలన కమిటీల జాడే కాన రావడం లేదు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఈ కమిటీల్లో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ స్థాయిలో సర్పంచ్, వీఆర్వో, ప్రధానోపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, మండల స్థాయిలో ఎస్సై, తహశీల్దారు, ఎంపీపీ, ప్రధానోపాధ్యాయులతో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నాయో ఈ కమిటీలు గుర్తించి వాటి సమాచారం టాస్క్‌ఫోర్స్ అందించాలి. అయితే ఈ కమిటీలు ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని స్వయంగా ఎక్సైజ్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. -
మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం
న్యూఢిల్లీ : మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. లోక్ సభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం నల్లధనంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు మాత్రం తమ పట్టు వీడలేదు. టీఎంసీ, జేడీయూ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవటంతో గందరగోళం నెలకొంది. -
రుణమాఫీ ఇంకెప్పుడో..!
మహరాజశ్రీ సీఎం చంద్రబాబు గారికి.. జిల్లా రైతాంగం రాసుకున్న విన్నపమేమనగా.. అయ్యా.. ఎన్నికల ప్రచారంలో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటే ఎగిరి గంతేశాం.. ఓట్లేశాం... అధికారంలోకి వచ్చారు.. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం మీకోసమే అంటే ఆనందపడ్డాం.. తీరా కమిటీ అంటే త్వరగా పూర్తి చేస్తారేమో అని మిన్నకుండిపోయాం.. పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షన్నరే అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా అని మనసుకు సర్దిచెప్పుకున్నాం.. పోనీలే అది వచ్చినా ఎంతోకొంత బాగు పడతామని ఎదురు చూశాం. బ్యాంకుల్లో అడ్డమైన పత్రాలు ఇవ్వాలని చెప్పావు.. ఒక్కొక్కరం రెండు, మూడు దఫాలు బ్యాంకుల చుట్టూ తిరిగి పత్రాలు అందజేశాం. ఛార్జీలు, ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.. కొందరైతే కూలి పనులు మానుకుని మరీ పత్రాలు ఇచ్చారు.. జిల్లాలో 4.95లక్షల మంది ఇలానే ఖర్చు భరించారు. రుణ మాఫీ పుణ్యమా అని ఒక్కొక్కరికి సుమారు 300 చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకు మా సొదరుల చేతి చమురు వదిలింది. అంతటితో ఆగారా.. సరిగా వివరాలు లేవంటూ 2.67లక్షల ఖాతాలను వెనక్కిపంపాదు. తిరిగి ఉరుకులు, పరుగుల మీద వెళ్లి వాటినీ అందజేశాం.ఇప్పుడేమో 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ రెవెన్యూ సిబ్బందికి పంపావు. పత్రాలు ఇవ్వకపోతే రుణమాఫీ రాదనే భయం వెంటాడుతోంది.. ఎందుకిలా మాతో ఆటలాడుకుంటున్నావు... మీ వంటి పెద్దలకు ఇది తగునా సామీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొదట 20 శాతం ఈ నెల 5న వేస్తానన్నావు.. మళ్లీ 12 అన్నావు.. తిరిగి 15వ తేదీ చెప్పావు.. ఇప్పుడేమో 18వ తేదీ అంటున్నావు.. మాట మీద నిలబడే అలవాటు మీకు లేదని అందరూ అనే మాటను నిజం చేస్తున్నావే. 49 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని మీకు నివేదికలు అందాయి.. అయినా కరుణించలేదు. మీరు రుణమాఫీ అమలు చేస్తారని బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. దీంతో వారు కొత్త రుణాల్విలేదు.. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి పంటలు సాగు చేశాం. రెన్యువల్స్ చేయకపోవడంతో బీమా కూడా దక్కలేదు. సరైన సమయంలో అప్పు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి గతం కంటే రూ.లక్షకు రూ.13వేలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. 20 శాతం ఖాతాల్లో వేస్తే బ్యాంకర్లు శాంతిస్తారనుకుంటే నువ్వు వాయిదాలు తప్ప నగదు జమ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు మారండి.. మా ఉసురు ఉసురు పోసుకోవద్దని మనవి. -
ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. (ఇంగ్లీష్ కథనం కోసం)