వాషింగ్టన్: జన్మతః భారతీయుడైన 46 ఏళ్ల వ్యక్తి అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొలువుదీరారు. భగవద్గీత సాక్షిగా కొలంబియా జిల్లా అప్పీల్ కోర్టు జడ్జిగా శ్రీ శ్రీనివాసన్ ప్రమాణ స్వీకారం చేశారు.అమెరికాలో ఉన్నత స్థానాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే పలువురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీనివాసన్ అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ భార్య గురుశరణ్ కౌర్, పలువురు న్యాయనిపుణులు హాజరయ్యారు. శ్రీనివాసన్ చండీగఢ్‌లో జన్మించారు. 1970లలో ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు.