యూఎస్‌లో జడ్జిగా ప్రమాణం చేసిన శ్రీ శ్రీనివాసన్
ఎన్నారై, ప్రముఖ న్యాయకోవిదుడు శ్రీ శ్రీనివాసన్ అమెరికా అత్యున్నత న్యాయస్థానం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టు జడ్జిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కిక్కిరిసిన ఆహ్వానితుల మధ్య కోర్టు హాల్లో శ్రీ శ్రీనివాసన్ చేత జస్టిస్ సంద్ర డే ఓ కన్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో శ్రీనివాసన్ హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీత, తన తల్లి సరోజా శ్రీనివాసన్‌పై ప్రమాణం చేశారు.
శ్రీనివాసన్ ప్రమాణ స్వీకారోత్సవానికి యూఎస్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గురుచరణ్ కౌర్ హాజరయ్యారు. శ్రీనివాసన్ కుటుంబ సభ్యులు,స్నేహితులతోపాటు అనేక మంది ప్రముఖ న్యాయ కోవిదులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ శ్రీనివాసన్ నియామాకాన్ని ఈ ఏడాది మేలో యూఎస్ సెనెట్ 97 - 0 ఓట్లతో ఆమోదించిన సంగతి తెలిసిందే.
అమెరికా చరిత్రలో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్టుకు జడ్జిగా నియమితులై శ్రీ శ్రీనివాసన్ మొట్టమొదటి దక్షిణాసియా వాసిగా చరిత్ర సృష్టించారు. శ్రీ శ్రీనివాసన్ చంఢీఘడ్‌లో జన్మించారు. అనంతరం 1970లో ఆయన తల్లితండ్రులు యూఎస్ వలస వెళ్లారు.