వాషింగ్టన్: భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా మేధావి వర్గంలో ప్రముఖుడుగా చెప్పదగిన రాహుల్ వర్మ నాన్సీ పోవెల్ స్థానంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ గతవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి ఇండియన్ అమెరికన్‌గా అయ్యారు. భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం కావాలని ఆశించే రిచర్డ్ రాహుల్ వర్మ, ఉభయదేశాల మధ్య పౌర అణు ఒప్పందానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం సాధించడంలో కీలకపాత్ర వహించారు.
వచ్చే నెలలో కెర్రీ భారత్‌లో పర్యటించేముందుగా రిచర్డ్ రాహుల్ వర్మ కూడా భారత పర్యటనకు రానున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నెల 26న రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్నారు.
భారత్‌కు అమెరికా రాయబారిగా రిచర్డ్ ప్రమాణం
Published Sun, Dec 21 2014 5:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement