కేరళ గవర్నర్‌గా షీలాదీక్షిత్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజుల చెల్లూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం ఊమెన్ చాందీ, మంత్రులతో పాటు షీలాదీక్షిత్ కుటుంబసభ్యులు, ఆమె సహచరులు పాల్గొన్నారు.
75 ఏళ్ల షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకూ సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆమెను కేరళ గవర్నర్‌గా యూపీఏ ప్రభుత్వం నియమించింది. కాగా, ఇప్పటివరకు కేరళ గవర్నర్‌గా పనిచేసిన నిఖిల్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు.