
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆమె మరణ వార్త తనను ఎంతో బాధపెట్టిందన్నారు. భారత దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment