మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి' | DMK Leader K Ponmudy Sworn in As Minister by Governor | Sakshi
Sakshi News home page

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'

Mar 22 2024 5:57 PM | Updated on Mar 22 2024 6:05 PM

DMK Leader K Ponmudy Sworn in As Minister by Governor - Sakshi

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్‌లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు.

ప్రస్తుతం మంత్రి ఆర్‌ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు.

పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు.

పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement