ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
Published Mon, Jan 9 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
రైతులకు అండగా ఉండాలి
ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
కోడి పందేలకు దూరంగా ఉండాలి
కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు.
Advertisement
Advertisement