executive body
-
నాట్స్ నూతన అధ్యక్షుడిగా నూతి బాపయ్య చౌదరి
డాలస్ (టెక్సాస్): అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, నూతన కార్యవర్గం 2022-24ను ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నూతి బాపయ్య చౌదరి (బాపుకి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. బాపు నూతి నాట్స్ చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్‌లో తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో నాట్స్ బోర్డు అధ్యక్ష పదవికి బాపు నూతి వైపే మొగ్గు చూపింది. నాట్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. వారిలో భాను ప్రకాశ్ ధూళిపాళ్ల, హరినాథ్ బుంగతావుల, మదన్ పాములపాటి, రమేశ్ బెల్లంలు ఉన్నారు. నాట్స్ కార్యదర్శిగా రంజిత్ చాగంటి, సంయుక్తి కార్యదర్శిగా జ్యోతి వనం, కార్యనిర్వహక కార్యదర్శి(మీడియా)గా మురళీ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్) శ్రీనివాస్ గొండి, కోశాధికారిగా హేమంత్ కొల్లా, సంయుక్త కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. అభినందనలు భాషే రమ్యం.. సేవే గమ్యం లక్ష్యంగా ముందుకు సాగే నాట్స్‌లో నూతన కార్యవర్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ బోర్డు ఛైర్మన్ అరుణ గంటి అన్నారు. నాట్స్ బోర్డు తరఫున బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం.. నాట్స్ నూతన అధ్యక్షుడు బాపు నూతితో పాటు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యవర్గ సభ్యులు నాట్స్ కార్యవర్గంలో దిలీప్ కుమార్ సూరపనేని నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్), శ్రీనివాస రావు భీమినేని నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్షిప్), వెంకట్ మంత్రి నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా), కవిత దొడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్మెంట్), రామ్ నరేష్ కొమ్మనబోయిన నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్‌లైన్ ఫండ్ రైజింగ్), రాజేష్ కాండ్రు నేషనల్ కోఆర్డినేటర్ (ప్రోగ్రామ్స్), కృష్ణ నిమ్మగడ్డ నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్), సురేష్ బొల్లు నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్), శ్రీని చిలుకూరి జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ వెస్ట్ జోన్), గురుకిరణ్ దేసు జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ ఈస్ట్ జోన్), రామకృష్ణ బాలినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్ సెంట్రల్ జోన్), ప్రసాద్ డీవీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ (సౌత్ సెంట్రల్ జోన్), సూర్య గుత్తికొండ (ఇమ్మిగ్రేషన్ & లీగల్ వింగ్ ), లక్ష్మి బొజ్జ (విమెన్ వింగ్)లు ఉన్నారు. చదవండి: డాలస్‌లో సందడిగా టీపాడ్ వనభోజనాలు -
చార్లెట్ తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక
చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ నూతన కార్యవర్గం 2022, 2023 మొత్తం రెండేళ్ల పాటు పని చేస్తుంది. చార్లెట్ తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి బోధ, ఉపాధ్యక్షుడిగా చందురెడ్డి గంగిడి, ప్రధాన కార్యదర్శిగా శశిభూషణ్, కోశాధికారిగా రవి సందిరి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా రాజా జలవంచ, ఈవెంట్ కోఆర్డినేటర్‌గా ప్రమోద్ తాడూరి, మీడియా కోఆర్డినేటర్‌గా సింధూరి గంగాపురం ఎన్నికయ్యారు. -
టీడీఎఫ్ అమెరికా నూతన కార్యవర్గం
అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్ - యుఎస్ఏ) 2022-23 రెండు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. చైర్మన్ గా వెంకట్ ఆర్ మారం, అధ్యక్షులుగా డాక్టర్ దివేష్ ఆర్ అనిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా (భవిష్యత్ అధక్షులు)గా శ్రీనివాస్ మణికొండ ఎన్నికయ్యారు. కవిత చల్లా మాజీ అధ్యక్షురాలు (పాస్ట్ ప్రెసిడెంట్) హోదాలో అడ్వయిజర్‌గా వ్యవహరిస్తారు. కార్యవర్గం రవి పల్లా (వాషింగ్టన్ డిసి), శ్రీకాంత్ ఆరుట్ల (వాషింగ్టన్ డిసి), శ్రీనాథ్ ముస్కుల (బే ఏరియా, కాలిఫోర్నియా), బాపురెడ్డి కేతిరెడ్డి (అట్లాంటా, జార్జియా) నలుగురు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రాజ్ గడ్డం (డెట్రాయిట్, మిషిగన్), సంయుక్త కార్యదర్శిగా స్వాతి సూదిని (అట్లాంటా, జార్జియా), కోశాధికారిగా ఇందిరాదీక్షిత్ (న్యూజెర్సీ), సంయుక్త కోశాధికారిగా వినయ తిరిక్కోవల్లూరు (వర్జీనియా) ఎన్నికయ్యారు. డా. దివేష్ ఆర్ అనిరెడ్డి, వెంకట్ ఆర్ మారం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మనోహర్ రెడ్డి ఎడ్మ (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), మురళి చింతలపాణి (బ్రిడ్జివాటర్, న్యూజెర్సీ), దామోదర్ గంకిడి (డెట్రాయిట్, మిషిగన్), సదానంద్ డోకూరు (శాన్ ఆంటోనియో, టెక్సాస్), డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె (ఫ్రెస్నో, కాలిఫోర్నియా), శ్రీనివాస్ గిల్లిపెల్లి (ఆస్టిన్, టెక్సాస్), రాం కాకులవరం (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), అజయ కట్ట (న్యూజెర్సీ), వినయ్ మేరెడ్డి (శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా), ప్రవీణ్ మిట్ట (డాలస్, టెక్సాస్), ప్రీతి రెడ్డి (చికాగో, ఇల్లినాయిస్), రవీంద్ర ఎం రెడ్డి (రాలీ, నార్త్ కరోలినా), బూరుగుపల్లి వెంకటేశ్వర్ రావు (కరీంనగర్, తెలంగాణ)లు ఉన్నారు. అభినందనలు టీడీఎఫ్ నూతన కార్యవర్గానికి ఎన్నారై ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ మంద భీంరెడ్డి, రిటర్నుడు ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ చైర్మన్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు అండగా ఉండాలి ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలకు దూరంగా ఉండాలి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు. -
సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిది
భీమవరం : ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా 35వ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇచ్చేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గృహిణిగా సామాన్య జీవితం సాగిస్తున్న తాను మునిసిపల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలిగా ముందుకు వెళ్లడానికి పాత్రికేయుల సహకారం ఎంతో ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిజంపై 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అయితే వీరికి హెల్త్‌కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వాంధ్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందరం మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రత్యేక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని, ఆత్మగౌరవ పింఛన్లు ఇవ్వాలని, రూ.20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటుచేయాలని తీర్మానం చేస్తున్నట్టు చెప్పారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రఘురామ్ అధ్యక్షత వహిం చగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మ¯ŒS కొటికలపూడి గోవిందరావు, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మ¯ŒS గోకరాజు మురళీరంగరాజు, అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ఎలక్టాన్రిక్స్ మీడియా జిల్లా అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వానపల్లి సుబ్బారావు కార్యదర్శి నివేదిక అందించగా యర్రంశెట్టి గిరిజాపతి స్వాగతం పలికారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ప్రధాన కార్యదర్శిగా వాకల సత్యసాయిబాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కంకిపాటి మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా గజపతి వరప్రసాద్, ఎంవీ గంగాధరరావు, పీటీ వెంకటేశ్వరరావు, డీవీ రామాంజనేయులు, బి.మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్కే రియాజ్, టి.స్వామి అయ్యప్ప, యడ్లపల్లి శ్రీనివాస్, డీవీఎల్ఎ¯ŒS స్వామి, కె.కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా డెస్క్ జర్నలిస్టులు ఎస్కే శ్రీనివాసరెడ్డి, బీఎస్ రెడ్డి, బి.పీటర్, కార్యవర్గ సభ్యులుగా డీవీ భాస్కరరావు, కేవీవీ సత్యనారాయణతో పాటు మరో 17 మందిని, ఎలక్టాన్రిక్ మీడి యా అధ్యక్ష, కార్యదర్శులుగా కె.మాణిక్యరావు, పి.రవీంద్రనాథ్, చిన్నపత్రికల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిౖMðనట్టు ఎన్నికల అధికారి గంగాధరరెడ్డి ప్రకటించారు. -
కాళోజీ వర్సిటీకి కార్యనిర్వాహక మండలి
ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫైలును త్వరలోనే సీఎం కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. ఆయన ఆమోదం తర్వాత ఫైలు గవర్నర్ పరిశీలనకు వెళ్లనుంది. మండలి ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపితే సంబంధిత చర్యలను ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభిస్తుంది. మండలి ఏర్పాటుకు ముందు వీసీ నియామకం జరుగుతుందని తెలిసింది. వీసీని నియమించకపోయినా రిజిస్ట్రార్‌ను ఇన్చార్జి వీసీగా కొనసాగిస్తూ మండలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇటీవల నియమించిన రిజిస్ట్రార్‌ను వివాదాల కారణంగా బర్తరఫ్ చేశారు.