కాళోజీ వర్సిటీకి కార్యనిర్వాహక మండలి | kaloji health university executive body | Sakshi
Sakshi News home page

కాళోజీ వర్సిటీకి కార్యనిర్వాహక మండలి

Published Tue, Feb 10 2015 1:56 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

kaloji health university executive body

ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు

సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫైలును త్వరలోనే సీఎం కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. ఆయన ఆమోదం తర్వాత ఫైలు గవర్నర్ పరిశీలనకు వెళ్లనుంది.

మండలి ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపితే సంబంధిత చర్యలను ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభిస్తుంది. మండలి ఏర్పాటుకు ముందు వీసీ నియామకం జరుగుతుందని తెలిసింది. వీసీని నియమించకపోయినా రిజిస్ట్రార్‌ను ఇన్‌చార్జి వీసీగా కొనసాగిస్తూ మండలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇటీవల నియమించిన రిజిస్ట్రార్‌ను వివాదాల కారణంగా బర్తరఫ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement