టీడీఎఫ్ అమెరికా నూతన కార్యవర్గం  | Details About Telangana Development Forum Newly Elected Executive Body | Sakshi
Sakshi News home page

టీడీఎఫ్ అమెరికా నూతన కార్యవర్గం 

Published Mon, Mar 7 2022 10:43 AM | Last Updated on Mon, Mar 7 2022 10:57 AM

Details About Telangana Development Forum Newly Elected Executive Body - Sakshi

అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్‌ - యుఎస్ఏ) 2022-23 రెండు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. చైర్మన్ గా వెంకట్ ఆర్ మారం, అధ్యక్షులుగా డాక్టర్‌ దివేష్ ఆర్ అనిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా (భవిష్యత్ అధక్షులు)గా శ్రీనివాస్ మణికొండ ఎన్నికయ్యారు. కవిత చల్లా మాజీ అధ్యక్షురాలు (పాస్ట్ ప్రెసిడెంట్) హోదాలో అడ్వయిజర్‌గా వ్యవహరిస్తారు.  

కార్యవర్గం
రవి పల్లా (వాషింగ్టన్ డిసి), శ్రీకాంత్ ఆరుట్ల (వాషింగ్టన్ డిసి), శ్రీనాథ్ ముస్కుల (బే ఏరియా, కాలిఫోర్నియా), బాపురెడ్డి కేతిరెడ్డి (అట్లాంటా, జార్జియా) నలుగురు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రాజ్ గడ్డం (డెట్రాయిట్, మిషిగన్), సంయుక్త కార్యదర్శిగా స్వాతి సూదిని (అట్లాంటా, జార్జియా), కోశాధికారిగా ఇందిరాదీక్షిత్ (న్యూజెర్సీ), సంయుక్త కోశాధికారిగా వినయ తిరిక్కోవల్లూరు (వర్జీనియా) ఎన్నికయ్యారు. 


డా. దివేష్ ఆర్ అనిరెడ్డి, వెంకట్ ఆర్ మారం

బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు
మనోహర్ రెడ్డి ఎడ్మ (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), మురళి చింతలపాణి (బ్రిడ్జివాటర్, న్యూజెర్సీ), దామోదర్ గంకిడి (డెట్రాయిట్, మిషిగన్), సదానంద్ డోకూరు (శాన్ ఆంటోనియో, టెక్సాస్), డాక్టర్‌ గోపాల్ రెడ్డి గాదె (ఫ్రెస్నో, కాలిఫోర్నియా),  శ్రీనివాస్ గిల్లిపెల్లి (ఆస్టిన్, టెక్సాస్), రాం కాకులవరం (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), అజయ కట్ట (న్యూజెర్సీ), వినయ్ మేరెడ్డి (శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా), ప్రవీణ్ మిట్ట (డాలస్, టెక్సాస్), ప్రీతి రెడ్డి (చికాగో, ఇల్లినాయిస్), రవీంద్ర ఎం రెడ్డి (రాలీ, నార్త్ కరోలినా), బూరుగుపల్లి వెంకటేశ్వర్ రావు (కరీంనగర్, తెలంగాణ)లు ఉన్నారు.

అభినందనలు
టీడీఎఫ్‌ నూతన కార్యవర్గానికి ఎన్నారై ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ మంద భీంరెడ్డి, రిటర్నుడు ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ చైర్మన్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement