tdf
-
లక్ష్య సాధనకు దిక్సూచి అయ్యి...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ‘మేము సైతం’ అంటూ ప్రవాస తెలంగాణవారు ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్’ (టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రొ. జయశంకర్ సార్ స్ఫూర్తితో మలి ఉద్యమంలో మొలచి, వృక్షంలా ఎదిగింది ఈ సంస్థ. పట్టుమని పది మందితో అమెరికా కేంద్రంగా న్యూయార్క్ నగరంలో 1999లో ఏర్పాటైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఆ తర్వాత శాఖోపశాఖలుగా వివిధ దేశాల్లో విస్తరించింది. పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికుడు మొదలు, ఆస్ట్రేలియా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడు కూడా ‘జై తెలంగాణ’ అని నినదించేలా చేసింది ఈ సంస్థ. నిధులు, నీళ్లు, నియామకాల్లో అప్పట్లో జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వివరించటంలో విజయవంతం అయింది టీడీఎఫ్.సామాజిక ప్రచార సాధనాల పరిధి ఇంతగా లేని రోజుల్లోనే తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వినూత్న పంథాలో విస్తరించింది. ఉద్యమం దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరినీ చైతన్యం చెయ్యడంలో కీలక భూమిక పోషించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు, కవులు, కళాకారులను, మేధావులను కలవడం ద్వారా టీడీఎఫ్ తెలంగాణ వాణి, బాణీలను బలంగా వినిపించే ప్రయత్నం చేసింది.ఓ వైపు బతుకు దెరువు కోసం దేశ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపా రాలు చేస్తూనే, తాము కూడబెట్టిన దాంట్లో కొంత తెలంగాణ సాధన కోసం ప్రవాసులు ఖర్చు పెట్టి మరీ స్వరాష్ట్రం కోసం కృషి చేశారు. కవులు, కళాకారులను ఆహ్వానించి ఊరూరా తెలంగాణ ధూమ్ ధామ్ లను ఏర్పాటు చేశారు. వ్యయ ప్రయాసలు కోర్చి తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తనదైన పాత్ర పోషించింది ఈ సంస్థ.ముఖ్యంగా విద్యార్థులను జాగృతం చేసింది. భవిష్యత్ తెలంగాణ బలిదానాల తెలంగాణ కావొద్దంటూ నినదించింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ యువతే బాగుపడుతుందనే సందేశాన్ని బలంగా ప్రచారం చేసింది. రాజకీయ అవసరాలు, ప్రలోభాలతో ఉద్యమం పక్కదారి పట్టిన ప్పుడల్లా పట్టు విడవకుండా ఉద్యమ దివిటీని ముందుడి మోసింది. ఎక్కడెక్కడో పనిచేసే సంస్థ సభ్యులు తెలంగాణలో ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపనూ తాకేలా తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించారనడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో జరిగిన మోసాలను, పక్కదారి పట్టిన నిధులను, నీటి కేటాయింపులో జరిగిన మోసాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేసింది.రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ పాలన ఎజెండాను రూపొందించటంలోనూ సంస్థ కృషి మరవలేనిది. కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవటం, అమరుల కుటుంబాలను వీలైనంతగా ఆదుకోవటంలోనూ ఫోరం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటికీ హెల్త్ క్యాంపుల నిర్వహణ, యువతకు క్రీడా పోటీలు, డ్రగ్స్ మహమ్మారిపై పోరాటం, రైతు చైతన్య యాత్రలు వంటి పలు కార్యక్రమాల నిర్వహిస్తూ టీడీఎఫ్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. విదేశాల్లో తాము ఉంటున్న ప్రాంతాల్లో తెలంగాణ పండగలను నిర్వహిస్తూ మలి తరాలకు కూడా సంస్కృతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తోంది.రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మారినా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల నుంచి మరలకుండా పాలన, విధాన నిర్ణయాలు ఉండేలా టీడీఎఫ్ తన ప్రభావాన్ని చూపుతోంది. నిర్ణయాలు గాడి తప్పిన సంద ర్భాల్లో ఉద్యమ పంథానే కొనసాగిస్తూ పాలకులను, పార్టీలను ప్రశ్నించ టంతో ముందు ఉంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు దాటినా ప్రభుత్వాలు ప్రత్యేక ఎన్నారై పాలసీని ప్రకటించకపోవడం శోచనీయం. సమీప భవిష్యత్తులోనే ఎన్నారై పాలసీ రూపుదిద్దుకుంటుందనే ఆశా భావంతో టీడీఎఫ్ ఉంది. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది.– లక్ష్మణ్ ఏనుగు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు, న్యూయార్క్ -
2014 నాటి మేనిఫెస్టో కరకట్ట కింద దాచేసిన బాబు
-
అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు
ముస్తాబాద్(సిరిసిల్ల): దగాపడ్డ తెలంగాణ పునర్నిర్మాణానికి రెండు దశాబ్దాల క్రితమే నడుం బిగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వెనకబడ్డ పురిటిగడ్డను బాగు చేసేందుకు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందే 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆవిర్భవించింది. ఖండాంతరాలలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ఒక్కటై.. అమెరికాలోని న్యూజెర్సీలో టీడీఎఫ్ పురుడుపోసుకుంది. అలా మొదలైన టీడీఎఫ్ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూనే ఉంది. జైకిసాన్‌తో రైతులకు సేవలు అమెరికాలోని న్యూజెర్సీలో పురుడుపోసుకున్న టీడీఎఫ్‌ను పలు విభాగాలకు విస్తరించారు. 5 వేల మంది సభ్యులతో ప్రారంభమై ఎన్నో సేవలు అందిస్తోంది. భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది వ్యవసాయ. అందుకు ప్రాధాన్యతను కల్పిస్తూ జైకిసాన్ విభాగాన్ని ప్రారంభించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా, సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చేయూతను అందించి, ఆత్మహత్యలు జరగకుండా అవగాహన కల్పిసున్నారు. జీవామృతం, ఘనామృతం తయారీ, డ్రమ్‌సీడర్ ద్వారా సాగు, పెస్టిసైడ్స్ ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండ్‌ను తీసుకువస్తున్నారు. పంట మార్పిడి, చిరుధాన్యాల సాగు, వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై చైతన్యాన్ని తెస్తున్నా రు. గ్రామాలలో రైతుసేవా కేంద్రాలు ఏర్పా టు చేసి వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నారు. వ్యవసాయాధికారుల సమన్వయంతో కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వరి కొయ్యలు కాల్చకుండా, కొయ్యకాళ్లను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపుతున్నారు. పశుపోషణతో కలిగే లాభాలను రైతులకు చేరవేస్తున్నారు. యంత్రాలను వాడుకుంటున్నాం ముస్తాబాద్‌లోని టీడీఎఫ్ రైతుసేవాకేంద్రంలోని యంత్రాలను వాడుకుంటున్నాం. డ్రమ్‌సీడర్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. కేంద్రంలోని యంత్రాల సాయంతో గడ్డిని తొలగించుకున్నాం. కలుపు అవసరం లేకుండా అది ఉపయోగపడింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – దేవిరెడ్డి, రైతు, ముస్తాబాద్ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావాలి రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆ దిశగా వారిని చైతన్యం చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేంద్రియ విధానం వైపు తీసుకువస్తున్నాం. రైతులు బాగున్నప్పుడే దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. దానికోసం జై కిసాన్ పనిచేస్తుంది. – మట్ట రాజేశ్వర్‌రెడ్డి, టీడీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్నారైల సహకారంతో సేవలు తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఇక్కడి ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు ఒక్కటై టీడీఎఫ్‌ను స్థాపించారు. దాని కోసం ఆహర్నిషలు పనిచేస్తున్నారు. సారవంతమైన నేలను కాపాడుకుంటూనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. రైతుల కోసం టీడీఎఫ్ మరింత ముందుకు వెళ్తుంది. – పాటి నరేందర్, జైకిసాన్ ఇండియా అధ్యక్షుడు -
చెట్టు కింద వంట సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (అట్లాంటా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు చెట్టు కింద వంట కార్యక్రమాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. 2022 మే 14న బూఫోర్డ్ డ్యామ్రోడ్డులో ఉన్న సరస్సు ఒడ్డున చిక్కనైన వనంలో పచ్చని చెట్ల కింద వంటావార్పు - ఆటాపాటలతో సందడి చేశారు. ఆరేళ్ల కిందట టీడీఎఫ్ ఈ వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వంటావార్పు కార్యక్రమంలో 800ల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా హాయిగా గడిపారు. పురుషులు నలభీములై పాకాలను ఘుమఘుమలాడించగ, స్త్రీమూర్తులు అన్నపూర్ణలై కమ్మదనాన్ని రంగరించారు. సుమారు 20 రకాల నోరూరే శాకాహార మాంసాహార వంటకాలు సిద్ధం చేశారు. లావణ్య గూడూరు తన ఆటపాటలతో ఆకట్టుకుంది. చెట్టు కింద వంట కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించుకుని టీడీఎఫ్ అందులో విజయం సాధించింది. బాపురెడ్డి కేతిరెడ్డి, స్వాతి సుదిని సారథ్యంలో స్వప్న కస్వా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, కోర్‌టీం మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు తమ వంతు సహకారాన్ని అందించిన సువిద, డెక్కన్ స్పైస్, డీజే దుర్గం, లావణ్య గూడురు ఇతర స్వచ్చంధ సంస్థలకు టీడీఎఫ్ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహాకారం ఇవ్వాలని కోరింది. తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి : టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే -
టీడీఎఫ్ అమెరికా నూతన కార్యవర్గం
అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్ - యుఎస్ఏ) 2022-23 రెండు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. చైర్మన్ గా వెంకట్ ఆర్ మారం, అధ్యక్షులుగా డాక్టర్ దివేష్ ఆర్ అనిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా (భవిష్యత్ అధక్షులు)గా శ్రీనివాస్ మణికొండ ఎన్నికయ్యారు. కవిత చల్లా మాజీ అధ్యక్షురాలు (పాస్ట్ ప్రెసిడెంట్) హోదాలో అడ్వయిజర్‌గా వ్యవహరిస్తారు. కార్యవర్గం రవి పల్లా (వాషింగ్టన్ డిసి), శ్రీకాంత్ ఆరుట్ల (వాషింగ్టన్ డిసి), శ్రీనాథ్ ముస్కుల (బే ఏరియా, కాలిఫోర్నియా), బాపురెడ్డి కేతిరెడ్డి (అట్లాంటా, జార్జియా) నలుగురు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రాజ్ గడ్డం (డెట్రాయిట్, మిషిగన్), సంయుక్త కార్యదర్శిగా స్వాతి సూదిని (అట్లాంటా, జార్జియా), కోశాధికారిగా ఇందిరాదీక్షిత్ (న్యూజెర్సీ), సంయుక్త కోశాధికారిగా వినయ తిరిక్కోవల్లూరు (వర్జీనియా) ఎన్నికయ్యారు. డా. దివేష్ ఆర్ అనిరెడ్డి, వెంకట్ ఆర్ మారం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మనోహర్ రెడ్డి ఎడ్మ (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), మురళి చింతలపాణి (బ్రిడ్జివాటర్, న్యూజెర్సీ), దామోదర్ గంకిడి (డెట్రాయిట్, మిషిగన్), సదానంద్ డోకూరు (శాన్ ఆంటోనియో, టెక్సాస్), డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె (ఫ్రెస్నో, కాలిఫోర్నియా), శ్రీనివాస్ గిల్లిపెల్లి (ఆస్టిన్, టెక్సాస్), రాం కాకులవరం (లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా), అజయ కట్ట (న్యూజెర్సీ), వినయ్ మేరెడ్డి (శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా), ప్రవీణ్ మిట్ట (డాలస్, టెక్సాస్), ప్రీతి రెడ్డి (చికాగో, ఇల్లినాయిస్), రవీంద్ర ఎం రెడ్డి (రాలీ, నార్త్ కరోలినా), బూరుగుపల్లి వెంకటేశ్వర్ రావు (కరీంనగర్, తెలంగాణ)లు ఉన్నారు. అభినందనలు టీడీఎఫ్ నూతన కార్యవర్గానికి ఎన్నారై ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ మంద భీంరెడ్డి, రిటర్నుడు ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ చైర్మన్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ
వాషింగ్టన్: ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ దినము, ఫాదర్స్ డేని పురస్కరించుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) వాషింగ్టన్ డీసీ వారి ఆధ్వర్యంలో జూన్ 21న ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కోవిడ్ కష్ట కాలంలో సరైన రక్షణ, ఆహరం దొరకక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొందరు హోమ్ బిల్డర్స్ కేర్ అస్సెస్మెంట్ (HBCAC)లో రక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీఎఫ్ వారికి ఆహార అవసరాలను సమకూర్చి చిరునవ్వు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అత్యవసర వసతి గృహంలో వున్న వారికి మంచి విందును ఇవ్వగలిగింది. టీడీఎఫ్ సభ్యుల సహకారంతో తత్వా (TATVA) రెస్టారెంట్ వారికి రుచికరమైన ఆహరాన్ని సమకూర్చింది. తద్వారా ఎంతో మంది నిరుపేదల ముఖాలపై, చిరునవ్వు, సంతోషం వెల్లివిరిసింది. స్వరూప్ కూరెళ్ల ఆధ్వర్యంలో SEWA టీం, టీడీఎఫ్ సంయుక్తంగా ఈ ఫాదర్స్ డే నాడు చాలా మంది నిరుపేదలకు ఆహరాన్ని అందించడంతోపాటు నిత్యావసర వస్తువులు కొనిచ్చింది. (టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు) ఈ సందర్భంగా టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు కవిత చల్ల SEWA టీమ్‌కు, టీడీఎఫ్ (TDF) కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా టీడీఎఫ్.. సభ్యుల సహకారంతో ఇలాంటి సాంఘీక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన టీడీఎఫ్ డీసీ కోఆర్డినేటర్ జీనత్ కుండూర్, రజని కొప్పారపు, శివాని రెడ్డి , ప్రతిభా కొప్పుల గారికి ప్రేత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన టీడీఎఫ్ వర్జీనియా కోఆర్డినేటర్ రామ్మోహన్ సూరినేని , టీడీఎఫ్ వర్జీనియా కోశాధికారి హర్షా రెడ్డి , టీడీఎఫ్ డీసీ సలహాదారు సుధీర్ బండారు, రవి పల్ల, టీడీఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆరుట్ల, టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్వరూప్ కూరెళ్ల (సేవా ఆర్గనైజషన్ ), ఫేస్బుక్ , టీడీఎఫ్ వెబ్సైట్ ద్వారా ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం) -
పొర్ట్‌లాండ్ బతుకమ్మ, దసరా వేడుకలు
వాషింగ్టన్: అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో బతుకమ్మ, దసరా వేడుకలను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బివర్టన్ సిటీ మేయర్ డెన్నీడోయల్ హజరయ్యారు. పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రోసిటీలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ బతుకమ్మ, దసరా వేడుకలకు దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ వేడుకలో చిన్నారులు, మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మల నిమర్జనం తర్వాత మహిళలు గౌరీ దేవీకి మొక్కుకుని, ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత బతుకమ్మ విన్నర్స్కి టీడీఎఫ్ టీం బహుమతులు అందజేశారు. అలాగే దసరా పండుగ రోజు పూజారి జమ్మీచెట్టుకు పూజ చేసి వేదమంత్రాలను అందరి చేత పఠించారు. అనంతరం జమ్మిఆకును ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటూ అలయ్ బలయ్ చేసుకున్నారు. ఈ వేడుకలో చిన్నారుల రావణ సంహారం స్కిట్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బివర్టన్ మేయర్ డెన్నీడోయల్ మాట్లాడాతూ.. ఈ వేడుకలో పాల్గోనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బతుకమ్మ,దసరా వేడుకలను, మహిళల ఆటపాటలు, చిన్నారుల వేసిన స్కిట్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీఏఫ్ టీంని ఆయన ప్రశంసించారు. టీడీఏఫ్ ప్రెసిడెంట్ శీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మహిళలను అభినందించారు. వేడుకలను వైభోవోపేతంగా నిర్వహించి, విజయవంతం కావటానికి కృషి చేసిన టీడీఏఫ్ టీంకు నిరంజన్ కూర, శివ ఆకుతో, రఘుశ్యామ, కొండల్‌రెడ్డి పూర్మ, వీరేష్ బుక్క, ప్రవీణ్ అన్నవజ్జల అజయ్ అన్నమనేని, రాజ్ అందోల్ తదితరులను పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వేడుకలో పాల్గోన్నవారందరికి రుచికరమైన భోజనం వడ్డించారు. చివరగా కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకు, టీడీఏఫ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణలో చీకటి పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అచ్యుతరామరావు అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, రచయితలు, ప్రజా సంఘాలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత రామారావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప యజ్ఞాలతో కాదన్నారు. టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుందని విమర్శించారు. కశ్మీర్ తరహాలో ఇక్కడ అప్రకటిత నిర్బంధం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎఫ్ కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ప్రొఫెసర్లు లక్ష్మణ్, అన్వర్‌ఖాన్, కాసీం, అడ్వకేట్ రఘునాథ్, నారాయణరావు, నలమాస కృష్ణ, కోటి, దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మేధావుల గొంతులను అణచివేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేసిన విరసం కార్యవర్గ సభ్యులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే మేధావుల గొంతులను అణచివేస్తున్నారని, దీనిలో భాగంగానే విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.జగన్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో విరసం కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ కాశీం, తెలంగాణ సాహితీవేత్త భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి వఝల శివకుమార్, జగన్ తల్లి లక్ష్మీ నర్సమ్మలు మాట్లాడారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్య మంలో జగన్ కీలకపాత్ర పోషించారని, అప్పుడు ఏర్పడిన విద్యార్ధి జేఏసీలో ప్రధాన నాయకుడిగా ఉన్నారని వారు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అర్ధశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జగన్ పనిచేస్తున్నారన్నారు. మఫ్టీలో ఉన్న గద్వాల పోలీసులు గురువారం ఉదయం 10.30 ప్రాంతంలో జగన్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టి ఎక్కడెక్కడో తిప్పి సాయంత్రం 4 గంటలకు ఆయన ఇంటికి తీసుకువచ్చి పుస్తకాలు, ఇల్లు మొత్తం చిందరవందర చేశారన్నారు. బేషరతుగా జగన్ తోపాటు చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి తదితరులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విరసం కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యులు రాంకీ, రాము, క్రాంతి, సభ్యులు అరవింద్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు
అట్లాంటా: ప్రకృతిని పూజించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అట్లాంటాలో ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 5న సౌత్ ఫోర్సిత్ మిడిల్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అట్లాంటాలో వందల సంఖ్యలో నివసిస్తోన్న తెలంగాణ మహిళలు వేడుకకు తరలి వచ్చారు. వారంతా కలిసి గౌరీదేవీని తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరయ్యారు. అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. ఈ వేడుకలో పసి పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలకు 2,500మంది పైచిలుకు హాజరయ్యారు ఇక దసరా పండగను జమ్మి పూజతో ప్రారంభించారు. కోలాటాల కోలాహలంతో వేడుక కన్నులవిందుగా సాగింది. అందంగా తయారు చేసిన బతుకమ్మలకు టీడీఎఫ్ జ్యూరీ బహుమతులను అందజేసింది. టీడీఎఫ్ బృందం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాక, తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ పాత్రను గుర్తు చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నానమ్మ-మనుమరాలు థీమ్‌తో ఈ యేడాది తీసుకువచ్చిన ఆన్సైట్ బతుకమ్మకు విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించామని పేర్కొంది. టీడీఎఫ్ సంస్థ తెలంగాణలో చేపడుతోన్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ చేసిన ఈఐఎస్ టెక్నాలజీస్‌కు టీడీఎఫ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేడుకలు విజయవంతమవడానికి సహాయ సహాకారాలు అందించిన రాపిడ్ ఐటీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, పీచ్ క్లినిక్, ఫార్మర్స్ ఇన్సూరెన్స్, డ్రవ్ ఇన్ఫో, ఆర్పైన్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, శేఖర్ పుట్ట రియల్టర్, సువిధ గ్రోసరీస్, పటేల్ బ్రదర్స్, ఏజెంట్ రమేశ్, ఓర్దశన్ టెక్నాలజీస్‌కు ధన్యవాదాలు తెలిపింది . ఈ ప్రోగ్రాంకు రఘు వలసాని ఫొటోగ్రఫీ, డీజే దుర్గం సౌండ్ సిస్టమ్‌ను అందించారు. సువిధ ఇండో పాక్ గ్రోసరీస్, బిర్యానీ పాట్, అడ్డా ఈటరీ వారు విందును ఏర్పాటు చేశారు. స్వప్న కట్ట, స్థానిక కళాకారులైన శ్రీనివాస్ దుర్గమ్లు వారి గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్( టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వనభోజనాలను అట్టహాసంగా నిర్వహించింది. చాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీని.. ప్రొఫెసర్ జయశంకర్‌కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. అదేవిధంగా టీడీఎఫ్ ఫుడ్ బృంద సభ్యులు పార్క్‌లోనే రుచికరమైన తెలంగాణ వంటలు వండి అందరికి వడ్డించారు. అదేవిధంగా కార్యక్రమం ముందు టీడీఎఫ్ రెండవ వాలీబాల్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. టీడీఎఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటీతో పాటు ఫన్ గేమ్స్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్రేస్ ఆటలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో మహిళలు, పిల్లలు, యువకులు, యువ దంపతులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు. ఈ వనభోజన వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికీ టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందించారు. అదేవిధంగా ఫన్ గేమ్స్, ఇతర ఆటల పోటీలు, రాఫెల్ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో కృషిచేసిన వాలంటీర్లకు, టీడీఎఫ్ చాప్టర్ సభ్యులు కాంత్ కోడిదేటి, నరంజన్ కూర, నరేందర్ చీటి, ప్రవీణ్ అన్నవజ్జల, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కొండాల్‌రెడ్డి పుర్మ, శ్రీపాద్, శివ ఆకుతోట, రఘు శ్యామ, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, నవీన్, సురేశ్ దొంతుల, రాజ్ అందోల్, వీరేశ్ బుక్క, జయాకర్ రెడ్డి, అజయ్ అన్నమనేని కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పోర్ట్‌లాండ్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు
పోర్ట్లాండ్ : అమెరికాలోని ఒరేగాన్స్టేట్లో టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్) పోర్ట్లాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోర్ట్లాండ్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల విఘ్నేశ్వరుడికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల, అమ్మాయిలు, మహిళలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తరువాత దసరా పండుగను జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకల అనంతరం పసందైన విందులను ఆరగించారు. ఈ సందర్భంగా శ్రీని అనుమాండ్ల మాట్లాడుతూ.. వేడుకలకి వచ్చిన వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహాయం చేసిన స్పాన్సర్స్‌కి శ్రీని కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీఎఫ్ టీమ్ మెంబర్స్ నిరంజన్ కూర, నరేందర్ చీటి, భాను పోగుల, కొండల్ రెడ్డి పుర్మ, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, శ్రీనివాస్‌రెడ్డి పగిడి, రఘు శ్యామ, సురేష్ దొంతుల, జయాకర్ రెడ్డి ఆడ్ల, సత్య సింహరాజు, వీరేష్ బుక్క, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్, హరి సూదిరెడ్డి, శ్రీని గుబ్బ, వెంకట్ గోగిరెడ్డి, ఇతర వాలెంటెర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
పోర్ట్‌ల్యాండ్ : అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వజభోజనాల కార్యక్రమం జరిగింది. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజన కార్యక్రమానికి పోర్ట్‌ల్యాండ్ మెట్రో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అవార్డ్స్‌ను చాప్టర్ చైర్మన్ అందించారు. అనంతరం పుడ్ కమిటీ తయారు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలతో చిన్నా పెద్ద అంతా కలిసి భోజనం చేశారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఢీఎప్ చాప్టర్ టీం సభ్యులు నిరంజన్ కూర, నరెందర్ చీటి, రాజ్ అందోల్, కాంత్ కోడిదేటి, కొండల్‌రెడ్డి పుర్మ, మధుకర్‌రెడ్డి పురుమాండ్ల, జయాకర్ రెడ్డి ఆడ్ల, హరి సూదిరెడ్డి, సత్య సింహరాజు, ఈవెంట్ టీం సభ్యులు శ్రీనివాసరెడ్డి పగిడి, వీరేష్ బుక్క, ప్రవీణ్ యలకంటి, స్పోర్ట్స్ టోర్నమెంట్ వాలంటీర్స్ శ్రీని బొంతల, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్ వర్సిటీ బిల్లును నిలిపేయాలి’
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ వర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు శంతన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తామని చెప్పి... నేడు ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా బిల్లు తేవడం శోచనీయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజన్న, రాం దాస్, విజయ్, బాలయ్య, తదితరులున్నారు. -
డల్లాస్‌లో వైభవంగా బతుకమ్మ-దసరా సంబరాలు
డల్లాస్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో బతుకమ్మ-దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా వైభవంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ ప్రజలంతా కలిసివచ్చి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినా బతుకమ్మ- దసరా పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులంతా దేవతల, జానపద, చారిత్రాత్మక దుస్తులు ధరించి 'దసరా వేషాలు' పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుని అందరిని మురిపించారు. ఈ కార్యక్రమానికి యుగంధర్ మరిన్ గంటి స్వామి, మంజురెడ్డి ముప్పిడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవీకి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాల నృత్యాలతో, ఢోల్ భాజాలతో వేడుకలకు కొత్త అందాలను తెచ్చారు. బతుకమ్మ పాటలతో ఊరేగింపులతో బతుకమ్మల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపారు. టీరేఫ్ సంస్థ వనితలందరికీ పసుపు, కుంకుమ గాజులు బ్యాగులలో పెట్టి కానుకలు ఇచ్చారు. సాయి నృత్య అకాడమీ నుంచి శ్రీదేవి ఎడ్లపాటి శిష్యులు జమ్మి పూజ ప్రారంభించే ముందు 'హైగిరి నందిని' పాటతో నృత్యాన్ని ప్రదర్శించారు. పురుషులందరూ కూడా జమ్మి పూజలో పాల్గొన్నారు. ఐదువేల మందితో ఆలయ ప్రాంగణమంతా పండుగ సంబరాలతో కిక్కిరిసి పోయింది. 'బీచ్ బీట్స్' అకాడమీ నుంచి ఆదిత్య గంగసాని బృందం కాల్ వాయిద్యాలతో పండుగకి మరింత వన్నె తెచ్చారు. కార్యక్రమంలో పాల్గొనవారికి పులిహోర, దద్ధోజనం, రవ్వకేసరి, సత్తుపిండి ప్రసాదాలతో చక్కటి విందుని టీరేఫ్ ఫుడ్ కమిటీ నిర్వహకులు వడ్డించారు. యోయో, టీ న్యూస్, టీవీ 9, ఐనా మీడియా వారికి టీరేఫ్ కార్యవర్గ బృందం కృతజ్ఞతలను తెలిపింది. టీడీఎఫ్, డల్లాస్, నేషనల్ కార్యవర్గ బృందం కలిసి గత 2006 నుంచి ఈ వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతున్నారు. -
అమెరికాలో బతుకమ్మ వేడుకలు
సిరిసిల్ల: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఈ సంబురాలు జరిగాయి. మహిళలు పూలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటికి టీడీఎఫ్ నిర్వాహకులు బహుమతులు అందించారు. అతిథులుగా సినీనటుడు విజయచందర్, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ పాల్గొన్నారు. బతుకమ్మ పోటీలో దీప్తి, శైలజ విజేతలుగా నిలిచారని టీడీఎఫ్ ప్రతినిధులు మురళి, జమున ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు టీడీఎఫ్ ఏర్పాట్లు
హైదరాబాద్: వచ్చే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగం గురువారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాన్ ఆంటానియో టీడీఎఫ్ విభాగానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి బిల్లా, పాండు కదిరే, తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ నేపథ్యంపై దిలీప్ రెడ్డి గారితో ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం టీడీఎఫ్ ప్రతినిధులు దిలీప్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. -
పేద విద్యార్థుల చదువు కోసం 'భారతి'...
ఆర్లాండో : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాదులు, మాతృభూమి అభివృద్దిలో తమ వంతు కర్తవ్యంగా భాగస్వామి అవ్వాలన్న ఆలోచనలతో మేధోమథన సదస్సును నిర్వహించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షులు విశ్వేశ్వర్ కలవల అద్వర్యంలో జరిగిన ఆగ్నేయ ప్రాంతాల సదస్సులో వివిధ టీడీఎఫ్ గ్రూప్ (మెల్బోర్న్, అట్లాంటా, జాక్సన్విల్లే, ఓర్లాండో, తలహాసి, టాంప, వెస్ట్ పామ్ బీచ్, మియామీ) నాయకులతో పాటు పలువురు వైద్యులు, విద్యా వేత్తలు, వ్యాపారులు పాల్గొని పలు అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు. ఏంతో విశ్లేషణాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్థిక కారణాల వల్ల చదువు మధ్యలోనే వదిలేస్తున్న బీద విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందించే 'భారతి' కార్యక్రమం గురుంచి క్షుణ్ణంగా చర్చించి, దాని విధివిధానాలను సూత్రప్రాయంగా నిర్ణయించారు. దాదాపు 300 మంది హాజరైన ఈ కార్యక్రమానికి ఫ్లోరిడాలోని ఆర్లాండో నగరం వేదికైంది. 'భారతి' కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. దానికి ఆర్థిక సహకారం అందించడానికి చాలా మంది ముందుకొచ్చారు. అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమంలో గాయకులు పాడిన తెలంగాణ జానపద గేయాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వైద్యులు, విద్యావేత్తలను సన్మానించారు. -
ఎవరి వ్యూహాల్లో వారు
- టీడీఎఫ్ చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు - ఎలాగైనా నిర్వహించి తీరాలని వేదిక నేతల పట్టు సాక్షి, హైదరాబాద్: ఆరునూరైనా అసెంబ్లీకి చేరుకోవాలని అటు టీడీఎఫ్ పట్టు.. ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసుల ప్రయత్నం! ఇలా ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, పది వామపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే అసెంబ్లీకి చేరుకోవాలని నిర్ణయించారు. విరసం నేత వరవరరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ-చంద్రన్న నాయకుడు కె.గోవర్దన్, ఇతర పార్టీల ముఖ్యులు పోలీసులకు చిక్కకుండా మంగళవారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అనుమతిస్తే ప్రదర్శన ఉంటుందని, లేదంటే ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు అసెంబ్లీకి చేరుకునే యత్నం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీఎఫ్ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మూడేళ్ల క్రితం సరిగ్గా సెప్టెంబర్ 30 చేపట్టిన ‘సాగరహారం’ స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. నిర్బంధకాండ.. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీఎఫ్ పేర్కొంది. అరెస్ట్‌లు, బైండోవర్లు, నాయకుల ఇళ్ల ముందు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నాయకులను గృహ నిర్భంధం చేశారని ధ్వజమెత్తింది. జిల్లాల్లో పార్టీ కార్యకర్తలను నిర్బంధించారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసినా, అడ్డుకున్నా ప్రదర్శనలు జరిపి తీరుతామన్నారు. పోలీసుల అణచివేతతో రాష్ట్రంలో నిర్బంధం తాండవిస్తోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని న్యూడెమోక్రసీ-చంద్రన్న నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్దన్ డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదు: పోలీసులు టీడీఎఫ్ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. టీడీఎఫ్ ముసుగులో మావోయిస్టులు రాష్ట్ర రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున అనుమతి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 6 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. నగరంలో సభలు, సమావేశాలతో పాటు, గుంపులు సంచరించడానికి వీలు లేదని స్పష్టంచేశారు. ర్యాలీలో రాష్ట్రం నిషేధించిన రెవెల్యూషన్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్ లీగ్(ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్), రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. రెండ్రోజుల క్రితమే టీడీఎఫ్ సానుభూతిపరులు హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో అదనంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
అమెరికాలో టీడీఎఫ్ సమావేశం
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) సమావేశమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి పథకాలతో పాటుగా ఇతర విషయాల గురించి చర్చించారు. ఎన్నారై భవనంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఎన్నారై విభాగాన్ని ఆహ్వానించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తారు. టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్.. పారదర్శకత కోసమే ఈ వేదికను నిర్వహిస్తామన్నారు. టీడీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో ఉందని, ఒక్క యూఎస్ఏలోనే 64 నగరాల్లో ఉందని విశ్వేశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో లైబ్రరీలు, విద్యాలయాలు, రోడ్ల అభివృద్ధికి 1,10,000 డాలర్లు కేటాయించినట్టు తెలిపారు. టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు విజయ్ భాస్కర్ పిట్టా, ప్రధాన కార్యదర్శి కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సహాయ కార్యదర్శి బొజ్జా అమరేందర్, రవీందర్ గడ్డంపల్లి బీఓటీ నాయకులు మురళి చింతలపాణి, శ్రీనాథ్ ముస్కుల, గుర్రాల రాధేశ్ రెడ్డి, విజయ్ సాధువు, సంతోష్ కాకులవరం, మహేష్ వెనుకదాసుల, వాసు దుండిగళ్ల, కృష్ణ ప్రసాద్ జలిగామ, రామ్ కోమందురి, రామ్ చావ్లా, సుమన్ ముప్పిడి, విశ్రాంత ఇంజనీర్ సత్యపాల్ రెడ్డి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్కటి సంగీత కచేరి ఏర్పాటు చేశారు. గాయకులు దివ్య దవులూరి, పద్మజకనాలి, వెంకట కనకాల, శ్రుతికనాల, స్వాతితిప్పిరెడ్డి, శిల్పాదుండిగల, కృష్ణ జలిగామ భక్తి గీతాలతో అలరించారు. నృత్య విభాగంలో కృతి జలిగామ, వైష్ణవి దెనువకొండ, శ్రేష్ట దుండిగళ్ల, తిప్పిరెడ్డి తన్మయి, ఆత్మకూర్ సానిక, ధృతి పదుకునే, శ్రేష్ట గడ్డం, సోహన్ కోస్నా, అనిష్ గడ్డం, సంజిత్ గడ్డం, అతిథి ఈర్ల, అనన్య భూమిరెడ్డి, మనీష్ ఇలేని, వెనుకదాసుల ప్రవధ్, కార్తీక్ గంకిడి పాల్గొన్నారు. మిమిక్రీలో తనుజ్ గంగ చక్కటి ప్రతిభ కనబరిచారు. -
డల్లాస్‌లో టీడీఎఫ్ తెలంగాణ ఆవిర్భావ సంబురాలు
డల్లాస్: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో తెలంగాణ మొదటి ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని హిల్‌టాప్ బంక్వీట్ హాలులో నిర్వహించిన ఈ వేడుకకు వందల సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ తోపాటు అమరవీరులకు నివాళులు అర్పించారు. టీడీఎఫ్ డల్లాస్ శాఖ ప్రతినిధులు రామ్ కొమందూరి, మాధవి సుంకిరెడ్డి, రవి పటేల్, విజయ పిట్టా, ప్రవీణ్ బిల్లా, శ్రీమతి శారదా సుంకిరెడ్డి, రావు కల్వాల, రఘువీర్ బండారు, ఉపేంద్ర తెలుగు, వేణు భాగ్యనగర్, దయాకర్ పుస్కూర్, దయాకర్ మందా, మోహన్ గాలి, ఆనంద్ కాట్రోజు, శివ మాటేటి, కరణ్ పోరెడ్డి, శ్రీనివాస్ వేముల, శ్రీధర్ వేముల, ఉపేందర్ తెలుగు, స్వరూప్ కొండూరు, నరేశ్ సుంకిరెడ్డి, వేణు భాగ్యనగర్, చంద్రా బండారు, పవన్ గంగాధర, అశోక్ కొండాట్ల, రామ్ అన్నాదిల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పిల్లలు, మహిళలు కలిసి తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు తెలుగు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. 1969 ఉద్యమంలో భాగస్వాములైన సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు సదా సిద్ధంగా ఉంటామని టీడీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
టిడిఎఫ్ ఆధ్వర్యాన కెనడాలో మీట్ అండ్ గ్రీట్
-
మీ తోడ్పాటు లేకుండా 'నో' మిషన్ కాకతీయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మిషన్ కాకతీయకు ఎన్ఆర్ఐ తోడ్పాటు తప్పనిసరి అని నీటి పారుదలశాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. తమ ప్రభుత్వం ఈ విషయంలో ఎంతటి అంకిత భావంతో ముందుకు వెళుతుందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రతి ఎకరా సాగుకు వచ్చి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కానుందని చెప్పారు. తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో యూఎస్, యూకే, ఆస్ర్టేలియా, గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో దాదాపు 715 మంది తెలంగాణ ఎన్ఆర్ఐలతో మాట్లాడిన హరీష్ రావు... మిషన్ కాకతీయ సాధ్యం కోసం ఎన్ఆర్ఐలు కచ్చితంగా పాల్గొనాలని కోరారు. దీనికయ్యే నిధుల కోసం టీ జాక్ తో పాటు, నాలుగు లక్షల మంది టీఎన్జీవోలను భాగస్వాములను చేసినట్లుగానే విదేశాల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తున్నామని ఆయన ఎన్ఆర్ఐలతో చెప్పారు. నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి దానిని పారదర్శకంగా నిర్వహిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు పలు కార్యక్రమాల్లో సాయాన్ని అందించినట్లుగానే ఇకపై కూడా టీడీఎఫ్ సాయం అందించాలన్నారు. తెలంగాణలో వెయ్యేళ్లపాటు చెరువులు ప్రధాన పాత్ర పోషించాయని, అయితే అనంతర పాలకులవల్ల అవి పూర్వవైభవం కోల్పోయాని చెప్పారు. ఏడాదికి 9000 చొప్పున 2019నాటికి మొత్తం 45వేల చెరువులను పునరుద్ధరిస్తామని, ఇందుకోసం 20 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు చెప్పారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్ ఆర్ఐలు కూడా చేయూత నివ్వాలన్నారు. చెరువులు పూర్తయితే 250 టీఎంసీల నీటిని నిల్వచేసుకోవడమే కాకుండాదాదాపు 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అందుకు యుద్ధప్రాతిపదికను ముందుకు వెళతామని హరీష్ రావు పేర్కొన్నారు. -
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మంత్రి హరీష్ తో ఎన్ఆర్ఐలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) మంగళవారం నిర్వహించనున్న ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గోనున్నారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు హరీష్ రావుతో ముచ్చటించనున్నారు. ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుదుత్పత్తి, సురక్షిత తాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి ఎన్నారైలు తమ సూచనలను మంత్రికి తెలియజేస్తారు. మంత్రి హరీష్ ఫోన్ ఇన్ ఫోన్ కార్యక్రమం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి ప్రవాస భారతీయులకు వివరించనున్నారు. ఎన్ఆర్ఐలతో జరిగే ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ సుమారు రెండు గంటల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలను హరీష్ రావు ఆ కార్యక్రమం ద్వారా ఎన్ఆర్ఐలకు తెలియజేస్తారు. -
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎంతో ఎన్ఆర్ఐలు
వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గురువారం తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) నిర్వహించిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న ఆయనకు ప్రవాసీలు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు శ్రీహరితో ముచ్చటించారు. ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ ఉత్పత్తి, శుభ్రమైన త్రాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి సూచనలను వారు శ్రీహరికి తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి శ్రీహరి వారికి తెలియజేశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ఎన్ఆర్ఐలతో సమావేశమైనందుకు తనకు ఆనందంగా ఉందని కడియం తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అసలు డైనమిక్ లీడర్ కేసీఆర్ నేతృత్వంలో తాను పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని శ్రీహరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామన్నారు. -
వర్జీనియాలో ఫ్రొ.జయశంకర్ కు ఘన నివాళులు
వర్జినియా: దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకను యూఎస్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఘనంగా నిర్వహించింది. వర్జీనియాలోని స్వదేశ్ బాంకెట్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ దర్శకుడు వడ్డెపల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అతిధులుగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ అందించిన స్పూర్తిని ఈ కార్యక్రమంలో అతిధులు కొనియాడారు. అభిమానులు, తెలంగాణవాదులు, టీడీఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా ఫ్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించారు.