అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్( టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వనభోజనాలను అట్టహాసంగా నిర్వహించింది. చాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీని.. ప్రొఫెసర్ జయశంకర్‌కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. అదేవిధంగా టీడీఎఫ్ ఫుడ్ బృంద సభ్యులు పార్క్‌లోనే రుచికరమైన తెలంగాణ వంటలు వండి అందరికి వడ్డించారు.
అదేవిధంగా కార్యక్రమం ముందు టీడీఎఫ్ రెండవ వాలీబాల్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. టీడీఎఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటీతో పాటు ఫన్ గేమ్స్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్‌రేస్ ఆటలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో మహిళలు, పిల్లలు, యువకులు, యువ దంపతులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.
ఈ వనభోజన వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికీ టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందించారు. అదేవిధంగా ఫన్ గేమ్స్, ఇతర ఆటల పోటీలు, రాఫెల్ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో కృషిచేసిన వాలంటీర్లకు, టీడీఎఫ్ చాప్టర్ సభ్యులు కాంత్ కోడిదేటి, నరంజన్ కూర, నరేందర్ చీటి, ప్రవీణ్ అన్నవజ్జల, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కొండాల్‌రెడ్డి పుర్మ, శ్రీపాద్, శివ ఆకుతోట, రఘు శ్యామ, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, నవీన్, సురేశ్ దొంతుల, రాజ్ అందోల్, వీరేశ్ బుక్క, జయాకర్ రెడ్డి, అజయ్ అన్నమనేని కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment