telangana nris
-
క్షమాభిక్షపై చిగురిస్తున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దుబాయ్ అధికారులతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. 17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల వాసులు 2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా పది మంది కలిసి హత్య చేశారనేది ఆరోపణ. కాగా ఈ కేసు నిందితుల్లో నలుగురు పాకిస్తానీయులు కాగా మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందినవారు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. అయితే శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలు విడుదలయ్యారు. కానీ తెలంగాణకు చెందిన మిగతా ఐదుగురు..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లే‹Ù, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు మాత్రం 17 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష ఈ ఐదుగురు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం శాపంగా మారింది. ఈ కేసులు విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (అరబ్బీ భాషలో ‘నజ్ల ఖజా యా) ఈ హత్యను క్రూరమైనది (జినయా)గా పరిగణించింది. కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ కారణంగానే వీరు మరో ఎనిమిదేళ్ల వరకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలంగా కేటీఆర్ ప్రయత్నాలు ఐదుగురు ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్‌లోని బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి దియ్య సొమ్ము పరిహారం (బ్లడ్ మనీ) అందించారు. ఆ కుటుంబం ఇచ్చిన క్షమాభిక్ష అంగీకార పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. అయితే నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఆరు నెలల కిందట మరోసారి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మంత్రి మరోసారి తనప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష లభించేలా చూడాలని అక్కడి అధికారులను కోరారు. అంతకుముందు జరిగిన బిజినెస్ భేటీల సందర్భంగా దుబాయ్ రాజ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే పలువురు వ్యాపారవేత్తల వద్ద కూడా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించి మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న తాజా ప్రయత్నాలు, స్థానిక వ్యాపారవేత్తల నుంచి లభించిన సానుకూల హామీ నేపథ్యంలో తెలంగాణ ఖైదీల విడుదలపై కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని హర్షించిన డాల్లస్ ఎన్నారైలు!
డాల్లస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకాన్ని డాల్లస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టమని తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్లో జులై 9 శుక్రవారం జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం జరగాలని ఎన్నారైలు ఆకాంక్షించారు. ఈ అభినందన సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్ లో పాల్గొని ఎన్నారైలని ఉద్దేశించి ప్రసంగించారు.రేవంత్ రెడ్డి తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్ లో పాల్గొని తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్( టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వనభోజనాలను అట్టహాసంగా నిర్వహించింది. చాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీని.. ప్రొఫెసర్ జయశంకర్‌కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. అదేవిధంగా టీడీఎఫ్ ఫుడ్ బృంద సభ్యులు పార్క్‌లోనే రుచికరమైన తెలంగాణ వంటలు వండి అందరికి వడ్డించారు. అదేవిధంగా కార్యక్రమం ముందు టీడీఎఫ్ రెండవ వాలీబాల్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. టీడీఎఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటీతో పాటు ఫన్ గేమ్స్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్రేస్ ఆటలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో మహిళలు, పిల్లలు, యువకులు, యువ దంపతులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు. ఈ వనభోజన వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికీ టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందించారు. అదేవిధంగా ఫన్ గేమ్స్, ఇతర ఆటల పోటీలు, రాఫెల్ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో కృషిచేసిన వాలంటీర్లకు, టీడీఎఫ్ చాప్టర్ సభ్యులు కాంత్ కోడిదేటి, నరంజన్ కూర, నరేందర్ చీటి, ప్రవీణ్ అన్నవజ్జల, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కొండాల్‌రెడ్డి పుర్మ, శ్రీపాద్, శివ ఆకుతోట, రఘు శ్యామ, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, నవీన్, సురేశ్ దొంతుల, రాజ్ అందోల్, వీరేశ్ బుక్క, జయాకర్ రెడ్డి, అజయ్ అన్నమనేని కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
వాషింగ్టన్లో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం
మేడ్చల్‌రూరల్: అమెరికాలోని వాషింగ్టన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదని అన్నారు. బంగారు తెలంగాణలోనూ కీలక పాత్ర పోషించాలని కోరారు. -
ప్రజల ఎజెండా కావాలి
సాక్షి, హైదరాబాద్ : ‘‘మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా అంశాల్లో వెనుకబడింది. ఈ పరిస్థితి రావడానికి ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలే కారణం. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. ఇందుకోసం ప్రజల ఎజెండా తయారు కావాలి. నిజంగా ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశం ఎటు పోవాలనే మార్గదర్శకం అవసరం. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నా. దేశ ప్రజలకు కావాల్సిన ఎజెండా రూపొందిస్తున్నా. ఈ ఎజెండాను యావత్ దేశం అంగీకరిస్తుంది. దాని ప్రకారం రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు రూపొందించుకుంటే మార్పు తప్పక సాధ్యమవుతుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు కూడా నరేంద్ర మోదీపై వ్యతిరేకత వస్తే, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. అయితే ఏం లాభం? దేశానికి ఏం మేలు జరుగుతుంది? ఏం మార్పు సాధ్యమవుతుంది? ఒకరి మీద కోపంతో మరొకరిని గెలిపిస్తాం. ఎవరు గెలిచినా పరిస్థితిలో మాత్రం మార్పు రాదు’’అని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో వివిధ దేశాలకు చెందిన తెలంగాణ ఎన్నారై ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. అనంతరం వారితో తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, ఎన్ఆర్ఐల సంక్షేమం తదితర అంశాలపై మాట్లాడారు. పదవుల కోసం కాదు.. ‘‘నేను పదవుల కోసమో, ఇంకోదాని కోసమో జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఈ దేశ పౌరుడిగా, దేశంలో మార్పు తేవడానికి నా వంతు ప్రయత్నం ఏదైనా చేయగలనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని, పని మొదలుపెట్టా. మనకెందుకులే అనుకుంటే తెలంగాణ వచ్చేదా? మనకెందుకులే అని అందరూ అనుకుంటే దేశంలో మార్పు సాధ్యమవుతుందా? ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. మనం ప్రయత్నిస్తే మార్పు సాధ్యమవుతుంది. ఎన్నారైలు ఈ విషయాలను ప్రపంచవ్యాప్తంగా చర్చించాలి. ఉద్యమ సమయంలో మనమెందుకు పోరాడుతున్నామో అందరికీ చెప్పారు. మీరు చేసిన సహాయం, సహకారం ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మనం చేస్తున్న ప్రయత్నాలపైనా విస్తృత చర్చ పెట్టాలి’’అని సీఎం పిలుపునిచ్చారు. దేశ పరిస్థితి బాగా లేదు ‘‘దేశంలోని ఒక రాష్ట్రంగా ఆలోచించినప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం బాగున్నామనిపిస్తుంది. కానీ మొత్తం దేశం పరిస్థితి బాగా లేదు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 40 వేల టీఎంసీలు వాడుకుంటే దేశం మొత్తం మీద ఉన్న 40 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ మాత్రం పని మన పాలకులు చేయలేదు. కేంద్ర బడ్జెట్ రూ.24.47 లక్షల కోట్లు. అందులో రూ.8.70 లక్షల కోట్లు అప్పుల కిస్తీలకు పోతాయి. రూ.10 లక్షల కోట్లు జీతభత్యాలు, పెన్షన్లు వంటి నిర్వహణ ఖర్చుకు పోతాయి. రూ.ఐదారు లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్)కు సరిపోతాయి. ఇక మిగిలేది రూ.రెండు మూడు లక్షల కోట్లు మాత్రమే. కేవలం ఈ రెండు మూడు లక్షల కోట్లతో ఇంత పెద్ద దేశంలో అభివృద్ధి పనులు ఎలా సాగుతాయి? దేశం ఎట్ల బాగుపడాలి. ఎన్నడు బాగుపడాలి? ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, ఆందోళన. కులం పేరిట, మతం పేరిట ఘర్షణలు. వీటికి పరిష్కారం లేదా? ఈ విషయాలను ఎన్నారైలు ఆలోచించాలి. మన పక్కనే ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారింది. మనమెందుకు మారడం లేదో ఆలోచించాలి’’అని సీఎం కోరారు. భారతదేశ ప్రజల ఎజెండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తున్న కృషిని ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా వివరించాలన్నారు. తెలంగాణ బిడ్డలుగా నాడు ఉద్యమ సమయంలో ఎలా సహకారం అందించారో, నేడు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయత్నంలో అలాగే భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రూ.50 కోట్లతో ఎన్నారై సెల్, కమిటీ ‘ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణకు చెందిన ఎన్నారైకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వెంటనే ఆదుకుని సహాయం అందిస్తుంది. ఇందుకోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాం’అని సీఎం ప్రకటించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్‌కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్నారై కమిటీ వేయాలని సూచించారు. ఎన్నారై సెల్, కమిటీ ఏర్పాటు, అవి పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించాల్సిందిగా మంత్రి కె.తారక రామారావు, ఎంపీ కవితలను ఆదేశించారు. తెలంగాణ ఎన్నారైల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ఈ సెల్, కమిటీ పని చేయాలని సూచించారు. ఎన్నారైల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.వంద కోట్లు కేటాయించామని, అందులోంచి రూ.50 కోట్లను సెల్‌కు బదిలీ చేస్తామని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కె.కవిత, ఎన్నారైల సమన్వయకర్త మహేశ్ బిగాల తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో తెలంగాణవాసుల అవస్థలు!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ దేశమైన కువైట్‌లో తెలంగాణవాసులు యాభైవేల మందికిపైగా నానా ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆ దేశ రాయబార కార్యాలయం వద్ద వారు పడిగాపులు పడుతూ.. స్వదేశం వచ్చేందుకు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి.. వారికి సాయం చేయాలని డిమాండ్ చేశారు. కువైట్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి.. అక్కడి తెలంగాణ వారిని ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. వారికి ప్రభుత్వమే ఉపాధి.. పునరావాసం కల్పించాలన్నారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలు జల్సాలకు .. బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని దుయ్యబట్టారు. ఎందుకు ప్రభుత్వం ఎన్నారై పాలసీ రూపొందించడంలో జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల కోసం సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని, గల్ఫ్ వెళ్లే వారికి బ్యాంక్స్ నుంచి ఋణం ఇప్పించాలని అభ్యర్థించారు. గల్ఫ్ కార్మికుల కోసం సర్కార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పీసీసీ నుంచి ఒక బృందం బాధితులకు సాయం అందించేందుకు గల్ఫ్ వెళ్ళనుందని, గల్ఫ్ బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని తెలిపారు. -
సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
సిడ్నీ: బతుకమ్మ, దసరా సంబురాలు సిడ్నీలో ఘనంగా జరిగాయి. ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. వందలాది మంది తెలంగాణ ఆడపడచులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....బంగారు బతుకమ్మ ఉయ్యాలో....ఉయ్యాల అంటూ ఈవేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడారు. బతుకమ్మ సంబురాలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవేడుకల్లో ఉత్తమ బతుకమ్మల పోటీ నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ తల్లికి వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉందని సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తుండటంతో పాటు, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు తెలంగాణ సంస్కృతిని నేర్పించడం తమ ముఖ్య లక్ష్యం అన్నారు. సిడ్నీలో నివసించే తెలంగాణ ఎన్నారైలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోడి మక్కే, జియోఫ్ లే, హుగ్ మక్డాట్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కలసి రండి
తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్నారైలు కలసి రావాలని ఎన్నారైల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు సహకరించిన ఎన్నారైలు, సాధించుకున్న సొంత రాష్ట్రాభివృద్ధిలో అదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలతో కలసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాలను తీర్చేందుకు సహకరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇండి యా డెవలప్మెంట్ ఫండ్(ఐడీఎఫ్) ద్వారా ప్రవా సులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు పోతుందన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలువురు ఎన్నారైలు ఐడీఎఫ్ ద్వారా తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, లైబ్రరీల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకారం అందిస్తామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో పట్టణంలో రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఎన్నారైలకు వివరించారు. అనంతరం ఎన్నారైలతో ముఖాముఖిగా మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి శీల, పురోగమన శీల రాష్ట్రంగా మారిందని, ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని మెచ్చుకున్నాయన్నారు. విపక్షాలవి అడ్డగోలు విమర్శలు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీ య స్థాయి గుర్తింపు లభించిందని, విద్యుత్, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామన్నా రు. ఇవి పూర్తయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయన్నారు. 60 ఏళ్లు ఏలిన ప్రతిపక్షాలు సాధించలేనిది,తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిందన్నారు. ఖమ్మంలో ఐటీ టవర్ పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ ఎన్నారైలకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని.. ఐటీ రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరిటీస్ వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించబోతోందని తెలిపారు. ఐటీ రంగ విస్తరణలో ప్రవాసులు చొరవ చూపాలని కోరారు. -
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కమిటీల ప్రకటన
కాన్ బెర్రా: టీఆర్ఎస్ పార్టీ విదేశాలలో తన శాఖలను విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలలో శాఖలను నెలకొల్పిన టీఆర్ఎస్ తాజాగా ఆస్ట్రేలియా శాఖను ప్రారంభించింది. దాంతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణ ఎన్ఆర్ఐలతో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, కాన్ బెర్రా శాఖలను ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి ఆస్ట్రేలియా టీఆర్ఎస్ గురించి వివరించినట్లు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ నేత వినోద్ ఏలేటి తెలిపారు. మద్దతుదారులందరూ టీఆర్ఎస్ ఆస్ట్రేలియాలో చేరాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డిపెండెంట్ వీసా ఉన్నవారిని చేర్చుకోవద్దని తమ లీగల్ అడ్వైజర్స్ సూచించారని వెల్లడించారు. జాతీయ కోర్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ గంగసాని, ఉపాధ్యక్షులు సందీప్ మునుగాల, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ పిన్నామ, సెక్రటరీ అనిదీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సుమన్ పారుపటి, ఎన్ఎస్డబ్ల్యూ స్టేట్ అధ్యక్షుడు సుమేష్ రెడ్డి, సెక్రటరీ పవన్ పాపయ్యగారి, విఐసి స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్ వంగపల్లి, ఏసీటీ స్టేట్ అధ్యక్షుడు రాజవర్ధన్ కోఠి, సెక్రటరీ రవి సాయుల, క్యూ ఎల్డీ స్టేట్ అధ్యక్షుడు రణధీర్ ఆరుట్ల, సెక్రటరీగా భరత్ కసిరెడ్డిలు నియమితులయ్యారు. సుమారు 700మందికి పైగా టిఆర్ఎస్ జాతీయ విభాగంలో చేరారు. జాతీయ కమిటీ వివరాలు మెల్బోర్న్: 1. విజయ్ రెడ్డి 2. అనీల్ దీప్ గౌడ్ 3. కపిల్ రెడ్డి 4. సురేన్ వంగపల్లి 5. బీరవెల్లి శశిధర్ రెడ్డి 6. నల్లని సతీష్ చౌదరి 7. పెద్ది శ్రీనివాస్ 8. సుమన్ పారుపాటి 9. అశోక్ బెల్లాల 10. జయపాల్ వంటేరు 11. రమేష్ తౌటిరెడ్డి 12. శేఖర్ కకునూరు 13. హరిణి పట్లోళ్ల 14. చంద్రశేఖర్ గంగసాని 15. నవీన్ గుడిమెట్ల 16. మమత పట్లోళ్ల 17. కవిత పుచ్ఛకాయల 18. రాజసింహారెడ్డి గంగసాని 19. మమత కకునూరు 20. శ్రావణి దేవిరెడ్డి 21. సాయిచరణ్ పన్నాల 22. ఆనందర్ చుక్క 23. ప్రవీణ్ నల్ల 24. శ్రీధర్ పాటిల్ 25. సుదీప్ ఆలేటి 26. ప్రీతమ్ ఏలేటి 27. వియాక్ కోలేపి 28. భరత్ గడ్డం 29. అభిజిత్ మామిడి 30. శ్రీపాల్ బొక్కా 31. సంజయ్ సేథీ 32. మహేందర్ గుర్రాల 33. చంద్రశేఖర్ దాసరి 34. అరుణ్ గుడుకుంట్ల 35. రాజేష్ గుట్ట బ్రిస్బేన్:1. రణధీర్ అరుట్ల 2. భరత్ కసిరెడ్డి 3. సందీప్ రెడ్డి 4. అంజూ రావు 5. వెంకట్ రిక్కల 6. వంశీ కృష్ణ 7. గణేష్ 8. జోసుష్ 9. శరత్ కొర్పోలు 10. అవినాశ్ పన్నాల 11. నిఖిల్ వెలుముల 12. రాజశేఖర్ బద్దం 13. రంజన్ కుమార 14. ప్రతాప్ కుమార్ 15. ఆనంద్ రెడ్డి కాన్బెర్రా: 1. వెంకట గన్రెడ్డి 2. రాజవర్ధన్ కోఠి 3. రవి సాయుల సిడ్నీ: 1. ప్రవీణ్ పిన్నమ 2. సుమేష్ రెడ్డి 3. పవన్ రెడ్డి 4. కుమార్ గుప్తా 5. రాజేష్ అర్షనపల్లి 6. నరేష్ రెడ్డి భీంరెడ్డి 7. రఘు రెడ్డి బీరం 8. రాజశేఖర్ అనంతోజు 9. వేణు ముద్దసాని 10. రాంరెడ్డి 11. కిరణ్ అల్లూరి 12. రూపా సూరం 13. విష్ణఉ చిట్యాల 14. రవి అనంతుల 15. ఓబుల్ రెడ్డి 16. సంగీత కోట్ల 17. పద్మిని చాడ 18. ప్రశాంత్ 19. రమణ ఆవుల 20. రఘు రెడ్డి 21. సందీప్ మదాడి