ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మంత్రి హరీష్ తో ఎన్ఆర్ఐలు
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మంత్రి హరీష్ తో ఎన్ఆర్ఐలు
Published Tue, Feb 17 2015 11:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) మంగళవారం నిర్వహించనున్న ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గోనున్నారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నతెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు హరీష్ రావుతో ముచ్చటించనున్నారు.
ముఖ్యంగా విద్య, జల వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుదుత్పత్తి, సురక్షిత తాగునీరు, ఆరోగ్యం, శాంతి భద్రతలు, మరుగుదొడ్లు తదితర అంశాలకు సంబంధించి ఎన్నారైలు తమ సూచనలను మంత్రికి తెలియజేస్తారు. మంత్రి హరీష్ ఫోన్ ఇన్ ఫోన్ కార్యక్రమం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల గురించి ప్రవాస భారతీయులకు వివరించనున్నారు. ఎన్ఆర్ఐలతో జరిగే ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ సుమారు రెండు గంటల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలను హరీష్ రావు ఆ కార్యక్రమం ద్వారా ఎన్ఆర్ఐలకు తెలియజేస్తారు.
Advertisement