
కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్న డీటీఎఫ్ నాయకులు
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ వర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు శంతన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తామని చెప్పి... నేడు ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా బిల్లు తేవడం శోచనీయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజన్న, రాం దాస్, విజయ్, బాలయ్య, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment