teachers
-
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆఫీసును ముట్టడించి... బరిషాల్లోని బేకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ శుక్లా రాణి హాల్దర్ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు! తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అంటూ సంతకం చేసిచ్చారామె. అజీంపూర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్ర పాల్ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. వైరలవుతున్న వీడియోలు... బంగ్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రొక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచి్చందని కాజీ నజ్రుల్ వర్సిటీ పబ్లిక్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముఖర్జీ తెలిపారు. ఖండించిన తస్లీమా ఈ ఘటనలపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు. జైలుపాలవుతున్నారు. దర్గాలను కూలి్చవేస్తున్నారు. అయినా యూనస్ నోరు విప్పడం లేదు’’ అంటూ ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్ ఖండించింది. -
పాఠాలు మానేసి ఇన్‌స్టా రీల్స్
లక్నో: స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు సోషల్ మీడియా రీల్స్‌లో మునిగి తేలుతున్నారు. ఒక టీచర్ కెమెరా ముందు యాక్షన్ చేస్తే, మరో టీచర్ దానిని షూట్ చేయడం, ఇంకో టీచర్ ఎడిటింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లు పోస్టు చేయడం ఇదీ తంతు. అక్కడితో వారు ఆగలేదు. తమ చానెల్‌ను లైక్, షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేయాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతూ వస్తోంది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లి దండ్రులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం)కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘మా టీచర్స్ అంబికా గోయెల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ ప్రతి రోజూ రీల్స్ చేస్తారు. వాటిని లైక్ చేసి షేర్ చేయాలని మాపై ఒత్తిడి తెస్తారు. అలా చేయకపోతే కొడతామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు’’ అని అన్ను అనే విద్యార్థిని తన గోడు చెప్పుకుంది. తమ చేత టీ పెట్టించుకోవడం, వారి కోసం వండి పెట్టడం వంటి పనులు కూడా చేయించుకుంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే టీచర్లు ఈ ఆరోపణల్ని కొట్టి పారేశారు. -
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. షాకైన టీచర్లు
సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా? పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్‌కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు. పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్సైడర్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు. 11 ఏళ్ల పిల్లలు కూడా.. స్విట్జర్లాండ్‌కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్‌లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు. టీచర్లు ఏమంటున్నారంటే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. -
ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా టీచర్ల బదిలీలు చేపట్టింది విద్యాశాఖ. 56, 829 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో టీచర్ల బదిలీలు చేపట్టింది. ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ ఆధారంగా టీచర్ల బదిలీల నిర్వహణ చేపట్టింది. ఉమ్మడి 13 జిల్లాల్లోనూ బదిలీ ప్రక్రియ షురూ చేసింది ఏపీ విద్యాశాఖ. -
టీచర్లకు డ్రస్ కోడ్! కొత్త రూల్‌ని జారీ చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్‌ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్‌లు, జీన్స్‌లు, టీ షర్ట్లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్ అవసరమని నోటిఫికేషన్లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్ కోడ్, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పారు. (చదవండి: పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..) -
బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్ వాలాను వీడిన ముగ్గురు టీచర్లు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ సానుభూతి కోసం ఏడుస్తూ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయింది. వారి ఏడుపు టీవీ నాటకంలా ఉందని నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ‘ఫిజిక్స్ వాలా’లో పనిచేస్తున్న తరుణ్ కుమార్, మనీష్ దూబే, సర్వేష్ దీక్షిత్ అనే ముగ్గురు టీచర్లు.. సంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో విభేదాల కారణంగా ఇటీవల ఆ సంస్థను విడిచి బయటకు వెళ్లారు. అయితే అడ్డా247 అనే సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకుని ‘ఫిజిక్స్ వాలా’ను వీడినట్లు ఆ సంస్థ కెమిస్ట్రీ టీచర్ తమపై ఆరోపణలు చేశారని ముగ్గురూ పేర్కొన్నారు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రాజీనామా తర్వాత ముగ్గురు ఉపాధ్యాయులు ఇప్పుడు సంకల్ప్ అనే పేరుతో వారి సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఫిజిక్స్ వాలాపై విమర్శలు చేస్తూ తమ ఛానెల్లో ఓ వీడియో పెట్టారు. తమపై ఆరోపణలు చేయడంపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బోరుమంటూ ఏడ్చేశారు. అయితే వీరికి కొంతమంది నెటిజన్లు సానుభూతి తెలపగా ఇదంతా టీవీ నాటకం లాగా ఉందని చాలామంది విమర్శలు చేశారు. ఈ వీడియోను కేవలం ఒక్కరోజులోనే 2.1 మిలియన్ల మంది వీక్షించారు. -
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
విద్యా అమృత్ మహోత్సవ్‌లో ఏపీకి రెండో ప్లేస్
సాక్షి, విజయవాడ: విద్యా అమృత్ మహోత్సవం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. అనంతి కాలంలోనే అధిక వీడియోలు, ప్రాజెక్టులు అప్లోడ్ చేశారు ఏపీ ఉపాధ్యాయులు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 'శిక్షక్ పర్వ్' వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమలులో ఏపీ ఉపాధ్యాయులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అనతికాలంలో అధిక వీడియోలు, ప్రాజెక్టులు అప్లోడ్ చేయడంతో.. ఏపీకి రెండో స్థానం దక్కింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని, సంబంధిత సిబ్బందిని ఆయన అభినందించారు. వినూత్న, వైవిధ్య విద్యా అంశాలతో పిల్లల మనసుని ఆకట్టుకునేలా చిన్నచిన్న అద్భుతమైన ఆలోచనలని దృశ్య రూపంగా మార్చేసి.. బోధనా అభ్యసనకు తగిన 1,00,758 ప్రాజెక్టులను విద్యా అమృత్ మహోత్సవం కోసం అప్ లోడ్ చేశారు ఏపీ ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమం అమలులో.. ప్రథమ స్థానం సాధించిన బిహార్, ఇతర రాష్ట్రాల్లో మూడు నెలలు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ, ఏపీ మాత్రం కేవలం ఒక నెలలోనే అధికంగా ప్రాజెక్టులు అప్ లోడ్ చేసి.. దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. దీనివెనుక.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, సముదాయ పర్యవేక్షణ (స్కూల్ కాంప్లెక్స్) సభ్యులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, సీమ్యాట్, ఎస్సీఈఆర్టీ సిబ్బంది కృషి ఎంతగానో ఉందని సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు బీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతికతను జోడించి మరింత బోధన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు గొప్ప వేదికగా సద్వినియోగ పడతాయని.. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు కూడా వీటిని సద్వినియోగపరుచుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా జాతీయస్థాయిలో పది వీడియోలను ఎంపిక చేసి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. -
నేటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ టీచర్ల బదిలీ
-
ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేసిన సీఎం వైఎస్ జగన్
-
ఏపీ మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ
-
టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ టీచర్లలో సబ్జెక్టులపై మంచి పట్టు, ఆయా అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. టీచింగ్ మెథడాలజీపై అవగాహన కూడా ఉంది. కానీ విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు..’ ప్రభుత్వ టీచర్ల పరిస్థితిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి–ఎన్సీఈఆర్టీ) విశ్లేషణ ఇది. దీనికి అనేక కారణాలున్నా అంతిమంగా పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో నెలకొనాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఒనగూరడం లేదని తేల్చింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యప్రణాళికలు, సిలబస్ తీరుతెన్నులు, టీచర్ల నైపుణ్యాలు, విద్యార్థుల్లో సామర్థ్యాలు తదితర అనేక అంశాలపై ఎన్సీఈఆర్టీ విశ్లేషించింది. బోధన కంటెంట్ సమన్వయంలో సమస్యలు ఎన్సీఈఆర్టీ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ కరిక్యులమ్ స్టడీస్ విభాగం టీచింగ్‌లో నాణ్యతను పరిశోధించడంలో భాగంగా సైన్సు టీచింగ్‌లో నాలెడ్జి, బోధనాపరమైన కంటెంట్‌ను సమన్వయం చేసుకోవడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తరగతి గది బోధనను పరిశీలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లోని 30 మంది టీచర్లను ఎంపిక చేసుకుంది. అందులో వచ్చిన ఫలితాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ మేరకు.. ► టీచర్లలో ఎక్కువమందికి టీచింగ్ మెథడ్స్‌పై మంచి అవగాహన ఉంది. బోధన విధానం, సబ్జెక్టుఅంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం పరచుకుని బోధించడంలో వారు విఫలమవుతున్నారు. ► పాఠ్యప్రణాళికలను రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తేవడం మధ్య చాలా అంతరం ఉంది. ► టీచర్లు బోధించాలనుకున్న అంశాలకు, బోధించిన అంశాలకు మధ్య చాలా తేడా ఉంటోంది. చాలామంది టీచర్లు తాము బోధించిన అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని భావించి అంతటితో సరిపెడుతున్నారు. (అమ్మాయిల ఐఐఠీవి.. ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు) ► బోధన సమయంలో విద్యార్థులు బోధన కాన్సెప్టులను ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారన్న అంశాలను టీచర్లు పట్టించుకోవడం లేదు. ► తరగతి గదుల్లో టీచర్లు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. యాక్టివిటీ ఆధారిత విద్యావిధానం అమలవుతున్నప్పటికీ ఆ కాన్సెప్టును టీచర్లు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనుసరించే మార్గం కూడా అలాంటిదే అన్న భావనతో మూసపద్ధతిలో వెళుతున్నారు. విద్యార్థులకు సరిపోయే విధంగానే తాము బోధిస్తున్నామని భావిస్తున్నారు తప్ప వారికి ఏమేరకు అవగాహన అవుతోందో గమనించడం లేదు. ► అన్ని స్కూళ్లలోను ఆంగ్లమాధ్యమ బోధనతో భాషా సమస్య ఏర్పడి విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇంటరాక్షన్ (పరస్పర సందేహ నివృత్తి)లో అంతరం బాగా పెరిగింది. ► టీచర్లు చాలా నైపుణ్యం కలవారే అయినా క్షేత్రస్థాయిలో ఒకింత గందరగోళం వల్ల విద్యార్థులకు, వారికి మధ్య అనుసంధానం ఏర్పడక వారు చెప్పదల్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించలేకపోతున్నారు. ► దీనిపై సవాళ్లను ఎదుర్కొంటున్న టీచర్లు.. విద్యార్థుల్లో అనాసక్తి, వనరులలేమి, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, ఫలితాలకోసం అధికారుల నుంచి ఒత్తిడి వంటి కారణాలను చెబుతున్నారు. (APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..) ఏపీలో సమర్థంగా డీఈడీ అమలు ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ/డీఈఎల్ఈడీ)ని సమర్థంగా అమలు చేస్తున్నారని ఎన్సీఈఆర్టీ తన నివేదికలో పేర్కొంది. డీఈడీ ఫస్టియర్, సెకండియర్‌లో వేర్వేరుగా వివిధ కోర్సులను ఎన్సీటీఈ ప్రవేశపెట్టగా ఏపీ దాన్ని మరింత పటిష్టం చేసి అమలు చేయిస్తోంది. పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో మార్పులుచేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని జోడించింది. స్కూల్ కల్చర్, లీడర్షిప్ వంటి అంశాలను పొందుపరిచింది. ఎలిమెంటరీ స్థాయిలో కూడా బోధన విధానాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మాతృభాష బోధన, చైల్డ్‌హుడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ పేపర్లను ప్రవేశపెట్టారని ఎన్సీఈఆర్టీ వివరించింది. -
సెల్ ఫోన్ సిగ్నల్ కోసం టీచర్ల తంటాలు
-
ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ!
లండన్: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. -
మమ్మల్ని ఆదుకోండి
ఏలూరు (మెట్రో): ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినా.. సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తానేటి వనితలను కలిసి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మాట్లాడుతూ రవీంద్రభారతి వంటి యాజమాన్యాలు జనవరి నెల నుంచి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదన్నారు. మిగతా యాజమాన్యాలు మార్చి, ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నారని, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి సగం జీతం మాత్రమే ఇస్తున్నారన్నారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజానికి సేవ చేస్తున్న సుమారు 5 లక్షల ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులవల్ల సిబ్బందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంత్రులను కోరారు. దీనిపై మంత్రి రంగనాథరాజు స్పందిస్తూ.. యాజమాన్యాలు ఈ సమయంలో సిబ్బందిని ఆదుకోవాలన్నారు. తమ విద్యా సంస్థల్లో సిబ్బందికి మే జీతాలు ఇచ్చామని.. మిగతా యాజమాన్యాలు కూడా స్పందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరాల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్ , పట్టణ జనరల్ సెక్రటరీ దాసు, ఇతర ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు. -
బడిపంతుళ్ల బతుకుపోరు!
కరోనా మహమ్మారితో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. పొట్ట కూటి కోసం కొందరు కులవృత్తి చేస్తుంటే.. మరికొందరు అప్పడాలు తయారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. – ఎలేటి శైలేందర్‌రెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జగిత్యాల అప్పడాలే ఆసరాగా.. అప్పడాలు చేస్తున్న వీరంతా జగిత్యాలలోని ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయినులు. వీరంతా కలసి అప్పడాల వ్యాపారం మొదలు పెట్టారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తాము, తమ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు ఇలా అప్పడాల వ్యాపారం మొదలుపెట్టినట్లు ప్రైవేట్ టీచర్ శ్వేత తెలిపారు. ఎంబీఏ చదివి కార్పెంటర్‌గా.. జగిత్యాల జిల్లా కేం ద్రం శివారు అనంతారం గ్రామానికి చెందిన భరత్ ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్. ఎంబీఏ వరకు చదివిన ఆయన పదోతరగతి వరకు సోషల్ సబ్జెక్టు బోధిస్తారు. లాక్‌డౌన్‌తో బడులు మూత పడటంతో తనకు తెలిసిన కార్పెంటర్ పనిని నమ్ముకున్నాడు. ఫర్నిచర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టైలరింగ్ చేస్తూ.. బీఈడీ చదివిన మంజుల జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు మూత పడటంతో కుటుంబానికి బాసటగా నిలిచేందుకు టైలరింగ్ పనులు చేస్తుంది. -
స్కూళ్లు తెరుచుకోక.. వేతనాలు రాక
సింగరేణి(కొత్తగూడెం): కరోనా ప్రభావంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 223 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 7వేలమందికి పైగా ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ సగటున రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలుంటాయి. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడినప్పటికీ..ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. మూడు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఫీజులు నిలిచిపోయాయని, అవి రావాల్సి ఉందని, తిరిగి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాకనే వేతనాలిస్తామని పలు యాజమాన్యాలు దాటవేస్తున్నట్లు సమాచారం. పాఠశాలల పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టతా లేదు. ప్రస్తుత పరిస్థితిలో సీనియారిటీని కూడా లెక్కలోకి తీసుకోకుండా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్ని యాజమాన్యాలు జూనియర్ ఉపాధ్యాయులను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. కేవలం కొందరిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకుంటారని ప్రైవేట్ టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతోనే.. కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలు కావడంతో మార్చి నుంచి అన్నీ బంద్ అయ్యాయి. జీతాలు ఆగిపోయి..చాలామంది ఇబ్బంది పడుతున్నాం. తిరిగి స్కూళ్లు తెరిస్తేనే..ప్రైవేట్ టీచర్లకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.– భాగ్యరాజ్, ప్రైవేటు స్కూల్ టీచర్,కొత్తగూడెం ఇంకా స్పష్టత లేదు.. అరకొర వేతనాలతో పనిచేసిన వారికి ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియట్లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. – షేక్ అస్లాం, ప్రైవేట్ స్కూల్ టీచర్,కొత్తగూడెం -
అసెంబ్లీ ముట్టడి..టీచర్ల అరెస్ట్
-
పిల్లల్లో నైతికత పెంపొందించే బాధ్యత గురువులదే
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): చిన్నారుల్లో నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలలోని నీతి, నైతికతలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని ఆయన సూచించారు. శ్రీ పావని సేవా సమితి రూపొందించిన మహాభారతం, రామాయణం, భగవద్గీత పుస్తకాలను శనివారం రాజ్‌భవన్ దర్బార్ హాలులో గవర్నర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత సారాన్ని నేర్పించే భగవద్గీత భారతదేశంలోనేగాక ఇతర దేశాల విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లోనూ చేర్చినట్టు తెలిపారు. మహాభారతంలో కర్ణుడి పాత్రపై ‘అభిసప్తా కర్ణ’ అనే పేరుతో ఒడియాలో తాను ఒక పుస్తకం రాశానని తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతం, భగవద్గీత మొదలైన ఇతిహాస పుస్తకాలను తీసుకురావడంలో పావని సేవా సమితి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వీటి రూపకల్పన జరిగిందని, ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఉచితంగా వీటిని పంపిణీ చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో చల్లా సాంబిరెడ్డి, పావని సేవా సమితి బాధ్యులు ఆచార్య ముత్యాల నాయుడు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థులకు వెత
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు మన బడి.. నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో జిల్లాలో 1059 పాఠశాలలను గుర్తించారు. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 220 కోట్లు కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో బోధనకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంతో ప్రైవేటు పాఠశాలల నుంచి 14,247 మంది íవిద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఫలితంగా బోధకుల సంఖ్య కొంత వెంటాడుతోంది. దీంతో విద్యార్థులకు సక్రమంగా బోధన అందడంలేదు. ఈ కారణంగా విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. అలాగే కోర్టు కేసుల నేపథ్యంలో డీఎస్సీ –2018 పోస్టుల ఖాళీల భర్తీకి ఆలస్యమైంది. వీటితోపాటు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు నెలవారి పదోన్నతులతో జిల్లాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానంలో విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలను పంపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. జిల్లాలో 476 పోస్టులకు ప్రతిపాదనలు.. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో 476 విద్య వలంటీర్లు అవసరం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి కూడా పంపింది. ఈ పోస్టులో 259 సెకండరీ గ్రేడ్ టీచర్స్, 217 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు వస్తే ఈ పోస్టుల్లో వలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ఇలా ఎంపికైన విద్యా వలంటీర్లను ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకు లేదా డీఎస్సీ– 2018 నియామకాలు చేపట్టే వరకు కొనసాగించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే... 2018 డీఎస్సీ నియామకాలు ఆలస్యం గత ప్రభుత్వ నిర్వాకమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచేందుకు డీఎస్సీని ప్రకటించి కొద్ది రోజులు గడిపింది. తరువాత ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ప్రలోభపెట్టేందుకు డీఎస్సీ–2018ని నిర్వహించింది. ఇందులో పలు లోపాల కారణంగా పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు 2018 డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో పరీక్షను విడతల వారిగా నిర్వహించారు. ఇందులో నార్మలైజేషన్ ప్రకటించకుండా ఫలితాలను విడుదల చేయడంతో అభ్యర్థుల మధ్య విభేదాలకు దారితీసింది. ఫలితంగా నియామకాలు ఆగిపోవడంతో ప్రస్తుతం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. కనీసం విద్యావలంటీర్ల నియామకాలైనా చేపడితో కొంత ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదికలనుపంపాం... జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించాం. విద్యార్థులకు బోధన సమస్యలను తీర్చేందుకు త్వరలో వలంటీర్ల నియామకాలను చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అర్హత గలవారిని గుర్తించి విద్యావలంటీర్లను నియమిస్తాం. – పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
కంటి వెలుగు ప్రసాదించాలని..
విశాఖ, చింతపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దసరా సెలవులు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసినప్పటికీ మారుమూల గ్రామాల పిల్లలు నేటికీ పాఠశాలలకు చేరుకోలేదు. దీంతో ఉపాధ్యాయులు వారి కోసం గ్రామాలకు వెళుతున్నారు. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు.. గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చింతపల్లి మండలం బలపం పాఠశాల పరిధిలోని గ్రామాల విద్యార్థులు శనివారం కూడా హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు వారికోసం అన్వేషణ ప్రారంభించారు. ఆదివారం ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువూరు వాగును దాటి గ్రామాల్లోకి వెళ్లి పిల్లలను గుర్తించి నేత్ర పరీక్షలు నిర్వహించారు. -
స్వర్గప్రాయం
పక్షులు లేని చెట్టుకు నిండా పూలున్నా ఆ పరిమళంలోంచి ప్రాణనాదం ఎలా వీస్తుంది? పిల్లలు నరకం చూపించనిచోట ఈ భువనవనం జీవన రుతువుల్ని ఎలా విరగ కాస్తుంది? మాధవ్ శింగరాజు పిల్లలు నరకం చూపిస్తారు. పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో తల్లులకు బాగా తెలుసు. తల్లులకు పిల్లలు నరకం చూపిస్తున్న సమయంలో.. తండ్రులు అక్కడ ఆఫీసులో పైవారు తమకు చూపించే నరకం చూడ్డానికో, లేక వాళ్లే తమ కిందివారికి నరకం చూపించడానికో వెళ్లి ఉంటారు కనుక.. ఇంట్లో పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో తండ్రులకు తెలిసే అవకాశాలు తక్కువ. పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో స్కూల్ టీచర్లకు కూడా బాగా తెలిసే ఉంటుంది. పిల్లల్ని కాసేపలా పార్కులో తిప్పుకొచ్చే ఆయాలను, ఎక్స్కర్షన్లకు ‘ట్రిప్పు’కొచ్చే టీమ్ లీడర్లను చెప్పమన్నా చెప్తారు.. పిల్లలు చూపించే నరకం ఏ విధంగా స్వర్గప్రాప్తిని కలిగిస్తుందో! తల ప్రాణాన్ని తోకకి బట్వాడా చెయ్యడంలో నిపుణులు పిల్లలు. పిల్లలు నిజానికి ఎవరికీ నరకం చూపించరు. తమ స్వర్గంలో తాము ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే పెద్దలకు నరకం అవుతుంటుంది. అరవడం, గెంతడం, గోడకు గుద్దుకోవడం, సైకిలెక్కి పడడం, తలుపు సందులో వేళ్లు పడేసుకోవడం, పెట్టింది తినకుండా మూతి తిప్పేసుకోవడం, తింటూ బట్టలకు పూసుకోవడం, కుక్కపిల్ల నోట్లో చేతులు పెట్టడం, ఆ చేతుల్తోనే మళ్లీ ఏదో ఒకటి తినడం.. వాళ్లిలా చూపెట్టే నరకాలతో పోలిస్తే, మహాభాగవతంలోని ఇరవై ఎనిమిది నరకాలేం లెక్కలోకి వస్తాయి! క్రైస్తవంలో కూడా గొప్ప నరకాలున్నాయి. ముస్లింలలో ఏడు రకాల నరకాలు ఉంటాయి. ఈ భాగవత క్రైస్తవ ముస్లిం నరకాలన్నీ కూడా పిల్లలు చూపెట్టే నరకం ముందు పిల్ల రేణువులే. అయితే నరకం అనేది పెద్దమాట. పిల్లల విషయంలో వాడకూడదు. పిల్లల్నేమైనా అంటే ఆరుద్రగారి ఆత్మ అసలే ఒప్పుకోదు. ‘పిల్లలు, దేవుడు చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే’ అని రాశారు ఆరుద్ర ‘లేత మనసులు’ సినిమా కోసం! కరుణామయుడైన దేవుడే ఒక్కో పాపానికి ఒక్కో నరకం సిద్ధం చేసి ఉంచినప్పుడు.. పాపం, కరుణామయులైన పిల్లలు పెద్దవాళ్లకు నరకం చూపించడాన్ని ఎలా తప్పు పట్టగలం? అదీగాక.. పెద్దలకు విధించాలని వాళ్లేమీ రెడీమేడ్ నరకాల పీనల్ కోడ్ బుక్కేమీ పట్టుకుని కూర్చోరు. వాళ్ల అల్లరిని మనమూ ఎంజాయ్ చేస్తే హెవెన్. ఎంజాయ్ చెయ్యలేకపోతే హెల్. అయితే.. యాపిల్టన్ సిటీ (యు.ఎస్.)లోని ‘టామ్స్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ అలా అనుకోలేకపోయింది. రోజూ స్కూల్ అయ్యాక, అక్కడికి వస్తుండే మిడిల్‌స్కూల్ పిల్లలు (9–14 ఏళ్ల వాళ్లు) ఇటీవల ఆ రెస్టారెంట్ ఓనర్‌కు, సిబ్బందికి, కస్టమర్లకు నరకం చూపించారు. ఖరీదైన గాజు బల్లలపై గీతలు గీశారు. ఒకరి మీద ఒకరు తినే పదార్థాలను విసురుకున్నారు. అక్కడికి వచ్చిన కొందరు పెద్దవాళ్లకు కూడా అవి తగిలాయి. కనీసం వారికి ‘సారీ’ కూడా చెప్పలేదు. పైపెచ్చు మూతికి చెయ్యి అడ్డుపెట్టుకుని దొంగచాటుగా నవ్వుకున్నారు. వెయిటర్లను అవి తెమ్మనీ ఇవి తెమ్మనీ, అవి తెమ్మంటే ఇవి తెచ్చారేమిటనీ వేధించారు. ఈ చేష్టలన్నిటికీ విసిగిపోయిన రెస్టారెంట్ యాజమాన్యం... ఇక మీదట బడి పిల్లలకు ‘నో ఎంట్రీ’ అని బోర్డు పెట్టేసింది. పక్కన అమ్మానాన్న ఉంటేనే అనుమతి. ‘మరి బుద్ధిమంతులైన పిల్లలకి కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది కదా ఎలా’ అంటే.. ‘పిల్లల్లో బుద్ధిమంతులేమిటండీ..’ అన్నట్లు వింతగా, విస్మయంగా చూసి, అదే బోర్డు కింద.. ‘బుద్ధిమంతులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని కూడా రాయించింది. గతంలో కూడా యు.ఎస్., బ్రిటన్‌లలోని కొన్ని రెస్టారెంట్స్‌లు ఇలాగే పిల్లల ఎంట్రీని నిషేధించాయి. మరికొన్ని రెస్టారెంట్లు పిల్లలకు సపరేట్ సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లోంచి పిల్లలు కనిపించేలా గాజు గ్లాస్ అడ్డుగా పెట్టి పెద్దల సెక్షన్‌ను ఏర్పాటు చేశాయి. పిల్లల డబడబలు కనిపిస్తుంటాయి కానీ వినిపించవు. ఏవైనా పగలగొడితే ఆ బిల్లు ఎలాగూ పెద్దల ప్లేట్ల దగ్గరికి వచ్చేస్తుంది. పిల్లలు చూపించే నరకాన్ని ఇలా పెద్దపెద్ద రెస్టారెంట్లే భరించలేక వైరాగ్యంతో కైవల్య మార్గాలను వెతుక్కుంటుంటే ఇంట్లో తల్లి ఒక్కరి వల్ల అంత నరకాన్ని పట్టడం సాధ్యమయ్యే పనేనా! అదీ ఒక రోజు నరకం, ఒక గంట నరకం, ఒక నిముషం నరకం కాదు. నిరంతరం. లక్కీగా (ఈ మాటను తప్పుగా అర్థం చేసుకోకండి) ఉద్యోగాలు చేసే కొందరు తల్లులకు తల్లులుంటారు. ఉద్యోగాలు చేయడం లక్కీ కాదు. పిల్లల్ని చూసుకునే తల్లులుండడం లక్కీ. అన్‌లక్కీగా (ఈ మాటను కూడా) కొందరు తల్లులకు యాభై ఎనిమిదేళ్లు వచ్చాక ‘మీరిక అలసిపోవచ్చు’ అని ఆఫీస్‌లు చివరి శాలరీ స్లిప్పు, కొంచెం డబ్బు ఇచ్చి వీడ్కోలు పలికాక.. ఫ్రెష్‌గా, ఫస్ట్ అపాయింట్‌మెంట్‌గా ఇంట్లో ముద్దు మురిపాలు ఒలికే మనవల కేరెంటింగ్ ఉద్యోగం ఉంటుంది. రోజంతా వాళ్లతో ఐపీఎల్ ఆడి, వాళ్లతో పాడుతా తియ్యగా అని పాడి, వద్దంటున్నా తినిపించి, వద్దన్నవి తింటే నోట్లో వేలుపెట్టి తీసి.. సాయంత్రం పేరెంట్స్ ఉద్యోగాల నుంచి తిరిగొచ్చి ఆ పిల్లల్ని చేతుల్లోకి తీసుకునే వరకు స్వర్గతుల్యమైన నరకప్రాయమే.అయినా.. పెద్దవాళ్లం అవుతూ, ఒంట్లో ఓపిక నశిస్తూ ఉండడం వల్ల ఇలా పిల్లల అల్లరిని భరించలేకపోతాం కానీ.. ఊరికే కాలింగ్ బెల్లు కొడుతూ ఉండే కాళ్లందని వేళ్లు లేకుండా మనింట్లో మనం ఎంతసేపు ఉండగలం? డైనింగ్ టేబుల్ మీదకు ఎక్కి కూర్చుని, రెండు చేతుల్తో ప్లేటుపై తపతపమని కొడుతూ తినే పిల్లలు కనిపించని రెస్టారెంట్‌కు మళ్లీ మళ్లీ ఎలా వెళ్లగలం? -
163 మంది టీచర్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు బాధ్యతారాహిత్యంగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది. అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం. -
పండగ పూటా పస్తులే!
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): పండుగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన తమను పస్తులుంచడం సరికాదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పెదబయలులో సోమవారం భోగిపండుగ చేసుకోవాల్సిన ఉపాధ్యాయులు రోడ్డుపై ధర్నా చేశారు. గిరిజన గిరిజన ఉద్యోగ సంఘాల ఆద్వర్యంలో పెదబయలు అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఖాళీ కంచాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారపు సంతలో అన్ని దుకాణాల్లో తిరిగి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని, హెచ్ఎంల అధికారాలను ఏటీడబ్లు్యవోలకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 132ను రద్దు చేయాలని, మూడు నెలల నుంచి జీతాలు లేక పండగ పూట పస్తులుండాల్సి వస్తోందని అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రి వారం రోజుల్లో జీవో రద్దు చేయించి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి, ఇచ్చిన మాట మరిచారని విమర్శించారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను చులకనగా చూస్తోన్న ప్రభుత్వానికి సిగ్గురావాలనే తాము భిక్షాటన చేపట్టామని అన్నారు. ఆందోళనలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు సైమాన్, మర్రిచెట్టు అప్పారావు, విశ్వనాథం, గిరిజన ఉపాధ్యాయులు, సాగేని లక్ష్మీనారాయణ, నిక్కుల అనంతరావు, గల్లేలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో.. ముంచంగిపుట్టు(పెదబయలు): ముంచంగిపుట్టులో సోమవారం ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఖాళీ కంచాలకు ఆకులు వేసుకుని తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అందరూ ఆనందంగా పండగ జరుపుకొనే వేళ ప్రభుత్వం తమను అవస్థలు పెడుతోందని మండిపడ్డారు. 132 జీవోను రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. గిరిజన సంక్షేమ సంఘం మండల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షకార్యదర్శులు భగత్రాం, నాగేశ్వరరావు, రామకృష్ణ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రుల పోరుకు కసరత్తు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కన్పిస్తుంది. శాసనమండలి ఎన్నికల కసరత్తు ప్రారంభమవడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఉపాధ్యాయ నియోజకవరాల్గ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు. రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇందుకోసం ఆశావహుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జోరు ఊపందుకుంది. ఆయా సంఘాల నాయకులు ముందు నుంచే హడావుడి మొదలుపెట్టాయి. ఇటీవల ఓ సంఘం నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించగా, తాజాగా ఓ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మళ్లీ నమోదు తప్పనిసరి సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగే ఈ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు సహా ఓట్ల లెక్కింపు భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఓటరుగా నమోదైతే సరిపోతుంది. కానీ మండలి ఎన్నికల్లో మాత్ర ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 1నాటికి ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ రోజుతో ముగిసే ఆరేళ్ల కాలంలో కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాలలో బోధన అనుభవం కలిగి ఉండాలి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు, ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను ఒక నియోజకవర్గంగా గుర్తించారు. ఈ మూడు జిల్లాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఓటు హక్కుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఎన్నికల సంఘం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా.. సాధారణ ఓటు హక్కు కోసం బూత్ స్థాయి అధికారులను సంప్రదిస్తుంటాం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటు నమోదు పత్రాలు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో తీసుకోవాలి. ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానానికి వేర్వేరుగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మాత్రం కేవలం ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాత్రమే ఓటు నమోదుకు అర్హతగా పరిగణిస్తారు. నవంబర్ 1, 2018నాటికి డిగ్రీ పూర్తి పట్టా పొంది మూడేళ్లు నిండిన వారై ఉండాలి. సదరు అభ్యర్థులు 2015 నవంబర్ నాటికి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఫారం 19ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు గెజిటెడ్ అధికారి ద్రువీకరించిన డిగ్రీ నకలుతోపాటు ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జత చేయాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే 2012 నవంబర్ ఒకటి నుంచి 2018 నవంబర్ 1 నాటికి ఆరేళ్లలో మూడేళ్లు హైస్కూల్, ఆ పైతరగతులకు బోధించే వారై ఉండాలి. ఆరేళ్లలో వరుసగా కాకపోయినా మూడేళ్ల పాటు బోధన అనుభవం ఉన్నట్లు ఆయా విద్యాసంస్థ నుంచి ద్రువపత్రంతో పాటు ఏదైనా గుర్తింపు పొందిన ద్రువపత్రం ఫారం–19కి జత చేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకు వ్యక్తిగతంగా గానీ కుటుంబ సభ్యులైనా, పాఠశాలలు, కళాశాలల హెడ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ప్రభుత్వ గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. -
వంట ‘మాస్టర్లు’
తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి): మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులే వంట మాస్టార్లుగా అవతారం ఎత్తి విద్యార్థులకు వంట చేసి వడ్డించారు. ఈ ఏజెన్సీ నిర్వాహకులు బుధవారం కూడా సమ్మెలో ఉంటారు. మండలంలోని ముకుందవరం యూపీ పాఠశాలలోని ఉపాధ్యాయులు స్వయంగా వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. మండలంలోని కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలను ఉపాధ్యాయులు, ఇతరులతో వండించారు. మండలంలోని వెంకటాపురం, సుభద్రంపేట యూపీ పాఠశాలలు, రంగంపేట, దొడ్డిగుంట ఉన్నత పాఠశాలల్లోమాత్రం వంటలు చేయలేదు. మండలంలోని ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులు కాకినాడ ధర్నాకు వెళుతున్నామని, మంగళ, బుధవారాల్లో వంటలు చేయమంటూ చెప్పడంతో ఉపాధ్యాయులు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేశారు. సమ్మెలో పాల్గొనని కొంత మంది మాత్రం మధ్యాహ్న భోజనం తయారుచేశారు. కొన్నిచోట్ల పాఠశాల సమీపంలో ఉన్న విద్యార్థుల ఇళ్లల్లో భోజనాలు వండించారు. నాలుగు పాఠశాలల్లో మాత్రం ముందుగానే భోజనాలు తెచ్చుకోవాలని చెప్పడంతో విద్యార్థులు క్యారేజీలు వెంట తెచ్చుకున్నారు. -
ఎంతెంతదూరం..చాలా చాలా దూరం..
‘ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం..’అని గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పాట పాడుకుంటూ పిల్లలు ఆడుకునే వారు. ఓ చిన్నారి కళ్లు కనిపించకుండా గంతలు కడితే.. మరొకరు ఒక వస్తువును ఆ చుట్టు పక్కల దాచేస్తారు.ఆ తర్వాత కళ్లకు కట్టిన గంతలు విప్పుతారు.ఆ చిన్నారి ఈ పాట పాడుకుంటూ దాచినవస్తువును కనుక్కోవడానికి వెతుక్కుంటూ బయలు దేరుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితీ అలాగే మారింది. అది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి. ►చంద్రబాబు హయాంలో భారంగా మారిన పాఠశాల విద్య ►రేషనలైజేషన్ పేరిట పెద్ద సంఖ్యలో పాఠశాలల మూత ►కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న సర్కారు ►వేలకు వేలు ఫీజులు భరించలేక చదువులకు దూరమవుతున్న పేద పిల్లలు ►నవరత్నాల్లోని ‘అమ్మ ఒడి’తో పిల్లల చదువులకు వైఎస్ జగన్ భరోసా ►పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు తమ చిన్నారుల చదువుకు ఆసరాగా ఉంటుందంటున్న తల్లిదండ్రులు రాష్ట్రంలో పాఠశాల విద్య సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారికి దూరం అవుతోంది. పిల్లలకు చదువు చెప్పించాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రేషనలైజేషన్ పేరిట మూసేయడమేగాక.. సరపడా టీచర్లను నియమించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వానంగా మార్చింది. ఇక్కడ చదువుతున్న పేద పిల్లలకు సరైన విద్య అందించకుండా వారిని ప్రయివేటు వైపు వెళ్లేలా చేస్తోంది. క్రమేణా ప్రభుత్వ పాఠశాలలను మూత వేయించి వాటి స్థానే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసేలా కార్యక్రమాలు చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట స్కూళ్ల మూత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట దాదాపు ఐదు వేల పాఠశాలలను మూత వేయించింది. ఇందులో అత్యధికం ప్రాథమిక పాఠశాలలే. ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన. ఒకటో తరగతిలో చేరే బాలబాలికలకు వయసు ఐదేళ్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వారికి సమీపంలోనే స్కూలు ఉండాలి. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మూడు కిలోమీటర్లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం పేరిట ఒక్కటిగా చేసి.. మిగతా స్కూళ్లను మూసేయించారు. ఆయా స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో వాటిని మూయించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూత పడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలకు పాఠశాలలు దూరమయ్యాయి. దగ్గరలోని ప్రయివేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపడం మాన్పిస్తున్నారు. అంతే కాకుండా దాదాపు ఐదు వేలకు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేశారు. అక్కడి 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులు దూరంలోని ఇతర స్కూళ్లకు వెళ్లలేక.. దగ్గరలోని ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. 98 హైస్కూళ్లనూ రేషనలైజేషన్ పేరిట యూపీ స్కూళ్లుగా డీగ్రేడ్ చేశారు. తమ పిల్లలను చదువులు మాన్పించడం సరికాదని భావించే తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రయివేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఆయా స్కూళ్లలో ఫీజుల భారం మోయలేక, అప్పులు కూడా దొరకని వారి పిల్లలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. ఒలింపిక్స్ నిర్వహిస్తారట.. పాఠశాలల్లో క్రీడా వసతులను మెరుగు పరచడం లేదు గానీ, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని సీఎం ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. తిరుపతిలో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో.. రాష్ట్రానికి చెందిన వారు నోబుల్ బహుమతి తెచ్కుకుంటే రూ.100 కోట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా, ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు వీలుగా ల్యాబ్‌లు ఇతర సౌకర్యాలు కల్పించకుండా, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా చంద్రబాబు ఇలా ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఆ ధైర్యంతోనే పిల్లల్ని చదివిస్తున్నా.. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు కొండేటి సాయి 5వ తరగతి, చిన్నోడు కొండేటి నవీన్ 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త నాలుగేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. నేను కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న నాకు.. పిల్లల చదువులు పెనుభారంగా మారాయి. వారిని కూడా చదువు మాన్పించి పనులకు పంపితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. కానీ అమ్మ ఒడి పథకం ద్వారా జగనన్న ఆర్థికంగా చేయూతనిస్తే పిల్లల చదువులు ముందుకు సాగుతాయి. ఆ ఆశతోనే వారి చదువులను కొనసాగిస్తున్నాను. లేదంటే ఇప్పటికి మాన్పించేదాన్ని. జగనన్నపై నమ్మకం ఉంది మా గ్రామంలో ఎక్కువ మంది ఉపాధి కూలీలే. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నా. జగనన్న ప్రకటించిన నవరత్నాలలోని అమ్మ ఒడి పథకం గురించి విన్నాక చాలా ధైర్యం వచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా పిల్లల చదువులను మాన్పించలేదు. అమ్మ ఒడి పథకంతో నా చిన్నారుల చదువులకు భరోసా దొరికిందని ధైర్యంగా వారిని బడికి పంపుతున్నాను. అన్న రాగానే వారి చదువుల బాధ్యతను తీసుకుంటాడన్న నమ్మకం ఉంది. నేను మళ్లీ చదువుకుంటాను.. మాది చాలా పేద కుటుంబం కావడంతో మా అమ్మానాన్న నన్ను చదివించలేకపోయారు. ఏడో తరగతిలోనే బడి మానేసి.. వారికి చేదోడువాదోడుగా ఉంటున్నా. నాన్న అప్పల్రాజు రోజూ ఇటుకల పనులకు, అమ్మ అప్పమ్మ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నాకు చదువుకుందామన్న కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఆ కోరికను తీర్చుకోనివ్వడం లేదు. జగనన్న ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి పథకంతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా పిల్లల్ని చదివించుకోవచ్చని చెబుతున్నారు. పిల్లల్ని బడికి పంపితే ఏటా రూ.15,000 ఇస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. జగనన్న త్వరగా ముఖ్యమంత్రి అయ్యి.. నాలాంటి పేద పిల్లలను చదివించాలని కోరుకుంటున్నా. మాలాంటి పేదలకు ‘అమ్మ ఒడి’ వరం మేం నిరుపేద గిరిజనులం.. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. మాకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె డిప్పల అప్పలమ్మను పేదరికం కారణంగా బడికి పంపలేకపోయాము. పనుల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటోంది. పారమ్మ ఒకటో తరగతి, అనిత రెండో తరగతి చదువుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలులోని ‘అమ్మ ఒడి’ పథకం అమలైతే.. మా పెద్ద బిడ్డను కూడా బడికి పంపిస్తాం. పిల్లలను బడికి పంపితే ఆర్థిక సాయం అందిస్తానని జగన్ చెబుతున్నారు. అదే జరిగితే కూలికెళితే తప్ప పూట గడవని మాలాంటి నిరుపేదలందరూ ఎంతో సంతోషిస్తారు. కార్పొరేట్లో ఫీజుల మోత కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే కాకుండా మండల స్థాయి స్కూళ్లలోనూ ఫీజులు భారంగా మారాయి. ఎల్కేజీ, యూకేజీ నుంచే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు ఇలా పలు నగరాల్లోని కార్పొరేట్ స్కూళ్లు 30 వేల నుంచి లక్ష వరకు ఫీజుల కింద విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫాంలు.. తదితరాల పేరిట వేలకొద్దీ డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15 వేలు, యూనిఫాంకు రూ.7 వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2 వేలు దండుకుంటున్నాయి. ఈ ఫీజులు భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ►టీడీపీ అధికారంలోకొస్తే పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం ►కాలేజీ విద్యార్థులకు ఐపాడ్లు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేస్తాం. ►ప్రతి కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ స్కూలు, మూడు కిలో మీటర్లకు ఒక యూపీ స్కూలు, ఐదు కిలోమీటర్లకో హైస్కూలు పెడతతాం (వాస్తవానికి ఉన్న స్కూళ్లను మూయించారు). ►ఏటా విద్యాసంవత్సరానికిమూడు నెలల ముందే డీఎస్సీనినిర్వహించి టీచర్లను నియమిస్తాం. ఇదీ బాబు ప్రభుత్వ నిర్వాకం ►పాఠశాలల్లో సదుపాయాల కల్పన పేరిట నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం విద్యాభివృద్ధి నిధులను తెలుగుదేశం నేతలకు పప్పు బెల్లాల కింద పంచిపెట్టింది. ►స్కూళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు, హెచ్ఎంల నుంచి పైస్థాయి అధికారులకు ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు. ►నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్ నిధులతో పాటు ఇటు బడ్జెట్ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టిన ప్రభుత్వం.. తాజాగా హైబ్రిడ్యాన్యుటీ అంటూ కొత్త కమీషన్ల వ్యవహారానికి తెరలేపింది. రూ.4,800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట కాంట్రాక్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ►ప్రభుత్వ స్కూళ్లను ప్రయివేటు, స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలకు అప్పగించి వారికి కోట్లాది రూపాయలు దోచిపెడుతోంది. ఈషా ఫౌండేషన్, రిషివేలీ, ప్రథమ్ తదితర సంస్థలకూ పాఠశాలలను అప్పగించింది. ఎవరి మార్గంలో బోధన చేయాలో అర్థంకాక టీచర్లు, ఏది నేర్చుకోవాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ►మధ్యాహ్న భోజన పథకంలో వివిధ సరకుల కొనుగోలు కాంట్రాక్టులను కేంద్రీకృతం చేసి.. కందిపప్పు తదితరాల కొనుగోలులో కోట్ల కొద్దీ ని«ధులను పక్కదారి పట్టిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో తెలుగుదేశం నేతలు కాంట్రాక్టర్లుగా మారి పిల్లల కడుపుకొడుతున్నారు. ►పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీలో అక్రమాలకు అంతే లేదు. ఆప్కో మాటున దుస్తుల పంపిణీలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ►వాస్తవ పరిస్థితికి భిన్నంగా గణాంకాలు చూపిస్తూ విద్యాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ అబద్ధాలు చెబుతోంది. ►విద్యాభివృద్ధిలో ముందంజలో ఉన్నామని చెప్పి.. రాష్ట్రానికి రావాల్సిన సర్వశిక్ష అభియాన్‌తో పాటు ఇతర నిధులకూ కేంద్రం కోతపెట్టడానికి కారణమయ్యారు. కొత్త చట్టాలతో మరింత ప్రమాదం కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్స్ పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి.. వాటి ఆస్తులను ప్రయివేటుకు అప్పగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్ పేరిట మూతవేసిన స్కూళ్లలో 200 పాఠశాలలను బ్రిడ్జి ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. మీ పిల్లల చదువుకు నాదీ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల పాలనలోప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే కాకుండాపాఠశాల విద్యను భారంగా మార్చింది. ఆ భారం మోయలేక చదువులు మాన్పిస్తున్న నిరుపేద, మధ్యతరగతికుటుంబీకులు ఎంతో మంది నాకు కష్టాలు చెప్పుకున్నారు. అందుకే ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపితే చాలు. ఏ బడికి అయినా ఫరవాలేదు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను.‘అమ్మ ఒడి’ పథకం కింద ఆ తల్లి ఖాతాలో జమ చేస్తాం.పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లిదండ్రులూ భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి రూ.15,000 – వైఎస్ జగన్ -
నాన్ టీచింగ్ డిప్యుటేషన్లు రద్దయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల డిప్యుటేషన్లపై విద్యాశాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో బోధనేతర పనుల్లో కొనసాగుతున్న టీచర్లు ఈసా రైనా తమ డిప్యుటేషన్లు రద్దవుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో డిప్యుటేషన్ల రద్దుపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలపై విద్యాశాఖ అధికారులే నీళ్లు చల్లుతూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలకు చెందిన వందల మంది టీచర్లు ఇంకా డిçప్యుటేషన్లపై కొనసాగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడిగితే ఉన్నతాధికారులు ఓ మెమో జారీ చేయడం, తర్వాత మిన్న కుండిపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆయా టీచర్లు పనిచేస్తున్న వందల పాఠశాలల్లో విద్యాబోధన లేకుండాపోతోంది. మండలాల్లోని రిసోర్సు సెంటర్లు, జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠశాల విద్యా డైరెక్టరేట్(డీఎస్ఈ)లోనూ టీచర్లు డిప్యుటేషన్లపై కొనసాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న టీచర్లపైనే డీఈవో ఆధారపడి పనిచేస్తుండటంతో ఆయా టీచర్ల ఇష్టారాజ్యం సాగుతుంది. టీచర్ల కొరత ఉన్నప్పటికీ..: రాష్ట్రంలో 25 వేల వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఇప్పటికే టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. 2,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయి. 5,000 వరకు ఉన్న ఉన్నత పాఠశాలల్లోనూ సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పాఠశాల విద్యా డైరెక్టర్‌గానీ, ప్రభుత్వంగానీ ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడుతోంది. అయినా పాఠశాలల్లో పని చేయాల్సిన టీచర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులే జిల్లా, రాష్ట్ర, మండల కార్యాలయాల్లో కొన్నింటిలో అధికారికంగా, మరికొన్నిం టిలో అనధికారికంగా కొనసాగిస్తుండటం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనేతర పనుల్లో టీచర్లకు ఇచ్చిన డిప్యుటేషన్లపై విద్యాశాఖ పదుల సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేసినా.. అవేవీ అమలుకు నోచుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన టీచర్లు సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చేయడంతో ఇప్పుడైనా అక్రమ, అనధికార, అధికారిక డిప్యుటేషన్లను రద్దు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లే 90% మంది డిప్యుటేషన్లలో కొనసాగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటున్నాయని, బోధించేవారు లేకుండాపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని బంధం
చిత్తూరు ,తవణంపల్లె: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలసిమెలిసి ఉండేవారు..ఇద్దరికీ రెండేళ్ల వయసు తేడా. ఒకే గ్రామానికి చెందిన వీరు కలిసి ఒకే చోట చదువుకున్నారు. ఇద్దరూ ఉపాధ్యాయులుగానే పనిచేశారు. వీరిద్దరూ ఒకేరోజు(ఆదివారం) అనారోగ్యంతో కన్నుమూశారు. మృత్యువు దగ్గరా వీరి బంధం వీడిపోలేదని స్థానికులు కంటతడి పెట్టారు. తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన కేశవులురెడ్డి, హేమసుందరరెడ్డి చిన్న నాటి నుంచి కలిసి ఉండేవారు. ఇద్దరూ వెంగంపల్లె పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అరగొండ హైస్కూల్లో కూడా ఎస్ఎస్ఎల్సీ వరకూ చదువుకొన్నారు. తర్వాత ఇద్దరూ బీఈడీ చదివారు. 1984లో వెంగంపల్లె ప్రాథమిక పాఠశాలలో కేశవులు రెడ్డి పనిచేశారు. తొడతర ప్రాథమిక పాఠశాలలో హేమసుందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పద్యోగంలో చేరారు. పలు పాఠశాలలో పనిచేసిన కేశవులు రెడ్డి 2009లో అరగొండ హైస్కూల్లో రిటైరయ్యారు. తర్వాత రెండేళ్లకు హేమసుందరరెడ్డి కూడా ఉద్యోగ విరమణ చేశారు. హేమసుందర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేశవులు రెడ్డికి భార్య..ఒక కుమార్తె సంధ్యారాణి. ఈమె బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. వరుసకు అన్నదమ్ములైన కేశవులు..హేమసుందర్ రిటైరయ్యాక ఒకే గ్రామంలో ఉంటున్నారు. వీరిద్దరికీ అనారోగ్యపరమైన సమస్యలున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం కేశవులు..రాత్రి హేమసుందరరెడ్డి కన్నుమూశారు. మరణం దగ్గర వీరి బంధం చెదిరిపోలేదు. ఒకేరోజు చనిపోయారంటూ గ్రామస్తులంతా చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్ వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇరువురు
జ్ఞానులు, కాపరులు.. ఆ ఇరువురు కలిస్తేనే మానవాళికి భవిష్యత్తు. అందుకు వర్తమానం దోహదపడాలి. ఐక్యమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలతో మనమంతా మెలగాలి. బాల్యంలో వుండగా క్రిస్మస్ సీజన్లో మిషనరీ బడుల్లో పిల్లలకు టీచర్లు చిన్న చిన్న ఆటలు, పాటల పోటీలు పెట్టి పెన్సిళ్లు, స్కేళ్ల వంటి బహుమతులు ఇస్తూ, వాటితో పాటు చక్కటి ఖరీదైన విదేశాల్లో తయారైన గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చేవారు. అవి అప్పటికే అంతకు ముందు విదేశీయులు వాడినవి (సెకండ్ హ్యాండ్) కనుక, వాటి మీద బాల్ పెన్ తో చేసిన వాళ్ల సంతకాలు కూడా ఉండేవి. అయితే, విషయం అది కాదు. వాటి మీద వుండే బొమ్మలు! గుడ్డల్లో చుట్టిన చిన్న బాబు జీసస్ వద్ద, ఖరీదయిన దుస్తులతో ముగ్గురు పెద్ద పెద్ద గెడ్డం వున్నవాళ్ల చేతుల్లో ఏవో చిన్న చిన్న పెట్టెలతో నిలబడి వుంటే, గొంగళ్లు కప్పుకుని పేదగా కనిపించే మరో ముగ్గురు చిన్నచిన్న గొర్రె పిల్లలు పట్టుకుని అయన వద్ద మోకరించి వుండేవారు. టీచర్లు సండే స్కూల్లో బైబిల్ కథలు చెబుతూ ‘తూర్పు దేశపు జ్ఞానులు బాల యేసుకు బంగారము, భోళము, సాంబ్రాణి తెచ్చి కానుకలుగా ఇచ్చారు. పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న కాపరులు తమ వద్ద వున్న చిన్న చిన్న గొర్రె పిల్లల్ని తెచ్చి జీసస్కు కానుకగా ఇచ్చారు’ అని చెప్పేవారు.కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ మీద ఆకాశంలో కనిపిస్తున్న ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూస్తూ ఒంటెల మీద జ్ఞానులు ముగ్గురు వస్తూ ఉన్న బొమ్మలు ఉండేవి. చలి రాత్రిలో ఒక దేవదూత వీరికి కనిపించి బెత్లేహేములో ఒక పశువుల శాలలో ఆయన పుట్టాడు అని వారికీ చెప్పడంతో వీరు ఇరువురు ఆయన్ని చూడటానికి బయలుదేరతారు. టీచర్లు ఇది క«థలుగా చెప్పడమే కాకుండా, దీన్ని ‘డ్రామా’ గా చేయించేవారు. పిల్ల జ్ఞానుల కోసం తగరం కాయితాలు అట్టలకు అంటించి తయారు చేసిన కిరీటాలు, గొర్రెల కాపరులకు దూది గెడ్డాలు పెట్టి రంగు రంగు గుడ్డల్ని అంగీలుగా మార్చి అప్పట్లో దీన్ని మాతో చేయించేవారు. జ్ఞానులకు ఖగోళ శాస్త్రం తెలుసు అనీ, దేవదూత చెప్పిన వార్త విని వాళ్లు తమ గ్రంథాల్లో వెతికి, అప్పటికే తాము కనిపెడుతున్న లోక విమోచకుడు అయిన ‘మెస్సయ్య’ భూమి మీద పుట్టాడని నిర్ధారణకు వచ్చి, ఆయన రాజు కనుక ఆయన వద్దకు వారు కానుకలు తీసుకుని వస్తారు. అయితే, గొర్రెల కాపరుల వద్దకు కూడా ఆ దేవదూత వచ్చింది, అదే వార్త వాళ్లకు చెప్పింది. వాళ్లు ఆ పొలాల్లో తమ వద్ద ఉన్నదే పట్టుకుని ఆయన వద్దకు బయలుదేరి వచ్చారు. మరి, అమెరికాలోనో, లేదా యూరోపియన్ దేశాల్లోనో తయారైన ఆ ఖరీదైన రంగురంగుల గ్రీటింగ్ కార్డుల మీద బొమ్మల్లో వున్నది ఏ దేశస్తులు? బొమ్మలు చూసి విషయం తెలుసుకునే దశ దాటి చాలా దూరం వచ్చాక, అప్పుడు తెలియని కొత్త విషయాలు కొన్ని ఆనాటి గ్రీటింగ్ కార్డుల మీద ఉన్నట్టుగా ఇప్పుడు మనసుకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది.. వాళ్ళు అమెరికన్లు, యూరోపియన్లు కాదు. మరి ఎవరు? ఆసియన్లు. మన మాదిరిగా గోధుమ వర్ణ మేని ఛాయ వున్నవారు. రెండవది.. అంతకంటే ముఖ్యమైనది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న తాత్వికతకు ప్రాతిపదిక అయిన ఐక్యమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం. దేశాధినేతలకు సైతం మార్గదర్శనం చేసే జ్ఞానులు, పొలాల్లో గొర్రెలను మేపుకునే పశువుల కాపరులు ఇద్దరికీ ఒకే వార్త ఒకే దూత ద్వారా తెలిసింది. వారిరువురు ఒకే స్థలానికి ఒకే పని మీద వచ్చారు, ఇరువురికీ ఒకేసారి లోనికి ప్రవేశం దొరికింది. ఒకే స్థలంలో వారు తాము వచ్చిన కార్యం పూర్తి చేసుకున్నారు. ఇరువురూ అక్కణ్నుంచి కలిసి బయటకు వెళ్లారు. కానీ ఆ ‘కలయిక’ ఇప్పటికీ ఇంకా పూర్తి రూపం సంతరించుకోలేదు. అందుకే దీని తదుపరి రూపం 1789 ఫ్రెంచ్ విప్లవంగా, పైన చెప్పుకున్న మూడు అంశాల ప్రాతిపదికగా మరోసారి మన ముందుకు వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి 2018 ఏళ్లు అయింది. అప్పటి నుంచి ఆ రూపాంతర ప్రక్రియ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దశలో కొనసాగుతూ వుంది. ఆ గ్రీటింగ్ కార్డ్ తయారైంది, అమెరికాలో అయినా యూరప్‌లో అయినా, దాని మీది వున్న ‘ఆసియా బొమ్మ’ను మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ మార్చలేరు. ఎందుకంటే అందులో గతం వుంది. జీసస్ జన్మించాడు. భవిష్యత్తు వుంది. ఆ ‘ఇరువురు’ ఒక్కటి కావాలి. అందుకు వర్తమానం దోహదపడాలి. – జాన్సన్ చోరగుడి, సామాజిక విశ్లేషకులు -
మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్కారు షాక్
విశాఖ సిటీ : ఎక్కడా లేని విధంగా మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి(పీఎఫ్) సొమ్ముపై వచ్చే వడ్డీలో 2 శాతం సొమ్మును నిర్వహణ చార్జీల పేరుతో వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్ ఉపాధ్యాయ సం ఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపా«ధ్యాయులు, ఉద్యోగుల జీతాలను గతంలో లోకల్ ఫండ్(ఎల్ఎఫ్) ఆడిట్ ద్వారా చెల్లించేవారు. వారి పీఎఫ్ ఖాతాలను మున్సిపాలిటీలే నిర్వహించేవి. అనంతరం 010 పద్దు కింద జీతాల చెల్లింపులను ప్రారంభించడంతో పీఎఫ్ అకౌంట్ల నిర్వహణ బాధ్యతలను మున్సిపాల్టీలు నిలిపివేశాయి. దీంతో పీఎఫ్ ఖాతాలు ట్రెజరీ పరిధిలోకి వెళ్లాయి. తమను పీఎఫ్ ఖాతాల నుంచి జీపీఎఫ్ ఖాతాలకు మార్చాలంటూ మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖాధికారులను కోరాయి. దీంతో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(డీఎంఏ) 2017 జూలై 10న మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అమలు చేయాలని సూచించారు. కానీ, ఇప్పటికీ పట్టించుకోలేదు. నిర్వహణ చార్జీల పేరుతో.. తమను జీపీఎఫ్ పరిధిలో చేర్చాలంటూ మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు పదేపదే కోరడంతో ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఏడాది క్రితం డీఎంఏ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టి, మున్సిపల్ ఉపాధ్యాయులకు ట్రెజరీ పరిధిలో పీఎఫ్ అమలు కోసం కమిటీ వేశారు. ఇందులో మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒక్కరు కూడా లేరు. ఈ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు ఉపాధ్యాయుల పాలిట గొడ్డలిపెట్టులా మారాయి. మున్సిపల్ టీచర్ల పీఎఫ్ ఖాతాలను ప్రస్తుతం ట్రెజరీలు నిర్వహిసున్నారు. ఇందుకుగాను ప్రతి ఖాతా నిర్వహణకు 2 శాతం మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయనున్నట్లు విధివిధానాల్లో పేర్కొన్నారు. పీఎఫ్ సొమ్ముపై వడ్డీలో ఈ 2 శాతం కోత విధించనున్నట్లు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతా నిర్వహణకు ఈ విధంగా మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేయడం లేదు. రాష్ట్రంలో 14 వేల మంది టీచర్లుండగా, వీరిలో 4 వేల మంది సీపీఎఫ్ పరిధిలోకి వస్తున్నారు. మిగిలిన 10 వేల మంది మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లోంచి 2 శాతం కోత విధించనున్నారు. మున్సిపల్ టీచర్లంటే చిన్నచూపా? ఒకే డీఎస్సీలో ఎంపికైనా ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పోలిస్తే మున్సిపల్ పాఠశాలల టీచర్లు పలు హక్కుల్ని కోల్పోతున్నారు. మున్సిపల్ టీచర్లకు ఎల్టీసీ, జీపీఎఫ్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించలేదు. జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్ఎంలకు ఉన్న డీడీవో అధికారాలు మున్సిపల్ స్కూళ్ల టీచర్లకు లేవు. 2009లో అప్పటి ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో మున్సిపల్ టీచర్ల పరిస్థితిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్ టీచర్లకు డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యాలు ఉన్నాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో మున్సిపల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించడంతోపాటు డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ, డీడీవో అధికారాలు, జీపీఎఫ్ సౌకర్యాలు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం పునరాలోచించాలి ‘‘పీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీ నుంచి 2 శాతం కోత విధించాలన్న సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో పుంగనూరు మున్సిపల్ ఉపాధ్యాయులకు మాత్రమే జీపీఎఫ్ సౌకర్యం కల్పించారు. ఈ విధానాన్ని అన్నిచోట్లా అమలు చేయాలి’’ – బి.హేన, ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం జీపీఎఫ్ విధానం కావాలి ‘‘మున్సిపల్ టీచర్లకు పీఎఫ్ కాకుండా జీపీఎఫ్ విధానాన్ని అమలు చేయాలి. 2 శాతం నిర్వ హణ చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలి. మున్సిపల్ టీచర్ల భవిష్య నిధి విధివిధానాల్ని రూపొందించేందుకు నియ మించిన కమిటీలో మున్సిపల్ ఉపాధ్యాయులకు స్థానం కల్పించకపోవడం దారుణం’’ – శ్రీనివాసరావు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ -
సీపీఎస్ రద్దుకు పోరుబాట
ఆదిలాబాద్‌టౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 వేల మంది వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 8 వేల మంది వరకు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారు. శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయుల సామూహిక సెలవుతో పాఠశాలల్లో బోధన, ప్రభుత్వ కార్యాయాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. కలెక్టరేట్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొన్నేళ్లుగా ఉద్యమం.. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారి భద్రతకు విఘాతంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన బాట పట్టారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. వీరికి ఉద్యోగ జేఏసీ, ఉపాధ్యాయ జాక్టో, టీటీజేఏసీ వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. 2004 నుంచి సీపీఎస్ అమలులోకి.. 2004 నవంబర్ 1 నుంచి సీపీఎస్ విధానం అమలులోకి వచ్చింది. 2004 సంవత్సరం తర్వాత నియామకం అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తించదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. సీపీఎస్ ఉద్యోగి సర్వీస్‌లో చేరగానే ఒక పర్మినెంట్ అకౌంట్ నంబర్ కేటాయిస్తారు. ఉద్యోగి జీతం నుంచి నెలనెల 10 శాతం కోత విధించి అంతే మొత్తాన్ని ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా సమకూర్చి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. ఇలా జమ అయిన మొత్తం సొమ్ములో 60 శాతం ఉద్యోగ విరమణ తర్వాత చెల్లిస్తారు. మిగతా 40 శాతం ఎల్ఐసీ వంటి బీమా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల్లో మ్యాచువల్ ఫండ్లలో జమచేసి వాటిపై వచ్చే వడ్డీ పెన్షన్ రూపంలో ఉద్యోగికి 71 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత 40 శాతం డబ్బును ఉద్యోగికి అందజేసి పెన్షన్ నిలిపివేస్తారు. 70 ఏళ్లలోపు మృతిచెందితే అతడిపై ఆధారపడిన భార్యకు ఎలాంటి పెన్షన్ ఇవ్వరు. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల లాభనష్టాలకు అనుగుణంగా ఉద్యోగి విరమణ అనంతరం వాటిని పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. ఉద్యోగ విరమణ తర్వాత భరోసా లేని సీపీఎస్ విధానం రద్దు చేయాలని పేర్కొంటున్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఉద్యోగ విరమణ తర్వాత అరకొర పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. గ్రాట్యూటీగా ఇచ్చే మొత్తం డబ్బులు ఇవ్వకుండా 40 శాతం ఆపుకోవడం సరికాదు. అసంబద్ధంగా ఉన్న సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి. – నల్ల రత్నాకర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రద్దు చేయాలి సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసిన వారికి పెన్షన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నాం. – దాముక కములాకర్, సీపీఎస్‌టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు -
సీపీఎస్‌పై మూకుమ్మడి ముట్టడి నేడే
రాయవరం (మండపేట): సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. మూకుమ్మడి సెలవుకు దరఖాస్తు చేసి శనివారం జిల్లా కేంద్రమైన కాకినాడకు చలో కలెక్టరేట్ పిలుపుతో తమ సత్తాను చాటుకొనేందుకు పిడికిలి బిగిస్తున్నారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బాసటగా పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా సెలవుకు దరఖాస్తు చేసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు కలెక్టరేట్‌కు తరలిరావడానికి అడుగులేస్తుండడంతో జిల్లాలో వందలాది పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అలా మూతపడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ముందుగానే టెలి యాప్‌లో నమోదుఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ రోజు సెలవు పెడితే అదే రోజు ఏపీ టెలి యాప్‌లో సెలవుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి భిన్నంగా ఉపాధ్యాయులంతా ఒకటి రెండు రోజులు ముందుగానే ఏపీ టెలి యాప్‌లో సెప్టెంబరు 1న సెలవుకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విద్యాశాఖఉపాధ్యాయులు మాస్ లీవ్ పెట్టేందుకు సిద్ధపడిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు మూత పడకుండా చూసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం పాఠశాలలు యథావిధిగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాకాధికారులకు ఆదేశాలు వచ్చాయి. మాస్ లీవ్ పెట్టిన పాఠశాలల ఉపాధ్యాయుల సెలవు చీటీలతో పాటుగా, ఆయా పాఠశాలల తాళాలు కూడా ఎంఆర్సీ కార్యాలయంలో అప్పగించాల్సిందిగా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది ఉపాధ్యాయులు, మరో ఐదువేల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయులకు మద్దతుగా మరో ఆరు వేల మంది ఉపాధ్యాయులు మాస్ లీవ్ పెట్టినట్లు తెలిసింది. వీరు కాకుండా సీపీఎస్, ఓపీఎస్‌కు చెందిన ఉద్యోగులు కూడా మాస్ లీవ్ పెట్టినట్లు సమాచారం. అన్ని సంఘాల మద్దతు... సీపీఎస్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరు కానున్నట్లు సమాచారం. ఫ్యాప్టొ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చలో కలెక్టరేట్ జిల్లా జేఏసీ కూడా మద్దతు పలకడం విశేషం. వివిధ కార్మిక సంఘాలు కూడా చలో కలెక్టరేట్‌కు మద్దతునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చలో కలెక్టరేట్‌కు దాదాపుగా 30 వేల మంది హాజరవుతారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనా వేస్తున్నాయి. అడ్డుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు శనివారం చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకే కలెక్టరేట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చాం. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డీవీ రాఘవులు, ఫ్యాప్టొ చైర్మన్. -
‘తర్ల్’ పర్యవేక్షణ పోస్టులకు పైరవీలు
రోజూ ఉదయమే స్కూల్‌కు వెళ్లాలి. బయోమెట్రిక్ హాజరు వేయాలి. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఇదంతా ఎందుకనుకుంటున్న టీచర్లకు ‘తర్ల్’ అవకాశం అందివచ్చింది. అకడమిక్ కోఆర్డినేటర్ల (సీఏసీ) పోస్టులకు పైరవీ పెరిగింది. ఏకంగా మంత్రుల సిఫారసుతో పోస్టులు పట్టేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరమంతా అలా గడిపేందుకు సిద్ధమయ్యారు. విద్యాశాఖ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తుండడంతో బోధన కుంటుపడనుంది. అనంతపురం ఎడ్యుకేషన్: టీచింగ్ అట్ రైట్ లెవల్ (తర్ల్) కార్యక్రమ పర్యవేక్షణ క్లస్టర్ అకడమిక్ కోఆర్డినేటర్ల(సీఏసీ) నియామకం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు.. అధికార పార్టీ నేతల సిఫారసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టడంతో బోధనపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదునుగా కొందరు మండల విద్యాశాఖ అధికారులూ చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా మిగులు టీచర్లును, 4 నుంచి 5 మంది టీచర్లున్న స్కూళ్ల నుంచి ఒకరిని సీఏసీలుగా నియమంచాలనే నిబంధనలు బుట్టదాఖలయ్యాయి. ఉద్దేశం ఇదీ... ప్రాథమిక స్థాయిలో చదువు సామర్థ్యాలు పెంపులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 3,173 ప్రాథమిక పాఠశాలల్లోని ‘తర్ల్’ కార్యక్రమం అమలు చేయనున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు భాషతో పాటు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన టీచర్లను సీఏసీలుగా నియమించి వారికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వీరు మండలస్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అనంతరం ఎంపిక చేసిన స్కూళ్లలో ‘తర్ల్’ కార్యక్రమం అమలును సీఏసీలు రోజూ రెండు స్కూళ్లకు వెళ్లి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించాల్సి ఉంటుంది. సరఫ్లస్ టీచర్లను పట్టించుకోకుండా... సర్ఫ్లస్ (మిగులు) టీచర్లను సీఏసీలుగా నియమించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సర్ఫ్లస్ లేకున్నట్లయితే 4–5 మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఒకరిని తీసుకోవచ్చు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. టీచర్లు కూడా చక్రం తిప్పారు. దీంతో ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న స్కూళ్లలో ఒకరిని బయటకు తీసి సీఏసీగా నియమించారు. దీంతో తమపై భారం పెరుగుతుందని మిగతా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆయా స్కూళ్లలో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీనికితోడు కొందరు ఎంఈఓలసు టీచర్ల అవసరాన్ని ఆసరగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ విద్యార్థుల గురించి ఆలోచించకుండా సీఏసీల నియామకాలు చేపట్టారని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వలంటీర్ల విషయాన్ని పట్టించుకోని ప్రభుత్వం సీఏసీలుగా తీసుకున్న టీచర్ల స్థానాల్లో వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 220 మంది వలంటీర్లు అవసరం అని ఇక్కడి అధికారులు నివేదిక పంపారు. ఇప్పటిదాకా అనుమతులు రాలేదు. ఈ క్రమంలో సీఏసీలుగా నియామకమైన వారి స్కూళ్లలో బోధన కుంటుపడుతుందని టీచర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఏసీ నియామకాల్లో కొన్ని... ♦ గుత్తి మండలం తురకపల్లి, కొత్తపల్లి స్కూళ్లలో సర్ఫ్లస్ టీచర్లున్నారు. వారిని కాకుండా ఇద్దరు టీచర్లున్న ఎంగిలిబండ, అబ్బేదొడ్డి, గుత్తి 8వ వార్డు స్కూళ్ల నుంచి ఒక్కో టీచరును నియమించారు. ♦ పామిడి మండలం జి.కొట్టాలు ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులున్నారు. ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒకర్ని సీఏసీగా నియమించారు. ♦ కనగానపల్లి మండలంలో సీఏసీల నియామకంలో మంత్రి పరిటాల సునీత బంధువులు, స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. ఫలితంగా అప్పటికే ముగ్గురు టీచర్లను ఎంపిక చేసి జాబితాను జిల్లా విద్యాశాఖకు పంపిన మండల అధికారులు... తెల్లవారే సరికే ఈజాబితాను మార్చడం విశేషం. రాత్రి జాబితాలో ఇద్దరు పేర్లను మార్పు చేసి ఉదయం కొత్త జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ♦ ఆత్మకూరు మండలం వడ్డుపల్లి ప్రాథమిక పాఠశాలలోనూ 50 మంది విద్యార్థులుండగా... ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒక టీచరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోలేని పరిస్థితి. పాఠాలు చెప్పడానికి ఆరోగ్యం సహకరించలేదు. ఆయనకు కచ్చితంగా ఒకరు తోడుండాల్సిందే. అయితే ఈ స్కూల్ నుంచి కూడా ఉన్న మరో టీచరును సీఏసీగా నియమించారు. గ్రామస్తులు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ♦ బుక్కరాయసముద్రం మండలంలో ముగ్గురి టీచర్లను జాబితాలో కనబరిచారు. అయితే ఉత్తర్వులు మాత్రం నలుగురు టీచర్లకు ఇచ్చారు. ఇదేమి లెక్కో అధికారులకే తెలియాలి. ♦ గార్లదిన్నె మండలం పెనకచెర్ల ఎస్సీ కాలనీ మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి ఒక టీచరును సీఏసీగా నియమించారు. మోడల్ స్కూల్ నుంచి టీచర్లను బయటకు తీసుకురాకూడదనే నిబంధన ఉంది. ఇదే విషయమై సదరు స్కూల్ హెచ్ఎం ఎంఈఓతో గొడవకు దిగినట్లు తెలిసింది. టీచరును రిలీవ్ చేసేందుకు హెచ్ఎం ససేమిరా అంటున్నారు. ♦ శింగనమల మండలం ఆనందరావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ముగ్గురు ఎస్జీటీలుండగా..1నుంచి 5 తరగతుల విద్యార్థులు 71 మంది ఉన్నారు. వీరిలో ఒకరిని సీఏసీగా నియమించారు. ‘సర్ఫ్లస్’నే నియమించాలి సర్ఫ్లస్ టీచర్లనే నియమించుకోవాలని ఎంఈఓలకు స్పష్టంగా చెప్పాం. సర్ఫ్లస్ టీచర్లు లేకపోతే నలుగురి నుంచి ఐదు మంది టీచర్లు ఉన్న స్కూళ్ల నుంచి ఒకరిని తీసుకోవాలనే నిబంధన ఉంది. కొందరు ఎంఈఓలు ఇద్దరున్న స్కూళ్ల నుంచి ఒకరిని తీసుకున్నట్లు నా దృష్టికి కూడా వ చ్చింది. అలాంటి వారిని మార్చాలని ఎంఈఓలకు ఆదేశించా. – జనార్దనాచార్యులు, డీఈఓ -
టీచర్ల సర్దుబాటు లీలలు!
అనంతపురం ఎడ్యుకేషన్: సబ్జెక్టు టీచర్లు లేని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా పదోతరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సర్దుబాటు’కు పూనుకుంది. అయితే విద్యాశాఖ అధికారులు పైరవీలకు పెద్దపీట వేస్తూ సర్దుబాటుకు కొత్తభాష్యం చెబుతున్నారు. విద్యార్థుల అవసరాలు కాకుండా టీచర్ల సౌలభ్యం కోసం సర్దుబాటు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ♦ రొళ్ల మండలం రత్నగిరి జెడ్పీహెచ్ఎస్లో 6–10 తరగతుల విద్యార్థులు 300 మంది ఉన్నారు. తెలుగు పండిట్ టీచర్లు ఇద్దరు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని ధర్మవరం మండలం గొట్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. గొట్లూరు స్కూల్లో 200 మంది విద్యార్థులున్నారు. ఇక్కడే ఇదివరకే ఒక టీచరు కూడా పని చేస్తున్నారు. అయినా మరో టీచరును సర్దుబాటు చేశారు. ♦ గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఫిజికల్ సైన్స్ టీచరును ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. నిబంధనల ప్రకారం మండల పరిధిలో సరఫ్లస్ (మిగులు) టీచర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ లేకపోతే పొరుగు మండలాలు, అక్కడా లేకపోతే పొరుగు డివిజన్ నుంచి తీసుకోవచ్చు. అయితే ముదిగుబ్బ మండలంలో ఓ యూపీ స్కూల్లో పీఎస్ టీచరు సరఫ్లస్గా ఉన్నారు. ఆ టీచరును కాదని ఎక్కడో గుడిబండ మండలం నుంచి తీసుకురావడం విశేషం. టీచర్ల సర్దుబాటులో జరుగుతున్న పైరవీలకు ఈ ఉదంతాలు నిదర్శనం. నిబంధనలకు నీళ్లు.. జిల్లాలో టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూనుకుంది. ఈ ప్రక్రియ జూన్ 30లోగా పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు నేటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘అయిన వారికి ఆకులో కానివారికి కంచంలో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు : ఉపాధ్యాయుల రేషియో మేరకు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ టీచర్లు ఉండి ఎక్కువ విద్యార్థులుండే పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న చోటే జీతాలు తీసుకుంటూ మరోచోట పని చేయాల్సి ఉంటుంది. సర్దుబాటు ఆయా మండలాల పరిధిలోనే మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోలేదు. విద్యార్థుల కోసం కాకుండా ఉపాధ్యాయుల సౌలభ్యం కోసమే చాలామందిని డెప్యూటేషన్‌పై నియమించారు. అయితే చాలామంది టీచర్లు పైరవీలు చేశారు. అవసరమైన చోటుకు కాకుండా...వారికి అనుకూలమైన ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకున్నారు. విద్యాశాఖ సిబ్బంది అడ్డుగోలుగా సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ చేయించి కొందరు టీచర్లు తమకు అనుకూలమైన చోటుకు వెళ్లగా, ఇదే అదనుగా కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆమ్యామ్యాలకు తెర తీశారు. అనుకూలమైన వారితో డబ్బు ఒప్పందం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిలీవ్ ఉత్తర్వులు పంపుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని డీఈఓ బ్లాగులో పెట్టే విద్యాశాఖ అధికారులు ఇంత భారీ ఎత్తున జరుగుతున్న సర్దుబాటు వివరాలను మాత్రం బ్లాగులో పెట్టకపోవడం విశేషం. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. విద్యార్థుల సంక్షేమం పట్టని టీచర్లు చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. తాము నివాసాలు ఉంటున్న చోటుకు ఎంత దగ్గరికి వద్దామనే ఆలోచన తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిత్యం గురించి ఆలోచించడం లేదు. ఇలాంటి వారికి విద్యాశాఖ సిబ్బంది సపోర్ట్ చేస్తుండడం బాధాకరం. ఎంతసేపూ జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపం, బస్సుల సదుపాయం అనుకూలంగా ఉన్నాయా...లేదా అనే టీచర్లు ఆలోచిస్తున్నారు. కొన్ని స్కూళ్లకు అవసరం లేకపోయినా కేవలం వారికి అనుకూలంగా ఉంటుందనే కారణంతో డీఈఓపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయించి మరీ ఆ స్కూళ్లలో చేరారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా తప్పుపడుతున్నారు. ♦ డీఈఓ పూల్‌లో హిందీ టీచర్లు ఉన్నారు. అవసరం ఉన్న చోట్ల వీరిని వినియోగించుకోవచ్చు. వారిని కాదని ఎక్కడో దూరంగా ఉన్న ఎస్జీటీ స్థాయి టీచరును అనంతపురం సమీపంలోకి సర్దుబాటు చేశారు. ♦ తాడిపత్రి ప్రభుత్వ పాఠశాల నుంచి గణితం టీచరును కళ్యాణదుర్గం స్కూల్‌కు సర్దుబాటు చేశారు. అయితే తిరిగి తాడిపత్రి స్కూల్‌కు గుంతకల్లు నుంచి మరో టీచరును సర్దుబాటు చేయడం విశేషం. ♦ అమడగూరు మండలం జౌకులకొత్తపల్లి నుంచి రొళ్ల మండలం కాకి స్కూల్‌కు ఫిజికల్ సైన్స్ టీచరును సర్దుబాటు చేశారు. నవాబుపేట స్కూల్ నుంచి తిరిగి జౌకులకొత్తపల్లికి ఇంకో టీచరును సర్దుబాటు చేశారు. ♦ ఒక్క కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాలకు దాదాపు తొమ్మిదిమంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున, మరో సబ్జెక్టుకు ఏకంగా ముగ్గురు టీచర్లను నియమించారు. ♦ ఎన్పీ కుంట మండలం గౌకులపల్లి ప్రాథమిక పాఠశాలకు టీచర్ల అవసరం ఉంది. పక్కనే ఉన్న వెలిచెలిమల స్కూల్లో టీచర్లు సర్‌ఫ్లస్‌గా ఉన్నారు. ఇక్కడి నుంచి కాదని 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండెంవారి పల్లి నుంచి సర్దుబాటు చేశారు. ఆరోపణలు రావడంతో తేరుకున్న అధికారులు అవసరం లేకపోయినా వెలిచెలిమలలో సర్‌ఫ్లస్‌గా ఉన్న టీచర్లను ఎన్పీకుంట మెయిన్ స్కూల్‌కు సర్దుబాటు చేశారు. వాస్తవానికి మండెంవారిపల్లిలో యూపీ స్కూల్‌కు ఇక్కడ టీచర్లు అవసరం. కానీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. -
అయ్యో పాపం.. పిల్లలను ఉతికేశారు
దొడ్డబళ్లాపురం: పిల్లలకు మంచి చదువులు చెప్పి కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యత మరచి ప్రవర్తించారు. తన హ్యాండ్‌బ్యాగులో ఉన్న 500 రూపాయలు కనబడలేదని ఇద్దరు టీచర్లు 5వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను వరుసగా నిలబెట్టి బెత్తంతో చితకబాదిన సంఘటన మాజీ సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామి తాలూకాలో చోటుచేసుకుంది. టీచర్లు కొట్టిన దెబ్బలకు పిల్లల శరీరంపై రక్తగాయాలతోపాటు బొబ్బలు వచ్చాయి. బాధతో పిల్లలు ఏడుస్తుంటే తల్లితండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బాదామి తాలూకా రాఘాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న అశ్విని, చంద్రు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అశ్విని బ్యాగులో 500 రూపాయలు కనబడలేదని దాన్ని పిల్లలే తీశారని అనమానంతో ఆమెతో పాటు చంద్రు కలిసి బెత్తం తీసుకుని 10 మంది విద్యార్థులను నిజం చెప్పమంటూ తీవ్రంగా కొట్టారు. గ్రామస్తులపైనా మండిపాటు విషయం తెలిసి ఇదేమని ప్రశ్నిస్తే తమతో పెట్టుకోవద్దని గ్రామస్తులను బెదిరించారు. ఈ సంఘటన కవరేజీకి వెళ్లిన ఒక టీవీ చానెల్ రిపోర్టర్‌ను కూడా టీచర్లు వదల్లేదు. కాలర్ పట్టుకుని బెదిరించినట్లు సమాచారం. ఇంత జరిగినా బీఈఓ కానీ, డీడీ కానీ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. -
‘టీచర్ రూల్స్’పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీస్ నిబంధనలపై దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, ఇందుకు అనుగుణంగా గతేడాది జూన్ 23న రాష్ట్రపతి ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో సర్వీస్ నిబంధనలను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే స్టేటస్కో ఎత్తేయాలని, కేసులపై విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా.. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. రాజ్యాంగ వ్యతిరేకం: పిటిషనర్లు రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెలువడిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 1975లోని పేరా 2ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి వీరాచారి ఇతరులు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371(డి) అధికరణకు రాష్ట్రపతి ఉత్తర్వులు వ్యతిరేకమని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు వాదించారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు (మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేసే వారు) స్థానిక సంస్థల పరిధిలోకి వస్తారని, వీరిని ప్రభుత్వ టీచర్లుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20 ఏళ్ల నుంచీ ఒకే తరహా ప్రకటన: ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో పని చేసే టీచర్లు కూడా సివిల్ సర్వెంట్లేనని, వారి విధులు కూడా ప్రభుత్వ టీచర్ల తరహాలోనే ఉంటాయని, రాష్ట్రపతి జారీ చేసిన ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు పూర్తి చట్టబద్ధత ఉంటుం దని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గిరి, ఇతర న్యాయవాదులు వాదించా రు. 20 ఏళ్ల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఒకే తరహా ప్రకటన జారీ చేయడమే కాకుండా ఏకీకృత విధానా న్నే అమలు చేస్తున్నామన్నారు. స్టేటస్కో ఎత్తేయడం తోపాటు ప్రభుత్వ టీచర్ల వ్యాజ్యాలు కొట్టేయాలన్నా రు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన టీచ ర్లు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
టీచర్లకు ఎంత చేసినా టీడీపీకి ఓట్లేయరు
శెట్టూరు: ‘‘టీడీపీ హయాంలో చంద్రబాబు ఉపాధ్యాయులకు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో టీచర్ పోస్టులు మా ప్రభుత్వంలోనే వచ్చాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా టీచర్లు మాత్రం టీడీపీకి ఓట్లెయ్యరు.’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లులో మంగళవారం ఎంఈఓ శ్రీధర్ అధ్యక్షతన ఆదర్శ పాఠశాల హెచ్ఎం శెట్టి నరసింహులు పదవీ విరమణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడు రఘురామిరెడ్డి, మరో నాయకుడు నరసింహులు ప్రభుత్వం విద్యను హేతుబద్ధీకరణ పేరుతో పేద ప్రజలకు దూరం చేస్తోందన్నారు. దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఉన్నం టీచర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తోందంటున్నారు కదా.. ఎంత మంది అయ్యవార్లు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారని ప్రశ్నించారు? ఏదైనా సమస్యలు వస్తే యూనియన్లంటూ ముందుకు వస్తారన్నారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ఎన్నో లబ్ధి చేకూర్చే పథకాలను తీసుకొచ్చారని.. అయినా టీడీపీకి మాత్రం అయ్యవార్లు ఓట్లెయ్యరన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు మాని ఒక పద్ధతిగా పోరాడండంటూ తన ప్రసంగాన్ని ఆవేశంతో సాగించారు. అంతలోనే మరో ఉపాధ్యాయ సంఘం నాయకుడు వెంకటస్వామి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల పిల్లలు ఒకే పాఠశాలలో చదివితే ఇలాంటి అంతరాలు ఉండవన్నారు. -
సుద్ద ముక్కలూ కరువే!
తాడేపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి కోట్లు ఖర్చు పెడుతున్నా పాఠశాలల నిర్వహణ, కొనుగోళ్లకు 2006లో ఇచ్చే గ్రాంటులనే నేటికీ ఇస్తోంది. అవి కూడా దారి మళ్లడంతో సుద్దముక్కలు, రిజిస్టర్లు, కాగితాలు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులే తమ వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని జిల్లాల్లో 8 వేల పాఠశాలలు :కృష్ణా, గుంటూరు జిలాల్లో మొత్తం ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలకు ప్రభుత్వం గ్రాంటు నిధులు ఇస్తుంది. వాటిలో స్కూలు గ్రాంటు కింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.7వేలు ఇస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీసులు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితరవాటిని కొనడానికి వినియోగిస్తారు. పాఠశాలల నిర్వహణ కోసం రూ.10వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ నిధులతో మరుగుదొడ్ల రిపేర్లు, కుర్చీల మరమ్మతులు, నీటిపైపుల సమస్యలకు వినియోగిస్తారు. ఇదే మొత్తం 2006వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. అప్పట్లో ఉన్న ధరలకు ఆ నిధులు సరిపోయేవి. ప్రస్తుతం అవి ఏమాత్రం చాలడం లేదని హెచ్ఎంలు పేర్కొంటున్నారు. గ్రాంటును పెం చాలని హెచ్ఎంలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. గతేడాది దారి మళ్లిన గ్రాంటు నిధులు : విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి ఆగస్టు లోపు గ్రాంటు నిధులు ప్రభుత్వం ఇవ్వాలి. కానీ గతేడాది కొన్ని పాఠశాలలకు సెప్టెంబర్‌లో, మరి కొన్నింటికి అక్టోబర్‌లో ఇచ్చారు. అయితే ఆ గ్రాంటు నిధులను ఎలా వినియోగించాలో అనే దానిలో సర్వశిక్ష అభియాన్ అధికారులు తమ సొంత నిర్ణయాలతో ఎంఈవోలకు ఉత్తర్వులు జారీచేశారు. స్కూలు అవసరాలకు ఇచ్చే గ్రాంటును గ్యాస్ డబుల్ సిలిండర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాథమిక పాఠశాల వారు తమకొచ్చిన రూ.5వేలతో వాటిని కొన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారు కొనగా రూ.2వేలు మిగిలింది. దీనికితోడు స్కూలు నిర్వహణకు ఇచ్చిన గ్రాంటు నిధులు రూ.10వేలు మరుగుదొడ్ల పరిశుభ్రతలో పాల్గొనే సిబ్బందికి (స్కావెంజర్లకు) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.2,500లు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.4వేలు ఇవ్వాలి. నిర్వహణ గ్రాంటు నిధులు వారికి వేతనాలుగా ఇచ్చేశారు. హెచ్‌ఎంలదే బాధ్యత : గ్రాంటు నిధులు దారి మళ్లడంతో పాఠశాలల్లో సుద్దముక్కలు కొనాలన్నా, రిజిస్టర్లు కొనాలన్నా, ఏమైనా మరమ్మతులు చేయించాలన్నా, చీపుర్లు కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబు నుంచే పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆదర్శ, పురపాలక, ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఈ సంఘాల నుంచి స్కావెంజర్లుగా రెండు జిల్లాల్లో 4,500మంది పనిచేస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరానికి ఎనిమిది వేల పాఠశాలలకు గాను ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించారని సమాచారం. ప్రస్తుత సంవత్సరం ఇంకా నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాలల్లో స్కావెం జర్లకు, చాక్‌పీస్‌లు, రిజిస్టర్లకు ఉపాధ్యాయులు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రాంటు వ్యవహారంపై విద్యాశాఖ ఆర్జేడీ, డీఈవోలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సమన్వయ లోపం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2015 అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఈ నిధులు కేటాయించారు. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.2వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేవారికి రూ.2,500లు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి డీఆర్డీఏ శాఖ వేతనాలు ఇచ్చేవారు. ఈ విద్యా సంవత్సరం వేతనాలను డీఆర్డీఏ ఆపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్డీఏ, విద్యాశాఖ మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెబుతున్నాయి. దీంతో స్కావెంజర్లు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పాఠశాలల్లో అవసరమైన చాక్‌పీస్‌లు కొనేందుకు కూడా నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఒక్కొక్క పాఠశాలకు 3 నుంచి 5 చాక్‌పీస్ బాక్స్‌లు అవుతాయని, ఒక్కొక్క చాక్‌పీస్ బాక్స్ ఖరీదు రూ.10లు ఉంటుందని, నెలకు రూ.1500ల వరకు ఖర్చవుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీచర్ల మాటే.. ప్రాణం పోసింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆ ఉపాధ్యాయుల మాటే .. ఓ విద్యార్థికి ప్రాణం నిలబడేటట్లు చేసింది. పాఠాలు చెప్పడమే కాదు..మనస్ఫూర్తిగా తలుచుకుంటే ప్రాణాలు సైతం పోయగలరని నిరూపించారు. ఆస్పత్రిలోని వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుక్కోట్టై గంధర్వపేటలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో అరుణ్‌పాండియన్ (17) అనే విద్యార్థి ప్లస్ టూ చదువుతున్నాడు. మిన్నాత్తూరు అనే గ్రామం నుంచి రోజూ బస్సు లో వచ్చి వెళుతుంటాడు. ఈనెల 17వ తేదీన పాఠశాల ముగియగానే తోటి విద్యార్థులతో కలసి ఆడుకుని.. బస్టాండుకు చేరుకున్న అరుణ్ పాండియన్ కొద్ది నిమిషాల్లోనే స్పృహతప్పి పడిపోయాడు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర చికిత్సను అందజేసి మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి నాడి చాలా బలహీనంగా కొట్టుకుం టోంది, కొద్ది నిమిషాల్లో కోమాలోకి వెళ్లిపోతాడని చెప్పారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థి అరుణ్‌ను ఉపాధ్యాయులు మణికంఠన్, సోమ సుందరం ఈ నెల 18న చూసేందుకు వెళ్లారు. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ అమర్చి ఉండగా, కంటి గుడ్లు పైకి తేలవేసి, చలనం లేని స్థితిలో ఉన్న విద్యార్థిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు టీచర్లు విద్యార్థి చెవివద్దకు వెళ్లి ‘తంబీ కన్ ముళిచ్చిపార్, యార్ వందిరిక్కిరోం’ (తమ్ము డూ కళ్లు తెరిచి చూడు.. ఎవరొచ్చారో) అంటూ అదేపనిగా పలకరించడం ప్రారంభించారు. కదలికలేకుండా ఉండిన కనురెప్పలు కొట్టుకోవడం ప్రారంభిం చాయి, కనుగుడ్లు కదలసాగాయి. శరీరంలో చలనం మొదలైంది. ఈ మార్పును గమనించిన టీచర్లు మరింతగా రెట్టించి ‘ఉనక్కు ఒన్రుం ఇల్లై నాంగళ్ ఇరుక్కి రోం’ (నీకేమీ కాలేదు, మేమున్నాం) అని పదే పదే ధైర్యం నూరి పోయగా విద్యార్థి పూర్తిగా స్పృహలోకి వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. అరుణ్ కోలుకోవ డాన్ని చూసి పక్కనే ఉన్న వైద్యులు సంభ్రమా శ్చర్యాలకు గురికాగా, తల్లిదండ్రులు ఆనందపడి పోయారు. సినిమాల్లో మాత్రమే జరిగే ఇలాంటి దృశ్యాన్ని నేరుగా చూడగలిగామని వైద్యులు ఉపాధ్యాయులను ప్రశంసించారు. -
బడి బంద్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీల్లో విద్యా శాఖాధికారులు హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని ఏకంగా 1,870 స్కూల్లో టీచర్లు లేకుండా పోయారు. మరో 900 స్కూళ్లు టీచర్లున్నా విద్యార్థుల్లేక మూతపడ్డాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దాదాపుగా ఏ గ్రామంలోనూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు గత 15 రోజులుగా తెరుచుకోలేదు. ఈ స్కూళ్లకు బదిలీపై వచ్చిన టీచర్లే అతి తక్కువ మంది అంటే వారిలోనూ అత్యధికులు దీర్ఘకాల సెలవుపై వెళ్లడమే ఇందుకు కారణం. పిల్లలున్నా టీచర్లు లేకపోవడం, టీచర్లున్నా పిల్లల్లేకపోవడం వంటివి పక్కన పెడితే, రాష్ట్రంలో 500, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో కూడా కనీసం సబ్జక్టు టీచర్లు లేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో నాలుగింటిలో, గ్రామీణ స్కూళ్లలో పదికి ఆరింట సబ్జక్ట్ టీచర్ల కొరత ఉంది. మరెన్నో స్కూళ్లలో అరకొర టీచర్లే బండి నెట్టుకొస్తున్నారు. మా స్కూళ్లు తెరిపించండి మహాప్రభో! టీచర్ల బదిలీల తర్వాత మూతపడ్డ స్కూళ్లను తెరిపించాలంటూ కలెక్టర్లకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం దేశాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులున్నారు. టీచర్లు లేక స్కూలు మూతపడింది. దాంతో తమ పిల్లలు చదువులు లేక ఇళ్ల వద్దే ఉంటున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. తక్షణమే స్కూలును తెరిపించాలని అభ్యర్థించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్ జిల్లాల్లోనూ 180కి పైగా స్కూళ్లు టీచర్లు లేక మూతబడ్డాయి. వాటిని తెరిపించాలని స్థానికులు కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. నల్లగొండ జిల్లా డిండి, చందంపేట మండలాల్లోనైతే స్కూళ్లు తెరిపించాలంటూ విద్యార్థి సంఘాలు స్థానిక గిరిజనులతో కలిసి ఏకంగా ఆందోళనలకు దిగాయి. ప్రైవేట్ స్కూళ్లు అందుబాటులో లేని చోట్ల ఇలా సర్కారీ బళ్లు మూతపడటంతో విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. దాంతో దాదాపు 900 స్కూళ్లలో విద్యార్థులే లేని పరిస్థితి ఏర్పడింది. వీటిలో పలు స్కూళ్లలో పట్టుమని పది మంది పిల్లలు కూడా లేరు. విచిత్రమేమిటంటే నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని దోరెపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు 60కి మించలేదు! చందంపేట మండలం చిత్రియాల జెడ్పీహెచ్ఎస్లో గతేడాది 85 మంది విద్యార్థులుండగా ఈసారి 65కు తగ్గారు. ఉన్న ఒక్క టీచర్ బదిలీపై విద్యార్థులే టీచర్లుగా మారారు! ఇక 100, అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న జెడ్పీహెచ్‌ఎస్‌లు రాష్ట్రంలో 1,000కి పైనే ఉన్నాయి!! సిలబస్ కష్టాలు స్కూళ్లు మొదలయ్యాక టీచర్ల బదిలీలు చేపట్టడంతో ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంకా సిలబస్ కూడా మొదలవలేదు. ఎలాగూ బదిలీ అవుతాం కదా అనే ఉద్దేశంతో టీచర్లు పట్టించుకోలేదు. బదిలీలయ్యాక రావాల్సిన టీచర్లు చాలాచోట్ల విధుల్లో చేరలేదు. ‘సిలబస్ విషయంలో ఇబ్బందులు ఉన్నమాట నిజమేనని విద్యా శాఖ సీనియర్ అధికారి ఒకరు అంగీకరించారు. అయితే, ‘‘హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతులు పెట్టే ఆలోచన ఉంది. దసరా సెలవుల నాటికి నిర్దేశిత సిలబస్ పూర్తయ్యేలా చూడాలని జిల్లా విద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశాం’’అని ఆయన వివరించారు. -
ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల అరెస్టులు
-
నూతన ఒర'బడి'
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతూ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, క్వాలిఫైడ్ టీచర్లు తదితర అంశాలు తెలుపుతూ కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. వేలాది రూపాయల ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపేకంటే రూపాయి ఖర్చులేని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతున్న విషయంపై చైతన్యం తీసుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చేరడం వల్ల అందే సంక్షేమ పథకాలపై కూడా ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పోటీ తత్వంతో పిల్లలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా బోధనలాకాకుండా మనోల్లాసం కలిగిస్తూ.. ఒత్తిడి లేని చదువులతో పిల్లల సంపూర్ణ మానసిక వికాసానికి ప్రభుత్వ బడులు వేస్తున్న బాటలపై తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఉత్సాహాన్ని నింపిన ‘పది’ ఫలితాలు ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అధికారులు, ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహం నెలకొంది. 10/10 పాయింట్లు, వందశాతం ఉత్తీర్ణత సాధించడంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నిలిచాయి. కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు 959 ఉండగా 516 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. వీటిలో 239 ప్రభుత్వ పాఠశాలలు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో 221 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాయి. ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించారు. పట్టణాలు, పల్లెల్లో ఇంటింటా తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ బడులు, ప్రైవేట్ బడులకు మధ్య తేడాలను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. వేలాది రూపాయల మిగులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే తల్లిదండ్రులకు వేలాది రూపాయలు మిగులుతాయనే విషయంపై ప్రభుత్వ టీచర్లు సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేకపోలేదు. ప్రైవేట్ స్కూళ్లలో రూ.10 వేల నుంచి 15 వేలు, కార్పొరేట్ స్కూళ్లలోనైతే ఇదే ఫీజును రెండింతలు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికితోడు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర ఖర్చు అదనం. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే రూ.2,500 విలువ చేసే రెండు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. దాతల సహకారంతో నోట్ పుస్తకాలు కూడా ఉచితంగా అందుతుంటాయి. మధ్యాహ్నం పౌష్టికర ఆహారం పెడతారు. నిష్ణాతులైన టీచర్లతో విద్యాబోధన ఉంటుంది. క్వాలిఫైడ్ టీచర్లకు ఎక్కువ జీతం చెల్లించలేని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారితోనే సరిపెడుతుంటాయి. పాఠ్యాంశాల బోధనపై పట్టులేని వారు బట్టీ చదువులతో నెగ్గుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన శాస్త్రీయంగా ఉంటుంది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధిస్తుంటారు. దీంతో పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం వల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలవుతోంది. ఆకట్టుకుంటున్న కరపత్రాలు, ఫ్లెక్సీలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే చొరవ తీసుకుని వీటిని ముద్రించారు. తమ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు, వారి విద్యార్హతలు. పాఠశాలలోని మౌలిక వసతులు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సంక్షేమ పథకాల వివరాలను ముద్రించిన కరపత్రాలతో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మంచి స్పందన లభిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, క్వాలిఫైడ్ టీచర్లు, నాణ్యమైన బోధన తదితర వాటిపై కరపత్రాలు, ఫ్లెక్సీలు ముద్రించి చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా గొల్లపల్లి, కొట్టాలలో పర్యటించాం. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న తమ పిల్లలను అక్కడ మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పిస్తామంటూ తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఇది శుభపరిణామం. – బొలికొండ చంద్రశేఖర్ హెచ్ఎం,బి.పప్పూరు జెడ్పీహెచ్ఎస్ -
బోధన.. వేదన
నంద్యాలవిద్య: ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో అరకొర జీతాలతో ప్రైవేటు సంస్థల్లో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితిని ఆసరగా చేసుకొని యాజమాన్యాలు నానా రకాల షరతులు పెడుతూ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాయి. సెలవు పెడితే రెండురోజుల జీతం కట్ : నంద్యాల పట్టణంలోని దాదాపు 120 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4వేల మంది ఉపాధ్యాయలు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు అడ్మిషన్లు చేపట్టాలంటూ టార్గెట్లు పెడుతున్నారు. లక్ష్యాలను చేరుకోలేనివారిపై క్రమశిక్షణ చర్యలకు కూడా వెనుకాడటం లేదు. ఆదివారం, రెండో శనివారం, జాతీయ సెలవుదినాలు అంటే ఏమిటో తెలియని స్థితిలో విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు వరుసగా తరగతులు కేటాయిస్తుండటంతో 10 నుంచి 12 గంటల వరకు నిలబడి బోధించాల్సి వస్తోంది. దీంతో అనారోగ్యాలపాలవుతున్నారు. అత్యవసరమై ఒక రోజు సెలవు పెడితే రెండు రోజులు వేతనం కోత పెడుతున్నారు. అంతేకాకుండా అనివార్య పరిస్థితిలో ఆలస్యంగా వస్తే యాజమాన్యంతో చీవాట్లతోపాటు అర పూట జీతంలో కటింగ్‌లు కూడా ఉంటాయి. వేసవిలో ప్రచారం ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు తమ బాధ్యతతో పాటు వేసవి సెలవుల్లో మండుటెండలో వీధులు వీధులు, ఊరూరు తిరుగుతూ విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ప్రచారం చేయిస్తున్నారు. వీరికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలు కూడా కల్పించడంలేదు. వీరు వేసవిలో సెలవులు పొందాలంటే కనీసం ఐదుగురు విద్యార్థులను అడ్మిషన్ చేయించాలనే షరతు ప్రతి కార్పొరేట్ పాఠశాలలో పరిపాటిగా మారింది. అలాగే పాఠశాల వదిలి వెళ్లాలన్నా వేతనాలు, సర్టిఫికెట్లు యాజమాన్యం వద్ద ఉంచుకొని వేధిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సంఘం నాయకులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి అరకొర వేతనాలతో ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. టీచర్లను అన్ని రకాలుగా వినియోగించుకున్న యాజమాన్యాలు వారి హక్కులను కాలరాస్తున్నాయి. వేతనాల పెంపుపై యాజమాన్యాలు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నాయే తప్ప వారి బాగోగులను పట్టించుకున్న సందర్భం లేదు. యాజమాన్యాలు టీచర్ల సమస్యలపై స్పందించాలి. – కల్యాణి, ప్రైవేటు టీచర్ అరకొర జీతాలతో ఇబ్బందులు నిరంతరం శ్రమిస్తున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అరకొర వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టతరంగా మారింది. ఆర్జిత సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు కల్పించడంలేదు. పాఠశాల ఎదుగుదలకు, తరుగుదలకు టీచర్లే కారణమంటూ చర్యలు తీసుకోవడం దారుణం. –సురేష్, ప్రైవేటు ఉపాధ్యాయుడు -
జీతాల్లేవ్ !
మడకశిర మండలం కల్లుమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి రెన్నెళ్లుగా మార్చి, ఏప్రిల్ జీతాలు నేటికీ అందలేదు. సీఎఫ్ఎంఎస్ విధానంలో ఈ స్కూల్ హెచ్ఎం ఆదినారాయణరెడ్డి డీడీఓగా ఉన్నారు. ఈయనేమో ఏకంగా మూడుసార్లు స్టాఫ్ అందరి హెచ్ఆర్ వివరాలు ఆన్లైన్లో పొందు పరిచారు. కానీ ఇప్పటిదాకా వారికి జీతాలు మాత్రం అందలేదు. ట్రెజరీ కార్యాలయంలో విచారిస్తే సర్వర్ స్లోగా ఉందంటూ సమాధానం చెబుతున్నారు. జీతాల విషయమై స్టాఫ్ హెచ్ఎంతో గొడవ పడుతున్నారు. జీతాలు రాకపోయే సరికి నెలానెలా కట్టాల్సిన వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: ఖజానా శాఖలో నూతన విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. మొన్నటి దాకా ప్రతినెలా ఒకటో తేదీ టంచనుగా జీతాలు అందుతుండగా రెన్నెళ్లుగా ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 34,900 మంది ఉండగా, టీచర్లు 16,300 మంది దాకా ఉన్నారు. జీతాల చెల్లింపులో సాంకేతికను ప్రవేశపెట్టి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘సమగ్ర ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ’ సీఎఫ్ఎంఎస్ను తీసుకొచ్చింది. దీనిపై డ్రాయింగ్ అధికారులకు (డీడీఓ) సరైన అవగాహన లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేదికగా రాజధానిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సీఎఫ్ఎంఎస్లోకి మార్చాల్సి ఉంది. ఈ మార్పులు చేసేందుకు కొత్త సర్వర్ సరిగా పని చేయడం లేదు. వివరాలు మార్పుచేసి బిల్లులు పెట్టాలంటే సమయం చాలా పడుతుందని డీడీఓలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ ఒక్కటే కాదు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అయితే ఎక్కువమంది ఉద్యోగులున్న విద్యాశాఖలో ఈ గందరగోళం మరింత ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త విధానంపై అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే సమస్యల పరిష్కారానికి రాజధానిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని డీడీఓలు వాపోతున్నారు. సర్వర్ పని చేయకపోవడం, వివరాలు అప్లోడ్ చేసేందుకు ఎదరువుతున్న సాంకేతిక పరమైన ఇబ్బందులపై కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే వారి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేసే ముందు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉన్నఫళంగా అమలు చేయడంతోనే సమస్య తలెత్తుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మార్చి నెల జీతాలందలేదు సీఎఫ్ఎంఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీడీఓలకు అవగాహన కల్పించకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో దాదాపు 100 పాఠశాలల ఉపాధ్యాయులకు మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. ఉన్నతాధికారులు స్పందించి సీఎఫ్ఎంఎస్ విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. – పి.అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
బదిలీలు ఉన్నట్టా..లేనట్టా
రాయవరం (మండపేట): ఈ ఏడాది బదిలీలు ఉంటాయా..ఉండవా అనే మీమాంసలో ఉపాధ్యాయ వర్గాలున్నాయి. ఈ నెల 23తో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసింది. సాధారణంగా బదిలీలు వేసవి సెలవుల్లో నిర్వహించాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. గతేడాది నిర్వహించిన బదిలీలు వేసవి సెలవుల అనంతరం నిర్వహించారు. పాఠశాల పని దినాల్లో బదిలీలు నిర్వహించడంతో ఉపాధ్యాయులకే కాదు..విద్యార్థులూ నష్టపోతున్నారు. జిల్లాలో 18వేల మంది ఉపాధ్యాయులు.. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల పరిధిలో సుమారుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతేడాది పాయింట్లు తక్కువై బదిలీలకు నోచుకోని వారు ఈ ఏడాదైనా బదిలీల్లో కోరుకున్న చోటుకు వెళ్దామన్న ఆశతో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాయింట్ల విధానాన్ని తెరమీదకు తీసుకుని వచ్చింది. ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించడం, వెబ్ కౌన్సిలింగ్, బదిలీలకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ విధానాలపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అవకాశం లేదు వచ్చే ఏడాది ఎన్నిక సంవత్సరం కావడంతో ఉపాధ్యాయ బదిలీలు జరిగే అవకాశం లేదు. దీంతో ఈ ఏడాది వేసవిలో తప్పనిసరిగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులను కలిసి బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనా«థ్ దాస్‌ను కూడా ఉపాధ్యాయ సంఘాలు కలిసి బదిలీలు చేపట్టాలని కోరగా, సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. డ్రాఫ్ట్ దశలోనే బదిలీల కోడ్ ఉపాధ్యాయ బదిలీలకు పర్మినెంట యాక్ట్ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో గత నెలలో పర్మినెంట్ బదిలీల యాక్ట్‌పై డ్రాఫ్ట్ రూపొందించారు. కర్ణాటక ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీల యాక్ట్‌ను రూపొందించారు. అదే తరహాలో ఇక్కడ కూడా బదిలీల యాక్ట్‌ను రూపొందిస్తే, చట్ట ప్రకారం నిర్ణీత వ్యవధిలో బదిలీలు ఏటా జరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. చట్టం చేయాలంటే శాసనసభలో అనుమతి పొందాల్సి ఉంది. అయితే ఇప్పట్లో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాత్కాలికంగా ఆర్డినెన్స్ తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నాయి. డ్రాఫ్ట్ దశలో ఉన్న బదిలీల కోడ్‌పై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో చర్చించి తుది దశకు తీసుకుని రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లోనే చేపట్టాలి.. పాఠశాలలు ప్రారంభించే నాటికి బదిలీలు, టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి కావాలి. దీనిపై ఎప్పటి నుంచో పోరాడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.– టి.కామేశ్వరం,యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికల హామీ ఏమైంది.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసవి సెలవుల్లోనే డీఎస్సీ నియామకాలు, బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకోకుండా వేసవి సెలవుల అనంతరం బదిలీలు, నియామకాలు చేపట్టడం విద్యా వ్యవస్థకు తూట్లు పొడవడమే. – కవి శేఖర్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
టీచర్ల పిల్లలూ..సర్కారు బడుల్లోనే
దేవరాపల్లి(మాడుగుల): ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని అప్పుడే సర్కారు బడులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష ఉపనేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులను గురువారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే అభినందించారు. ఎంఈవో సిహెచ్. రవీంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, వారికి సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో ఇది శుభపరిణామమన్నారు. ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా గతంలో సర్కారు బడుల్లో చదివి ర్యాంకులు సాధించిన వారేనని పేర్కొన్నారు. విద్యాపరంగా సాయానికి తానెప్పుడూ ముందుంటానన్నారు. తారువాలో మోడల్ గ్రంథాలయం..... స్వగ్రామం తారువాలో అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తయి వినియోగంలోకి వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ లాలం గంగా భవాని దీనికి నిధులు సమకూర్చారని చెప్పారు. ఈ గ్రంథాలయంలో గ్రూప్–వన్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. వచ్చే ఏడాది పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 40 మంది కుర్చునేలా తరగతి గది , ల్రైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, కంప్యూటర్ రూమ్, ఈ బుక్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను అభినందించారు. రెసిడెన్షియల్‌కు ఎంపికైన విద్యార్థులకు నోట్ పుస్తకం, పెన్నులు అందజేశారు.‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు బడిలో చేరిన విద్యార్థులకు ప్రవేశప్రతాలను ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో సీఆర్పీలు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లో..?
కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక పద్ధతి ‘ఆర్డర్ టూ సర్వ్’ పేరిట అనేక మంది ఉద్యోగులను జిల్లాలోని వివిధ శాఖలలో పాత జిల్లాల ఉద్యోగులతో ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లా ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... ఈ ‘ఆర్డర్ టూ సర్వ్’లో మార్పు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోస్టుల భర్తీ తర్వాత వెంటనే తమ స్థానాలకు తిరిగి వెళ్లిపోవచ్చని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఖాళీ పోస్టులభర్తీపై ఇప్పటివరకు పెదవి విప్పకపోవడంతో ‘ఇంకెన్నాళ్లు’ అంటూ నిరాశ చెందుతున్నారు. అయితే బదిలీలను వేసవి సెలవుల్లో చేపడతామని ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సూచనలు వస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ బదిలీలు ఉపాధ్యాయులకే పరిమితమా... అన్ని శాఖల ఉద్యోగులకు ఉంటుందా అనే అంశం తేలాల్సి ఉంది. ఆశల పల్లకిలో 7, 627 మంది ఉద్యోగులు... జిల్లాలో ప్రస్తుతం 7,627 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3,470 మంది వివిధ శాఖలలో పనిచేస్తుండగా, 4,157 మంది వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఉపాధ్యాయులు తప్ప ఇతర ఉద్యోగులు అధిక శాతం జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో ఆర్డర్ టూ సర్వ్ పేరిట విధులు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు డీఈవో కార్యాలయ సిబ్బంది మొత్తం ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చిన వారే. వీరందరినీ తాత్కాలిక పద్ధతిన నియమించిన ప్రభుత్వం.. ఆ పోస్టులను భర్తీ చేయకపోవంతో నాడు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భర్త ఖమ్మంలో... భార్య కొత్తగూడెం జిల్లాలో.. ఇలా వేర్వేరు చోట్ల విధులను నిర్వహించాల్సిన పరిస్థితి. అంతే కాకుండా ఈ ఆర్డర్ టూ సర్వ్, బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన వెల్లడించకపోవడంతో వచ్చే ఏడాది తమ పిల్లలను ఏ జిల్లాలోని పాఠశాలల్లో చేర్పించాలో తెలియని అయోమయంలో కొందరు ఉద్యోగులున్నారు. బదిలీలు, ప్రమోషన్ల కోసంఎదురుచూపులు... జిల్లాలో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ఎస్జీటీలు 2701 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1348 మంది, ప్రధానోపాధ్యాయులు 108 మంది.. మొత్తం 4157 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2015 జూలైలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం బదిలీలు నిర్వహించారు. ఈ బదిలీలు జరిగి సుమారు మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బదిలీలు, ప్రమోషన్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులైన భార్యాభర్తలు, అనారోగ్య కారణాలు ఉన్నవారు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇతర శాఖల్లో ప్రమోషన్ల భర్తీ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల్లో ‘కామన్ సర్వీస్ రూల్స్’ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందనే కారణంతో ప్రమోషన్లను ఇప్పటి వరకు చేపట్టలేదు. దీనిపై సైతం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రమోషన్లు లేకుండానే అనేక మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిక్కుముడులు వీడితేనే సులువు... బదిలీలను చేపడతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అదనంగా ఉన్నవారిని కుదించే ప్రక్రియ ‘రేషనలైజేషన్’ను చేపట్టాలనే మరో డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇటీవల టీఎస్పీఎస్సీ చేపట్టిన టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్టు పూర్తయినప్పటికీ కోర్టు కేసుతో ఫలితాలు విడుదల కాలేదు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘ప్రైవేట్ వర్సిటీ బిల్లును నిలిపేయాలి’
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ వర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు శంతన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తామని చెప్పి... నేడు ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా బిల్లు తేవడం శోచనీయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజన్న, రాం దాస్, విజయ్, బాలయ్య, తదితరులున్నారు. -
ఇంటర్ ‘స్పాట్’లో గొడవ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేసినందుకు చెల్లించే భత్యం (డీఏ) మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ అధికారులతో అధ్యాపకులు గొడవకు దిగారు. ఇందులో భాగంగా అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. 50 కిలోమీటర్ల పైబడిన దూరం నుంచి స్పాట్ విధులకు వస్తున్న అధ్యాపకులకు రూ. 450 ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే 50 కిలోమీటర్ల లోపు దూరం నుంచి వచ్చేవారికి రూ. 300 ఇవ్వాల్సి ఉందన్నారు. రూ. 300ను రూ. 120కు తగ్గించినట్లు సామాజిక మాద్యమాల్లో మెసేజ్‌లు వస్తున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కంటే ధరలు పెరిగాయని ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సిందిపోయి డీఏ తగ్గించడం అన్యాయమని వాపోయారు. స్థానికంగా (లోకల్) ఉంటూ స్పాట్‌కు వచ్చే అధ్యాపకులకు గతంలో రూ. 130 దాకా ఇచ్చే రెమ్యూనరేషన్ ఈసారి రద్దు చేసినట్లు తెలిసిందని దీనిపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ పరీక్షల విధుల్లో పాల్గొన్నవారికి డీఏ మొత్తంలో తగ్గించారు తప్ప స్పాట్ విధుల్లో పాల్గొన్నవారికి తగ్గించాలనే సమాచారం తమకు రాలేదన్నారు. -
అడవిలో అక్షర దివిటీలు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా పల్లెలు. నిన్న మొన్నటివరకూ అక్కడి పరిస్థితులు దయనీయం. వారిని పట్టించుకునేవారిని కనం. అక్కడి పరిస్థితులను సాక్షి పరిశీలించింది. అంతే ఆర్ద్రంగా అక్షరీకరించింది. రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. అంతే... అడవి మధ్యన, కొండల మాటున అభివృద్ధికి, అక్షరానికి దూరమైన అక్కడి ప్రజల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్షర సుగంధాలు పరిమళిస్తున్నాయి. 21 గ్రామాల్లో మళ్లీ చదువుల తల్లి పరవశిస్తోంది. ఇరు రాష్ట్రాల ఉపాధ్యాయులు కొఠియా పల్లెలకు క్యూ కడుతున్నారు. గిరిజన బిడ్డలకు చదువులు చెప్పేందుకు పోటీపడుతున్నారు. సాక్షిప్రతినిధి విజయనగరం : దశాబ్దాలుగా మారని వారి బతుకుల్లో వెలుగులకు కారణం ‘సాక్షి’ దినపత్రిక కావడం గర్వకారణం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, పాలకులు, అధికారులకు ఆమడ దూరంగా కొఠియా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర జీవితాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకితీసుకువచ్చింది. క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ తొలిసారిగా కొఠియా పల్లెల్లో పర్యటించి అక్కడి వారి కన్నీటి వ్యధలను కళ్లకు కట్టినట్టు ప్రముఖంగా ప్రచురించి పాలకుల 0కళ్లు తెరిపించింది. ఫలితంగా కొఠియా ప్రజల జీవితాల్లో పెను మార్పు మొదలైంది. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన ఈ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ విద్యా వికాసం. ‘సాక్షి’ పది వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ చరిత్రలో నిలిచిపోయే మార్పునకు ఇది శ్రీకారం. పోటాపోటీగా ఏపీ, ఒడిశా బోధనలు కొఠియా గ్రామాల్లో ఒక్కో రాష్ట్రానివి 14 చొప్పున 24 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి నిర్వహణను రెండు రాష్ట్రాల వారు వేర్వేరుగా చూసుకుంటున్నారు. గ్రామాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో, 5 సంవత్సరాలు పైబడినవారిని స్థానిక పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఒక విద్యార్థి పేరు రెండు రాష్ట్రాల పాఠశాలల్లోనూ నమోదు చేస్తున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మాత్రం ఉపాధ్యాయులు రావడం లేదు. కానీ ఇప్పుడులా గ్రామాల్లో ఆంధ్రా–ఒడిశా అధికారులు తరచుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పాఠశాలలను ఒడిశా అధికారులు పరిశీలించినప్పుడు గ్రామంలోని విద్యార్థులు ఆంధ్రా ప్రాంతంలోని పాఠశాలలో ఉండటాన్ని గమనించారు. వెంటనే ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఒడియా బోధనకు ఉపాధ్యాయులను పురమాయించింది. ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ అదే పరిస్థితి. మొత్తమ్మీద అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి రెండు రాష్ట్రాల ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఒడిశా ప్రభుత్వం ఇటీవల ధూళి¿భద్ర గ్రామంలో ఆంధ్రా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని ఒడిశా అధికారులు పరిశీలించారు. అక్కడ ఏపీ రాష్టర బోర్డు ఉండడాన్ని గమనించారు. ఆ భవనం ఒడిశా ప్రభుత్వం నిర్మించినందున అక్కడ ఏపీ కేంద్రాన్ని నిర్వహించడాన్ని తప్పు పట్టారు. తక్షణమే బోర్డు తీయాలని లేదంటే వేరే భవనం వద్ద ఆ కేంద్రాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలానే ఇటీవల కాలంలో అక్కడ చోటు చేసుకుంటున్నాయి. అక్షరాన్ని వారానికోరోజు ఒక పూట నేర్చుకోవడమే గగనమనుకునే ప్రాంతంలో కేవలం ‘సాక్షి’ కథనాల వల్ల విద్యార్థులకు నిత్యం విద్య అందే పరిస్థితులు వచ్చాయి. భావితరాల భవిష్యత్తుకు బాటలు ఏర్పడ్డాయి. -
19న అంగన్వాడీల చలో విజయవాడ
ఒంగోలు టౌన్: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 19వ తేదీ చలో విజయవాడ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అంగన్వాడీలు చలో విజయవాడలో పాల్గొనేందుకుగాను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాళ్లు గురువారం సాయంత్రం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సరోజినిని కలిసి ఒకరోజు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.18 వేల చొప్పున వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు లక్ష రూపాయల చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసే సమయంలో అంగన్వాడీలు అందుకున్న చివరి నెల వేతనాన్ని పెన్షన్‌గా నిర్ణయించి ప్రతినెలా ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు ఐసీడీఎస్‌తో సంబంధంలేని బీఎల్ఓ, పలకరింపు, స్మార్ట్ పల్స్ సర్వే వంటి విధులు అప్పగించరాదన్నారు. పీడీని కలిసి సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్ నాయకురాళ్లు కేవీ సుబ్బమ్మ, ఉమాదేవి, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. -
పిల్లలు కాపీ కొడితే టీచర్లకు ఐదేళ్లు జైలుశిక్షా?
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం మూడు పంటలు పండే భూములను దౌర్జనంగా లాక్కుందని విమర్శించారు. రైతుల భూములు లాక్కొని వెయ్యిగజాలు ఇవ్వడం, భూసేకరణ చేసుకొని రైతులను బిక్షగాళ్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంతో మాట్లాడారు. రైతులు భూములు ఇవ్వమంటే అరెస్టు చేస్తున్నారని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. మీరా ప్రసాద్ అనే రైతును వేధించారని వెన్నపూస గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ‘రాజధానిలో భూములివ్వని రైతులను రకరకాలుగా వేధిస్తున్నారు. రాత్రికి రాత్రే భూములివ్వని రైతుల పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు అకస్మాత్తుగా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. చంద్రబాబు జీవితమంతా షో చేయడమే, లేచింది మొదలు అబద్ధాలే. అనంతపురం జిల్లాలో కరువుతో రైతులు అల్లాడుతుంటే రెయిన్ గన్ల పేరుతో షో చేశారు. ఆ తర్వాత అనంతపురం వైపు చంద్రబాబు కన్నెత్తి కూడా చూడలేదు. రైతులపై మొసలి కన్నీరు కార్చడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడాలి.’ అని పిలుపునిచ్చారు. టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లలు కాపీ కొడితే ఉపాధ్యాయులకు ఐదేళ్లు జైలు శిక్షానా?. విద్యార్థులు పొరపాటున జేబులో పేపర్ పెట్టుకొని వస్తే ఆ బాధ్యత ఉపాధ్యాయుడిదా అని మండిపడ్డారు. టీచర్లను హింసించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడాలేని చట్టాలను చంద్రబాబు ఏపీలో ప్రవేశపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. -
‘టెన్’షన్ వద్దు
ఆలేరు : పదవ తరగతి..ప్రతి విద్యార్థికి ఎంతో కీలకమైంది. పదవ తరగతిలో పరిపూర్ణత అంటే 10 గ్రేడ్ పాయింట్లు. ఇదే ప్రతి విద్యార్థి లక్ష్యం. అన్ని సబ్జెక్టుల్లో 92 కంటే ఎక్కువ మార్కులు వస్తే 10 గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. అంటే ప్రతి సబ్జెక్టులోను రాణించేలా సాధన చేయాలి. ఈనెల 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాల్లో 9460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 460 మంది (కంపార్ట్మెంటల్) విద్యార్థులు ఉన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 156 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 99 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భయం వీడితే విజయం పరీక్షల్లో ఉత్తీర్ణులమవుతామో లేదోనని ఆందోళన విద్యార్థులను మరింత కుంగదీస్తుంది. ఇలాంటి సందేహాలను మనస్సులోకి రానివ్వకూడదు. పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించడం కష్టం కావచ్చు. ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదు. ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టిపెట్టాలి. సమయం తక్కువగా ఉంది కనుక సులువైన పాఠాలను వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి. దీంతో పట్టు సాధించవచ్చు. సాధారణంగా విద్యార్థులు గణితం, ఆంగ్లం, సామాన్యశాస్త్రం వంటి సబ్జెక్టులపై దృష్టిని సారిస్తుంటారు. ఇది సరైంది కాదు. అన్ని సబ్జెక్టులకు సమానమైన ప్రాధాన్యతనివ్వాలి. అన్ని సబ్జెక్టుల్లో 92 కంటే ఎక్కువ మార్కులు వస్తేనే ఏ–1 గ్రేడ్ సాధించేందుకు అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి పరీక్షల సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. ఏది పడితే అది తినవద్దు. తాజా పండ్లు, ఉడికించిన గుడ్లు, సలాడ్స్, ఎండు ఫలాలు మధ్యమధ్యలో తింటుండాలి. తగు విధంగా మంచి నీరు తాగాలి. నీరు, మజ్జిగ, నిమ్మరసం, పండ్లర సాలు తీసుకోవాలి. కాఫీ, టీలు తగ్గించాలి. తీపి పదార్థాలు, వేపుళ్లు తక్కువగా తీసుకోవాలి. ఒత్తిడి పెంచొద్దు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడిని పెంచవద్దు. ఇతరులతో పో ల్చి వారిని తక్కువగా చేయవద్దు. అతిగా ఆశలు పెట్టుకున్నామని వారిని వేధించవద్దు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. పరీక్ష సమయంలో కుటుంబ సభ్యులు టీవీని కట్టిపడేయాలి. పరీక్షలు కదాని రాత్రి పొద్దుపోయేదాకా చదవకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ధ్యానం చేస్తే మంచిది. ఏకాగ్రతతో చదివేలా చూడాలి. ఆత్మవిశ్వాసం ముఖ్యం.ముందస్తు ప్రణాళికతో చదవాలి. ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి జీవశాస్త్రంలో ప్రతి పాఠం కీలకమే. ఇందులో మొత్తం 10 పాఠ్యాంశాలున్నాయి. పోషణలో కిరణజన్య సంయోగ క్రియ, శ్వాస క్రియల నుంచి ఎక్కువగా 4మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులు, విటమిన్లపై కూడా ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. నిత్యజీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రయోగాల సాధనపై పట్టు సాధించడం ద్వారా పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందవచ్చు. నిత్య జీవితంలో అన్వయించుకునే అంశాలను కూడా వదలకుండా నేర్చుకోవాలి. – ఖమర్ సుల్తాన, ఎస్ఏ ఉపాధ్యాయురాలు స్కోరింగ్‌కు అవకాశం హిందీలో మంచి మార్కులు వస్తే స్కోరింగ్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. ప్రశ్నలు, వ్యాకరణాంశాలు, అపరిచిత అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవడం, రాయడం చేయాలి. హిందీ అంటే భయపడవద్దు. చదివింది అర్థం చేసుకోవడం ము ఖ్యం. కవి, రచయిత పరిచయాలను క్షు ణ్ణంగా చదవాలి. ప్రతి పాఠం సమగ్రం గా చదివితే మార్కులు ఎక్కువగా వస్తాయి. వ్యాకరణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – అబ్దుల్గని, హిందీ పాఠ్యపుస్తక రచయిత అవగాహన పెంచుకోవాలి సాంఘికశాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలకు, చదివిన సమాధానాలను సరిగా ప్రజెంట్ చేయగలిగి పూర్తి మార్కులు తెచ్చుకునేలా అభ్యసించాలి. సెకండ్ పేపర్లో మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేస్తూ అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నపత్రాన్ని సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. విద్యార్థులు పాఠాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వస్తున్న సమాచార పట్టికలు, గ్రాఫ్‌లను ప్రాక్టీస్ చేయాలి. ప్రణాళికాబద్ధంగా పునశ్ఛరణ చేయాలి. – హరిశంకర్, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు దోషాలు లేకుండా రాయాలి ప్రతి పాఠాన్ని విద్యార్థులు పలుమార్లు చదవాలి. పద్యాలు సాధన చేయాలి. పువ్వుగుర్తున్న పద్యాలపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. పాఠ్యాంశాల్లోని అంశాలే కాకుండా సామర్థ్యాల వారీగా శ్రద్ధపెట్టి చదువుకోవాలి. వ్యాసరూప ప్రశ్నల్లో గద్య, పద్య, ఉపవాచకాల నుంచి రెండేసి ప్రశ్నలుంటాయి. పేపర్ –1 లో స్వీయరచన 20 మార్కుల పదజాలంలో 10 మార్కులను సామార్థ్యాల నుంచి పరీక్షిస్తారు. పేపర్–2లో పఠనావగాహన, సృజనాత్మకత, వ్యాకరణ అంశాలపై ఇస్తారు. సాధ్యమైనంత వరకు వ్యాకరణం దోషాలు లేకుండా రాయాలి. – దూడల వెంకటేశ్, తెలుగు ఉపాధ్యాయుడు వందశాతం మార్కులు గణితంలోనే వందకువంద మార్కులు సాధించిపెట్టే సబ్జెక్ట్ అంటే గణితమే. మెళకువలతో దీన్ని సాధించవచ్చు. ప్రతి అధ్యాయంలో గల పటాలను, గ్రాఫ్‌లను, రేఖా చిత్రాలను, నిర్మాణాలను పలుమార్లు సాధనచేయాలి. ప్రతి అధ్యాయంలోని కీలక భావనల్నీ, ముఖ్య సూత్రాలను కనీసం 2 లేదా 3 సార్లు పునశ్ఛరణ చేసుకోవాలి. సాంఖ్యాక శాస్త్రంలోని ఓజివ్ వక్రంగీయడంపై బాగా సాధనచేయాలి. స్వరూప త్రిభుజాలు, అప్లికేషన్స్‌పై, త్రికోణమితులు, అనువర్తనాలు, మాధిరి సమస్యలపై సాధనచేయాలి. – చింతకింది మురళి, గణితం ఉపాధ్యాయుడు ఆరోగ్యం కీలకం పరీక్షల సమయంలో ఆరోగ్యంపై దృష్టిసారించడం కీలకం. ఏడాదంతా చదివిన తరువాత పరీక్షల వేళ అనారోగ్యానికి గురైతే వృథా అవుతుంది. ఎండాకాలం కావడంతో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మంచినీరు, మజ్జిక, కొబ్బరి నీరు తీసుకోవాలి. పదేపదే కాఫీలు, టీలు తీసుకోవద్దు. కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే మంచిది. ఆహార నియమాలు పాటించాలి. – సౌజన్య, వైద్యురాలు -
పని ఎక్కువ...జీతం తక్కువ
విద్యాశాఖలో ఉపాధ్యాయులు, సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్స న్స్ (సీఆర్పీ)ను ప్రభుత్వం విస్మరిస్తోంది. మండల విద్యాశాఖాధికారుల పరిధిలో పనిచేసే సీఆర్పీలు రోజురోజుకూ పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్కూల్ అసి స్టెంట్లతో సరిపోయే అర్హతలతో నియమితులైన సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్షగానే మిగిలింది. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీ చేసిన వారు కూడా సీఆర్పీలుగా పనిచేస్తున్నా.. వారికి చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. అరకొరగా ఇస్తున్న వేతనాలు రవాణా ఖర్చులకే సరిపోతుండడంతో జీవనోపాధికి నానాపాట్లు పడుతున్నారు. – సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి ఎర్ర శ్రీనివాస్ సీఆర్పీ వ్యవస్థ ఏర్పడిందిలా.. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి డిప్యూటేషన్‌పై ఎమ్మార్పీ (మండల రిసోర్స్ పర్సన్)లుగా నియమించే వారు. పాఠశాలలు దెబ్బతింటున్నాయనే ఉద్దే శంతో ఆ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ విధా నంలో ఆరేళ్ల క్రితం (2012లో) సీఆర్పీ వ్యవస్థ ను రూపొందించింది ప్రభుత్వం. డీఎస్సీ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణత, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం సీఆర్పీలను నియమించారు. నియామక సమ యంలో రూ.5,500 వేతనం. అందులోనే టీఏ బిల్లు ఇచ్చేవారు. క్రమంగా.. 2013లో రూ. 7 వేలు, 2014లో 8,500 చెల్లించారు. ప్రస్తుతం రూ.15వేలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2298 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. ఇవీ డిమాండ్లు..: ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనం రూ. 28,940 స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటగిరి ప్రకారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్యకార్డులు, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఏడాదికి 22 సాధారణ సెలవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. కేజీ నుంచి పీజీ విద్యలో భాగస్వాములను చేయాలి. వేతన వ్యత్యాసం వివిధ రాష్ట్రాలలో సీఆర్పీలకు ఇచ్చే వేతనాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే వేతనాలకు వ్యత్యాసం భారీగా ఉంది. ఉత్తరాఖండ్‌లో రూ. 75 వేలు, గుజరాత్లో రూ. 55,640, హర్యానాలో రూ.54వేలు, తమిళ నాడులో రూ. 51 వేలు, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ. 57,390, సిక్కింలో రూ. 60,500 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవీ సీఆర్పీల విధులు.. - సీఆర్పీలను స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుసంధానించారు. ఒక్కో సీఆర్పీ దాదాపు 15 నుంచి 18 పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. - ఏదో ఒక స్కూల్‌ను ప్రార్థన సమయంలో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు చేసుకొని వాట్సాప్‌లో అధికారులకు పంపాలి. - మండల వనరుల కేంద్రానికి, పాఠశాలలకు అనుసంధాన కర్తగా పని చేస్తూ సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. - ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే సీఆర్పీ విధులు నిర్వర్తించాలి. - కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సహకరించాలి. - సర్వశిక్షా అభియాన్‌తోపాటు ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను చేపట్టాలి. - మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలి. - బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, రెగ్యులర్‌గా రాని వారిని వచ్చేలా చేయడం వీరి విధి కూడా.. - పాఠశాలలో నిధుల వినియోగాన్ని సమీక్షించాలి. - క్లస్టర్ స్థాయిలో ఎగ్జిబిషన్ మేళాలు నిర్వహించడానికి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహకరించాలి. - వేసవి బడులను నిర్వహించాలి. -
క్లాస్‌లో సెల్ నిషేధం
బజార్హత్నూర్(బోథ్): దేశభవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతోంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అయితే గురువులే క్రమశిక్షణ పాటించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. స్మార్ట్ఫోన్ల రాకతో చాలామంది సర్కారు ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడం అటుంచి ఫోన్లలో మాట్లాడడం, ఆన్లైన్ చాటింగ్‌లతో బిజీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈమేరకు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లకుండా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకు లు కిషన్ అన్ని జిల్లాల విద్యాధికారులకు (జీవో నం.3466 ద్వారా) ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ నెల 6నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉ న్నత, కేజీబీవీ, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలల్లోని త రగతి గదుల్లోకి ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ తీ సుకెళ్లకుండా నిబంధనలు అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అం దాయి. ప్రధానోపాధ్యాయులకు మినహయింపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెల్ఫోన్ల వాడకంపై నిషేధం అమలు చేశారు. అన్ని చోట్లా ఉత్తర్వుల అమలుకు కసరత్తు జరుగుతుంది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్‌కు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల వద్ధ ఉపాధ్యా యు లు తమ సెల్ఫోన్లను డిపాజిట్ చేయల్సి ఉం టుంది. తరగతులు పూర్తయ్యాకే వాటిని అప్ప గించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొ న్నారు. మధ్యాహ్న భోజన వివరాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిత్యం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవలసి ఉ న్నందున ఆ సమయంలో వారికి మినహాయిం పు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో స్పెషలాఫీసర్ ఫోన్ మాట్లాడవచ్చు. ఈ విషయాన్ని రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. వీటి అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈవోలకు అప్పగించారు. కాగా ప్రస్తుతం సాంకేతిక యుగంలో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, విద్యార్థులకు మరింత వివరంగా బోధించేందు కు స్మార్ట్ఫోన్లు దోహదపడుతున్నాయని అందువల్ల వాటిపై నిషేధం సరికాదని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్లతో నష్టపోతున్న విద్యార్థులు భావిభారత పౌరులను తీర్చిదిద్దే తరగతి గది వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉం టే బోధన అభ్యసన ప్రక్రియ అంత సాఫీగా సాగుతుంది. అయితే ఇటీవల ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్న సమయంలో సెల్ మోగితే మధ్యమధ్యలో బయటకు వెళ్లడం, లేదా విద్యార్థులకు చదువుకోమని చెప్పి ఉపాధ్యాయులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తుండడం ఎక్కువయ్యాయి. ఇదే అదనుగా భావించి విద్యార్థులు సైతం స్మార్ట్ఫోన్లను పాఠశాలకు తీసుకురావడం, తరగతి గదిలోనే ఫోన్లు మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం, అల్లరి చేయడంతో క్రమశిక్షణ తప్పిన విద్యార్థులకు బోధన, అభ్యసన ప్రక్రియ సరిగా లేదని, చివరకి పరీక్ష ఫలితాపై ప్రభావం చూపి విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది. ఆదేశాలు వెంటనే అమలు పరచాలి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు డీఈవో జనార్దన్రావ్ బుధవారం జిల్లా కేంద్రంలో డెప్యూటీ ఈవో, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈమేరకు తరగతి గదు ల్లో సెల్ఫోన్లు అనుమతించకూడదని ఎంఈవోలు.. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపి విద్యాశాఖ ఆదేశాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలు జిల్లాలో 929 ప్రాథమిక పాఠశాలలు, 112 ప్రాథమికోన్నత పాఠశాలలు, 106 జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలతో పాటు ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలు 31, కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలు 18, ఆదర్శ పాఠశాలలు 6 ఉన్నాయి. ఇందులో సుమారు 4500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఎవరు కూడా తరగతి గదులు, పాఠశాల ఆవరణలో సెల్‌ఫోన్ వినియోగించరాదని నిబంధనల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు తరగతి గదిలో పూర్తి సమయం బోధనకు కేటాయించడం, విద్యార్థులపై శ్రద్ధ కనబరచడంతో పాటు విద్యార్థుల ఏకాగ్రత, అభ్యాసన సామరŠాధ్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, క్రమశిక్షణ అలవడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. -
టీచర్లకు తుపాకులు, శిక్షణ ఇవ్వాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా పాఠశాలల్లో తుపాకీ కాల్పుల ఘటనలను అరికట్టేందుకు కొంతమంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వారికి తుపాకులు కూడా అందజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ సమస్యకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొంటుందని హామీనిచ్చారు. ఇటీవల ఫ్లోరిడాలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో ఓ బహిష్కృత విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించడం తెలిసిందే. ఆ పాఠశాల విద్యార్థులు, చనిపోయిన వారి తల్లిదండ్రులతో కూడిన బృందం ట్రంప్‌ను కలిసింది. ఉపాధ్యాయులందరికీ తుపాకులు ఇవ్వాలని తానెప్పుడూ అనలేదనీ, కొంతమంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి మాత్రమే తుపాకులు ఇవ్వాలని అన్నానని ట్రంప్ వారికి వివరించారు. -
రేప్ చేస్తామని.. శృంగారంలో పాల్గొందామని..
గురుగ్రామ్ : ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలిని, ఆమె కుమార్తెను రేప్ చేస్తానని అదే పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి(13) ఫేస్బుక్లో హెచ్చరించిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. అంతేకాకుండా అదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఒకరు మరో ఉపాధ్యాయురాలని షికారుకు వెళదామనీ, క్యాండిల్‌లైట్ డిన్నర్‌తో పాటు శృంగారంలో పాల్గొందామని ఆహ్వానించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ రెండు ఘటనలు వారం రోజుల క్రితం చోటుచేసుకున్నాయి. అత్యాచారం చేస్తానని విద్యార్థి హెచ్చరికలతో సదరు ఉపాధ్యాయురాలు కొన్నిరోజుల పాటు పాఠశాలకు వెళ్లడం మానుకున్నారు. చివరికి ఈ విషయం జిల్లా చిన్నారుల సంక్షేమ కమిటీ చైర్మన్ శకుంతలా ధుల్ దృష్టికి రావడంతో పాఠశాలతో పాటు టీచర్లతో అనుచితంగా ప్రవర్తించిన విద్యార్థులకు నోటీసులు జారీచేశారు. వీరిని అధికారులు త్వరలోనే ప్రశ్నించడంతో పాటు కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. మరోవైపు ఈ ఘటనలపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నట్లు సదరు స్కూల్ యాజమాన్యం తెలిపింది. రేప్ చేస్తామని బెదిరించిన విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ ఘటనపై తమకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదనీ గురుగ్రామ్ పోలీస్‌స్టేషన్ పీఆర్వో రవీందర్ కుమార్ మీడియాకు తెలిపారు. -
బాలికకు ప్రేమ పాఠాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బుద్ధిమాలిన పనికి పాల్పడ్డారు. ప్రేమికుల రోజున 13 ఏళ్ల బాలికకు రోజాపువ్వు ఇచ్చి ఐలవ్యూ చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పిన ఉపాధ్యాయుడు, బాలికను బెదిరింపులకు గురిచేసి సహకరించిన మరో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు కటకటాల వెనక్కునెట్టారు. తమిళనాడులో చోటుచేసు కున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపం మేల్‌నారియప్పనూ రులో పునిత ఆంథోని ఉన్నత పాఠశాలలో నిర్మల్ (48), లారెన్స్, జాన్ ఫ్రాన్సిస్ అనే ఉపాధ్యాయులు ఈనెల 14న ప్రేమికులరో జు జరుపుకున్నారు. అదే పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థిని (13)ని పాఠశాలలోని తన గదికి పిలిపించుకుని రోజా పువ్వు చేతిలో పెట్టి ‘నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వూ ప్రేమించు, పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు. దీంతో బాలిక ఏడుస్తూ క్లాసురూంకు వచ్చింది. ఉపాధ్యాయులు లారెన్స్, జాన్ ఫ్రాన్సిస్‌లకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. నిర్మల్ చేష్టలను ఖండిచాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు బాలికనే బెదిరించారు. బాలిక ఏడుస్తూనే ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పుకుంది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఏకమై పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సీపీఎస్ వద్దు..పెన్షన్ కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు గళమెత్తారు. మచిలీపట్నంలో పెన్షన్ సాధన సమితి తూర్పుకృష్ణాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, పలు దఫాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళన ధర్మమైనది : పేర్ని ఏపీ ఏన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా శాఖ సారధ్యంలో పెన్షన్ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల ఆందోళనకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ధర్మమైనదని ఇందుకు ఉద్యోగుల సమస్యకు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. డీఏ పెంపుదల విషయంలో కేసీఆర్‌ను చూసి ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటిస్తే తప్ప ఆంధ్రరాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి లేదని అర్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్ష,కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మత్తి కమలాకరరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, శోభన్‌బాబు, యూటీఎఫ్ నాయకులు కెఏ ఉమామహేశ్వరరావు, ఏపీటీఎఫ్ నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయు నాయకులు కొమ్ము ప్రసాద్, డి చంద్రశేఖర్, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు చేబ్రోలు శరత్చంద్ర, కైతేపల్లి దాస్, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జీటీవీ రమణ, పెన్షనర్స్ అసోసియేషన్ జీవీ రామారావు, రామస్వామి, ఎన్జీవో సంఘ నాయకులు గౌరి, రమాదేవి, బి సీతారామయ్య, ఎల్వీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయటవర్స్ వద్ద ధర్నా ఇబ్రహీంపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేయాలని రాష్ట్ర పెన్షన్ సాధన సమితి పిలుపుమేరకు క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగసంఘాలు ఆంజనేయటర్స్ వద్ద శనివారం ధర్నా నిర్వహించాయి. క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు సీవీ.రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాష్ట్రకోశాధికారి వీరేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీహెచ్ అజయ్‌కుమార్, మహిళా అ«ధ్యక్షురాలు పీవీఎల్ఎస్.రత్న, ఏపీఎన్టీవో సంఘం కార్యదర్శులు నరసింహం, జగదీశ్వరరావు, తులసీరత్నం, కృపావ రం, క్యాపిటల్సీటీ బ్రాంచి కార్యదర్శి నాగభూష ణం, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్ర అడిట్సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఎకనామిక్, స్టాటిక్స్ సంఘం, పీఏవో, అగ్నిమాపక శాఖల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం!
కాగజ్‌నగర్‌టౌన్: అధికారుల పర్యవేక్షణలోపం..రాజకీయ నాయకుల అండదండలతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత ఎజెండాను అమలు చేస్తున్నాయి. డోనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. సెలవు దినాల్లోనూ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాగోబా జాతర రోజు పాఠశాల కొనసాగించారని డీఈవో మెమో జారీ చేశారు. కాని రాజకీయ అండదండలు, పలుకుబడితో మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యతోపాటు పాఠశాలల్లో క్రీడలు ఉండాలి. కాని చాలా పాఠశాలల్లో మైదానాలే లేవు. అంతే కాకుండా పైఅంతస్తులో పాఠశాల నిర్వహిస్తే అదనంగా అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి. కాని కొన్ని పాఠశాలలకు అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. జిల్లాలో 104 ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సౌకర్యాలు కల్పించని పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జనవరి 31న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఒక చోట, నిర్వహణ మరోచోట.. అనుమతి తీసుకున్న చోటనే ప్రైవేటు పాఠశాలలు కొనసాగించాలి. కాని కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల రెండు ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఒకచోట ఉంటే వాటిని మరోచోటకు తరలించారు. ఇలా స్కూల్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు యాజమాన్యాలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ఎగ్గొంటేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కాయి. ఇలాంటి వాటిపై స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదుదారుల ఒత్తళ్ల మేరకు ఉన్నతాధికారులు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అతితక్కువ జీతాలు చెల్లిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు మొత్తంలో 50 శాతం జీతాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం 12 నెలల జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులపై ఒత్తిడి ప్రైవేటు పాఠశాలలు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు రోజుకు ఏడు గంటలు కొనసాగాలి. మధ్యాహ్న భోజన విరామం, స్వల్ప విరామాలు కలుపుకొని ఏడు గంటలు ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 7:15 నిమిషాలు కొనసాగాలి. ఎక్కువ గంటలు పాఠశాలల్లో విద్యార్థులను ఉంచకూడదు. కాని 9 నుంచి 10 గంటల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచుకొని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మండల కమిటీల పర్యవేక్షణ కరువు ప్రైవేటు పాఠశాలల్లో మండల స్థాయి అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో వసతులు, సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ప్రతీ మండలంలో తహసీల్దార్ చైర్మన్, ఎంఈవో కన్వీనర్, ఎంపీడీవోతోపాటు సీఐ, ఎస్సైలు సభ్యులుగా ఉంటారు. కాని ఈ కమిటీలు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిబంధనలు పాటించడం లేదు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తరఫున ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. -ఎండీ.ఆసీఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పట్టించుకుంట లేరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చాలా మంది ప్రమాదకరంగా ఆటోల్లో వెళ్తున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. తేజశ్విని, టీపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ -
అయ్యవార్లకు ‘స్మార్ట్’గండం
పశ్చిమగోదావరి , దెందులూరు: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బ హుపరాక్.. విధులు నిర్వర్తించే సమయంలో స్మార్ట్ఫోన్లలో వాట్సప్, ఫేస్బుక్ ఓపెన్ చేయడం, ఫోన్ సంభాషణ చేస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ప్రవేశించే ముందుకు ఫోన్లు రిసెప్షన్లో పెట్టి సాయంత్రం, భోజన విరామ సమయాల్లో మాత్రమే వినియోగిస్తారు. బోధనా సమయంలో వీటికి దూరంగా ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవే ట్ సంస్థల యాజమాన్యాలు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తూతూమంత్రంగానే అమలవుతోంది. ఉపాధ్యాయులు ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటున్నారు. ఎవరినుంచి ఏ మెసేజ్ వస్తుందో.. ఎప్పుడు ఫోన్‌కాల్ వస్తుందో అన్న ఆతృతతో పలువురు ఉపాధ్యాయులు ఫోన్లపై అధికంగా దృష్టి సారిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులైతే ఏకంగా రెండు ఫోన్లను జేబులో పెట్టుకు ని తరగతి గదులకు తీసుకువెళ్లటం గమనార్హం. ఇలా జరిగితే ఉపాధ్యాయులకు విద్యాబోధనపై ఆసక్తి సన్నగిల్లుతుందని, తద్వారా విద్యార్థుల భవిష్యత్ కుంటుపడే ప్రమాదం ఉందని జిల్లావ్యాప్తంగా తల్లిదండ్రులు, సంఘ సేవలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠశాలల పనివేళల్లో ఫోన్ వినియోగించరాదని, వాట్సప్, ఫేస్బుక్ ఓపెన్ చేయకుండా చూడాల ని డీఈఓలకు పక్కాగా ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనా సమయంలో సెల్ఫోన్లను విని యోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. బోధనా సమయంలో సెల్ఫోన్లు సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. భోజన విరామ సమయంలో వినియోగించుకోవచ్చు. బోధనా సమయంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సెల్ఫోన్లను వినియోగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సీవీ రేణుక, జిల్లావిద్యాశాఖాధికారి -
మీదే బాధ్యత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బోధన ఎలా ఉందనే విషయానికి పది ఫలితాలే గీటురాయి కానున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షలపై గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న ప్రైవేట్ పాఠశాలలు సైతం వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తుంటే అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అలా జరగడం లేదని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని సూచించారు. గత ఏడాది ఒక్క గణితంలోనే 4,400 మంది ఫెయిల్ అయ్యారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదన్నారు. సరైన ఫలితాలు రాకుంటే మొదట పాఠశాల హెచ్ఎం, తర్వాత సబ్జెక్టు చెప్పిన ఉపాధ్యాయుడిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలు తీసుకోవాలన్నారు. కాగా, హరితహారంలో మొక్కల పెంపకం, వివిధ వసతుల కోసం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇక కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నట్లుగానే ఫలితాలు కూడా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహించొద్దు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్, చూచి రాతలకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఇక పరీక్షలు పూర్తయ్యేంత వరకు సంబంధిత సబ్జెక్టు టీచర్లకు ఎలాంటి పరిస్థితుల్లో సెలవులు మంజూరు చేయొద్దని హెచ్ఎంలు, ఎంఈఓలకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అ«ధికారి సోమిరెడ్డి, సెక్టోరల్ అ«ధికారులు హేమచంద్రుడు, చంద్రశేఖర్, డీసీఈబీ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చాకిరీ బారాణా.. జీతం చారాణా
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీ.. ఒలింపియాడ్.. టెక్నో.. కాన్సెప్ట్.. ఈ–శాస్త్ర.. ఒకటా రెండా.. ఇలా 62 రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నాయి! పొద్దుట్నుంచి రాత్రి వరకు క్లాసులు చెప్పిస్తున్నా జీతాలు మాత్రం అరకొరగా విదిలిస్తున్నాయి. కొన్ని అగ్రస్థాయి పాఠశాలలు మినహా మెజారిటీ స్కూళ్లు.. తమ టీచర్లకు చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల ఆదాయ, వ్యయాలను చూసే వ్యవస్థ లేకపోవడం, విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని ప్రైవేటు టీచర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. రెగ్యులర్ టీచర్లకు చెల్లిస్తున్న తరహాలోనే తమకూ వేతనాలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతోంది. ఎంతెంత ఇస్తున్నారో లెక్కే లేదు.. రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మంది విద్యార్థులు 11,700 పైగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. వీటిల్లో సుమారు 1.5 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. అయితే 50 వేల మంది వరకు టీచర్లను యాజమాన్యాలు అసలు వారి రికార్డుల్లోనే చూపించడం లేదు. వారందరికీ తక్కువ వేతనాలిస్తూ యాజమాన్యాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల్లో చూపించే టీచర్లకు చెల్లిస్తున్నది కూడా అంతంతే అని చెబుతున్నారు. ఇక టీచర్ల వేతనాలను బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న యాజమాన్యాలూ తక్కువే ఉన్నాయి. దీంతో అత్యధిక స్కూళ్లు టీచర్లకు ఎంత మొత్తాన్ని వేతనంగా చెల్లిస్తున్నాయో తెలిసే పరిస్థితి లేదు. వాటికి ఓ లెక్కా పత్రం ఉండడం లేదు. తమతో నానా చాకిరీ చేయిస్తూ అరకొర వేతనాలివ్వడంతో జీవనం కూడా గడవడం కష్టమవుతోందని ప్రైవేటు పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. ఇష్టారాజ్య వసూళ్లకు అడ్డదారులెన్నో.. ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్న్అంటూ ప్రైవేటు యాజమాన్యాలు రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏయే జిల్లాలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నాయన్న లెక్కలను విద్యాశాఖ తేల్చింది. ఆకర్షణీయ పేర్లతో అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్న స్కూళ్ల వివరాలను సేకరించింది. రాష్ట్రంలో 3,487 ప్రైవేటు స్కూళ్లు 62 రకాల పేర్లతో తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్న్ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయని, చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయని విద్యాశాఖ తేల్చింది. జీవో నంబర్ 1 అమలేది? ప్రైవేటు టీచర్ల వెతలు తీరాలంటే ప్రభుత్వం 1994లో జారీ చేసిన జీవో నంబరు–1 పక్కాగా అమలు చేయడమే సరైన మార్గమని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. అందుకే ప్రభుత్వానికి పంపిన నివేదికలో దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం టీచర్ల వేతనాలకు వెచ్చించాలి. 15 శాతం నిధులను పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు ఉపయోగించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమానికి ఉపయోగించాలి. యాజమాన్యం కేవలం 5 శాతం నిధులను మాత్రమే లాభంగా తీసుకోవాలని జీవో నంబర్–1 చెబుతోంది. ఈ ఉత్తర్వుల్లోని నిబంధనలను విద్యాశాఖ తమ నివేదికలో చేర్చింది. వేతనాలు ఖాతాల్లోకి వేయరెందుకు? ప్రైవేటు పాఠశాలలకు చెందిన టీచర్ల వేతనాలు, వారి సంక్షేమంపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికలోనూ స్పష్టమైన నిబంధనలు లేనట్టు తెలిసింది. అసలు టీచర్ల వేతనాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించకుండా కేవలం ఫీజుల పెంపునకు అవసరమైన సిఫారసులు చేయడం విమర్శలకు దారి తీసింది. జీవో నంబర్–1 అమలు ప్రస్తావనే అందులో లేదు. వాస్తవానికి విద్యాశాఖ అంతకుముందు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో టీచర్ల సంక్షేమం, వేతనాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను పొందుపరిచింది. ఉపాధ్యాయల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఆన్లైన్ ద్వారా వేయాలని సిఫారసు చేసింది. విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల్లో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు చెల్లించాలని పేర్కొంది. విద్యాశాఖ తెచ్చిన ఈ నిబంధన ప్రైవేటు యాజమాన్యాల్లో ఆందోళనకు కారణమైంది. అందుకే తిరుపతిరావు కమిటీపై ఒత్తిడి తెచ్చి ఆ నిబంధన లేకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. -
సర్కారీ స్కూళ్లకు ‘జన్మభూమి’ సంకెళ్లు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పబ్లిక్ పరీక్షలు.. జేఈఈ, ఎంసెట్‌తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వాల్సిన తరుణం.. పాఠశాలల్లోనూ సిలబస్‌లో అతి ముఖ్యమైన చాప్టర్లపై బోధన, పబ్లిక్ పరీక్షల కోసం సాధన జరిగే సమయం... ఇలాంటి కీలకమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు అటు ఉపాధ్యాయులను, విద్యార్థులను చదువుకు దూరం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో వీరిని బలవంతంగా భాగస్వాములను చేయడం, అనేక బరువు బాధ్యతలు మోపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించే పేరుతో నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడమే కాక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం పెద్ద సమస్యగా మారడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్ధుల చదువులు ఎలా పోయినా ఫర్వాలేదు, ప్రయివేటు కార్పొరేట్ సంస్థల విద్యార్ధులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. బోధనేతర కార్యక్రమాల్లో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా పేర్కొన్నా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలకు ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులను తరలిస్తోంది. మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వాములను చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ప్రభుత్వ టీచర్లు, విద్యార్ధులకు ముఖ్యమంత్రి అప్పగించిన పనులివే... ⇔ ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులో నోడల్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించాలి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ ఆఫీసరు అవుతారు. ⇔ నోడల్ ఆఫీసర్ మున్సిపల్, వార్డు అభివృద్ధి ప్లాన్‌ను అమలు చేయాలి. ⇔ గ్రామ, మున్సిపల్ వార్డు డెవలప్మెంటు ప్లాన్‌లో 2014–15 నుంచి 2017–18 వరకు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను నమోదు చేయాలి. ⇔ 2017–18కి సంబంధించిన గ్రామ, వార్డు అభివృద్ధి ప్లాన్‌ను విడిగా తయారు చేసుకోవాలి. 2018–19, 2019–20 లకు విద్యాపరమైన లక్ష్యాలను తయారు చేసుకోవాలి. ⇔ గడచిన మూడేళ్లలో వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా పాఠశాలకు అందించిన నిధులు, మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలి. ⇔ పాఠశాల అకడమిక్‌కు సంబంధించిన నివేదిక రూపొందించుకోవాలి. పాఠశాల అకడమిక్ మరియు అభివృద్ధి గురించి ఫ్లెక్సీలు వేయించి గ్రామంలో జన్మభూమి జరిగే ప్రదేశంలో, పాఠశాల వద్ద ప్రదర్శించాలి. ⇔ ప్రతి రోజు గ్రామంలో నోడల్ ఆఫీసరు తమ పాఠశాలలో ఆరోజు జన్మభూమికి సంబంధించిన అంశంపై విద్యార్ధులకు వ్యాస, మౌఖిక, ఉపన్యాస, చర్చ పోటీలు నిర్వహించాలి. అదేవిధంగా పి.ఇ.టి.సహాయంతో క్రీడలను నిర్వహించాలి. ⇔ ప్రతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థులు జన్మభూమిలో ఆరోజుకు సంబంధించిన అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. ⇔ ప్రతి రోజు గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలపై డాక్యుమెంటేషన్, ఫోటోలను మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలి. ⇔ ఈనెల 5న జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకించి విద్యాశాఖ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఉదయం ర్యాలీ నిర్వహించాలి. తరువాత 15 నిమిషాలు ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉంటుంది. తదుపరి కూచిపూడి, భరత నాట్యం, జానపద నృత్యం వంటి జానపద కళలను ప్రదర్శించాలి. పిల్లలు తయారు చేసిన బొమ్మలు, సైన్సు ప్రయోగాలు ప్రదర్శించాలి. ⇔ జన్మభూమి రోజుల్లో విద్యార్ధులు గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై సర్వే చేయాలి. ⇔ మండల, పంచాయతీ స్థాయిలో 5కె రన్‌ను నిర్వహించాలి. విద్యార్థులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు మినహాయింపు.. ప్రభుత్వ విద్యాసంస్థల టీచర్లు, విద్యార్ధులను జన్మభూమిలో తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం అదే సమయంలో ప్రయివేటు కార్పొరేట్ సంస్థలను పూర్తిగా మినహాయించింది. ఆయా విద్యాసంస్థల్లో బోధనాభ్యసన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తోంది. జేఈఈ, ఎంసెట్‌తో సహా అనేక పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులను సైతం ఈ జన్మభూమికి తరలించేలా ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా ఆదేశాలు జారీ చేయించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, విద్యార్ధులను అనేక బోధనేతర కార్యక్రమాల్లో వినియోగిస్తోంది. దోమలపై దండయాత్ర, పుష్కరాల్లో సేవలు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ ఇలా ప్రతి కార్యక్రమానికి విద్యార్ధులను, టీచర్లను తరలిస్తోంది. ఇక ఆయా ప్రాంతాలకు సీఎంతో సహ ముఖ్యులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం కోసం విద్యార్ధులను తరలిస్తున్నారు. పాఠశాలలా మీ ప్రచారవేదికలా? జన్మభూమి నోడల్ ఆఫీసర్లుగా, గ్రామ కోఆర్డినేటర్లుగా టీచర్లను నియమించడం సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలోని వారికి పాఠశాలలను తమ ప్రచార వేదికలుగా మార్చేయడం అలవాటుగా మారింది. దోమల దండయాత్ర నుంచి గ్రామాల్లో మరుగొదొడ్లు కడిగే దాకా అన్ని పనులకూ విద్యార్ధులు, టీచర్లను వీధుల్లో తిప్పుతున్నారు. గ్రామాల్లో అనేక శాఖల ఉద్యోగులు ఉండగా టీచర్లను నియమించడం ఏమిటి? ప్రతిరోజూ ర్యాలీల పేరుతో విద్యార్ధులను బయటి తిప్పితే వారి చదువులు ఏం కావాలి? –యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబుల్‌రెడ్డి నెలకు పదిరోజులు వీధుల్లోనే విద్యార్థులు జన్మభూమిలో టీచర్లు, విద్యార్ధులను భాగస్వామ్య చేయడం సరికాదు. రోజూ ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెబుతున్నారు. పిల్లలను ర్యాలీగా ఆయా గ్రామసభలకు తీసుకురావాలంటున్నారు. వారికి చదువు లేకుండా చేస్తున్నారు. నెలరోజులుగా టాయిలెట్లు పరిశీలన అని విద్యార్థులను గ్రామాల్లో ఇంటింటికీ తిప్పారు. ప్రతి నెలలో పది రోజులు ఈ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇక పిల్లలకు చదువులెప్పుడు? –పాండురంగవరప్రసాద్ ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టీచర్లకు బోధనేతర బాధ్యతలు టీచర్లను స్కూళ్లు వదిలి గ్రామసభల్లో ఉండాలంటున్నారు. గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించారు. మండలం స్థాయిలో ఏర్పాటయ్యే అధికారుల బృందాలకు సహాయకులుగా టీచర్లను నియమిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ బాధ్యతలు పెడుతున్నారు. పది రోజులు స్కూళ్లను వదిలి గ్రామ సభల్లో పాల్గొనాలి. ఆ గ్రామ సభల ఇన్‌ఛార్జి బాధ్యతలను పెట్టడం అన్యాయం. జన్మభూమి పేరిట ప్రభుత్వానికి నివేదికలు, ఇతర సన్నాహాల కోసం రాత్రి పది వరకు టీచర్లు నానా యాతనలు పడుతున్నారు. ––శ్రీనివాసరాజు, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి పరీక్షల సమయంలో ఇదేం తీరు? ఇంటర్మీడియెట్‌తో సహ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులను జన్మభూమి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయడం సరికాదు. ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్, 28 నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రయివేటు కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్ధులను జన్మభూమిలో ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు? ––రవిచంద్ర, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు -
విద్యార్థినుల పట్ల టీచర్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ప్రాధానోపాధ్యాడితోపాటు పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. 7,9,10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పెట్టే మానసిక, శారీరక వేధింపులు భరించలేక తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, అందువల్ల పోకిరీ టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
విహారయాత్రలో విద్యార్థులకు మద్యం..
తుమకూరు: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం మత్తులో తూగారు. విహారయాత్రకు వెంట తీసుకెళ్లిన విద్యార్థులకు మద్యం కలిపిన నీరు ఇచ్చి వారు అస్వస్థతకు గురయ్యేందుకు కారణమయ్యారు. ఈఘటన తుమకూరు జిల్లాలోని కొరటగెరె తాలూకా బొమ్మలదేవిపుర గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9,10వ తరగతి విద్యార్థులు 30 మందిని ధర్మస్థలం, హొరనాడు, దక్షిణ కన్నడ ప్రాంతాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచ్చిదానంద, ఉపాధ్యాయులు షేక్ ముజామిల్, రాథోడ్‌లు గత శుక్రవారం విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు మద్యం సేవించారు. కొంత మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లతో కలిపి నిల్వ ఉంచారు. తమకు దాహంగా ఉందని అడగడంతో విద్యార్థులకు ఆ బాటిళ్లను అందించారు. వాటిని తాగిన విద్యార్థులు సోమవారం ఇంటికి చేరుకున్న తర్వాత వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వైద్యులకు చూపించగా మద్యం కలిసిన నీరు సేవించినట్లు తేలింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు. మధుగిరి డీడీపీఐ రవిశంకర్‌రెడ్డి పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. -
‘టీచర్లను నిందించడం సరికాదు’
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఎమ్మెస్ కిష్టప్ప శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సరైన పనితీరు కనబర్చకుంటే అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవచ్చని..కానీ అనవసరంగా నిందిస్తూ మానసిక వేదనకు గురిచేయవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయులు కావాలి
అమ్రాబాద్ (అచ్చంపేట): నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం రోడ్డెక్కారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం హాస్టల్ నుంచి మన్ననూరులోని ఐటీడీఏ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. జంగంరెడ్డిపల్లి నుంచి మొల్కమామిడి వరకు 8 కిలోమీటర్లు విద్యార్థినులు వెళ్లాక.. సమాచారం అందుకున్న పీవో వెంకటయ్య వారికి ఎదురొచ్చారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి తమకు గణితం, బయోసైన్స్, ఫిజిక్స్, సోషల్, తెలుగు బోధించే టీచర్లు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని విన్నవించారు. దీంతో స్పందించిన పీఓ మాట్లాడుతూ శుక్రవారమే ఇద్దరు ఉపాధ్యాయులను పంపించడంతో పాటు వారంలోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. -
జిల్లాలో 40మంది ఉపాధ్యాయులు అరెస్టు
ఒంగోలు క్రైం: ప్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. అందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలకు చెందిన దాదాపు 40 మంది నాయకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నుంచే ఉపాధ్యాయుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకలకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లవద్దని, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలాల నుంచి బయటకు వెళ్లొద్దంటూ ఎస్సైలు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హుకుం జారీ చేశారు. అయినా ప్యాప్టో ఆధ్వర్యంలోని అన్ని సంఘాలకు చెందిన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని ముందస్తుగా బైండోవర్ చేయించుకున్నారు. మొత్తం 210 మంది ఉపాధ్యాయులను ముందస్తుగా బైండోవర్ చేశారు. -
టీచర్లు రాక.. ప్రార్థన చేయించిన ఎంఈఓ
చిన్నచింతకుంట(దేవరకద్ర): మండల పరిధిలోని అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ విద్యార్థులతో ప్రార్థన చేయించారు. ఆ సమయానికి ఉపాధ్యాయులు ఒక్కరు కూడా రాలేదు. చాలారోజులుగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎంఈఓ తెలిపారు. దీంతో వారిని పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశానని, ఉదయం 9:30 అవుతున్నా ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. హెచ్ఎం.బాలయ్య , ఉపాధ్యాయుడు నాగరాజు, గోపాల్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీచకుడు..!
అతడొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇన్చార్జ్ హెచ్ఎం కూడా. అతడి బుద్ధి వక్రించింది. కీచకుడిగా మారాడు. పదోతరగతి మార్క్స్ మెమో కోసం పాఠశాలకు వచ్చిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి, ఉపాధ్యాయ లోకానికి తలవంపులు తెచ్చాడు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’గా మారాడు. వేంసూరు: మండలంలోని కల్లూరుగూడెం గ్రామానికి చెందిన ఆ విద్యార్థిని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పదోతరగతి ఉత్తీర్ణురాలైంది. సత్తుపల్లిలోని ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పదోతరగతి లాంగ్ మెమో కోసం సోమవారం పాఠశాలకు వెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు (మండల ఇన్చార్జ్ ఎంఈఓ) సిహెచ్.వెంకటేశ్వరరావు లేరు. ఖమ్మంలో సమావేశానికి వెళ్లారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు డి.వెంకటేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆపీస్ రూమ్‌కు వచ్చిన ఆ విద్యార్థినితో అతడు అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. ఆమె భయపడింది. తప్పించుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పింది. వారు పాఠశాలకు చేరుకునేసరికి వెంకటేశ్వరరెడ్డి వెళ్లిపోయాడు. వారు అదే రోజున (ఇన్చార్జ్) ఎంఈఓకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. ఆ ఉపాధ్యాయుడిని మంగళవారం ఉదయం పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి పాఠశాలలో ఉన్న (ఇన్చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. డి.వెంకటేశ్వరరెడ్డిని పిలిపించకపోవడంతోపాటు సర్దిపుచ్చేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. దీనిపై తల్లిదండ్రులు, 150మంది గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఎంఈఓ నిర్బంధం కీచకుడిగా మారిన డి.వెంకటేశ్వరరెడ్డిని పాఠశాలకు పిలిపించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇన్చార్జ్ ఎంఈఓను గ్రామస్తులు నిర్బంధించారు. ‘‘గతంలో కూడా ఇదే పాఠశాలలోని అమ్మాయిలతో వేరొక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని మీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు మరొకడు తయారయ్యాడు. ఇదంతా మీ చాతగానితనంతోనే టీచర్లు ఇలా తయారవుతున్నారు’’ అంటూ నిర్బంధించారు. ఆ కీచకోపాధ్యాయుడు వచ్చేదాకా వదిలేది లేదన్నారు. ఈ సమాచారంతో ఎస్సై వెంకన్న, తహసీల్దార్ ఎన్టీ ప్రకాష్‌రావు వచ్చారు. చర్యలు తీసుకుంటామని వారు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. పురుగుల మందు డబ్బాతో అన్న ఆందోళన తన చెల్లితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని పాఠశాలకు రప్పించకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలి అన్న, పాఠశాల భవనం పైకి ఎక్కాడు. అతడికి గ్రామస్తులు నచ్చచెప్పి కిందకు దించారు. తన కూతురుతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ (ఇన్చార్జ్) ఎంఈఓ వెంకటేశ్వరరావుకు బాలిక తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకుంటానని బాధితురాలి తండ్రికి లిఖితపూర్వక హామీ పత్రాన్ని (ఇన్చార్జ్) ఎంఈఓ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెళ్లిపోయారు. -
అర్చకులైన అధ్యాపకులు
ప్రమోద్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత అధ్యాపకుడు ప్రస్తుతం : శ్రీ మహాకపాలేశ్వర్ ఆలయంలో అర్చకుడు సంజీవ్ కుమార్ : ప్రభుత్వ పాఠశాలలో క్రీడాపాధ్యాయుడు ప్రస్తుతం : శివాలయంలో అర్చకుడు జై కిషన్ : ప్రభుత్వ పాఠశాల ప్రధానోధ్యాపకుడు, ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు మోహన్ లాల్ : ప్రభుత్వ పాఠశాలలో హిందీ అధ్యాపకుడు ప్రస్తుతం : సఫేద్ గురు బచ్చాచా ఆలయంలో ఆర్చకుడు బిలాస్ పూర్ : వీళ్లేకాదు.. మరో 91 మంది టీచర్లు.. బిలాస్‌పూర్‌లోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. హరియాణాలో పవిత్ర రోజులుగా పేర్కొనే కపాల్ మోచన్ మేళ సందర్భంగా వివిధ ఆలయాల్లో టీచర్లు అర్చకులుగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ టీచర్లకు గత నెల 29న అర్చకత్వంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీచర్లను ఇలా ఇతర కార్యక్రమాలకు వినియోగంచడంపై ప్రభుత్వ టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్లను వేరే కార్యక్రమాలకు వినియోగించడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని ఇతర అధ్యాపకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధ్యాపకులను ఇతర కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారంటూ.. విద్యాశాఖాధికారులకు జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖాధికారులు.. ఇటువంటి పర్వదినాల్లో భక్తులకు అవసరమైన సేవలు అందించాలంటే అర్చకలు సరిపొవడం లేదని.. కేవలం ఆరు రోజులు మాత్రమే ఇలా వినియోగించడం జరగుతుందని వివరణ ఇచ్చారు. -
మోత‘బడి’
హిందూపురం అర్బన్: చిన్నారులకు తరగతి గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు...వారిని కూలీలుగా మార్చారు. బకెట్లు చేతికిచ్చి కంకర, మట్టి మోపించారు. మోయలేని భారంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసిన వారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే... స్థానిక ఆబాద్‌పేటలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రాథమికోన్నత పాఠశాలకు ఇటీవల మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే బుధవారం బేల్దారులు పనికి రాకపోవడంతో అక్కడి ఉపాధ్యాయులు పాఠశాల ప్రహరీ నిర్మాణానికి అవసరమైన కంకర, మట్టిని విద్యార్థుల చేత మోపించారు. బకెట్లలో మట్టిని నింపుకుని విద్యార్థులు బరువును మోయలేక పడిన అవస్థలు గమనించిన విద్యార్థి సంఘాల నాయకులు సంపత్, బాబావలి పాఠశాల అధ్యాపకులను నిలదీశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎంఈఓ గంగప్పకు తెలియజేయడంతో ఆయన పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పొరపాటు జరిగితే సహించేదిలేదని చెప్పారు. అయితే విద్యార్థులచేత పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు ఎంఈఓకు వినతిపత్రం అందించారు. -
టీచర్లు అర్చక శిక్షణ తీసుకోవాల్సిందే!
చండీగఢ్ : ప్రభుత్వ టీచర్లందరూ అర్చక శిక్షణ తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 29న ప్రభుత్వం నిర్వహించిన శిక్షణకు హాజరు కానీ టీచర్లపై కఠినచర్యలకు మనోహర్‌లాల్ కట్టర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్చక శిక్షణ తీసుకున్న టీచర్లు.. ఆయా గ్రామాల్లో పండుగలు, ఇతర పర్వదినాల్లో అర్చకత్వం చేయాల్సి ఉంటుందని గతంలో హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అర్చక శిక్షణపై పలువురు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం అంటూ.. పలువురు టీచర్లు ఈ అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కాలేదు. శిక్షణా కార్యక్రమానికి టీచర్లు హాజరు కాకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో వివరించాలంటూ.. ఆయా టీచర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అర్చక శిక్షణా కార్యక్రమానికి హాజరు కానీ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓ అధికారులు తెలిపారు. -
సార్లకు చికెన్ బిర్యానీ.. పిల్లలకు నీళ్లచారు
సాక్షి, నర్సాపూర్ : ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదారి పడుతున్నారు. ఇందుకు తాము పని చేస్తున్న పాఠశాలనే అడ్డాగా చేసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నీళ్ల చారు వడ్డిస్తూ.. తాము మాత్రం చికెన్ బిర్యానీ వండుకు తింటున్న విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో, అదే పథకానికి చెందిన బియ్యంతో వారానికి రెండు సార్లు చికెన్ బిర్యానీ వండించుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులకు నీళ్ల చారు వడ్డించిన విషయం బయటపడింది. ఉపాధ్యాయుల కోసం బిర్యానీ తయారు చేసేందుకు మసాలా కలిపి సిద్ధం చేసిన చికెన్ ముక్కలు, బియ్యం ఉడికించేందుకు పెట్టిన ఎసరు కూడా కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పాఠశాలలోని ఒక గదిలో ఖాళీ బీరు సీసాలు లభించడంతో వారు మద్యం కూడా తాగుతున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. పాఠశాలకు ప్రహరీ లేనందున రాత్రి పూట మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన బీరు సీసాలను మధ్యాహ్న భోజనం వండి పెట్టె మహిళ తెచ్చుకుని ఒక గదిలో దాచి పెట్టిందని ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ చెబుతున్నారు. బిర్యానీ వండించిన సంగతి తనకు తెలియదని అంటున్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాలలో పర్యవేక్షణ సరిగా లేనందునే పలువురు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు ఆరోపించారు. వారు మధ్యాహ్న భోజన బియ్యంతో బిర్యానీ వండించుకోవడంతోపాటు, తరగతి గదులలో మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అధికారులను కోరారు. -
గురువులదే గురుతర బాధ్యత
సందర్భం ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమి తంగా సంబరపడేది గురువే. అందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గొప్ప వేదాంతి మాత్రమే కాదు, సమున్నత రాజనీతి జ్ఞునిగా విద్యారంగంలో రాబోయే పరిణామాలు ఎంతో ముందుగానే ఊహిం చారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయవర్గానికి అంకితం చేసి ఉపాధ్యాయ దినోత్స వంగా జరుపుకోవటం సముచితం. రాధాకృష్ణన్ జీవించి ఉన్నప్పటి పరిస్థితులకూ, నేటి పరిస్థితులకూ ఎంతో తేడా ఉన్నది. విద్యారంగంలో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. విద్యా రంగంలో వచ్చే ప్రతి మార్పు తదనుగుణంగా ఉపాధ్యా యలోకంలోనూ మార్పుని కాంక్షిస్తుంది. 21వ శతా బ్దంలో సమాజ ప్రగతికి పునాది విద్యారంగమే అనే భావన ఈనాడు యావత్ ప్రపంచంలో ఏర్పడింది. అంటే 21వ శతాబ్దంలో సమాజంలో కీలకపాత్రధారులు ఉపాధ్యాయులే. మునుపటి కంటే గొప్ప టీచర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతగానో పెరిగిందని అర్థం. ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశానికీ, ఈ సమాజానికీ ఒక గొప్ప ఉపాధ్యాయుడినీ, ఒక గొప్ప భవిష్యత్‌ను ఇవ్వనున్నామనే హామీని ప్రజలు కోరుకుంటున్నారు. ఉపాధ్యాయుడనేవాడు ఆకాశంలోనుంచి ఊడిపడడు. సమాజం నుంచే వస్తాడు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా టీచర్‌కు సమున్నత స్థానమే ఇచ్చారు. మన సంస్కృతిలో మాతృదేవో భవ, పితృ దేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లి, తండ్రి తరు వాత గురువుకు స్థానం కల్పించారు. నేటి ఉపా ధ్యాయతరం దీనిని గుర్తించాలి. ఒక గొప్ప టీచర్‌గా మన పాత్ర ఏమిటనేది ఆలోచించాల్సిన సందర్భం కూడా ఇదేనని నా అభిప్రాయం. ప్రతిరోజు ఉపాధ్యాయుల గురించి రకరకాల కథనాలు, వ్యాఖ్యానాలు మీడియాలో వస్తుంటాయి. నేను ప్రతీరోజూ ఒక పాఠశాలను సందర్శిస్తుంటాను. ఉపాధ్యాయులతో మాట్లాడుతుంటాను. కాబట్టి వాస్త వాలకూ, వదంతులకూ చాలా తేడా ఉంటుంద న్న విషయం గ్రహించాను. ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమితంగా సంబరపడేది ఉపా ధ్యాయుడే. ప్రభుత్వం, మీడియా, సమాజం ఉపా ధ్యాయులకు సరైన వాతావరణాన్ని కల్పించాలి. నూటికి తొంభయ్ శాతంగా ఉన్న ఉపాధ్యాయుల చిత్తశుద్ధినీ, విద్యాబోధనలో వారు అనుసరిస్తున్న నూతనత్వాన్నీ, పద్ధతులను, ప్రజల దృష్టికి తెస్తూ తగిన ప్రోత్సాహం ఇస్తే ఉపాధ్యాయ లోకం తన బాధ్యతలను ఇప్పటికంటే మెరుగ్గా చేయగలరనే నమ్మకం నాకున్నది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మీడియా ఈ విషయంలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నది. విద్యారంగంలో జరుగుతున్న వినూత్న ప్రయోగాలకు ప్రచారం కల్పి స్తున్నది. అటువంటి ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టీచర్ నియామక విధానంలో మార్పులు చేసి, సమర్థవంతమైన ఉపా ధ్యాయుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మూడు అంశాలు ప్రధానమైనవి. మొదటిది విద్యాపరమైన సమర్థత, రెండవది వృత్తిపరమైన సమర్థత. మూడవది ప్రతిభ. విద్యాపరమైన, వృత్తిపరమైన సమర్థత విష యంలో నియామక సంస్థ చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు. ప్రతిభను గర్తించటం వరకే దాని విధి. ప్రతిభ వ్యక్తికి సంబంధించినది. సమర్థతకు గీటురాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వీస్ కమిషన్ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమర్థత ఉపాధ్యాయవిద్యపై ఆధారపడి ఉంటుంది. నేడు విద్యారంగంలో ప్రమాణాల పెంపు ఒక సవా లుగా మారింది. ఇప్పటికీ డ్రాప్‌అవుట్ రేట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం కలవరపెట్టే అంశం. డ్రాప్‌ఔట్ రేట్‌ను సరిగ్గా నియంత్రించలేకపోవటమంటే విద్యా రంగంలో మన వైఫల్యాన్ని అంగీకరించటమనే అర్థం. ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపలేకపోతున్న పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లల గురించి మరింత లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం జరగాలి. సరైన ప్రతిభ చూపని పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లలు విద్యకు పనికి రారు అనే భావనను తొలగించాలి. లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. మరో ముఖ్యమైన అంశం పబ్లిక్ - ప్రైవేట్ రంగాల పాత్ర. ఈనాడు ప్రభుత్వాలే అంతా చేయగలిగే పరిస్థితులు లేవు. ప్రైవేట్ రంగంతో సామ రస్యపూర్వకంగా ఉంటూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. విద్యారంగం ఎంతగా బలోపేతం అయితే, సమర్థవంతమైన టీచర్లు ఎంతగా పెరిగితే దేశభవిష్యత్తు అంత బాగుంటుంది. వ్యాసకర్త: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు