ఒంగోలు క్రైం: ప్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. అందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలకు చెందిన దాదాపు 40 మంది నాయకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నుంచే ఉపాధ్యాయుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు.
అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకలకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లవద్దని, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలాల నుంచి బయటకు వెళ్లొద్దంటూ ఎస్సైలు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హుకుం జారీ చేశారు. అయినా ప్యాప్టో ఆధ్వర్యంలోని అన్ని సంఘాలకు చెందిన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని ముందస్తుగా బైండోవర్ చేయించుకున్నారు. మొత్తం 210 మంది ఉపాధ్యాయులను ముందస్తుగా బైండోవర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment