chalo assembly
-
బీజేపీ చలో అసెంబ్లీ భగ్నం
ముషీరాబాద్(హైదరాబాద్): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు చేట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును కూడా కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణ రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ ముట్టడి..టీచర్ల అరెస్ట్
-
ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉపాధ్యాయులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులను పోలీసులు కాలర్ పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భద్రతను ఛేదించుకుని ముందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. -
చలో అసెంబ్లీకి అనుమతి లేదు..
సాక్షి, అమరావతి: చలో అసెంబ్లీకి అనుమతి లేదని.. ముట్టడికి యత్నిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ముసుగులో రెచ్చగొట్టేందుకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 31 వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంత ప్రజలు సహకరిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరాచక శక్తులపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ హెచ్చరించారు. -
విజయవాడ: ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
-
మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా బీసెంట్ రోడ్డులో ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు. 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద ప్యాప్టో చైర్మన్ సహా పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలనుండి లక్షా ఎనభైవేల మంది రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగులను దొంగలు, దోపిడీ దారుల మాదిరిగా ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి బైండోవర్ చేయడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయకపోతే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. -
నినాదాలతో హోరెత్తిన పోలీస్‌స్టేషన్
-
సీపీఎస్ విధానంపై ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ... విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఉద్యోగుల ‘ఛలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, సచివాలయం వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే వాహనాలను అటువైపు అనుమతిస్తున్నారు. అలాగే ప్యాఫ్టో యూనియన్ నాయకులను, ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 25 మందిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్యాఫ్టో నేతల నినాదాలతో పోలీస్‌స్టేషన్ హోరెత్తింది. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మూకుమ్మడిగా నినదించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు తీర్మానం చేయాలని, ఎన్ఎస్డీఎల్ రికవరీలను ఆపాలని, 653, 654, 655 జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఇది హేయమైన చర్య’
సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలిరాగా.. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదని చెప్పిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, గౌతం రెడ్డి.. సూర్యనారాయణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌పై ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉద్యోగులపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగుల నిరసన
-
చలో అసెంబ్లీ.. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత!
సాక్షి, విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూనియన్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. వందలసంఖ్యలో ఉద్యోగులు బ్యారేజీపై బైఠాయించి.. బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదంటూ.. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులు బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రకాశం బ్యారేజితోపాటు పలుచోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీలోకి సిబ్బందిని, ఇతరులను అనుమతించారు. మరోవైపు విజయవాడలో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత.. చలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీని దిగ్బంధించి.. ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీతోపాటు పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు.. ‘చలో అసెంబ్లీ’కి తరలివస్తున్న ఉద్యోగులను పెద్దసంఖ్యలో అరెస్టు చేస్తుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
టీచర్ల పై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయం కోసం గొంతెత్తితే.. హక్కుల కోసం నినదిస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపొచ్చంటూ సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని తెలుగుదేశం సర్కారు కర్కశంగా కాలరాస్తోంది. తమకు తీరిన నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగా లను ప్రయోగించింది. ఈ కార్యక్రమానికి తరలి వస్తున్న వేలాది మంది టీచర్లపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించింది. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా ఉపాధ్యాయులపై సర్కారు రాక్షసత్వం ప్రదర్శించడం గమనార్హం. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 10,000 మంది టీచర్ల నిర్బంధం ఉద్యోగ విరమణ తరువాత జీవితానికి ఎలాంటి భరోసా కల్పించని సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహించారు. సీపీఎస్ రద్దు కోసం ఇప్పటికే ఎన్నో రూపాల్లో ఉద్యమించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపో వడంతో మంగళవారం ‘చలో అసెంబ్లీ’కి ఐక్య ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విఫలం చేయాలని ప్రభుత్వం వ్యూహం పన్నింది. అసెంబ్లీకి తరలివస్తున్న టీచర్లను సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో మోహరించి, ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో అనధికారికంగా 10,000 మందిని నిర్బంధించినట్లు సమాచారం. కొన్నిచోట్ల పోలీసు వలయాలను ఛేదించుకుని వేలాది మంది విజయవాడకు చేరుకున్నారు. వీరంతా అసెంబ్లీ వైపు వెళ్లకుండా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీచర్లు విజయవాడలోని లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వందలాది మంది పోలీసులు మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. నిరసన తెలుపుతున్న టీచర్లను లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. మహిళా ఉపాధ్యాయులను బలవంతంగా ఈడ్చిపారేశారు. నిరసనకారులను నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఉపాధ్యాయులను రాజధాని వరకు ఎలా రానిచ్చారంటూ పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీల అరెస్ట్ ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీచర్లను అరెస్ట్ చేయడం ఏమిటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఉపాధ్యాయులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎస్ రద్దుపై శాసన మండలిలో తాము ఎంతగా నిలదీసినప్పటికి ప్రభుత్వం తన వైఖరి ప్రకటించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో అరెస్టయిన టీచర్లకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ దమనకాండ సాగిస్తోందని ఆరోపించారు. పింఛన్ అడిగిన టీచర్లపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమని అన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తూ ఫైల్‌పై సంతకం చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గౌతంరెడ్డి గుర్తుచేశారు. టీచర్ల అక్రమ అరెస్ట్‌లను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న వారిని నిర్బంధించడం దారుణమని విమర్శించారు. కమిటీల పేరుతో సర్కారు కాలయాపన ‘‘చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం టీడీపీ ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం. విజయవాడలో మహిళా టీచర్లను పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీపీఎస్ రద్దుపై టీడీపీ ప్రభుత్వం లేఖలు, కమిటీల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఆఖరి రోజున చర్చిస్తామంటోంది. కేవలం ఒక్క రోజులో ఏం చర్చిస్తారు? సీపీఎస్ రద్దుపై అసెంబ్లీ, శాసన మండలిలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. సీపీఎస్‌కు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్ రద్దు కోసం ఎంతవరకైనా పోరాడుతాం’’ – బాబురెడ్డి, చైర్మన్, ఏపీ ఫ్యాప్టో పింఛన్ భిక్ష కాదు.. మా హక్కు ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం తన వైఖరి ఏమిటో వెల్లడించలేదు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికే పింఛన్ ఇస్తుంటే, 30 ఏళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు పింఛన్ కోరడం తప్పా? పింఛన్ భిక్ష కాదు.. అది మా హక్కు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా టీడీపీ ప్రభుత్వాలకు బుద్ధి రాకపోవడం శోచనీయం’’ – ఎన్.రఘురామిరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అరెస్ట్‌లు అప్రజాస్వామికం ‘‘ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. పింఛన్ ఇవ్వాలని కోరడం నేరమా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. సీపీఎస్‌ను రద్దు చేసేవారికే మా మద్దతు ఉంటుంది. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి’’ – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట తప్పిన ముఖ్యమంత్రి ‘‘సీపీఎస్ రద్దుపై గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారు. గతంలో కేబినెట్ సమావేశంలో అజెండాగా పెట్టి, చర్చించకుండా దాట వేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. సీపీఎస్ రద్దుపై తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ – సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల జేఏసీ అసెంబ్లీ చుట్టూ పోలీసు కవచం ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ వద్ద, పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. శాసనసభకు వచ్చే అన్ని మార్గాలను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒక కానిస్టేబుల్‌తో పహారా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వరకూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, కార్లు... ఇలా ప్రతి ఒక్క వాహనాన్ని జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు అసెంబ్లీ దాకా చేరుకోకుండా చక్రబంధాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట, రాజధాని గ్రామం మందడం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాత్కాలిక సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి అసెంబ్లీ మీదుగా అమరావతి గుడికి వెళ్లే ఆర్టీసీ బస్సులపై డేగ కళ్లతో నిఘా ఉంచారు. -
పెన్షన్ టెన్షన్
-
ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల చలో అసెంబ్లీ
-
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలోఅసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్‌ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్‌లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
ఉద్యమాన్ని అణచలేరు..
విజయనగరం పూల్‌బాగ్: ఉద్యమాలు చేసే నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయగలరేమో కాని ఉద్యమాన్ని అణచలేరని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక లోయర్ టాంక్బండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగత్‌సింగ్‌ను ఉరితీయగలిగారు గాని ఆయన ఆశయాలను కాదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికిన చంద్రబాబునాయుడు..ఓటుకు నోటు కేసులో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రధాని మోదీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్తున్న సీపీఐ నాయకులను అడ్డుకుని అరెస్ట్‌లు చేయడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర, పార్టీ నాయకులు ఎ. జగన్నాధం, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యశ్వంత్, బాషా, విశాలాంధ్ర బుక్హౌస్మేనేజర్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. మౌన ప్రదర్శన బొబ్బిలి: అన్యాయాలను ప్రశ్నిస్తున్న గొంతును రాష్ట్ర ప్రభుత్వం నొక్కేస్తోందని సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సీపీఐ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరు చూస్తుంటే మనం బ్రిటీష్ పాలనలో ఉన్నామా అన్న అనుమానం రేకెత్తుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఒమ్మి రమణ, ఇతర సభ్యులు కోట అప్పన్న, ఆర్. శకుంతల, ఎల్వీఆర్ మూర్తి, పండు సుజాత, రాకోటి నాగమ్మ, పి. చిన్న తదితరులున్నారు. కామేశ్వరరావు అరెస్ట్ విజయనగరం పూల్‌బాగ్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధనకోసం సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీపీఐ జిల్లా కార్యదర్శి పి. కామేశ్వరరావును విజయవాడలో కంకిపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ముందస్తు చర్యగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీపీఐ నేతలను ఆదివారం అరెస్టు చేసి సోమవారం ఉదయం విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో పార్వతీపురంలో ఆర్వీఎస్ కుమార్, బొబ్బిలిలో ఒమ్మి రమణ, సాలూరులో రామచంద్రరావును, రామభద్రపురం మండలం కొట్టక్కిలో ఆనందరావు, విజయనగరం లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర ఉన్నారు. -
హోదా ఆకాంక్షపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి కారుల్లో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను గ్రంథి శ్రీనివాస్ ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రంథి శ్రీనివాస్, నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు 31 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.సీతారామప్రసాద్, సీహెచ్.రంగారావులను ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కరీముల్లా బాషాలను అరెస్టు చేశారు. ఏలూరులో చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరిన సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుండి పవరుపేట రైల్వేస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావులను గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, బోనం ధనలక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణానికి చెందిన సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బొద్దాని నాగరాజులను రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలవరం మండలం సీపీఐ కన్వీనర్ జమ్మి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి.ఆంజనేయులుని గృహనిర్బంధం చేసి సోమవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆచంట మండలంలో సీపీఐ కార్యదర్శి వైట్ల విద్యాధరరావును ముందస్తు చర్యగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిడదవోలుకు చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకా భాస్కరరావును గృహ నిర్బంధం చేసి అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నాయకులు ఉండి మండల కార్యదర్శి కె.వెంకట్రావు, గణపవరం సీపీఐ కార్యదర్శి గంజిరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేతర లక్ష్మిలను అరెస్టు చేశారు. -
‘చలో అసెంబ్లీ’కి వైఎస్సార్సీపీ మద్దతు
విజయవాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీల అమలు కోసం సోమవారం నిర్వహించనున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులు కూడా పాల్గొని ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చాటిచెబుతాయని స్పష్టం చేశారు. వారు ఆదివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్సార్సీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభలు, దీక్షలు, యువభేరి సభలతో యువతలో చైతన్యం రగిల్చిందని మల్లాది విష్ణు చెప్పారు. కాంగ్రెస్ మద్దతు: రఘువీరా వామపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి చేపడుతున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిర్బంధాలతో ‘చలో అసెంబ్లీ’ ఆగదు: రామకృష్ణ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం వేధించినా ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జరిగి తీరుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జల్లి విల్సన్, రావుల వెంకయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు దాటినా విభజన చట్టానికి సంబంధించి ఇంత వరకు ఒక్క హామీ కూడా సక్రమంగా అమలుకాలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన కోసమే చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టామని రామకృష్ణ చెప్పారు. -
‘చలో అసెంబ్లీ’ ని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, మహబూబ్‌నగర్: తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రాష్ట్ర ఆరెకటిక సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటికలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌జీ, రాంచందర్జీలు మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాలలో ఆరెకటిక కులం ఎస్సీ జాబితాలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసి ‘డి’ జాబితాలో ఉందన్నారు. దీని కారణంగా ఆరెకటికలకు సరైన విద్య అందక, ఉద్యోగాలు రాక రాజకీయ ప్రాధాన్యం లేక వెనకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల సంక్షేమానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వెనకబాటుకు, అన్యాయానికి గురైన తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. -
జిల్లాలో 40మంది ఉపాధ్యాయులు అరెస్టు
ఒంగోలు క్రైం: ప్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. అందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలకు చెందిన దాదాపు 40 మంది నాయకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నుంచే ఉపాధ్యాయుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకలకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లవద్దని, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలాల నుంచి బయటకు వెళ్లొద్దంటూ ఎస్సైలు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హుకుం జారీ చేశారు. అయినా ప్యాప్టో ఆధ్వర్యంలోని అన్ని సంఘాలకు చెందిన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని ముందస్తుగా బైండోవర్ చేయించుకున్నారు. మొత్తం 210 మంది ఉపాధ్యాయులను ముందస్తుగా బైండోవర్ చేశారు. -
నవంబర్ 1 నుంచి ‘పోరుబాట’
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 నుంచి ప్రజా సమస్యలపై పోరుబాట నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. నవంబర్ 1 నుంచి 4 వరకు రైతు భరోసా యాత్ర, నవంబర్ 10 నుంచి 20 వరకు పత్తి కొనుగోలు కేంద్రాల సందర్శన, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు పోరు సభల నిర్వహణ, నవంబర్ 7న నిరుద్యోగ సమస్యలపై చలో అసెంబ్లీ, 26న నిరుద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సభకు బీజేవైయం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మంచిర్యాలలో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలు చేశామని, పలు కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. అవినీతిపై పోరాడేందుకు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళితులు, గిరిజనుల సమస్యలపై పోరాటానికి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి ఎమ్మెల్యే చింతల, మద్యపాన నియంత్రణ కమిటీకి రాజేశ్వరరావులు నాయకత్వం వహిస్తారన్నారు. -
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
-
తొలి రోజే రచ్చ !
-
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై కాంగ్రెస్ తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలను గేట్ల వద్దే అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. రైతు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మాజీమంత్రి డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉదయమే గాంధీభవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ జెండాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి పాదయాత్రగా బయల్దేరారు. అయితే గాంధీభవన్ ప్రధాన గేటు దాటుతున్న సమయంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్తమ్, మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి, కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ మహిళా నేతలు నాంపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, నేరెళ్ల శారద, బండ కార్తీక రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు రాస్తారోకో చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచౌదరి ట్యాంక్‌బండ్ నుంచి పాదయాత్రగా వచ్చి నేరుగా అసెంబ్లీ వద్దకు చేరుకుని లోపలికి వెళ్లడానికి యత్నించారు. అరెస్టు చేయడానికి రావడంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేల బైఠాయింపు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభ, శాసన మండలి పక్ష నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, పొంగులేటి, జి.చిన్నారెడ్డి, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. అరెస్టులు అప్రజాస్వామికమంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇంత నిరంకుశత్వమా? నిజాంను మించిన కర్కశత్వం: కాంగ్రెస్ మండిపాటు రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినందుకు అరెస్టులు, నిర్బంధాలు విధించడం అప్రజాస్వామికమని ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం వారు మాట్లాడారు. ‘‘రైతులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచింది. వాటిని అమలు చేయాలని అడిగినందుకు అరెస్టులు చేయడం ఏం న్యాయం? రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదు. సభలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. కేసీఆర్ తీరు నిరంకుశత్వానికి, రాచరిక పాలనకు అద్దం పడుతోంది’’అని విమర్శించారు. నిజాంను మించిన కర్కశత్వం చూపిస్తున్నారని జానారెడ్డి, ఉత్తమ్ మండిపడ్డారు. నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పాలన కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అంటూ ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులను తమ రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ఎకరానికి నాలుగు వేలు ఇస్తామంటున్న సీఎం వెంటనే దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు పోలీసు స్టేషన్లలో ఎందుకు ఉంటున్నారో ప్రభుత్వం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను చర్చించకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికే అయితే 50 రోజులు నడిచినా, 500 రోజులు నడిచినా సభకు అర్థం లేదన్నారు. అలాగైతే టీఆర్ఎస్ కార్యాలయంలో అసెంబ్లీని నడుపుకోవచ్చునన్నారు. ప్రతిపక్ష పార్టీలను జైళ్లలో పెట్టి బీఏసీ సమావేశం పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమావేశాలు ఇంత దారుణంగా లేవన్నారు. రైతులకు బోనస్ ఇవ్వని సీఎం... కేసీఆర్ ఒక్కరేనని షబ్బీర్ అలీ విమర్శించారు.