తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నమహబూబ్‌నగర్ జిల్లా అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు.
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నమహబూబ్‌నగర్ జిల్లా అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన అంగన్‌వాడీ కార్యకర్తలు జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని అడ్డుకునే సమయంలో పోలీసులు తమపై అనుచితంగా వ్యవహరించారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపించారు.