హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఛలో హైదరాబాద్కు ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్ల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొంటున్నప్పటికీ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఛలో హైదరాబాద్కు బయలుదేరారు. నగరానికి వస్తున్న వర్కర్లను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సెక్రటేరియట్కు వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు.