indirapark
-
సీఆర్పీల ఉద్యమబాట!
ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నా తగిన గుర్తింపు రావడం లేదని భావించిన సీఆర్పీలు ఉద్యమబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లారు. కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం నూతన విద్యావిధానాలు అమలు చేస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)ల సమస్యలను పట్టించుకోవ డం లేదు. పదేళ్లుగా విధుల్లో ఉన్నా ఉద్యోగ భద్రత లేకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఉపాధ్యాయ ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన మేరకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. 2021 జూన్ నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో 203 మంది.. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు వా రధి ఉంటూ.. పాఠశాలలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అనుసంధానంగా పనిచేసేందుకు వీలుగా సీఆర్పీలను ప్రభుత్వం నియమించింది. పదేళ్ల క్రితం రాత పరీక్షల ద్వారా ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఎమ్మార్సీ కా ర్యాలయ పనులు, పాఠశాలల పర్యవేక్షణ పనులు అప్పగించారు. అయితే ఉపాధ్యాయులు కార్యాలయాల్లో పనిచేస్తే విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను అత్యవసర పరిస్థితులు, ఎన్నికల విధులు, జనాభా లెక్కల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2011లో నూతన విధానం తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా టీటీసీ, బీఈడీ విద్యార్హతతో 2012లో రాత పరీక్షలు, ఇంటర్వూలు నిర్వహించి సర్వ శిక్ష కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో సీఆర్పీని నియమించారు. ఇందులో కొంత మంది వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు వదిలిపెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 232 కాంప్లెక్స్‌లకు 203 మంది సీఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. 18కి పైగా విధులు ప్రస్తుతం సీఆర్పీలు క్షేత్రస్థాయిలో 18కి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహా యంగా ఉంటూనే బడిబయట పిల్లల గుర్తింపు, 18 నుంచి 25 పాఠశాలల పర్యవేక్షణ, ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులు, మధ్యాహ్న భోజన అమలు పరిశీలన, సమగ్ర శిక్ష కార్యక్రమాల నిర్వహణ, ఎమ్మార్సీ కార్యాలయం, పాఠశాలల మ ధ్య అనుసంధాన కర్త, విద్యార్థుల ఆధార్ నమోదు, ఎన్నికల విధులు, యూడైస్, చైల్డ్ ఇన్ఫోలో వివరాల నమోదు తదితర పనులు చేయాలి. వీటితోపాటు జిల్లాస్థాయి అధికారులు ఆదేశాల మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల స్వచ్ఛ విద్యా పురస్కార్‌కు సంబంధించి ఫొటోలు తీసుకోవడం, ఉపాధ్యాయుల డేటా అప్డేట్ చేయడం వంటి బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. ఉద్యోగ భద్రత లేక.. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగిన వేతనం చెల్లించాలని సీఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం వీరు 15 నుంచి 18 పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరతతో 18 నుంచి 25 స్కూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఖాళీలను భర్తీచేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తు తం వీరికి కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భాగస్వామ్యంతో వేతనాలు చెల్లిస్తున్నారు. అంతకు ముందు వీరికి రూ.15వేలు చెల్లించగా, 2021 నుంచి 30 శాతం పెంచారు. దీని ప్రకారం రూ.19,500 అందాల్సి ఉన్నా రూ.150 కోత విధించారు. రెగ్యులర్ చేయాలి పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వెంటనే సీఆర్పీలను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పేస్కేల్ అమలు చేయాలి. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అందరూ తరలిరావాలి. -
ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి
సాక్షి, సిటీబ్యూరో: వివిధ థీమ్‌లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకర్షణీయంగా, ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్న జీహెచ్ఎంసీ తగిన సదుపాయాలున్న చోట ప్రత్యేకాకర్షణలు కలి్పంచేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు అందుబాటులో ఉండి.. కొంతకాలంగా మరుగున పడిన సదుపాయాలను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతోంది. ఇలాంటి వాటిల్లో భాగంగా ఇందిరాపార్కులో ఒకప్పుడుండి కొంతకాలంగా లేని బోటింగ్ షికారును తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వేసవిలో చల్లని నీటి మధ్య బోట్ షికారు సరదాగా ఉంటుంది కనుక పార్కుకు వచ్చేవారికి ఆహ్లాదంగానూ ఉంటుందని భావించి వచ్చే వేసవిలోగా బోటు షికారు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. బోటు షికాకు ధరలను కూడా ఖరారు చేసి ఔత్సాహికులైన కాంట్రాక్టర్లు ఇందిరాపార్కు కొలనులో వాటి విహారానికి ఏర్పాట్లు చేసుకునేందుకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. పెడల్, మోటార్ రెండు రకాల బోట్లు కాంట్రాక్టరు అందుబాటులో ఉంచవచ్చని, 20 నిమిషాల షికారుకు పెడల్ బోటుకు రూ.30, మోటార్ బోటుకు రూ.50గా గరిష్ఠ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే రద్దీని బట్టి ఇంకా తక్కువ చార్జీనైనా వసూలు చేసుకోవచ్చు కానీ, అంతకుమించి గరిష్టంగా వసూలు చేయడానికి వీలుండదన్నారు. -
కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ధర్నాలు..
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా.. టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగానే.. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికైన కేంద్రం.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ధర్మాలో పాల్గొన్నారు. అదే విధంగా.. సిరిసిల్లలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, రాయపర్తి ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, తక్షణమే ఆ చట్టాలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు తన కాన్వాయ్‌తో రైతులను ఢీకొట్టి నలుగురి మృతికి కారణమైన ఘటనకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం రేవంత్ మాట్లాడుతూ 11 నెలలుగా రైతులు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా వారిపై దౌర్జన్యాలు, దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని చెప్పిన మోదీ, దాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మొదట్లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత కేంద్రానికి అనుకూలంగా మారారని విమర్శించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో.. న్యాయం అడిగితే ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. యూపీ రైతుల హత్యలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో తేల్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు మేలు చేస్తా నని హామీ ఇచ్చిన మోదీ ఆచరణలో అమలు చేయటంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యూపీలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సమస్యను పరిష్కరించకుండా హత్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
సామాన్యుడికి స్వేఛ్చ లేకుండా చేస్తున్న ప్రభుత్వం పై పోరాడాలి : భట్టి విక్రమార్క
-
ఇందిరాపార్క్‌కు నష్టం కలిగించొద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్‌కు నష్టం కలిగించే చర్యలు చేపట్టవద్దంటూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఇందిరాపార్క్‌కు నష్టం చేకూర్చడం, అందు లోని చెట్లను కూల్చివేయడం, టెన్నిస్ ప్లే గ్రౌండ్‌ను తరలించడం లాంటివి చేయొద్దని గురువారం ఆదేశించింది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ మైసమ్మగుడి వద్ద వరకు నిర్మిస్తున్న స్కైవేకి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టంచేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) ప్రాజెక్ట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ మైసమ్మగుడి వద్ద వరకు రూ.350 కోట్లతో స్కైవే నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ స్కైవే వల్ల ఇందిరాపార్కు నష్టపోవాల్సి వస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ 102 మంది పౌరులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం గురువా రం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. 2.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న స్కైవే వల్ల ఇందిరా పార్క్ తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న దాదాపు 200 చెట్లను కొట్టేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఇక్కడ తప్ప ఎక్కడా కూడా సింథటిక్ టెన్నిస్ కోర్టు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇందిరాపార్క్ పరిరక్షణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్లు కోరినవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. -
ధర్నా చేసే హక్కు మాది.. రక్షణ ఇచ్చే బాధ్యత మీది
► బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ' ప్రొటెస్ట్ చేసే హక్కు మాకుంది..ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని' స్పష్టం చేశారు. పోలీసులను, టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డం పెట్టి..ధర్నా చౌక్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ధర్నా చౌక్ ఘటన ప్రభుత్వ దౌర్జన్యానికి, అరాచకానికి పరాకాష్ట అని దయ్యబట్టారు. స్థానికుల ధర్నాకు అనుమతి ఎలా ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల సమస్యల కోసం ఎవరితో అయినా..కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టి.. బెయిల్ రాకుండా కుట్ర పన్నారని విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్ లేకుండా రైతులపై కేసులు పెట్టారా అని అడిగారు. పోలీసులు ఆవేశంతో కేసులు పెట్టి, బేడీలు వేశారని చెప్పినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కేసులు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెప్పటానికి నామూషీ ఎందుకని. రైతులను ఇంక మోసం చేయలేరని పేర్కొన్నారు. -
ధర్నాచౌక్‌ను తొలగించాలి..
- ధర్నాచౌక్‌తో అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికుల ఆరోపణ - స్థానికులతో టీఆర్ఎస్ నేతల మంతనాలు సాక్షి, హైదరాబాద్: విపక్షాల ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు.. ధర్నాచౌక్‌తో ఇబ్బంది పడుతున్న ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, బీమానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జలవాయుటవర్స్, ఇండియన్ బుల్స్ అపార్ట్ మెంట్, ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మంతనాలు సాగించారు. ఆదివారం ఉదయం వాకర్స్ అసోసియేషన్‌తో పాటు బండమైసమ్మనగర్ బస్తీ ప్రతినిధులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ధర్నాచౌక్‌తో నిత్యం ఇబ్బందులే... ధర్నాచౌక్‌తో తాము నిత్యం అసౌకర్యానికి గురవుతున్నామని ఇందిరాపార్క్ పరిసర కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైక్‌లతో శబ్ద కాలుష్యం, అటూ, ఇటూ బారీకేడ్లు వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. అప్పుడప్పుడు పోలీసుల లాఠీ చార్జీ జరిగినప్పుడు తప్పించుకొనేందుకు ఆందోళనకారులు తమ ఇండ్లలోకి వస్తున్నారని తెలిపారు. ఆయా వర్గాల ఆందోళనలకు, ధర్నాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరికీ అసౌకర్యం కలగకుండా వేరే ప్రాంతంలో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేయాలని బీమా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,, కార్యదర్శులు పి.కుమార్, సతీశ్, జలవాయు టవర్స్ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, ఇండియన్ బుల్స్ అపార్టుమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కోరారు. -
ధర్నాచౌక్ పరిరక్షణకు ఉద్యమం : చాడ
ఈ నెల 15 నుంచి మే 9 వరకు నిరాహార దీక్షలు: చాడ సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను పరిరక్షించుకునేందుకు ప్రజా ఉద్య మాలు ప్రారంభిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి ధర్నాచౌక్‌ను ఇందిరాపార్క్ వద్దే కొనసాగిం చేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. గురువారం మగ్దూంభవన్‌లో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చాడ వెంకట్‌రెడ్డి మాట్లా డుతూ ధర్నా చౌక్ ఎత్తివేయొద్దని గవర్నర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ నెల 15 నుంచి మే 9 వరకు మగ్దూంభవన్ ఎదుట రోజుకో సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తామ న్నారు. మే 10న ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమా వేశంలో పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, ప్రజా తెలంగాణ వేదిక గాదె ఇన్నయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రవిచంద్ర, ఎంసీపీఐ సాంబయ్య, సీపీఐ నేత ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్వకుర్తి డివిజన్ కోసం ధర్నా
కల్వకుర్తి డివిజన్ సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్షాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పజ ల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ వారు విమర్శించారు.టీసీఎల్పీ నేత జానారెడ్డి, , టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు -
చలో హైదరాబాద్‌ను జయప్రదం చే యండి
నర్వ: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నామని ఆ సంఘం నర్వ, ఆత్మకూర్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరికృష్ణ, సుభాష్, కృష్ణయ్య, భాస్కర్లు వేరు వేరు ప్రకటనలో మంగళవారం తెలిపారు. సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాతపెన్షన్ విధానాన్నే ∙కొనసాగించాలని, ఉపాధ్యాయులకు రిజర్వేషన్లలో పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆయా మండలాలలోని ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సంక్షోభంలో రైస్ మిల్లులు
లెవీని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం కొనుగోళ్లు బంద్ ♦ 2,500 మిల్లుల్లో ఇప్పటికే 1,500కు పైగా మూత ♦ లక్ష మంది కార్మికులపై ప్రభావం సాక్షి,హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రైస్ మిల్లులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. జీరో లెవీ విధానం రైస్ మిల్లర్లు, వాటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న హమాలీల పాలిట శాపంగా మా రింది. లెవీ(మిల్లర్లు సేకరించిన ధాన్యంలో ఎఫ్‌సీఐకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటా)ని పూర్తిగా ఎత్తివేయడంతో ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి, మిల్లర్లకు పనిలేకుండా పోయింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1,500 మిల్లులు మూతపడ్డాయి. మరికొన్ని మూత పడేందుకు సిద్ధంగా ఉన్నా యి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కస్టమ్ మిల్లింగ్ చార్జీలను పెంచితే తప్ప పరిశ్రమ మనుగడ కష్టమేనని మిల్లర్లు అంటున్నారు. ఈ దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేం దుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లుల బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. జీరో లెవీతో దెబ్బ... రాష్ట్రంలో ఉన్న 2,500 రైస్ మిల్లుల నుంచి 50 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ జరిగేది. 25 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగేది. మొత్తంగా ఒక్కో రైస్‌మిల్లులో హమాలీలు మొదలు డ్రైవర్లు, క్లీనర్ల వరకు 50 నుంచి 100 మంది వరకు ఉపాధి లభించేది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షకు మించి ఉంటుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. అయితే కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. క్రమంగా లెవీ విధానాన్ని ఎత్తివేసింది. 2014 మార్చి వరకు 75శాతంగా ఉన్న లెవీని గతేడాది 25 శాతానికి తగ్గిం చింది. దీనిని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గని కేంద్రం.. ఈ ఏడాది నుంచి పూర్తిగా లెవీని ఎత్తివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నాయి. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు ఇచ్చే కస్టమ్ మిల్లిం గ్ ధరపైనే రైస్ మిల్లులు ఆధారపడాల్సి ఉం టోంది. ఇది గిట్టుబాటు కాకపోవడంతో గతేడాదే 500, ఈ ఏడాది మరో వెయ్యికి పైగా మిల్లులు మూతపడ్డాయి. దక్కని హామీ... ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చిబియ్యం (రా రైస్) అయితే 67 క్వింటాళ్లు, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) అయితే 68 క్వింటాళ్లు పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. ఇలా మార్చి ఇచ్చినందుకు పచ్చి బియ్యానికి క్వింటాల్‌కు రూ.15, ఉప్పుడు బియ్యానికి రూ.25 చెల్లిస్తారు. దీనినే కస్టమ్ మిల్లింగ్ అంటారు. ఇలా వచ్చిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖ రేషన్‌కార్డు దారులకు సరఫరా చేస్తుంది. అయితే వంద క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 61 నుంచి 62 క్వింటాళ్ల వరకు మాత్రమే బియ్యం వస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు ఇవ్వాలంటే తాము మరో నాలుగైదు క్వింటాళ్లు అదనంగా కలపాల్సి వస్తోందని, దీంతో తమకు నష్టం కలుగుతోందని అంటున్నారు. ఈ దృష్ట్యా క్వింటాల్ ధాన్యానికి ఎంత బియ్యం, ఎంత నూక, పొరం, తవుడు వస్తుందన్నది ధాన్యం సేకరణకు ముందే టెస్ట్ మిల్లింగ్ చేసి నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కస్టమ్ మిల్లింగ్ ధరను క్వింటాల్ పచ్చిబియ్యానికి రూ.75, ఉప్పుడు బియ్యానికి రూ. 100కు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లెవీ అంటే..? భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బియ్యం సేకరణ విధానమే లెవీ. అంటే రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో ఎఫ్‌సీఐ కొంత మొత్తాన్ని కచ్చితంగా తీసుకోవడం. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు చాలా సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ 75 శాతం లెవీని అమలు చేసింది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల పాటు 50 శాతం, చివరగా గతేడాది 25 శాతం అమలు చేసింది. ఈ ఏడాది పూర్తిగా లెవీ విధానానికి స్వస్తి చెప్పింది. ఈ కారణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడాన్ని మిల్లర్లు ఆపేశారు. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పౌరసరఫరాల సంస్థలు చేపట్టాయి. రాష్ట్ర పరిశ్రమలను పట్టించుకోరా? ‘‘రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ అని, ప్రత్యేక ప్రోత్సాహకాలని విదేశీ పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రైస్‌మిల్ పరిశ్రమలు మూతపడి లక్షల మంది కార్మికుల ఉపాధి పోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని రైస్ మిల్లులను ఆదుకోవాలి.’’ - వ డ్డి మోహన్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇందిరాపార్క్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఛలో హైదరాబాద్‌కు ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్ల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొంటున్నప్పటికీ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఛలో హైదరాబాద్‌కు బయలుదేరారు. నగరానికి వస్తున్న వర్కర్లను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జూపల్లి
కవాడిగూడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం ఆయన ఇందిరాపార్కు సమీపంలోని ఆప్కో లీవరీ విభాగాన్ని (స్టాక్ సప్లై) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, స్టాక్ వివరాలు సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. కంప్యూటర్లో వివరాలను చూపించాలని ఆదేశించినా సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయడంతో డేటాను పెన్‌డ్రైవ్‌లో తీసుకువెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో చేనేత శాఖ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ఆప్కో విభజన జరుగుతుందన్నారు. వీటిలో స్టాక్, బ్యాంకు బ్యాలెన్స్‌లో అధిక వాటా తెలంగాణకే దక్కుతుందన్నారు. పాఠశాలలు, ఆర్టీసీ, ఆసుపత్రులు, అంగన్ వాడీలకు ఆప్కో వస్త్రాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో మార్కెటింగ్ అధికారి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.