
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా.. టీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగానే.. టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికైన కేంద్రం.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ధర్మాలో పాల్గొన్నారు. అదే విధంగా.. సిరిసిల్లలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, రాయపర్తి ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment