మిర్యాలగూడలో రోడ్డెక్కిన అన్నదాతలు
ధాన్యం పోటెత్తడంతో కొనుగోళ్లు నిలిపేసిన మిల్లర్లు
రైతుల రాస్తారోకో..జడ్చర్ల–కోదాడ రహదారిపై నిలిచిన ధాన్యం ట్రాక్టర్లు
మిర్యాలగూడ: ధాన్యం కొనాలని..మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులకు 3వేల ట్రాక్టర్లకుపైగా ధాన్యం తరలివచి్చంది. దీంతో కోదాడ రోడ్డు వైపు యాద్గార్‌పల్లి మిల్లుల్లో ఉదయం పూట ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, నిల్వ సామర్థ్యం లేదని ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మద్దతు ధరకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి రైతులు రాస్తారోకో చేశారు.
మరోవైపు నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండల పరిధిలోని రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 గంటల పాటు ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. వెంటనే అధికారులు ఆ ట్రాక్టర్‌ను తొలగించడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మహీంద్ర, పద్మ చింట్లు తదితర ఎర్ర రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధర వేస్తు న్నారని రైతులు యాద్గార్‌పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి మండల పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు.
అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షించినా...
ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ ఏరియా రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ 3గంటల పాటు సమీక్షించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. దీనికి రైస్ మిల్లర్లు అంగీకరించారు. కానీ, ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులుదీరడంతో పచ్చి గింజ, తేమ అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలు సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు.
ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా కూడా మద్దతు ధర చెల్లించకుండా కేవలం రూ.2,300లోపు ధరకు చాలా ధా న్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు.
పచ్చి వడ్లు అని ధర తగ్గిస్తున్నారు
వడ్లలో నాణ్యత లేదని, పచి్చ గా ఉన్నాయని, తేమ శాతం అధికంగా ఉందని, తాలుగింజలు ఉందని సాకు చూపి మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ.2,250కే కొన్నారు. అధికారులు మిల్లుల వద్దకు రాకపోవడం వల్లే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర పర్యటన చేసి మద్దతు ధర ఇప్పించాలి. – వీరబోయిన లింగయ్య, రైతు, పాములపహాడ్
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం సుమారు 3వేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం వచ్చింది. రైతులు సహకరిస్తే కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఆదివారం ఉద యం 10గంటల వరకు కొనుగోలు కాస్తా మందగించాయి. మధ్యాహ్నం 1గంట వరకు కొనుగోలు చేశాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే రూ.2,320కు పైగా ధర చెల్లిస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసి రంగు మారి న ధాన్యాన్ని కూడా కొనాలని అన్ని మిల్లులకు ఫోన్లు చేసి చెప్పాం. – కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment