అశోక్‌నగర్‌లో గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన
సెక్రటేరియట్ ముట్టడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ యత్నం
ముత్యాలమ్మ ఆలయ ఘటనపై బంద్‌కు హిందూ సంఘాల పిలుపు
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్‌లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్‌నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
సికింద్రాబాద్ బంద్‌లో లాఠీచార్జ్..
కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూవాహిని, బీజేపీ తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు
రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment