చలో హైదరాబాద్‌ను జయప్రదం చే యండి
Published Wed, Aug 3 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నర్వ: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నామని ఆ సంఘం నర్వ, ఆత్మకూర్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీహరికృష్ణ, సుభాష్, కృష్ణయ్య, భాస్కర్‌లు వేరు వేరు ప్రకటనలో మంగళవారం తెలిపారు. సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాతపెన్షన్ విధానాన్నే ∙కొనసాగించాలని, ఉపాధ్యాయులకు రిజర్వేషన్‌లలో పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆయా మండలాలలోని ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement