
సాక్షి, హైదరాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉపాధ్యాయులు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులను పోలీసులు కాలర్ పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భద్రతను ఛేదించుకుని ముందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు.