
ప్రగతిభవన్ ముందు నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆదివారం ప్రగతిభవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు స్థానికత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది సొంత జిల్లాలు వదిలి సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తాము కూడా శాశ్వతంగా తమ స్థానికత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి తమను సొంత జిల్లాకు పంపాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment