Teachers protest
-
మాపై ఎందుకంత కక్ష.. చంద్రబాబుపై ఉపాధ్యాయులు ఫైర్
-
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు. -
జీవో 317: ప్రగతి భవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
మమ్మల్ని కలపండి సారూ
సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. 13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్ బదిలీ! దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. రసాభాసగా మౌనదీక్ష ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. -
ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆదివారం ప్రగతిభవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు స్థానికత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది సొంత జిల్లాలు వదిలి సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తాము కూడా శాశ్వతంగా తమ స్థానికత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి తమను సొంత జిల్లాకు పంపాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మాకొద్దీ 317 జీఓ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. జీఓలోని లోపాలను సవరించాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కులను కాలరాసే జీవో ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి పాలేరు తీరులా ఉందని విమర్శించారు. జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన.. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో టీచర్ల ఆందోళన జిల్లాల్లో ఆందోళనలు ఇలా.. ♦నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డికి, కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపతం సమర్పించారు. బాన్సువాడలో ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టారు. ♦కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ♦రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కేటాయింపులు జరపడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ దామాషాలను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారన్నారు. ♦హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హనుమకొండలో జరిగిన నిరసనలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ♦సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మెదక్‌లో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ♦ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీచర్లు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చేసిన అప్పీళ్లను కూడా పరిశీలించడం లేదని విమర్శించారు. ♦ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట టీచర్లు ధర్నా చేశారు. యూటీఎఫ్‌తో పాటు టీఈజేఎస్, కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. -
ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. కంటతడి పెట్టిన టీచర్లు
-
సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట దేశా రాజధానిలో నిరసన చేస్తున్న టీచర్లతో కలిసి ఆయన కూడా తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ టీచర్లు తమని రెగ్యులర్ చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో ఆదివారం సిద్ధూ కూడా పాల్గొన్నారు. గత నెలలో పంజాబ్‌లోని మొహాలిలో కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజేషన్ కోరుతూ నిరసన చేస్తుంటే కేజ్రీవాల్ వారికి మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు సిద్ధూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అదే డిమాండ్ చేస్తున్న ఢిల్లీ టీచర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ టీచర్లని పర్మనెంట్ చేస్తామని, విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు. ఢిల్లీలో కూడా కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థని పెట్టుకొని పంజాబ్‌లో ఏం చేస్తారని సిద్ధూ ప్రశ్నించారు. ఖాళీలన్నీ గెస్ట్ టీచర్లతోనే కేజ్రీవాల్ భర్తీ చేస్తున్నారన్నారు. -
ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన గవర్న్మెంట్ టీచర్లు
కలకత్తా: తమను అకారణంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను తీవ్ర రూపం చేసేందుకు వారు విషం సేవించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. విషం తాగిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటనతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్) మాధ్యమిక శిక్ష కేంద్ర (ఎంఎస్కే), శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్కే)లో కాంట్రాక్ట్ టీచర్లు పని చేస్తున్న వారిని సుదూర ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని పాఠశాల విద్యా శాఖ కార్యాలయం (బికాశ్ భవన్)ను మంగళవారం బదిలీ జరిగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. మంత్రికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సమయంలో టీచర్లు కార్యాలయంలో ఉన్న మంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు విషం సేవించారు. విష ద్రావణం సేవించడంతో టీచర్లు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురు టీచర్లు షికాస్ దాస్, జ్యోత్స్న తుడు, పుతుల్ జనా, చబీదాస్, అనిమానాథ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా -
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
కవాడిగూడ(హైదరాబాద్): బోధన చేసే ఉపాధ్యాయలోకం వేదనతో రోడ్డెక్కింది.. రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిమంది టీచర్లు కదిలివచ్చారు. నినాదాలతో ధర్నాచౌక్‌ను హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మహాధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌కు వచ్చే రహదారులపై బైఠాయించారు. పీఆర్సీని అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టా లని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పైసా ఖర్చు లేని బదిలీలూ చేపట్టరా: నర్సిరెడ్డి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాలను మొత్తం తన వద్ద ఉంచు కోకుండా విద్యారంగానికి సంబంధించిన అధికారాలను విద్యాశాఖ మంత్రికి ఇవ్వాలని, తక్షణమే పీఆర్సీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపట్టే బదిలీలు, పదోన్నతులు సైతం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. టీచర్లు పోలీసుస్టేషన్లలోనా? మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ.. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ 30 నెలలుగా ఎందుకు జాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. క్లాసు రూం లో ఉండాల్సిన టీచర్లను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్లో ఉంచడం సిగ్గుచేటన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ లేటుతో టీచర్లకు 18 నెలలుగా ఐఆర్ ఇస్తూ ఆదుకుంటున్నారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యు డు అజీజ్‌పాషా, సీపీఎం నేత వెంకట్, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, కె.గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు రవి, కె.రమణ, శ్రీనివాసులు, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దుర్మార్గం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సాక్షి, హైదరాబాద్: హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. చక్రధరరావు, హరగోపాల్‌లు తీవ్రంగా ఖండిచారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉ ద్యమాన్ని అణిచివేసేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. టీచర్ల పట్ల, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. -
విద్యాశాఖలో పదోన్నతుల రచ్చ
సాక్షి, మచిలీపట్నం(కృష్నా) : జిల్లా విద్యాశాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. డీఈఓ కార్యాలయంలోని సిబ్బంది నిర్వాకం వల్ల అర్హులైనప్పటికీ, పదోన్నతులు దక్కటం లేదని కొంతమంది ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. భాషా పండితుల పదోన్నతుల్లో అక్రమాలకు జరిగాయని ఆరోపిస్తూ, ఓ ఉపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు సోమవారం గుండు గీయించుకొని నిరసన తెలిపాడు. ఈనెల 3, 4 తేదీల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు డీఈఓ కార్యాలయ అధికారులు అంతా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవటం విద్యాశాఖ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియతో వీటిని ఆశించే ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమౌతున్నప్పటికీ, ఎక్కడ వివాదాలు చుట్టుకొని కౌన్సెలింగ్ నిలిచిపోతుందేమోననే భయం వారిని వెంటాడుతుంది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉపాధ్యాయుల విన్నపాలను పరిగణలోకి తీసుకొని సర్వీసు రూల్స్‌కు లోబడి అర్హులైన వారిందరికీ అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అడహక్ పదోన్నతులు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాల నేపథ్యంలో రెండేళ్లుగా పదోన్నతులు లేకపోగా, ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాలను సైతం విడుదల చేశారు. కొంతమంది ఎస్జీటీలు బీఈడీ మెథడాలజీ అర్హతతో పదోన్నతులు కల్పించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవటంతో, కలెక్టర్ ఆమోదంతో వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నామని చెప్పి, డీఈవో కార్యాలయ అధికారులు ఈనెల 27న కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సే ఉర్దూ–1, తెలుగు–19, హిందీ –11 మందికి పదోన్నతులు ఇచ్చారు. వీటిపై భాషా పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 05–02–2017 సంవత్సరానికి ముందు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలని, కానీ రద్దు అయిన జీవోలను అనుసరించి, నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి పదోన్నతులు కల్పించారని భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో పదిమంది భాషా పండితులు డీఈఓ కార్యాలయానికి వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుండు గీయించుకొని నిరసన జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు బత్తుల సత్యనారాయణ, విజయలక్ష్మిలను కలసిన భాషా పండితులు, జరిగిన అన్యాయంపై వివరించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, కమిషనర్ ఆదేశాలతో, కలెక్టర్ ఆమోదంతోనే అంతా జరిగిందని వారు ఉపాధ్యాయులకు తెలిపారు. దీనిపై ఎటువంటి సమాచారం లేకుండానే పదోన్నతులు ఇవ్వడటంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల అండ చూసుకొని, కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై తాము పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ముందు నినాదాలు చేశారు. అధికారుల తీరుకు నిరసనగా, భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గుండు గీయించుకున్నాడు. ఆ తర్వాత స్పందనలో జిల్లా అధికారులకు దీనిపై వినతిపత్రాన్ని అందజేశారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు సవ్యంగా సాగేనా! ఈ నెల 3న ప్రధానోపాధ్యాయులు, 4న స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 3,4,5 తేదీల్లో వీటిని నిర్వహిస్తామని డీఈఓ కార్యాలయ అధికారులు ముందుగా ప్రకటించారు. తాజాగా వీటి షెడ్యూల్ మార్పు చేశారు. హెచ్ఎం పోస్టులు 51, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 350 వరకు ఖాళీలు ఉన్నట్లుగా డీఈఓ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కానీ సంబంధిత సెక్షన్లు చూసే సిబ్బంది వీటిపై స్పష్టత ఇవ్వకపోవటం, ఒక్కోసారి ఒక్కో రీతిన ఖాళీల వివరాలను చెబుతుండటం, వాటిలోనూ మార్పులు ఉంటాయని అంటుండం ఉపాధ్యాయవర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది వ్యవహారశైలి డీఈఓకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇటువంటి వాటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
సీపీఎస్ అంతం... టీచర్ల పంతం
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై నిరసన హోరు మిన్నంటుతోంది. దానిని రద్దు చేసేవరకూ ఉద్యమం ఉధృతం చేయాలనే సంకల్పం ఉపాధ్యాయ వర్గాల్లో బలపడుతోంది. ఇప్పటికే జిల్లాలో వివిధ రీతుల్లో చేపట్టిన ఆందోళన సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్టరేట్ ముట్టడితో ఉధృతరూపం దాల్చనుంది. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేపట్టడమే గాకుండా... సామూహిక సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఇందుకోసం ఆరువేల మంది సెలవుపెట్టినట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. విజయనగరం అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు పోరును ఉధృతం చేసేందు కు ఉపాధ్యాయ వర్గాలు సమాయత్తం అవుతున్నా యి. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక(ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కొన్ని నెలలుగా జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సీపీఎస్ రద్దు ఉద్యమంపై చైతన్యం పెరిగింది. మండల కేంద్రాల్లో ర్యాలీలు, జిల్లా వ్యాప్తంగా పోరుజాత, ప్రధాన పట్టణాల్లో బహిరంగ సభలు ఒకటేమిటి విభిన్న రీతిలో నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తెస్తున్నారు. సీసీఎస్ రద్దు నిరసనలు అంటేనే పాలకులు భయపడుతున్నారు. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహణ కోసం ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం ఉలిక్కిపడి ఉద్యమ జిల్లా స్థాయి నాయకులను జిల్లా దాటనీయకుండా హౌస్ అరెస్టులను చేయించారు. తాజాగా వచ్చేనెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ఇచ్చిన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో హాజరు కావాలని ఉపాధ్యాయులంతా ఇప్పుడు సామూహిక సెలవులకు అర్జీలు చేశారు. కలెక్టరేట్ ముట్టడికి సామూహిక సెలవుల అస్త్రం ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయ వర్గాలు సామూహిక సెలవుల అస్త్రం ప్రయోగిస్తున్నాయి. దీనిపై మండలాలు, గ్రామాల వారీగా ప్రచారం ఊపందుకోవడంతో సామూహిక సెలవులకు సిద్ధమైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజుల క్రితం నుంచే క్యాజువల్ లీవ్‌లను పెట్టడం మొదలు పట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్ ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులు 14 వేల వరకు ఉండగా గురువారం నాటికి ఆరువేల మంది సామూహిక సెలవులు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక రోజున సరాసరిన 700 మందికి మించి సెలవులు పెట్టే పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ రాలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గంలో సీపీఎస్ రద్దు లక్ష్య సాధన ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది. క్యాజువల్ లీవులు ఇవ్వడానికి కొన్ని మండలాల్లో విద్యాశాఖ అధికారులు ఇష్టపడటం లేదని, ఆలాంటి మండలాలకు సంఘాల ప్రతినిధులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యమాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్లు తెలుస్తోంది. ఆదినుంచి శాంతియుత ఉద్యమాలే..! ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడిన ఐక్యవేదిక(ఫ్యాప్టో) ఆవిర్భావం మొదట్లో సీపీఎస్ బాధితుల సమస్యలపై విస్తృత స్థాయిలో సమీక్షించింది. దాని ప్రభావ తీవ్రతను గుర్తించి రద్దు చేయడమే ఒక్కటే పరిష్కారమార్గమంటూ నిర్ణయించింది. అందుకు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఇక ఉద్యమ బాట పట్టింది. ఇంతవరకు చేసిన ఉద్యమాల ప్రభావాన్ని ప్రభుత్వం గుర్తించిందో లేదో తెలియదు గానీ సీపీఎస్ రద్దు లక్ష్యం ఉపాధ్యాయుల నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లు ఉద్యమ నేపథ్యం తెలియజేస్తోంది. ఇంతవరకు చేపట్టిన ప్రధాన నిరసన కార్యక్రమాలు... ఫ్యాప్టో ఆధ్వర్యంలో 2017 అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా స్థాయి ధర్నాల పిలుపు నేపథ్యంలో జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో నిర్వహించారు. నవంబర్ 15న చలో అసెంబ్లీ. జిల్లా నుంచి విజయవాడకు 500 మంది హాజరయితే 300 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ అరెస్టులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్రలో సీపీఎస్ బాధితులు కలవడం... ఆయన రద్దు చేస్తానని ప్రకటించడంతో ఉద్యమానికి కొండంత బలం వచ్చింది. 2018 జూలై 30, 31 తేదీల్లో జిల్లాలో పోరుయాత్ర చేపట్టారు. పార్వతీపురం నుంచి కొత్తవలస వరకు ఈ నిరసన యాత్ర సాగింది. పట్టణంలో కోట జంక్షన్ వద్ద బహిరంగ సభ జరిగింది. ఆగస్టు 11న చలో విజయవాడ – జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగసభ – జిల్లా నుంచి 1,000 మంది హాజరు. ∙ సెప్టెంబర్ ఒకటిన కలెక్టరేట్ ముట్టడి. మాస్ క్యాజువల్ లీవులు పెట్టిన ఉపాధ్యాయులు ఇప్పటికే 6 వేల మంది. ముట్టడికి ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక మద్దతు. సీపీఎస్ రద్దు బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే రాష్ట్రంలో అమలవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సీపీఎస్ విధానం రద్దు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీపీఎస్ రద్దు కేంద్రప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను హరించడంలో భాగంగానే సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రద్దు చేసే వరకు ఉద్యమాలు ఆగవు. – కె.శేషగిరి, జిల్లా చైర్మన్, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక, విజయనగరం -
సీపీఎస్ వద్దే వద్దు
ఆదోని అర్బన్: కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు నినదించారు. ఆదివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఢణాపురం నుంచి ఆదోని ఆర్ట్స్ కళాశాల వరకు బైకు, జీపుజాత, ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ బాబురెడ్డి, సెక్రటరీ హృదయరాజు మాట్లాడారు. సీపీఎస్ రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ జాప్యం చేస్తున్నారన్నారు. సీపీఎస్ కారణంగా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు పింఛన్ భద్రతను కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఆర్డీఏ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ సమస్య పరిష్కరించేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న సామూహిక సెలవు పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు తిమ్మన్న, సురేష్‌కుమార్, రామశేషయ్య, మాణిక్య రాజు, రంగన్న, నర్సింహులు, సోమశేషాద్రిరెడ్డి, ప్రేమ్ కుమార్, క్రిష్ణ, రఘు, జయరాజు, హనుమంతు, నాగురాజు, సునీల్‌కుమార్, క్రిష్ణమూర్తి, ఉరుకుందప్ప, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మరో వివాదంలో పశ్చిమ గోదావరి కలెక్టర్
-
కలెక్టర్‌ను సరెండర్ చేయాలి
ఏలూరు (వన్‌టౌన్): దైవంతో సమానమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులపై కలెక్టర్ అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్‌ను సరెండర్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఉపాధ్యాయుల జెఏసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఈ నెల 19న విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జిల్లా ఉపాధ్యాయ జెఏసీ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని మునిసిపల్ కార్యాలయం నుంచి వసంతమహల్, ఓవర్‌బ్రిడ్జి, ఫైర్‌స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఎక్కడాలేని విధంగా స్థానిక కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనేక పనులు పురమాయిస్తూ ఉపాధ్యాయులను బోధనేతర పనులతో వేధించడమే కాకుండా గురువారం విద్యాశాఖ సమీక్ష పేరుతో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యమైందన్నారు. ఏప్రిల్ 19న జరిగిన సమీక్షలో ఉపాధ్యాయులను కదిలే శవాలుగా మారవద్దని, నీతిలేని ఉపాధ్యాయులు పిల్లలకు నీతి కథలు ఎలా చెబుతారని, హక్కుల కోసం పోరాడే ఉపాధ్యాయులు ఉన్నంత వరకు విద్యావ్యవస్థ ఇలాగే ఉంటుందని చేసిన వ్యాఖ్యలను రాతపూర్వకంగా పంపించిన నోటీసును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లి కలెక్టర్‌పై చర్యలకు పట్టుబడతామని, చర్యలు తీసుకోని పక్షంలో ఫ్యాప్టోగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మంతెన సీతారామ్, బండి వెంకటేశ్వరరావు, యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు జిల్లాలో పని చేసిన ఏ కలెక్టర్ కూడా నియంతలా, అప్రజాస్వామికంగా పని చేయడం చూడలేదని కలెక్టర్ భాస్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ ఆర్ఎన్ హరనాథ్ మాట్లాడుతూ కలెక్టర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఉపాధ్యాయులనే కాకుం డా వివిధ శాఖల సమీక్షలో సంబంధిత ఉద్యోగులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్య లు చేస్తున్నారని వారు విరుచుకుపడ్డారు. తక్షణమే కలెక్టర్ ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని జిల్లా ఉపాధ్యాయ జేఏసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధ్యాయులనే కాకుండా అంగన్వాడీ టీచర్లను, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కార్మికులను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ను జిల్లా నుంచి సాగనంపే వరకు ఉద్యమాలు తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు కె.నరహరి, జి.నాగేశ్వరరావు, గుంపుల వెంకటేశ్వరరావు, కె.రాజ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, టి.రాజబాబు,ఆర్.ధర్మరాజు, పి.ఆంజనేయులు, ఎన్.శ్రీనివాసరావు, జి.సుధీర్, ఆర్వీఎం శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి: టీచర్ల అరెస్ట్
విజయవాడ: పీఆర్సీ అమలు చేయడంతో పాటు సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ.. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఏపీఎంఎస్‌టీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. పెండింగ్ జీతాలను చెల్లించడంతో పాటు తక్షణమే పీఆర్సీని అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇబ్రహీంపట్నంలోని డైరెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయులను అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
‘కడియం’పై ఆగ్రహం
సిద్దిపేట జోన్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మహిళ ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యాలు చేశారంటూ బుధవారం రాత్రి సిద్దిపేటలో మహిళ టీచర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మహిళ ఉపాధ్యాయుల సంఘం అద్వర్యంలో వెంకటేశ్వరాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఉదయరాణి, సుకన్య, సాయిశ్రీ, సౌజన్య, సరళ, యాదమ్మ, శోభరాణి, శ్రీవాణి, అనిత, ఆరుణ, విజయ, స్వాతి, పద్మ, మాదవి, యశోద, తదితరులు పాల్గొన్నారు. -
4న కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
విజయవంతానికి యూటీఎఫ్ పిలుపు శ్రీకాకుళం : జిల్లా పరిషత్ పీఎఫ్ సమస్యలు, రిమ్స్ కార్యాలయంలో మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 4న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి మోహనరావు, చౌదరి రవీంద్ర, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సంపతిరావు కిశోర్‌కుమార్ తెలిపారు. ధర్నాకు సంబంధించి యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పీఎఫ్ ఆన్లైన్ ప్రక్రియ సుదీర్ఘ కాలంగా నడుస్తుందని, సంవత్సరాల తరబడి ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల వివరాలు లేకపోవడంతో తీవ్ర గందరగోళంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పీఎఫ్ సబ్స్క్రిప్షన్ సక్రమంగా జమ అవుతున్నదీ, లేనిదీ తెలియడం లేదన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి వివరాలు అప్డేట్ చేయడానికి ఇన్నేళ్లా? అని ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో మీనమేషాలు లెక్కిస్తూ ఏవో కథలు చెబుతున్నారని, కానీ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కో-ఆర్డినేటర్ సమావేశాలు నిర్వహించి హామీలు ఇస్తున్నారు కానీ మళ్లీ యథాతథ స్థితి వుందని పేర్కొన్నారు. అలాగే మెడి కల్ రీయింబర్స్మెంట్ సమస్యల విషయంలో రిమ్స్ అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బిల్లుల్లో కోత సహేతుకంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారమై రిమ్స్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ఏ పోరాటం చేస్తే దాన్ని భగ్నం చేయాలని రిమ్స్ యంత్రాంగం విఫలయత్నం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందన్నారు. ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాల ని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ నాయకులు సనపల తిరుపతిరావు, బమ్మిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో టీచర్ల ర్యాలీ