విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి: టీచర్ల అరెస్ట్
Published Mon, Jul 24 2017 1:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
విజయవాడ: పీఆర్సీ అమలు చేయడంతో పాటు సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ.. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఏపీఎంఎస్‌టీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. పెండింగ్ జీతాలను చెల్లించడంతో పాటు తక్షణమే పీఆర్సీని అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇబ్రహీంపట్నంలోని డైరెక్టరేట్‌ను ముట్టడించారు.
ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయులను అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement