అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు.
డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు.
శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు.
Comments
Please login to add a commentAdd a comment