Undavalli
-
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు. -
సీఆర్ డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
-
CRDA అధికారులపై రైతుల ఆగ్రహం
-
సామాన్యుడు కాడు.. వీడు అసామాన్యుడు.. ఇది కదా ఉండవల్లి అంటే..
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. వెండితెరపై హీరో గొప్పదనం చూసి చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో అలాంటి హీరోలు కనిపించినప్పుడు, వారి గురించి తెలిసినప్పుడు పెద్దగా పట్టించుకోం. రీల్ హీరోలు ఎక్కడైనా కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం నానాయాతన పడతాం. అదే రియల్ హీరోలను చూసినప్పుడు, వారి పోరాట పటిమ తెలిసినా సరే ఎక్కడో ఏవో అనుమానాల కారణంగా శెభాష్ అనడానికి మొహమాటపడతాం. ఒక్కోసారి వారు చనిపోయిన తర్వాత వారి గొప్పదనం గురించి తెలిసి, వారు వీరు చెబుతుంటే విని, వావ్ అనిపిస్తుంది. అంతటితో రియల్ హీరోల కథ సమాప్తం. కానీ రియల్ హీరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూస్తే అలా అనిపించడం లేదు. ఆయన స్పెషల్ రియల్ ఫైటర్. ఆయన నిజమైన అసాధారణ పోరాట యోధుడు. Created history with great fighting spirit. మార్గదర్శి అవకతవకల్ని వెలికితీయడంద్వారా ఆర్ధికరంగ నేరాలపై తనదైన శైలిలో సామాన్యులకు సైతం చక్కటి అవగాహన కల్పించిన సామాన్యుడు. ఆయన చెప్పే పాయింట్లలో ఒక్క మాట కూడా తప్పు పట్టేలా లేదు. సామాన్యుల్లో అసామాన్యుడు. ప్రజాప్రతినిధిగా పదికాలాలపాటు నిలిచిపోయే పని చేశారు. ఆర్ధిక రంగ నేరాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించిన ధన్యజీవిగా కీర్తి సంపాదించారు. కేవలం చట్టాలను నమ్ముకొని, న్యాయవ్యవస్థమీద నమ్మకంతో ప్రజాప్రతినిధిగానే కాదు లాయర్ గా కూడా మార్గదర్శిపై పట్టుదలగా పోరాటం చేసి చరిత్రలో తనకంటూ మంచి పేరు ఆర్జించారు. నాకు రాజ్యాంగం పట్టదు, నేను చెప్పిందే చట్టం, నేను సంకల్పించిందే సక్రమం అనుకునే మోనార్క్లలో కనీసం ఒక్కరినైనా నేలమీదకు ఈడ్చుకొచ్చిన మహర్షి ఉండవల్లి. మార్గదర్శి సక్రమంగా పని చేస్తోంది కదా! ఎలాంటి ఫిర్యాదులు లేవు కదా!! ఏంటీ ఈ ఉండవల్లికి వచ్చిన నొప్పి అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సమస్య లోతుపాతులు తెలిసిన తర్వాత ఇంతకాలం జరిగిన మోసం తెలిస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అంతిమంగా దెబ్బతినేది ప్రజలు. లాభపడేది ఆ మోసాలు చేసినవారు, అంతో ఇంతో లబ్ధి పొందేది వారికి చప్పట్లుకొట్టేవారు. ఆ స్పృహతో చూసినప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన పోరాటం అసాధారణం, అమోఘం, అద్వితీయం. మాటలతో చెప్పలేనిది. సెల్యూట్ టు ఉండవల్లి అరుణ్‌కుమార్ సార్. undavalli arun kumar on margadarshi, on ramoji, on chit funds, on chits, on margadarshi financiers ..అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.. మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత సమాచారం వాటిలో లభ్యమవుతుంది. అయినా సరే మీడియా మొఘల్ రామోజీయే కరెక్ట్ అని ఎవరైనా అంటే ఎవరైనా చేయగలిగిందేమీలేదు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవడమే. -చెమికెల రాజశేఖరరెడ్డి, హైదరాబాద్ -
బాబు ఇంటిని కూల్చేస్తున్నారని..
సాక్షి, అమరావతి: ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబునాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా విషప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. దీనిలోభాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటిని కూల్చేస్తున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రారంభమైన అక్రమ నిర్మాణాల తొలగింపు ఉండవల్లి కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇప్పటికే పలుమార్లు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. -
టీడీపీ కుట్రలు ప్రజలు నమ్మరు
-
చంద్రబాబు ఇంటికి నోటీసులు
సాక్షి, గుంటూరు: వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ శనివారం నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన వీఆర్వో వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు. నీట మునిగిన పంటలు ఎగువ నుంచి వస్తున్న వరదలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. దాచేపల్లి మండలం రామపురం, మాచవరం మండలంలోని రేగులగడ్డ, అచ్చంపేట మండలం మదిపాడు, గింజపల్లి,జీడిపల్లి, తాండువాయి,చల్లగరిగ, దామర్ల, కోడూరు గ్రామాల్లో పత్తి, మిరప పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. అదే విధంగా కొల్లిపొర మండలం పాతబొమ్మవానిపాలెం, అన్నవరపులం, కొల్లూరు మండలం ఆవులవారిపాలెం, పెసర్ల, పోతారం, జువ్వలపాలెం,ఈపురు తదితర గ్రామాల్లో అరటి, పసుపు, తమలపాకు పంటలకు పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. -
గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..
సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్‌ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్సీసీ రూఫ్‌తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది. హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీఆర్డీఏ డైరెక్టర్ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అని, ఆయన కుమారుడు సింగపూర్‌లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు. -
అక్రమాల గని.. ‘లింగమనేని’
సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే. ఈ గెస్ట్‌హౌస్ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. ఏసీసీ భూములతో ప్రారంభం గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్షిప్ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేట్ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్కే రియల్ ఎస్టేట్ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. అక్రమాలను ప్రశ్నించిన గ్రామ కార్యదర్శి సస్పెండ్ ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్ సైట్, సెట్ బ్యాక్స్ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్ సురేష్‌కుమార్ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు ఇంటి ముందు హంగామా
సాక్షి, ఉండవల్లి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్డీఏ నోటీసులు ఇస్తే... చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేపట్టింది. టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి... చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారు. అక్రమ కట్టడం నుంచి చంద్రబాబును తరలిస్తే ఊరుకునేది లేదంటూ హంగామా చేశారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు -
భారీ భద్రత నడుమ ప్రజావేదిక తొలగింపు పనులు
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు మూడవ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వాటిని జాగ్రత్తగా పక్కకు తీస్తున్న నేపథ్యంలో ఈ గురువారం కూడా తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రజావేదిక భవనాన్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. -
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఫోటోలు
-
రెండవరోజుకు ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు.. కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. చదవండి : అక్రమాల వేదిక! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్రేకింగ్.. ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న సీఎం సూచనల మేరకు..కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ భవనాన్ని కూల్చివేసే చర్యలను ప్రారంభించారు. ఈ సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. భవనంలోని ఫర్నించర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే జేసీబీలు, కూలీలను ప్రజావేదిక వద్దకు తరలించారు. (చదవండి : ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రుల బకాయిలు చెల్లించాలి
-
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలందాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇక మీదట ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు వచ్చి పిల్లల్ని కొరకడం.. టార్చిలైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుడదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రులకు రూ. 450 కోట్ల బకాయిలున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 9 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలని జగన్ ఆదేశించారు. కుష్టువ్యాధి వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. కుష్టువ్యాధి మళ్లీ విజృంభిస్తున్నట్లు పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందన్నారు. కుష్టువ్యాధి నివారణ, మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. -
అందుకే ‘అమ్మ ఒడి’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్రూమ్స్ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలనే ఆలోచన రాకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.(చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) సన్న బియ్యం ఇస్తాం.. పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులనే ఇవ్వాలి. ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు. ఆ బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి, మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి. దీనికి కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి. గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది. ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు. ఈ వెయ్యి కోట్లను రైతులకే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ కలెక్టర్లకు తెలిపారు. (చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
ప్రతీ సోమవారం ఆఫీసుల్లో గ్రీవెన్స్ డే
-
ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదు ఇవ్వాలి. పై అధికారులు కూడా ఆ రోజు మీకు ఫోన్లు చేయరు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వినండి. మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి. లేదంటే నా దృష్టికి తీసుకురండి. మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం. మన దగ్గర పనిచేసే వాళ్లనే సంతోషపెట్టకుంటే ప్రజలను ఎలా సంతోషపెడ్తాం? (చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) వారంలో ఒక రోజు.. ఐఏఎస్ అధికారులు ప్రతి వారం ఒక రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలి. మీరు వస్తున్నట్లు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వద్దు. హాస్టళ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీల పరిస్థితిని ఫొటో తీయండి. రెండేళ్ల తర్వాత తీసే ఫొటోలో మన అభివృద్ధి కనపడాలి. వాటి అభివృద్దికి కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తా. ఒక జిల్లా కలెక్టర్‌గా మీరు పనిచేసి వెళ్లిన తర్వాత ప్రజలు మంచిగా గుర్తు చేసుకోవాలి. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కలెక్టర్లు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. అధికారులను అప్యాయంగా పలకరించాలి. సంక్షేమ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలను పట్టించుకోవద్దు’ అని వైఎస్ జగన్ సూచించారు.( చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
అక్రమ నిర్మాణమైన ప్రజా వేదిక కూల్చేయాలి
-
‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్ ఆరోపించారు. (చదవండి: మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంకా చంద్రబాబు పెత్తనమేనా?
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట కృష్ణాతీరంలో రిజర్వ్ కన్జర్వేటరీలో నిబంధనలకు విరుద్ధంగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన నివాసం వైపు రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. అయితే ఎన్నికలు ముగిసి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చంద్రబాబు నివాసం వైపు ప్రయాణికులను, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఆయన ఇంటికి మూడు వైపులా దారులు మూసివేశారు. మరోవైపు కృష్ణానదిలో మత్స్యకారులను వెళ్లనీయకుండా నిరంతరం పోలీసులు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీతానగరం కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ నుంచి చంద్రబాబు నివాసానికి 3 కి.మీ.ల దూరం ఉంటుంది. కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో ఎక్కువ శాతం పూల తోటలు, కూరగాయలు ఉండటంతో రైతులు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల సమయంలో పొలాలకు వెళుతుంటారు. రైతులను పొలాలకు వెళ్లనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబునాయుడు పెత్తనం చెలాయిస్తున్నాడని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ విషయమై ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడని, కష్టపడే రైతు పంట పొలానికి వెళ్లనీయకపోతే సహించేది లేదని, రెండు మూడు రోజుల్లో పోలీసులు బారికేడ్లు తొలగించకపోతే, ఆయన ఇంటిముందే కూర్చుంటానని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. -
సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు ఇప్పటికే కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు. -
ఉండవల్లి వెలవెల తాడేపల్లి కళకళ..
విజయవాడ సిటీ: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన తీర్పు రావడంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెలవెలబోగా, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివా సం ఉన్న తాడేపల్లి ప్రాంతం జన సందోహంతో కళకళలాడింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చరిత్రా త్మక విజయం సాధించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గురువా రం తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. మరోవైపు అక్కడికి సమీపంలోనే ఉన్న చంద్ర బాబు నివాసం వద్ద ఎలాంటి సందడి కనిపిం చలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటలోనే పసుపు జెండాల రెపరెపలు ఆగిపోయాయి. నిన్నటి దాకా తొడలు కొట్టిన వాళ్లంతా ఇళ్లకే పరి మితమయ్యారు. ఉండవల్లిలోని ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, పరిసరాలు నిర్మాను ష్యంగా మారాయి. ఉదయం 9 గంటలకే ఫలి తాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో టీడీపీ అధికార ప్రతిని« దులంతా బయటకు రాలేదు. ఒక్కరు కూడా మీ డియా పాయింట్‌కు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే ఆ ప్రాంతం బోసిపో యింది. వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడే పల్లిలోని తన నివాసంలో ఉండి, ఎన్నికల ఫలి తాలను టీవీలో వీక్షించారు. కుటుంబ సభ్యులు, ఆంతరంగికులతో కలిసి ఫలితాలను సమీక్షిం చారు. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివ చ్చారు. వారి రాకతో తాడేపల్లి కిటకిటలాడింది. అడుగడుగునా వైఎస్సార్సీపీ జెండాలు రెపరెప లాడాయి. విజయోత్సాహంతో కుర్రకారు జోరుకు అడ్డే లేకుండా పోయింది. బాణాసంచా మోతలతో తాడేపల్లి దద్దరిల్లిపోయింది. మహిళా నేతలు, అభిమానులు నృత్యాలు చేశా రు. వైఎస్ జగన్ నివాసం ముందు భారీగా బాణసంచా కాల్చారు. ‘ఇదే ప్రజాతీర్పు.. బై బై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్ర హ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ ఉన్నతా ధికారులు జగన్ కలిసిన వారిలో ఉన్నారు. -
చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం