విజయవాడ సిటీ: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన తీర్పు రావడంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెలవెలబోగా, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివా సం ఉన్న తాడేపల్లి ప్రాంతం జన సందోహంతో కళకళలాడింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చరిత్రా త్మక విజయం సాధించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గురువా రం తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు.
మరోవైపు అక్కడికి సమీపంలోనే ఉన్న చంద్ర బాబు నివాసం వద్ద ఎలాంటి సందడి కనిపిం చలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటలోనే పసుపు జెండాల రెపరెపలు ఆగిపోయాయి. నిన్నటి దాకా తొడలు కొట్టిన వాళ్లంతా ఇళ్లకే పరి మితమయ్యారు. ఉండవల్లిలోని ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, పరిసరాలు నిర్మాను ష్యంగా మారాయి. ఉదయం 9 గంటలకే ఫలి తాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో టీడీపీ అధికార ప్రతిని« దులంతా బయటకు రాలేదు. ఒక్కరు కూడా మీ డియా పాయింట్‌కు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే ఆ ప్రాంతం బోసిపో యింది.
వైఎస్సార్‌సీపీ జెండాల రెపరెపలు
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడే పల్లిలోని తన నివాసంలో ఉండి, ఎన్నికల ఫలి తాలను టీవీలో వీక్షించారు. కుటుంబ సభ్యులు, ఆంతరంగికులతో కలిసి ఫలితాలను సమీక్షిం చారు. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివ చ్చారు. వారి రాకతో తాడేపల్లి కిటకిటలాడింది. అడుగడుగునా వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరెప లాడాయి. విజయోత్సాహంతో కుర్రకారు జోరుకు అడ్డే లేకుండా పోయింది. బాణాసంచా మోతలతో తాడేపల్లి దద్దరిల్లిపోయింది. మహిళా నేతలు, అభిమానులు నృత్యాలు చేశా రు. వైఎస్ జగన్ నివాసం ముందు భారీగా బాణసంచా కాల్చారు. ‘ఇదే ప్రజాతీర్పు.. బై బై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్ర హ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ ఉన్నతా ధికారులు జగన్ కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment