
ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది.

Comments
Please login to add a commentAdd a comment