
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్‌లతో సీఎం భేటీ కానున్నారు.
ఇటీవలే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్యేల పనితీరు, కిందిస్థాయి కార్యకర్తలు అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకుంటున్నారు. సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం పరిశీలకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment