
సాక్షి, అమరావతి: ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబునాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా విషప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చింది. దీనిలోభాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటిని కూల్చేస్తున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది.
ప్రారంభమైన అక్రమ నిర్మాణాల తొలగింపు
ఉండవల్లి కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇప్పటికే పలుమార్లు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది.