సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సీఎం సేఫ్ హౌస్ (తాడేపల్లి పోలీసుస్టేషన్), సేఫ్ హాస్పటల్ (మణిపాల్ ఆస్పత్రి)కు మంగళవారం పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. తొలుత సీఎం సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి ఉండవల్లి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి కూడలి, తాడేపల్లి ప్రధాన రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్ వరకు, తిరిగి పాత జాతీయ రహదారి ముగ్గురోడ్డు, పోలకంపాడు మీదుగా ఉండవల్లి ఊరు దాటిన తరువాత కొండవీటి వాగు వంతెన మీదుగా కరకట్టపై ఉన్న సీఎం నివాసానికి కాన్వాయ్ చేరుకుంది.
కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, బోటు యార్డు, ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్‌పేట మీదుగా జాతీయ రహదారి వెంబడి వారధి వద్ద ఉన్న సేఫ్ హాస్పిటల్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్‌కి సేఫ్ హాస్పటల్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, తిరిగి నివాసానికి చేరుకోవడానికి పది నిమిషాల సమయం పట్టింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది, నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సీఐ హరికృష్ణ, ఎస్‌ఐలు వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెస్ట్ హౌస్ నుంచి సేఫ్ హౌస్
Published Wed, Jun 29 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement
Advertisement