CM convoy
-
కమ్మేస్తున్న ‘పొగమంచు'.. ‘డ్రైవింగ్'లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,తెలంగాణ : మీరు రాత్రి సమయాల్లో వాహనం నడుపుతున్నారా? ప్రయాణ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లో బీమ్ లైట్లను వినియోగించాలని రవాణా శాఖ కోరుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ వాహనాలలో లో బీమ్ లైట్లను వినియోగించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను ఉదహరిస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం లో బీమ్‌తో ప్రయాణించింది. తోటి వాహనదారుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు లో బీమ్‌లో ప్రయాణించాయని, మీరు కూడా లో బీమ్‌ను వినియోగించాలని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Hon’ble Chief Minister Shri @revanth_anumula ’s entire convoy is using low beams.The reason is, they want to understand what is behind them. Let us all learn from them and Use low beams when we are too close to vehicle in front and road is well lit!@HiHyderabad @HYDTP pic.twitter.com/FgRZpC3Gn0— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) December 19, 2024‘లో బీమ్ లైట్ల’ డ్రైవింగ్‌తో ఉపయోగాలు అవాంతరాలు లేని ప్రయాణం: నగరాలు, ఇతర రహదారుల్లో లో బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురుగా ఉన్న ఇతర వాహనాలు నడిపై డ్రైవర్ కళ్లకు అంతరాయం ఉండదు. మార్గ మధ్యలో ఎలాంటి అడ్డంకులున్నా సులభంగా గుర్తించవచ్చారు. భద్రత: హై బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురు వస్తున్న వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. ప్రమాదానికి కారణమవుతాయి. లో బీమ్ లైట్లతో ప్రమాదాల్ని నివారించవచ్చు. తోటి వాహనదారుల సంక్షేమం: లో బీమ్ లైటన్లను ఉపయోగించడం ఎదురుగా వాహనాల్లో వస్తున్న వాహనదారుల సంక్షేమాన్ని కోరిన వారిమవుతాం. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. నిబంధనలు: అనేక నగరాల్లో జరిగే ప్రమానాన్ని నివారించేలా, లేదంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లో బీమ్ లైట్లు ఉపయోగించుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. -
సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
-
సీఎం కాన్వాయ్‌కు ఘనస్వాగతం
పటాన్చెరు: మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు చల్లి తమ అభిమానం చాటుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహారాష్ట్ర పర్యటన వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చారని గుర్తుచేశారు. రైతాంగానికి అండగా నిలవాలన్న ఉన్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరిస్తున్నారన్నా రు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్టాభివద్ధికి పెనుముప్పుగా మారిన ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని, వచ్చే ఎన్నిక ల్లో వారికి డిపాజిట్లు సైతం దక్కే పరిస్థితులు లేవని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జహీరాబాద్: సీఎం కాన్వాయ్ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మండలకేంద్రానికి చేరుకుంది. కాగా హుగ్గెల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం వాహనంపై పూలు చల్లి స్వాగతం పలికారు. సీఎం తన వాహనంలో నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్ర సరిహద్దు వద్ద కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, డీఎస్పీ రఘు, సీఐ భూపతి ఈ పర్యటనను పర్యవేక్షించారు. 65వ జాతీయ రహదారి పొడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం కాన్వాయ్ రహదారిపై ఎక్కడా ఆగకుండా కర్ణాటకలోకి ప్రవేశించింది. -
మహారాష్ట్రలో అడుగుపెట్టిన సీఎం కేసీఆర్..సోలాపూర్‌లో రాత్రి బస
Updates. ►ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. కాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాత్రి సోలాపూర్‌లోనే రాత్రి బస చేయనున్నారు. ►మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్ఎస్ సభలో ఎన్సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాలే్క.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారు. ►సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ జాతీయ రహదారి 65 నుండి బై పాస్ రోడ్డు మీదుగా భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తరలివెళ్లారు. ► జహీరాబాద్ జాతీయ రహదారి 65 వెంట భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు తరలిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ తీయ రహదారిపై కొహీర్ క్రాస్ రోడ్డు వద్ద, హుగ్గేలీ వై జంక్షన్, అల్గోల్ క్రాస్ రోడ్డు, చిరాగ్ పల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు నుంచి చేతులు ఊపి అభివాదం చేశారు. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వస్తుండడంతో బై పాస్ రోడ్డు పై ట్రాఫిక్ ను పోలీసు అధికారులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి తరలిన అనంతరం ట్రాఫిక్‌ను వెళ్ళనిచ్చారు. ► జహీరాబాద్ దాటి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించిన సీఎం కాన్వాయ్ ► సంగారెడ్డి జిల్లా దాటిన సీఎం కాన్వాయ్ ► సీఎం పర్యటన సందర్భంగా గులబీమయమైన హైదరాబాద్- ముంబై జాతీయ రహదారి ► కార్యకర్తలకు అభివాదం తెలుపుకుంటు వెళ్లిన సీఎం సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. - ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. - రోడ్డు మార్గంలో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు. - దాదాపు 600 కార్లతో ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్ బయలుదేరింది. - సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉంటారు. ఈ సందర్బంగా పండరీపూర్‌లో విఠలేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. - సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి.. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. -
బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోనూ భారత్ రాష్ట్ర సమితి బలోపేతానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లనున్న సీఎం..తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎంపీ వేణుగోపాలచారి.. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో కలిసి సమన్వయం చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు. పండరీపూర్, తుల్జాపూర్లో ప్రత్యేక పూజలు షోలాపూర్‌లో రాత్రి బస అనంతరం మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్ఎస్ సభలో ఎన్సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాలే్క.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారు. భారీ ఏర్పాట్లు.. తెలంగాణ ఉద్యమ సమయంలో భారీ కార్ల ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించిన కేసీఆర్, బీఆర్ఎస్ బలోపేతానికి ప్రస్తుతం అదే తరహా వ్యూహానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో రోడ్డు మార్గాన ప్రయాణించడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 65వ నంబరు జాతీయ రహ దారి పొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ భారీయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వాహన కాన్వాయ్‌లో పలువురు కేబినెట్ మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు సీఎం వెంట వెళ్లనున్నారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గత ఏడాదిలో బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, కాందార్ లోహ, ఔరంగాబాద్, నాగపూర్‌లో జరిగిన సభలు, సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. నాగపూర్‌లో పార్టీ తొలి శాశ్వత కార్యాలయాన్ని కూడా ప్రారంభించడంతో పాటు ఔరంగాబాద్, షోలాపూర్, పుణే, ముంబయిలోనూ శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సభ్యత్వ నమోదుతో పాటు 45 వేల జనావాసాల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తుండగా, ప్రస్తుతం కేసీఆర్ రెండురోజుల పర్యటన బీఆర్ఎస్కు మరింత ఊపు తెస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్డు మార్గంలో 315 కిలోమీటర్లు.. సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో మంత్రులు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సీఎం కేసీఆర్ అల్పాహారం చేస్తారు. ఉదయం 10 గంటల సమయంలో సుమారు 500 వాహనాలు అనుసరిస్తుండగా 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు బయలుదేరతారు. కూకట్పల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. ఆ రాష్ట్రంలోని హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా సాయంత్రం నాలుగు గంటలకు మహారాష్ట్రలోని ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి షోలాపూర్‌కు బయలుదేరతారు. హైదరాబాద్ నుంచి మొత్తం సుమారు 315 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణానంతరం రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ చేరుకున్న పొంగులేటి, జూపల్లి -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన..
సాక్షి, జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి మహిళా పోలీస్ అధికారి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం.. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. కాన్వాయ్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ జారీ జాతీయ రహదారిపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపి వేశారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. కాన్వాయ్ నుంచి జారిపడ్డ మహిళా అధికారి
-
‘ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం?’.. పంజాబ్ సీఎంపై విమర్శలు!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని ఆరోపించాయి. గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ కార్లు తన కాన్వాయ్‌లో ఉనియోగిస్తున్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో గత ముగ్గురు సీఎంలను మించి కార్లు వినియోగిస్తున్నారని, ఇది వీఐపీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నాయి. సామాన్యుడి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా. ఆయన ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘షాకింగ్ విషయం.. 2007-17 వరకు సీఎం బాదల్ 33 వాహనాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదే కొనసాగించారు. కానీ, ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. సీఎం భగవంత్ మాన్ తన కాన్వాయ్‌లో 42 కార్లు ఉపయోగిస్తున్నారు.’ అని పేర్కొన్నారు పంజాబ్ అసెంబ్లీలో విపక్ష నేత ప్రతాప్ సింగ్. సెప్టెంబర్ 20, 2021 నుంచి మార్చి 16, 2022 వరకు సీఎంగా చేసిన చరణ్ జీత్ సింగ్ చన్నీ కెప్టెన్‌తో పోలీస్తే మరో ఆరు కార్లు ఎక్కువగా ఉనియోగించినట్లు చెప్పారు. భారీ స్థాయిలో కాన్వాయ్‌ని ఉపయోగించి పంజాబ్ ప్రజలకు సీఎ మాన్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును నిర్లక్ష్యంగా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కాన్వాయ్‌ని ఎలా ఉపయోగిస్తారు? అంటూ దుయ్యబట్టారు. అయితే.. ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీ. Shocking revelation- CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm — Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్.. రూ.10 వేల తక్షణ సాయం, వీల్ ఛైర్
శంఖవరం : పుట్టుకతోనే బుద్ధిమాంద్యం గల బాలుడి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఔదార్యం మరోమారు ప్రశంసలు అందుకుంది. గురువారం సీఎం పాయకరావుపేట పర్యటనలో రోడ్డు పక్కన విలపిస్తున్న ఓ తల్లిని గమనించడం, కాన్వాయ్ ఆపించి ఆమెతో మాట్లాడటం, రెండు గంటల్లోనే ఆమె కుమారుడు ధర్మతేజకు వికలాంగ పింఛన్ మంజూరు కావడం, తక్షణ సాయంగా రూ.10 వేలు, రూ.30 వేల విలువైన వీల్ ఛైర్‌ను కలెక్టర్ కృతికా శుక్లా ద్వారా అందజేయడం తెలిసిందే. (చదవండి: మానవత్వమై నిలిచి..) వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా గురువారం మంజూరు పత్రం అందజేసినప్పటికీ, సీఎం ఆదేశాలతో 24 గంటలు తిరక్కుండానే శుక్రవారం పింఛన్ సొమ్ము అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం సచివాలయంలో నక్కా ధర్మతేజకు ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యంలు పింఛన్ అందజేశారు. అతి తక్కువ సమయంలో తమ సమస్యను పరిష్కరించినందుకు బాలుడి తల్లిదండ్రులు నక్కా చక్రరావు, తనూజ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ) -
మానవత్వమై నిలిచి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం కనిపించింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన సీఎం.. దిగి నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. బుద్ధిమాంద్యం గల కుమారుడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని ఆమె విన్నవించింది. ఈమె కష్టం తీర్చండని సీఎం కలెక్టర్‌ను ఆదేశించిన రెండు గంటల్లోనే తక్షణ సాయంగా ఆమెకు రూ.10 వేలు అందింది. ఆ బాలుడికి వికలాంగ పింఛన్ మంజూరైంది. రూ.35 వేల విలువైన వీల్ ఛైర్ అందింది. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/నక్కపల్లి: రోడ్డు పక్కన కన్నీటితో కనిపించిన ఓ తల్లిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఆపించి, వాహనం నుంచి కిందకు దిగి సాయం చేసిన తీరు ప్రశంసలందుకుంటోంది. గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో రోడ్డుకు ఇరువైపులా జనం జై జగన్ అంటూ జేజేలు పలుకుతున్నారు. వారి మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం సీఎం కంట పడింది. వెంటనే కాన్వాయ్‌ని రోడ్డుపైనే ఆపించి, ఆయన బస్సు దిగారు. అక్కడ ఉన్న వారంతా ఏం జరిగిందా అని ఉత్కంఠగా చూస్తుండగా.. సీఎం నేరుగా నడుచుకుంటూ ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఎందుకు ఏడుస్తున్నావని ఆరా తీశారు. ‘నా పేరు తనూజ. మేం నిరుపేదలం. మాది ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామం. నా ఎనిమిదేళ్ల కుమారుడికి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మీరే ఆదుకోవాలి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. బాలుడి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి తీవ్రంగా చలించిపోయారు. సీఎం ఆదేశాల మేరకు పింఛన్ మంజూరు పత్రాన్ని అందిస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆ బాలుడికి తక్షణమే సాయం అందించాలని అక్కడే ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. తప్పకుండా ఆదుకుంటామని తనూజకు ధైర్యం చెప్పి ముందుకు సాగారు. మధ్యాహ్నం1.30 గంటలకు సీఎం అక్కడి నుంచి వెళ్లగా, రెండు గంటల వ్యవధిలోనే.. 3.30 గంటలకు బాధిత తల్లీ, కుమారుడిని కలెక్టర్ కాకినాడకు రప్పించారు. తక్షణ సాయంగా రూ.10 వేలు తనూజకు అందజేశారు. వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా మంజూరు పత్రాన్ని అందించారు. బాలుడికి నిత్యం ఉపయోగపడేలా రూ.35 వేలు విలువ చేసే వీల్‌చైర్‌ను అందజేశారు. బాలుడి పరిస్థితి తన దృష్టికి రాగానే రెండు గంటల వ్యవధిలోనే సాయం అందించి ఆదుకున్న సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తనూజ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం మానవత్వంతో స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
ఒంగోలు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా స్వాధీనం (సీజ్) చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్ రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం ప్రైవేటు ట్రావెల్స్ కారులో తిరుమలకు బయల్దేరింది. బుధవారం రాత్రి టిఫిన్ కోసం ఒంగోలులో ఆగారు. అక్కడికి వచ్చిన ఒంగోలు రవాణా శాఖ అధికారులు సీఎం కాన్వాయ్ కోసమంటూ వారి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఈ ఉదంతంపై విచారించారు. ఒంగోలు అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు పి.తిరుపాల్‌రెడ్డి ఇందుకు బాధ్యులుగా నిర్ధారించారు. అసిస్టెంట్ ఎంవీఐని సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు తిరుపాల్ రెడ్డిని పోలీసు శాఖకు సరెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘తిరుమల వెళ్తున్న భక్తులపట్ల ఒంగోలు రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణిస్తున్నాం. సీఎం కాన్వాయ్ కోసమని ప్రైవేటు వాహనాలు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. ఒంగోలు అసిస్టెంట్ ఎంవీఐ అడుసుమల్లి సంధ్య, హోంగార్డు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదు. భక్తులకు ఇబ్బంది కలిగించిన ఉదంతంలో వారిద్దరూ బాధ్యులని విచారణలో వెల్లడైంది. వారిపై చర్యలు తీసుకున్నాం’ అని రవాణా శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నాం : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు: తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును స్వాధీనం చేసుకోవడం దురదృష్టకర ఘటన అని, ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నామని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం సభా వేదిక, ఏబీయం కాలేజీ ఆవరణలో హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో కలిసి బాలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. -
కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్
కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలోనే 108 అంబులెన్స్ రావడంతో దానికి దారిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకులకు హాజరయ్యే క్రమంలో కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఒక అంబులెన్స్ వెనకాలే వచ్చింది. అంబులెన్స్ సైరన్ వినగానే దానికి దారివ్వలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. దాంతో అధికారులు కాన్వాయ్‌ను ఒక పక్కకు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. ఆపై సీఎం జగన్ ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రాముని కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. -
సీఎం కాన్వాయ్‌లో 108 రయ్ రయ్..
గన్నవరం: తన పర్యటన సందర్భంగా ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మంగళవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. సరిగ్గా సీఎం కాన్వాయ్ గన్నవరం వద్ద జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై సీఎం కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌ను ముందుకు పంపించారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది. అక్కడ సీఎంను కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తదితరులు ఉన్నారు. -
సీఎం కాన్వాయ్ వెంట మహిళ పరుగు..ఓఎస్డీని పంపిన సీఎం..!
రేణిగుంట: తిరుపతిలో 29వ సదరన్ జోనల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి వెళుతున్న సీఎం కాన్వాయ్ వెనుక ఓ మహిళ అర్జీ చేత పట్టుకుని సార్.. సార్.. అంటూ పరుగులు తీసింది. కారు అద్దంలో నుంచి గమనించిన సీఎం వైఎస్ జగన్.. వెంటనే కారు ఆపి వెనుక కూర్చున్న ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని ఆమె వద్దకు పంపించారు. ఆయన వెళ్లి సమస్యను తెలుసుకుని అర్జీ స్వీకరించారు. విజయకుమారి సమస్య తెలుసుకుంటున్న ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి తనకు ఉద్యోగం ఇప్పించాలని, జీవనం కష్టతరంగా మారిందని అర్జీలో పేర్కొంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కూడా అనారోగ్య విషయమై అర్జీ ఇచ్చారు. స్పందించి వాహనాన్ని ఆపిన సీఎంకు విజయకుమారి ధన్యవాదాలు తెలిపారు. -
సీఎం కాన్వాయ్‌నే ఆపేశారు..
పూణే : గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తరలిన అంబులెన్స్‌కు దారిఇచ్చేందుకు ఏకంగా తన కాన్వాయ్‌ను నిలిపివేసిన పూణే ట్రాఫిక్ పోలీసులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గ్రీన్ కారిడార్‌ను రూపొందించిన పుణే పోలీసులు ఇలా వేగంగా అవయవాలను సంబంధిత ఆస్పత్రికి చేర్చడం ఇది వందో సారి కావడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూణే రుబీ హాల్ క్లినిక్‌లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సోలాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రి నుంచి చార్టర్డ్ విమానంలో పూణేలోని లోహెగావ్ విమానాశ్రయానికి చేరుకున్న దాత గుండె చేరుకుంది. రుబీ హాల్ ఆస్పత్రికి తరలాల్సిన గుండెను సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు గ్రీన్ కారిడార్‌పైకి తీసుకురాగా, అదే సమయంలో సీఎం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోకి వెళుతోంది. సీఎం కాన్వాయ్‌ను వేచిఉండాలని, గ్రీన్ కారిడార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తాము కోరామని అధికారులు తెలిపారు. పూణే ట్రాఫిక్ పోలీసులు చర్యను ప్రశంసిస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. రోగి సకాలంలో గుండె మార్పిడి చికిత్సను పొంది సత్వరమే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్ కాన్వాయ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ప్రజలు తనను నమ్మి కట్టబెట్టిన అఖండ విజయానికి అనుగుణంగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ.. జనసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా వడివడిగా సుపారిపాలన అందిస్తున్నారు. ఈ క్రమంలో తన అధికారిక పర్యటనలు, రాకపోకల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు. తాజాగా శనివారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ వెళుతుండగా.. బెంజ్ సర్కిల్ సమీపంలో ఓ ప్రైవేటు అంబులెన్స్ అటుగా వచ్చింది. మొదట అంబులెన్స్‌కు దారి ఇచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్ తన కాన్వాయ్‌ను ముందుకుపోనిచ్చారు. ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్ వ్యవహరించడం, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్ జగన్ ముందుకుసాగడం.. ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న ఆయన మానవీయ హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని దీనిని గమనించిన స్థానికులు పేర్కొంటున్నారు. -
సీఎం వైఎస్ జగన్ భద్రత ఇలాగేనా?
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని వందేమాతరం హైస్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు. సీఎం కాన్వాయ్ పెనుమాక నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా తాడేపల్లి వైపుకు వస్తున్న సమయంలో ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లే వాహనాలను ఒక్కసారిగా వదిలేశారు. దీంతో అతి తక్కువ వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు సీఎం కాన్వాయ్‌లో కలిసిపోయాయి. ఇలా, సీఎం ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం ఆయన భద్రతకు ముప్పని పోలీస్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తన వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసు, సీఎంవో అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీస్, భద్రతా అధికారులు అన్వేషిస్తున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం) -
సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు
టీనగర్: సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నై రాజా అన్నామలైపురంలో మంత్రుల నివాసగృహాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం ఎడపాడి పళనిస్వామి కుటుంబం నివసిస్తోంది. శనివారం ఉదయం సచివాలయానికి వెళ్లేందుకు సీఎం ఎడపాడి బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కారుకు ముందు, వెనుక భద్రతా వాహనాలు బారులుతీరాయి. సీఎం వాహనం కామరాజర్ రోడ్డులో వస్తుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నలుగురు యువకులు సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డారు. దీంతో వెంటనే దిగ్భ్రాంతి చెందిన పోలీసులు యువకులను అరెస్టు చేసి అన్నాస్క్వేర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో వారు పల్లికరనైకు చెందిన శ్రీనివాస్, అతని స్నేహితులని తెలిసింది. వీరు విద్రోహచర్యకు పాల్పడేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
► సీఎం బందోబస్తు పేరుతో వాహనాల నిలిపివేత ► కారులోనే గుండెపోటుతో వృద్ధురాలి మృత్యువాత సాక్షి సూర్యాపేట: పోలీసుల అత్యుత్సాహానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన సూర్యాపేటలో మంగళవారం జరిగింది. పట్ట ణంలోని శ్రీరాంనగర్‌లో సోమా అంజయ్య, లక్ష్మమ్మ(65) కుటుంబం నివాసం ఉంటోంది. లక్ష్మమ్మ ఉదయం 11 గంటలకు గుండెపో టు, ఆస్తమాతో బాధపడుతుండగా.. స్థానిక గాయత్రి నర్సింగ్ హోంలో చికిత్స చేయించేందుకు కారులో బయలుదేరారు. అయితే మంగళవారం ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభో త్సవానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ మార్గ మధ్యలో సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటి వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగా రు. అదే సమయంలో అటుగా వస్తున్న లక్ష్మమ్మ కారును పోలీసులు ఆపేశారు. ముందుగా ఫ్లై ఓవర్ కింది నుంచి ఆస్పత్రికి వస్తుండగా.. అటుకాదు మరోవైపు నుంచి వెళ్లాలని పోలీసులు కారును మళ్లించారు. అనంతరం 60 ఫీట్ల రోడ్డు నుంచి వస్తుండగా అక్కడ ఉన్న పోలీసులు నిలిపి వేశారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, గుండెపోటుతో ఉన్న ఆమెకు వైద్యం అంద కపోతే ఇబ్బంది అవుతుందని పోలీసులను బతిమిలాడినా స్పందించలేదని అంజయ్య వాపోయారు. దీంతో తన భార్యను బతికిం చమని డాక్టర్ వద్దకు పరుగు పెట్టానని, డాక్టర్ కారు వద్దకు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని బోరున విలపించాడు. పోలీసులు ఆటంకం కలిగించలేదు.. సోమా లక్ష్మమ్మ వస్తున్న వాహనానికి పోలీసులు ఆటంకం కలిగంచలేదని సూర్యాపేట ఎస్పీ పరిమళ హననూతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కాన్వాయ్ వస్తున్నప్పటికీ లక్ష్మమ్మ వాహనాన్ని అడ్డుకోవద్దని సెట్లో చెప్పి వైద్య సేవలు అందించేలా ప్రయత్నించామని ఎస్పీ పేర్కొన్నారు. లక్ష్మమ్మకు వైద్యసేవలు అందించాలని డాక్టర్ రామ్మూర్తిని తీసుకెళ్లింది కూడా పోలీసులే అని తెలిపారు. లక్ష్మమ్మ పదేళ్లుగా పేషెంట్‌గా ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు. -
కరీంనగర్ కలెక్టరేట్లో కలకలం
కరీంనగర్ అగ్రికల్చర్: కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి బయలుదేరుతున్న సమయంలో కలెక్టరేట్లో ఒక్కసారిగా దూకి క్రిమిసంహారక మందుతాగాడు. పోలీసులు అప్రమత్తమై యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడవెల్లికి చెందిన లచ్చుమల్లు, చిన్నవ్వల కుమారుడు పర్వతం గోపి(25) డిగ్రీ చదివి ఖాళీగానే ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు, ఒక చెల్లెలు, అన్న ఉన్నారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. ఒకరు పుట్టింట్లోనే ఉంటున్నారు. చెల్లి చదువుకుంటోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉం ది. తండ్రి లచ్చుమల్లు(65)కు గతంలో రూ.200 వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఆధార్‌కార్డులో లచ్చుమల్లు వయస్సు 65కు బదు లు 25గా ముద్రితమైంది. దీంతో ప్రస్తుతం పింఛన్ రావడం లేదు. ఆధార్‌లో తండ్రి వయస్సు సవరించి, పింఛన్ ఇప్పించాలని మండల కార్యాలయాల్లో, కలెక్టరేట్లో జరి గే ప్రజావాణిలో పలుమార్లు అర్జీలు సమర్పించినా ఫలితం లేకపోరుుంది. మరోవైపు ఉద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోపి మనస్తాపం చెందాడు. సోమవారం సీఎం కేసీఆర్ వస్తున్న విషయం తెలుసుకుని.. ఇంటివద్ద నుంచే క్రిమిసంహార మం దు, బ్లేడు వెంట తీసుకొని వచ్చాడు. ముందుగా ఎల్ఎండీ గెస్ట్‌హౌస్ వద్దే సీఎంను కలుసుకోవాలనుకున్నాడు. పరిస్థితి అనుకూలించకపోవడంతో కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. పోలీసు బందోబస్తు ఉండగానే కలెక్టరేట్‌లోనికి ప్రవేశించి పోర్టికో సమీపంలో ని వికలాంగుల శాఖ కార్యాలయం ఎదుట నిరీక్షించాడు. సీఎం అధికారులతో సమీక్షను ముగించుకుని భోజనానికి బయలుదేరే క్రమంలో కిందికి రాగానే.. గోపి కాన్వాయిలోకి ప్రవేశించి క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలిసిన సీఎం కేసీఆర్ వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అధికారులు గోపిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సీఎం కాన్వాయ్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
రెస్ట్ హౌస్ నుంచి సేఫ్ హౌస్
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సీఎం సేఫ్ హౌస్ (తాడేపల్లి పోలీసుస్టేషన్), సేఫ్ హాస్పటల్ (మణిపాల్ ఆస్పత్రి)కు మంగళవారం పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. తొలుత సీఎం సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి ఉండవల్లి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి కూడలి, తాడేపల్లి ప్రధాన రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్ వరకు, తిరిగి పాత జాతీయ రహదారి ముగ్గురోడ్డు, పోలకంపాడు మీదుగా ఉండవల్లి ఊరు దాటిన తరువాత కొండవీటి వాగు వంతెన మీదుగా కరకట్టపై ఉన్న సీఎం నివాసానికి కాన్వాయ్ చేరుకుంది. కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, బోటు యార్డు, ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్‌పేట మీదుగా జాతీయ రహదారి వెంబడి వారధి వద్ద ఉన్న సేఫ్ హాస్పిటల్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్కి సేఫ్ హాస్పటల్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, తిరిగి నివాసానికి చేరుకోవడానికి పది నిమిషాల సమయం పట్టింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది, నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సీఐ హరికృష్ణ, ఎస్ఐలు వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధు కాన్వాయ్‌లో కొత్త కారు
‘కాకిపిల్ల’ కూర్చున్నందుకే వాహనాన్ని మార్చారా!. బెంగళూరు: మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు తానే అలాంటి విశ్వాసానికి తలొగ్గారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌లోని కారును మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం కాన్వాయ్‌లో సీఎం ప్రయాణించే వాహనాన్ని మూడేళ్లకే మార్చేశారు. కోరమంగళ రీజనల్ ఆర్టీఓ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ పొందిన సరికొత్త ఫార్చునార్ కారు సీఎం కాన్వాయ్‌లో శనివారం చేరింది. అయితే మూడేళ్ల వ్యవధికే కారును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కారును మార్చేందుకు ఎలాంటి సాంకేతిక సమస్య కారణం కాదని తెలుస్తోంది. కాన్వాయ్‌లోని సీఎం ప్రయాణించే కారుపై గత వారంలో ఓ కాకిపిల్ల కూర్చొని కాసేపు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ విషయంపై విస్తృత చర్చ జరిగింది. వాహనంపై కాకిపిల్ల వాలడం ఏదో సమస్య తలెత్తనుందనే సంకేతాన్ని అందజేస్తోందంటూ జ్యోతిషులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకిపిల్ల వాలడాన్ని అపశకునంగా భావించిన సీఎం సిద్ధరామయ్య ఆ వాహనం స్థానంలో కొత్త కారును చేర్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తానని పదే పదే చెప్పుకునే సీఎం సిద్ధరామయ్య కాకిపిల్ల కూర్చుందన్న కారణంతోనే కారు మార్చడమేమిటనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.