సాక్షి,తెలంగాణ : మీరు రాత్రి సమయాల్లో వాహనం నడుపుతున్నారా? ప్రయాణ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లో బీమ్ లైట్లను వినియోగించాలని రవాణా శాఖ కోరుతుంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ వాహనాలలో లో బీమ్ లైట్లను వినియోగించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను ఉదహరిస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం లో బీమ్‌తో ప్రయాణించింది. తోటి వాహనదారుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు లో బీమ్‌లో ప్రయాణించాయని, మీరు కూడా లో బీమ్‌ను వినియోగించాలని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula ’s entire convoy is using low beams.
The reason is, they want to understand what is behind them.
Let us all learn from them and Use low beams when we are too close to vehicle in front and road is well lit!@HiHyderabad @HYDTP pic.twitter.com/FgRZpC3Gn0— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) December 19, 2024
‘లో బీమ్ లైట్ల’ డ్రైవింగ్‌తో ఉపయోగాలు
అవాంతరాలు లేని ప్రయాణం: నగరాలు, ఇతర రహదారుల్లో లో బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురుగా ఉన్న ఇతర వాహనాలు నడిపై డ్రైవర్ కళ్లకు అంతరాయం ఉండదు. మార్గ మధ్యలో ఎలాంటి అడ్డంకులున్నా సులభంగా గుర్తించవచ్చారు.
భద్రత: హై బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురు వస్తున్న వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. ప్రమాదానికి కారణమవుతాయి. లో బీమ్ లైట్లతో ప్రమాదాల్ని నివారించవచ్చు.
తోటి వాహనదారుల సంక్షేమం: లో బీమ్ లైటన్లను ఉపయోగించడం ఎదురుగా వాహనాల్లో వస్తున్న వాహనదారుల సంక్షేమాన్ని కోరిన వారిమవుతాం. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కొనసాగేందుకు ఉపయోగపడుతుంది.
నిబంధనలు: అనేక నగరాల్లో జరిగే ప్రమానాన్ని నివారించేలా, లేదంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లో బీమ్ లైట్లు ఉపయోగించుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment