
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ప్రజలు తనను నమ్మి కట్టబెట్టిన అఖండ విజయానికి అనుగుణంగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ.. జనసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా వడివడిగా సుపారిపాలన అందిస్తున్నారు. ఈ క్రమంలో తన అధికారిక పర్యటనలు, రాకపోకల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు.
తాజాగా శనివారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వెళుతుండగా.. బెంజ్ సర్కిల్ సమీపంలో ఓ ప్రైవేటు అంబులెన్స్ అటుగా వచ్చింది. మొదట అంబులెన్స్‌కు దారి ఇచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్ తన కాన్వాయ్‌ను ముందుకుపోనిచ్చారు. ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్ వ్యవహరించడం, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్ జగన్ ముందుకుసాగడం.. ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న ఆయన మానవీయ హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని దీనిని గమనించిన స్థానికులు పేర్కొంటున్నారు.