benz circle
-
విజయవాడ బెంజి సర్కిల్ లో ప్రమాదం
-
పూల మొక్కలతో ఆకర్షణీయంగా విజయవాడ బెంజ్ సర్కిల్
-
ఏప్రిల్ 1న వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 1న వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. చదవండి: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స -
కేంద్రం తరపున ఏపీకి కిషన్ రెడ్డి హామీ
-
నితిన్ గడ్కరికి సీఎం వైఎస్ జగన్ మర్చిపోలేని సన్మానం
-
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ను ప్రారంభించిన నితిన్ గడ్కరి,సీఎం వైఎస్ జగన్
-
గురువారం బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
-
రేపు బెంజ్ సర్కిల్ వెస్ట్ సైడ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ నితిన్ గడ్కరి
-
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉదయం రోడ్లు ఊడుస్తున్న కార్పొరేషన్ సిబ్బందిపైకి కారు వేగంగా దూసుకుపోయింది. గాయపడినవారిని 108లో ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ఢీకొట్టడంతో కార్పొరేషన్‌కు చెందిన వాహనం(ఆటో) తీవ్రంగా దెబ్బతింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి -
10న బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ప్రారంభం
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అనతి కాలంలో నిర్మాణ పనులు పూర్తి అయిన బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈ నెల 10న సీఎం వైఎస్ జగన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. రవాణా, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వి.ప్రసన్నతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జిని, ప్రారంభోత్సవ ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం, కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. విజయవాడలోని స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటెల్ హోటల్ మధ్య రూ.88 కోట్లతో 2.47 కి.మీ. మేర అనుకున్న సమయానికే నిర్మించారన్నారు. దీని వల్ల ఆ మార్గంలోని పలు జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. -
బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్ సక్సెస్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నిర్మించిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీంతో అధికారులు శనివారం ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాలను వదిలి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. రామవరప్పాడు వైపు వెళ్లే వాహనాలు స్క్రూబ్రిడ్జి వద్ద ఫ్లైఓవర్‌పైకి వెళ్లి వినాయక థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపైకి దిగుతాయి. బెంజి సర్కిల్‌తోపాటు నిర్మలా కాన్వెంట్ జంక్షన్, రమేష్ ఆస్పత్రి జంక్షన్లను కలుపుతూ రూ.90 కోట్ల ఖర్చుతో రెండో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మొదటి ఫ్లైఓవర్ కంటే రెండో ఫ్లైఓవర్ ఏడాదిలోపే నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడం విశేషం. మొదటి ఫ్లైఓవర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నాలుగేళ్లకు కానీ పూర్తి కాలేదు. కాగా, ప్రస్తుతం బెంజి సర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆస్పత్రి జంక్షన్ల వద్ద ఓవైపే ఫ్లైఓవర్ ఉండటంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం రెండో ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. -
బెంజ్ సర్కిల్ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా నలుగుతూ వస్తున్న విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ల సర్వీసు రోడ్ల నిర్మాణ వివాదానికి హైకోర్టు ధర్మాసనం తెర దించింది. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే మొదటి ఫ్లై ఓవర్‌కు తూర్పు వైపున, చెన్నై నుంచి కోల్‌కతా వైపు వెళ్లే రెండో ఫ్లై ఓవర్‌కు పడమర వైపున సర్వీసు రోడ్డు నిర్మించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రెండు ఫ్లై ఓటర్ల పక్కన నిబంధనల ప్రకారం 7.5 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్డు నిర్మించాలంది. సర్వీసు రోడ్ల నిర్మాణ బాధ్యత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)దేనని, ఆ బాధ్యత నుంచి ఆ సంస్థ తప్పుకోజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లో సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. సర్వీసు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ఎవరు సేకరించాలి.. అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలన్న అంశాలు ప్రజానీకానికి అవసరం లేదంది. అది ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, ఏ కారణం చేత కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకూడదని స్పష్టం చేసింది. ఫకీరుద్దీన్ జంక్షన్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే ఫ్లై ఓవర్ (మొదటిది)కు తూర్పు వైపున సర్వీసు రోడ్డు నిర్మించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్హెచ్ఏఐ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇదే సమయంలో రెండో ఫ్లై ఓవర్‌కు పడమర వైపున సర్వీసు రోడ్డు నిర్మాణంతో పాటు ఫకీరుద్దీన్ జంక్షన్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు సింగిల్ జడ్జి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్థానికులు దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్‌సర్కిల్ వద్ద రెండో ఫ్లైవోవర్ నిర్మాణాన్ని సవాలు చేయడంతో పాటు ఫ్లైవోవర్ వెంట సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాల్లో సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బెంజ్ సర్కిల్ వద్ద రెండో ఫ్లైవోవర్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇదే అంశంపై సింగిల్ జడ్జిల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మరో రెండు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘స్లిప్’ రోడ్ వేసేందుకు నిబంధనలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. ఈ రోడ్డు ద్వారా స్థానికులు సులభంగా రాకపోకలు సాగించవచ్చన్నారు. ఫ్లైవోవర్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ అంజనేయులు వాదనలు వినిపిస్తూ రెండో ఫ్లైవోవర్‌కు పశ్చిమం వైపు 10 మీటర్ల మేర సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం లేదని, దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారుల సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం స్థలం సేకరించి ఇస్తే.. వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు భూమి పూజ, శిలాఫలకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం నాగపూర్ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన పలు ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గడ్కరీ ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.8,869 కోట్లతో 28 ప్రాజెక్టులు ► ఏపీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2014లో మేము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఈ అయిదేళ్లలో కొత్తగా 2,667 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ► రాష్ట్రంలో రూ.8,869 కోట్లతో మొత్తం 28 ప్రాజెక్టులు చేపడుతున్నాం. 2,209 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయి. ► రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకం. పోర్టు కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ జాబితా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ మేరకు పనులు చేపడతాము. ► అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతాయి. అదే విధంగా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు కూడా చేపడదాం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు (సీఎం జగన్) ఢిల్లీకి రండి. అక్కడ అన్నీ చర్చిద్దాం. ► భూసేకరణలో మీ వాటా 50 శాతం కొంత భారం అంటున్నారు కాబట్టి, రోడ్డు నిర్మాణంలో వాడే వాటి మీద మైనింగ్ సెస్ లేక రాయల్టీ, స్టీల్, సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీలో మినహాయింపు ఇవ్వండి. తద్వారా కేంద్రంపై ప్రాజెక్టు భారం కాస్త తగ్గుతుంది. ► విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇవాళ దేశానికే గర్వకారణం. నేను కూడా చూశాను. అమ్మవారిని దర్శించుకున్నాను. ► దేశంలో ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్ష మంది చనిపోతున్నారు. ఏపీలో కూడా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇప్పటికే మార్చాం. అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ► ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎంఎస్ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు మేము పూర్తి అండగా నిలుస్తాం. ఎంఎస్ఎంఈ మంత్రిగా చెబుతున్నాను. చేనేత, హస్తకళల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇక్కడ వాటికి కొదవ లేదు. ► రాష్ట్రంలో ఉన్న పోర్టులు కూడా అభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తున్నాయి. మీ (సీఎం) విజ్ఞప్తులకు పూర్తి అండగా నిలుస్తాం. వచ్చే నెలలో నేను ఢిల్లీకి వస్తాను. మీరూ, అధికారులు రండి. మీ ఎంపీలు కూడా నన్ను కలుస్తున్నారు. మీరు ఢిల్లీకి వస్తే, అన్నీ మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ► ఈ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు. రహదారుల నెట్‌వర్క్‌కు ఏపీ హబ్ దేశంలో అనేక రహదారుల నెట్‌వర్క్‌కు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా ఉంది. దీని వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. – వీకే సింగ్, కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్ వల్ల విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. రాష్ట్రంలో ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకు మంత్రి గడ్కరీ ఎంతో సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి -
రోడ్లకు మరిన్ని నిధులు
ఫ్లై ఓవర్‌పై రయ్ రయ్ మంటూ.. విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 46 ఒంటి స్తంభాలపై 2.6 కిలోమీటర్ల మేర ఆరు వరుసలు, ఆరు మలుపులతో రూ.502 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను వర్చువల్ విధానంలో నాగపూర్ నుంచి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. దీంతో పాటు బెంజ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు తమ ప్రయాణాలను మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రద్దీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరిన్ని ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. కేంద్ర రహదారుల నిధి నుంచి రావాల్సిన నిధులను త్వరగా ఇప్పించాలని, రాష్ట్రంలో పోర్టులకు రహదారుల కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభం, రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వేగంగా రహదారుల నిర్మాణం ► ఈ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది మొత్తం జాతీయ రహదారుల రూపురేఖలనే మారుస్తోంది. ► 2013–14లో రోజుకు 12 కి.మీ మాత్రమే రహదారుల నిర్మాణం జరగ్గా, ఇప్పుడు ప్రతి రోజూ 30 కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది. వినూత్న విధానంలో ప్రాజెక్టులు ► ప్రాజెక్టుల కోసం భిన్న మార్గాల్లో నిధులు సేకరించడంతో పాటు, టీఓటీ (టోల్–నిర్వహణ–బదిలీ) పద్ధతిలో ప్రాజెక్టులు చేపడుతున్నారు. టీఓటీ ప్రక్రియలో తొలుత 682 కి.మీ.కు సంబంధించి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 442 కి.మీ రహదారులు ఉన్నాయి. ► ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీ దూరదృష్టితో దేశ వ్యాప్తంగా 7,800 కి.మీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలను దాదాపు రూ.3.3 లక్షల కోట్లతో చేపట్టారు. రహదారుల కనెక్టివిటీ వల్ల ఆర్థిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ► గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో రాష్ట్రంలో 375 కి.మీ పొడవైన 6 రహదారులు ఉండడం గమనించవలసిన విషయం. మీ (గడ్కరీ) హయాంలో 2,667 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారులు 6,880 కిలోమీటర్లకు పెరిగాయి. ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషకరం.. అభినందనీయం ► రాష్ట్రంలో ఇవాళ రూ.15,592 కోట్ల విలువైన 1,411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ, వాటిని జాతికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ► గిరిజన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించినందుకు అభినందనలు. ముఖ్యంగా రాజమండ్రి – రంపచోడవరం – కొయ్యూరు – అరకు – బౌడారా – విజయనగరం రహదారి నిర్మాణం. ► తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని సుదూర గిరిజన ప్రాంతాలను కలిపే దాదాపు 380 కి.మీ రెండు లైన్ల రహదారిని ఆమోదించినందుకు ధన్యవాదాలు. ► నాలుగు లైన్ల మైదుకూరు – బద్వేలు – నెల్లూరు, మదనపల్లి – పీలేరు – తిరుపతి, అనంతపురం – గుంటూరు, కర్నూలు – దోర్నాల, అనంతపురం – మైదుకూరు రహదారులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేశారు. ► విజయవాడ బెంజి సర్కిల్ వద్ద పశ్చిమం వైపున మూడు లైన్ల ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని మన్నించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరికొన్ని ప్రతిపాదనలు ► రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. అవి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులు. 1. కేంద్ర రహదారుల నిధి (సీఆర్ఎఫ్) నుంచి 2014 నుంచి 2019 వరకు రూ.2,611 కోట్లు మంజూరు చేశారు. కానీ దురదృష్టవశాత్తు గత ఏడాది 2019–20లో ఏ నిధులూ విడుదల చేయలేదు. కాగా ఇప్పుడు రూ.680 కోట్ల తొలి దశ విడుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పారు. రెండో దశకు సంబంధించి రూ.820 కోట్ల ప్రతిపాదనలను కూడా సమర్పించాం. కాబట్టి వాటిని విడుదల చేయాలి. 2. విజయవాడలో శరవేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని బైపాస్ రహదారులు అవసరం. నగరానికి పశ్చిమం వైపు ఇప్పటికే మంజూరు కాగా, పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. తూర్పు వైపునకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన 189 కి.మీ.కు బదులు 78 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–16ను కలుపుతూ 52 కి.మీ మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఇందులో కృష్ణా నదిపై పెద్ద వంతెనను తొలి దశలో నిర్మించాల్సి ఉంది. దీని వల్ల మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని నిర్మాణం కూడా లాభదాయకంగానే ఉంటుంది. అందువల్ల భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై మోపకుండా ఆ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతున్నాను. 3. వెనకబడిన రాయలసీమ జిల్లాల్లోని ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసే బెంగుళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను భారత్‌మాల తొలి దశలోనే చేపట్టాలి. కొడికొండ చెక్‌పోస్టు, పులివెందుల, ముద్దనూరు, మీదుగా ఆ రహదారి నిర్మాణం జరుగుతుంది. 4. అనంతపురంలో రహదారి విస్తరణ, ఎన్‌హెచ్–42కు అనుసంధానం, నగరంలో ఆర్ఓబీతో సహా నాలుగు లైన్ల రహదారి కోసం 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఇప్పటికే కేటాయించిన రూ.90 కోట్లతో పాటు అదనంగా రూ.220 కోట్లు మంజూరు చేయాలి. 5. ఉభయ గోదావరి జిల్లాలకు మంచి అనుసంధానంగా నిలిచే ఎన్‌హెచ్–216పై నరసాపురం బైపాస్ నిర్మాణంలో భాగంగా వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాల్సి ఉంది. 6. ఎన్‌హెచ్–67లో భాగంగా కావలి, ఉదయగిరి, సీతారామపురం మధ్య ఉన్న రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. 2020–21 జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికలో ఆ మేరకు అదనంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ రహదారి వల్ల నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. 7. రాష్ట్రంలోని ఐదు ప్రధాన పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానించే విధంగా 400 కి.మీ. పొడవైన 25 రహదారుల నిర్మాణం చేపట్టాలి. వాటి నిర్మాణం వల్ల పోర్టులకు, పారిశ్రామిక రంగానికి అనుసంధానం ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థికంగా కూడా అభివృద్ది చెందవచ్చు. 8. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి చేయాలి. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం ఎంతో అవసరం. రాష్ట్రాన్ని సందర్శించండి ► రాష్ట్రంపై మీరు మమకారం చూపుతున్నందుకు, ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నందుకు మనసారా ధన్యవాదాలు. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు చేపట్టి, సకాలంలో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ, సహకారాలు అందజేస్తుంది. ► స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు, భూసేకరణలో కూడా నిరంతరం మీకు తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒకసారి ఇక్కడికి రావాలని కోరుతున్నా. -
నేటితో తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు
సాక్షి, విజయవాడ: ఇక నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. 2.6 కి.మీ పొడవుతో వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది -
మేమున్నామనీ.. మీకేం కాదని..
బెజవాడ బెంజి సర్కిల్ సమీప కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న అధికారికి కరోనా సోకింది. ఆయన కుమార్తె డాక్టర్. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరికీ ఈ విషయం తెలిసింది. అంతా ఒక్కటై.. ‘కరోనా సోకిన విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదు. వెంటనే ఆస్పత్రికి వెళ్లండి. లేదంటే తక్షణమే ఫ్లాట్ ఖాళీ చేయండి’ అని రభస చేశారు. వారిలో ఒకరు కల్పించుకుని.. ‘వాళ్లని వెళ్లగొట్టడం కంటే.. మనమంతా సహకరిద్దాం. ఆ కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే క్వారం టైన్లో ఉంటారు. వాళ్లను బయటకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకుందాం. వారి అవస రాల్ని ఒక్కో రోజు ఒక్కో కుటుంబం నుంచి తీరుద్దాం. ఇలాంటి సమయంలోనే కదా ఒకరికొకరం సాయపడాలి’ అన్నారు. అందరికీ ఆ మాటలు నచ్చాయి. ఇప్పుడక్కడ భయానికి బదులు మానవత్వం వెల్లివిరుస్తోంది. ఇది ఒక్క బెంజి సర్కిల్ ప్రాంతానికే పరిమితం కాలేదు. విజయవాడ నగర పరిధిలోని పటమట, ఎల్ఐసీ కాలనీ, కానూరు తదితర ప్రాంతాలతో పాటు గుంటూరు, కర్నూలు నగరాల్లోని అపార్ట్ మెంట్లలోనూ ఇలాంటి పద్ధతులే నడుస్తు న్నాయి. ‘ఒకరికి ఒకరం తోడుగా ఉందాం.. మానవతా దృక్పథంతో స్నేహాన్ని మరింత పదిలపర్చుకుందాం. కరోనాను తరిమేద్దాం’ అంటూ అంతా కూడబలుక్కుంటున్నారు. ఇందుకు అపార్ట్మెంట్ కమిటీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి. సాక్షి నెట్వర్క్: కరోనా.. అమ్మానాన్నల ప్రేమాభిమానాలను దూరం చేస్తోంది. అన్నదమ్ములను దరిచేరనీయడం లేదు. అక్కా చెల్లెళ్లు ఒకచోట చేరలేని దుస్థితి. అత్త మామల పలకరింపులు లేవు. ప్రాణ స్నేహితులూ పరాయి వాళ్లవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజలు క్రమంగా తమ ఆలోచనా ధోరణులను మార్చుకుంటున్నారు. కరోనా బాధితుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. తోడుగా నిలుస్తూ.. తోడ్పాటు అందిస్తూ.. ► తొలినాళ్లలో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందని తెలిస్తే.. అందరూ ఆ వ్యక్తిని, ఆ ఇంటిని, ఇరుగు పొరుగు వారిని సైతం వెలి వేసినట్టు చూశారు. ► నిర్ణీత దూరం పాటిస్తూ.. మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ.. సహాయం అందిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారనే అవగాహన క్రమంగా పెరు గుతుండటంతో ‘మేమున్నామంటూ..’ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. ► బాధితునితో పాటు ఆ కుటుంబంలోని సభ్యు లందర్నీ ఇంట్లోనే ఉంచి.. రోజువారీ అవసరాలు తీరుస్తున్నారు. ఎవరెవరికి.. ఎప్పుడెప్పుడు.. ఏమేం కావాలో ఫోన్ ద్వారా తెలుసుకుని మరీ సమయానికి ఇస్తున్నారు. మందులు, ఇతరత్రా వస్తువులనూ తెచ్చిస్తున్నారు. ► గుంటూరు శ్యామలా నగర్‌లోని అపార్ట్మెంట్ వాసులు సమావేశమై తమ అపార్ట్మెం ట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే సంబంధిత వ్యక్తి తోపాటు కుటుంబీకులంతా హోమ్ క్వారం టైన్లో ఉండాలని తీర్మానించుకుని.. బాధితుల కు ఇతర కుటుంబాల వారు సాయం చేస్తున్నారు. ► కర్నూలు నగరంలోని గాయత్రి అపార్ట్మెంట్లో ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే అసోసియే షన్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేసి.. ఆ కుటుంబం మొత్తం హోమ్ ఐసోలేషన్‌కు వెళ్తున్నారు. ► వారికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ వంటివి రోజుకొక ఫ్లాట్ వారు సిద్ధం చేసి.. డిస్పోజబుల్స్‌లో సర్ది బాధితుల డోర్ వద్ద పెట్టి ఫోన్ చేసి చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఇలా.. ► విజయవాడ వన్‌టౌన్, పశ్చిమ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల సంఘాల నాయకులు తమ వారిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. క్వారంటైన్లో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ల సాయంతోనే కోలుకున్నా ఇటీవల కరోనా బారిన పడ్డా. ఈ విష యాన్ని అపార్ట్మెంట్ కమిటీ ప్రెసి డెంట్‌కు చెప్పా. నా ఇద్దరు పిల్లలతో 15 రోజుల పాటు హోమ్ క్వారం టైన్లో ఉన్నా. అపార్ట్మెంట్ కమిటీ, నా తోటి స్టాఫ్, వారి కుటుంబ సభ్యులే అన్నీ తెచ్చి ఇచ్చేవారు. వాళ్ల సాయంతో త్వరగానే కోలుకున్నా. –సోమేశ్వరి, స్టాఫ్ నర్సు, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కోలుకునే వరకు ఇస్తూనే ఉంటా మా అపార్ట్మెంట్లో ఒకాయనకు కరోనా సోకడంతో భార్య, ఇద్దరు పిల్లలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వారికి వారానికి సరి పడా కూరగాయలు ఇచ్చి వచ్చా. ఇతర నిత్యా వసర సరుకులు, పాల ప్యాకెట్లు అందజేశా. ఈ పనిని కొందరు తప్పు పట్టారు. కుటుంబ యజ మాని పూర్తిగా కోలుకుని బయటకు వచ్చేవరకూ వారి అవసరాలు తీరుస్తా. –డి.శ్రీనివాస్, దాన వాయిపేట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా -
‘బెంజి’పై రయ్..రయ్
సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్‌రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్‌రన్ సక్సెస్ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్‌రన్ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్ మీదుగా ఏపీ39–టీహెచ్ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. -
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై ట్రయల్‌రన్!
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. సోమవారం సాయంత్రం నుంచి భారీ వాహనాల రాకపోకలకు వీలుగా ట్రయల్‌రన్ నిర్వహించారు. తొలుత కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ట్రయల్‌రన్‌లో భాగంగా మొదట కొత్త లారీ (ఏపీ–39–టీహెచ్ 9786)ని పంపించారు. తర్వాత చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ వంతెన అందుబాటులోకి వస్తే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తీరుతుందని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వంతెనను ప్రారంభిస్తారని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై ప్రమాదాలకు తావులేకుండా రెండు వైపులా రిఫ్లెక్టెడ్ విద్యుత్ లైట్లను పూర్తి స్థాయిలో అమర్చాక రాత్రి వేళ కూడా వాహనాలకు అనుమతిస్తామని తెలిపారు. ట్రయల్‌రన్ ద్వారా తెలుసుకున్న సమస్యలను సరిచేసి పూర్తి స్థాయిలో ఈ వంతెనపై వాహనాల రాకపోకలను అనుమతిస్తామని చెప్పారు. -
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై నేటి నుంచి ట్రయల్‌రన్
-
విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ అక్కరకు రానుంది. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై సోమవారం నుంచి ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయింది. అయితే, ఫ్లైఓవర్ ప్రారంభానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రావాల్సి ఉంది. ఆయన రాష్ట్రానికి వచ్చే తేదీపై స్పష్టత లేకపోవడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ ఆదివారం ‘సాక్షి’కి చెప్పారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎన్హెచ్ఏఐ అధికారులు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌ను సందర్శించనున్నారు. నితిన్ గడ్కరీ రాక తేదీ ఖరారయ్యాక అధికారికంగా ఆయనతో ప్రారంభోత్సవం చేయించనున్నారు. (చదవండి: ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక) -
పచ్చనేతల పిచ్చి డ్రామాలు
-
బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామాకు తెరలేపారు. బెంజ్‌సర్కిల్ వద్దనున్న వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవానికి బుధవారం సాయంత్రం మాజీ సీఎం వచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్రగా వెళ్లడానికి వీల్లేదని, సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసు అధికారులు వివరించారు. బస్సుయాత్రకు కూడా అనుమతి లేని విషయాన్ని స్పష్టంచేశారు. అనుమతి తీసుకుని యాత్ర ప్రారంభించాలని సూచించారు. అయితే వారి మాటను పెడచెవిన పెట్టి చంద్రబాబు సహా నేతలు వాగ్వాదానికి దిగారు. ఆటోనగర్ వెళ్తామంటూ మంకుపట్టు పట్టారు. పోలీసులపై మాజీ సీఎం తీవ్రస్థాయిలో బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. అనంతరం చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని సవాలు విసిరారు. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా మొండిగా రోడ్డుపైనే బైఠాయించారు. స్తంభించిన ట్రాఫిక్.. చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్‌లో బైఠాయించడంతో గంటన్నరపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. చంద్రబాబుతో పోలీసు అధికారులు పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతో ప్రతిపక్ష నేత, జేఏసీ నేతలతోపాటు మాజీ మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. చంద్రబాబు, లోకేష్‌లను ఇంటి వద్ద దింపేశారు. మిగిలిన నేతలను వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. కాగా, బెంజిసర్కిల్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగడంతో నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రాగల 33 రోజుల్లో.. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్!
రాజధాని.. విపరీతంగా పెరిగిన వాహనాలు.. తరచూ ప్రముఖుల రాకపోకలు.. మరోవైపు అధ్వానంగా రోడ్లు.. పలు ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు.. వెరసిసగటు ప్రజానీకానికి విజయవాడలోప్రయాణం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి.. ముఖ్యంగా రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు ట్రాఫిక్ ఒక పద్మవ్యూహంలా పరిణమించింది. అయితే రాగల 33 రోజుల్లో నగరవాసికి ట్రా‘ఫికర్’ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. డిసెంబర్ నెలాఖరుకు పూర్తిస్థాయిలో పనులు ముగించి.. జనవరి ఆరంభంలో ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు సన్నాహాలుచేస్తున్నారు. సాక్షి, విజయవాడ: చాన్నాళ్లుగా ఊరిస్తున్న బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. విజయవాడ– మచిలీపట్నం రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.740 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌కు రూ.82 కోట్లు కేటాయించారు. 1,450 మీటర్ల మేర 49 పిల్లర్లతో నిర్మించిన ఈ వంతెన పనులు మూడేళ్ల క్రితం 2016 నవంబర్‌లో మొదలయ్యాయి. దీని నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావలసి ఉంది. కానీ భూసేకరణలో సమస్యలు, కోర్టు కేసులు, అప్రోచ్‌రోడ్లు, అండర్‌పాస్‌లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు తదితర కారణాల వల్ల వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఈ వంతెన వీలైనంత త్వరగా పూర్తి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పనులు రేయింబవళ్లు జరిగేలా చూడడంతో పాటు స్థానికుల లేవనెత్తిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పనులు శరవేగంగా ముందుకుసాగాయి. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తవుతున్న అప్రోచ్ రోడ్డు.. మరోవైపు ఏలూరు వైపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. దీనిని ప్రధాన రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. అలాగే పకీరుగూడెం వద్ద 14 మీటర్ల వెడల్పుతో జరుగుతున్న అండర్‌పాస్ పనులు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. మరో 20 రోజుల్లో ఈ పనులు కూడా పూర్తికానున్నాయి. రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా పూర్తవుతోంది. ఫ్లైఓవర్‌పై తారు రోడ్డు వేసి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జనవరి ఆరంభంలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెల్లు.. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు చాలావరకు తీరనున్నాయి. ప్రస్తుతం కోల్‌కతా–చెన్నై రహదారిపై లారీలు, బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతుండటం వల్ల నిత్యం వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకు వెళ్లడానికి ఎంతో సమయం పడుతోంది. దీంతో బెంజిసర్కిల్ వైపు వెళ్లడమంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి వాహన చోదకుల్లో నెలకొంది. కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను ఈ వంతెనపై నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్ దిగువ రోడ్లపై భారీ వాహనాల రద్దీ గణనీయంగా తగ్గి ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. -
వామపక్ష నేతల రాస్తారోకోలు, అరెస్ట్
సాక్షి, విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు రాస్తారోకోలు నిర్వహించాయి. ఆర్థిక మాంద్యానికి బీజేపీ వైఖరీనే కారణమని వామపక్షాలు ఆరోపించాయి. పట్టణంలోని బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణతో పాటు వామపక్షాల నేతలు పాల్గొన్నారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్న వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. నల్ల ధనాన్ని వెనక్కి తెస్తానని మాట్లాడిన ప్రధాని చివరకు నల్లధనం కూడబెట్టే వారికే వత్తాసు పలుకుతున్నారనీ ఎద్దేవా చేశారు. ప్రధాని కేవలం కార్పొరేట్ వ్యవస్థని మాత్రమే బాగు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.