
సాక్షి, విజయవాడ : త్వరలోనే బెజవాడ వాసుల కల సాకారం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు అండర్‌పాస్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘అండర్‌పాస్ 15 మీటర్ల వెడల్పు, 5.2 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. అండర్‌పాస్‌ను దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని’ అన్నారు. డిసెంబర్ చివరికి పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు.