Imtiaz
-
సీఎం జగన్ చేసిన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుంది
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎండి ఇంతియాజ్
-
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
Hyderabad: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కుటుంబసభ్యులంతా నేరచరితులే... గుంటూరుకు చెందిన ముజీబ్ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్లపై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. తొలినుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్ సోదరుడు సయ్యద్ ఫిరోజ్ రౌడీïÙట్ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు. -
కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్ లైంగిక వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. -
ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావులకు హైకోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ వారెంట్‌ను అమలు చేసి ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ చేయూత పథకానికి తాము అర్హులమైనా, ఆ పథకాన్ని తమకు వర్తింపజేయడం లేదంటూ కృష్ణా జిల్లా, చందర్లపాడుకు చెందిన పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు, వారికి వైఎస్సార్ చేయూత పథకాన్ని వర్తింపజేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు 2020–21 సంవత్సరానికి నిధులు విడుదల చేశారు. అయితే 2019–20 సంవత్సరానికి నిధులు ఇవ్వకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, ఇంతియాజ్, శ్రీనివాసరావులు కోర్టు ముందు స్వయంగా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ అధికారులిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
అలర్ట్ : ఈనెల 13 వరకు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా ఈనెల 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. (కొనసాగుతున్న వాయుగుండం) భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు పోవద్దని ఆదేశించారు. విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు వారివారి ప్రాంతాల తహశీల్దార్లను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీచేశారు. కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు : బందరు కలెక్టరేట్ : 08672-252572 విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805 సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454 సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486 రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697 -
రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ రద్దు
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యంతో పది మంది రోగుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్రవారం కమిటీ నివేదిక వెల్లడించింది. దీంతో రమేష్ ఆస్పత్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందినట్లు గుర్తించారు. (మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం) రమేష్ ఆస్పత్రి నియంత్రణలో ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆగస్టు 8న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టినట్లు తేలింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వెల్లడైంది. అంతేకాక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేశారని నివేదిక పేర్కొంది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. (మంటలు తీవ్రమైన తర్వాతే సమాచారం ఇచ్చారా?) -
‘తెలుగువారు వచ్చేందుకు రంగం సిద్ధం’
సాక్షి, విజయవాడ: విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న సుమారు 30 వేల మందిని రాష్ట్రానికి తీసుకురావటానికి రంగం సిద్ధం చేశామని అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. రేపు మొదటి విమానం విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రానుందని ఆయన తెలిపారు. అందులో మొదటిగా 19మంది రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రానున్న రెండు వారాలలో జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వారికి రెండు ఆప్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. (సీఎం వైఎస్ జగన్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు) గవర్నమెంట్ క్వారంటైన్, పెయిడ్ క్వారంటైన్లను సిద్ధం చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ హోటల్స్‌లో వెయ్యి గదులను సిద్ధం చేశామని ఆయన అన్నారు. 14 రోజులు క్వారంటన్‌లో ఉండటం తప్పనిసరి ప్రోటోకాల్ అని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. వచ్చేవారిని ఎయిర్‌పోర్టు దగ్గర పర్యవేక్షించటం కోసం ఒక బృందాన్ని, ప్రత్యేక మైన స్క్రినింగ్, ఏ జిల్లా వారైతే ఆ జిల్లాకు పంపేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు కూడా ఒక అధికారుల బృందాన్ని పంపామని, అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి వచ్చేవారిని సైతం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. (‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’) జిల్లాలో 32 క్వారంటైన్ సెంటర్లలో ఐదు వేల బెడ్లు ఉన్నాయని క్వారంటైన్ సెంటర్లలో నాణ్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఒక్క వ్యక్తికి రోజుకు రూ. ఐదు వందల నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నామని ఆయన తెలిపారు. క్వారంటైన్ సెంటర్లో ఆహారం తీసుకున్న వారి స్పందన బాగుందని ఆయన తెలిపారు అదే మెనూను హోటల్స్‌కు కూడా ఇవ్వనున్నాము కలెక్టర్ చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు జిల్లాలో ఎవరులేరని, యూఎస్, యూరప్ నుంచి ఎక్కువ మంది జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. (ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్) -
ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్: కృష్ణా కలెక్టర్
సాక్షి, విజయవాడ : నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్లక్ష్యంతో ఉంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వృధానే అవుతుందన్నారు. ఆదివారం ఆయన సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్ధూస్ నగర్ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు చెప్పారు. ఒక్కోక్క వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్ సోకిందని విచారణలో తేలిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,500 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. 170 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. తాము చర్యలు తీసుకున్నా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు) ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే ఊరుకోం లాక్డౌన్ వేళ ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ద్వారాకా తిరుమలరావు హెచ్చరించారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణలంక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెడతామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగేకొద్దీ పోలీసులు చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం) -
‘కలిసికట్టుగా కరోనాపై పోరాటం’
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ..కరోనాపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారి సిద్దార్థ జైన్, ఇతర ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలు, పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించామని వెల్లడించారు. కరోనా శాంపిల్స్ చెక్ చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు జిల్లాకు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ఒకే రోజులో వెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించవచ్చన్నారు. సోమవారం నుంచి అధిక సంఖ్యలో నమూనాలను సేకరిస్తామని తెలిపారు. రేపటి నుంచి నుంచి కొత్తపేట,రాణిగారి తోట, జగ్గయ్యపేట, ముప్పాళ్ల, రాఘవాపురంలో శాంపిల్స్ సేకరణ జరుగుతుందన్నారు. కరోనా అనుమానం ఉన్న ప్రతిఒక్కరూ శాంపిల్స్ ఇవ్వాలని కోరారు. మంగళవారం ఖుద్దూస్ నగర్, మచిలిపట్నం, నూజివీడులో పరీక్షలు చేస్తారన్నారు. లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ పాటించి..ఇంటికే పరిమితం కావాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలకు నిత్యావసరాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై అసత్యాలు ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారికంగా ఇచ్చే ప్రకటనలను మాత్రమే ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ప్రభుత్వాసుపత్రి రాష్ట్ర కొవిడ్ సెంటర్‌గా ఉండటంతో సాధారణ ఓపి సేవలను నిలిపివేశామన్నారు. వారి కోసం ఇఎస్ఐ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తాం: కలెక్టర్
-
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్..
సాక్షి, కృష్ణా: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పాల్గొని.. జాతీయి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్ రిజర్వు పోలీసులు నిర్వహించిన ఉత్సవ కవాతు గౌవర వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాపై సమగ్ర నివేదికను కలెక్టర్ ఇంతియాజ్ అందించారు. స్వతంత్ర సమరయోధులను కలెక్టర్ ఘనం సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇంతియాజ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
‘త్వరలోనే బెజవాడ వాసుల కల సాకారం’
సాక్షి, విజయవాడ : త్వరలోనే బెజవాడ వాసుల కల సాకారం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు అండర్‌పాస్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘అండర్‌పాస్ 15 మీటర్ల వెడల్పు, 5.2 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. అండర్‌పాస్‌ను దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని’ అన్నారు. డిసెంబర్ చివరికి పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. -
ఏపీకి రెండు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, శిశుమరణాలను నివారించేందుకుగాను కేంద్రం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ అవార్డులు, క్షేత్రస్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఐసీడీఎస్ ప్రోగ్రాం అమల్లో ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది. ఇందుకుగాను రూ.కోటి నగదు పురస్కారాన్ని దక్కించుకుంది. అదేవిధంగా పోషకాహారం పంపిణీలో ఏపీ రెండో స్థానం పొందింది. ఈ అవార్డులను శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా.దమయంతి, ఆ శాఖ సంచాలకులు డా.కృతిక శుక్లా అందుకున్నారు. నాయకత్వ విభాగంలో దక్కిన అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రాజెక్టు స్థాయిలో అనంతపురం జిల్లా శింగనమల సీడీపీవో జి.వనజ అక్కమ్మ, క్షేత్రస్థాయిలో గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలు అవార్డులను అందుకున్నారు. -
పగలు డ్రైవర్.. రాత్రి దొంగ
జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోని ప్రబుద్ధుడు చోరీ సొత్తు అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన నిందితుడు వరంగల్‌క్రైం : పగలంతా నగరంలో ఆటో నడుపుతూ రాత్రయితే దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.70 వేల విలువ చేసే 17 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కథనం ప్రకా రం.. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పు డు రైళ్లలో సమోసాలు అమ్మేవాడు. వీటి ద్వారా వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతోపాటు జల్సాలకు అలవా టు కావడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2012లో మొదటిసారి మిల్స్‌కాలనీ, మట్టెవాడ పరిధిలో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత నగరంలో పగలంతా ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. ఇలా జనవరిలో మడికొండ, హన్మకొండ, మట్టెవాడ, మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ లకు పాల్పడ్డాడు. చోరీ సొత్తును అమ్మడానికి మంగళవారం వరంగల్ బులియన్ మార్కెట్ వద్ద తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో క్రైం ఏసీపీ ఈశ్వర్రావు ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సిబ్బందితో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.70 వేల విలువ చేసే 17 గ్రాముల బంగా రు, 500 గ్రాముల వెండి ఆభరణాల ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతి భ కనపరిచిన సీసీఎస్ సీఐ శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్ వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, జంపయ్యను సీపీ అభినందించారు. -
ఇద్దరు బాలకార్మికుల విముక్తి
- యజమానులపై కేసు హిమాయత్‌నగర్ ఇళ్లలో పనులు చేస్తున్న ఇద్దరు బాల కార్మికులకు బాలల హక్కుల సంఘం, కార్మిక శాఖ అధికారుల జోక్యంతో విముక్తి లభించింది. హైదర్‌గూడలోని అపొలో హాస్పిటల్ సమీపంలోని జగన్నాధ్ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్-203 యజమాని భాగ్యరాణి నివాసంలో పని మనిషిగా చేస్తున్న విశాఖకు చెందిన బాలిక(13), ఫ్లాట్ నెంబర్ -101 యజమాని చందన్‌లాల్ ఇంటిలో పనిచేస్తున్న బాలుడి(13)పై బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు వారు కార్మిక శాఖ అధికారులను తీసుకుని ఆ ఇళ్లలో మంగళవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కనిపించిన బాలుడు, బాలికను గుర్తించి స్టేట్‌హోంకు తరలించారు. యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, కార్మిక శాఖ శాఖ అసిస్టెంట్ అధికారి నజీముద్దీన్ ఉన్నారు.